top of page

అమ్మ


'Amma' New Telugu Story

Written By Ch. Pratap

'అమ్మ' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది. కారు దిగి, కోటు, లాప్ టాప్ బ్యాగ్ సోఫాలో పడేసి పక్కన అలసటగా వాలిపోయాను. ఒత్తిడి తో తల పగిలిపోతుంది. టి వి చూస్తున్న నా శ్రీమతి డాక్టర్ రజని వచ్చి నా పక్కన కూర్చోని కణతలపై సున్నితంగా మసాజ్ చేసింది. కొద్ది సేఫటికి రిలీఫ్ గా అనిపించడంతో స్నానం చేయడానికి సోఫా లోంచి లేచాను.


"ఈ రోజు కూడా కేసులు బాగా ఎక్కువగా వున్నట్లు వున్నాయి.. " అడిగింది శ్రీమతి.


"అవును, అన్ని అప్పాయింట్ మెంట్లు క్లీనిక్ లో పూర్తి చూసుకున్నాక, అర్జంట్ కేసులు రావడం తో సన్ షైన్ హాస్పిటల్ కు వెళ్ళవలసి వచ్చింది" అన్నాను నేను. నీ కేసులు ఎలా వున్నాయి అని నేను ఆవిడను అడగలేదు ఎందుకంటే తను ఎనిమిది వరకే క్లినిక్ లో వుంటుంది. తర్వాత ఇంటికి వచ్చి హాయిగా రిలాక్స్ అవుతుంది. ఇంతకంటే కష్టపడడం అవసరం. నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలన్నది ప్రాధాన్యత అని ఖచ్చితంగా అభిప్రాయం ఏర్పాటు చేసుకుంది.


ఇద్దరం డాక్టర్లం. నేను హార్ట్ స్పెషలిస్టును అయితే తను గైనకాలజిస్ట్. మణిపాల్ లో పి జి చదువుతుండగా పరిచయం ఏర్పడి క్రమక్రమంగా అది ప్రేమకు దారి తీసింది. హైదరాబాద్ లో స్వంత క్లీనిక్ లను ఏర్పాటు చేసుకున్నాం. నాకు మొదటి నుండి కరీర్ పట్ల ఎంతో కసి వుంది. నగరం లోనే టాప్ ఫైవ్ కార్డియాలజిస్టులలో నేను ఒకడిని కావాలన్న లక్ష్యం ప్రాక్టిస్ ప్రారంభించిన మొదటి రోజునే ఏర్పాటు చేసుకున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు నాటి నుండి అవిశ్రాంతంగా కృషి చేస్తునే వున్నాను.. పదిహేను ఏళ్లలో టాప్ టెన్ లో ఒకరిగా స్థానం అందుకున్నాను. ఇంకా అయిదు స్థానాలు అందుకునేందుకు కసి, పట్టుదలతో కృషి చేస్తునే వున్నాను. అందుకోసం కుటుంబ బాధ్యతలను, కుటుంబంతో కలిసి సమయం గడిపే విధానానికి ప్రాక్టీసు ప్రారంభించిన తొలిరోజునే స్వస్తి పలికాను. కేసులు, పేషెంట్లు, దబ్బు సంపాదన, సంఘంలో గౌరవ మర్యాదలు, మెడికల్ కౌన్సిల్ లో పరువు ప్రతిష్టలు, పదవులు ఇప్పుడె ఇవే నా జీవితం. మిగితావాటికి నా జీవితంలో ఇప్పుడు స్థానం లేదు.

నా శ్రీమతి స్వభావం నా కంటే కొంచెం భిన్నంగా వుంటుంది. జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వుండి తీరాలంటుంది. అందుకు అనుగుణంగా తన దిన చర్యను ప్లాన్ చేసుకుంది. మాకు ఒక్కడే కొడుకు. ఇంటర్ ద్వితీయ చదువుతున్నాడు. వాడి చదువు పట్ల చిన్ననాటి నుండి రజని ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. వాడి జీవితంలో తండ్రి ప్రేమ మిస్ అయిన లోటు తెలియకుండా జాగ్రతలు పడుతోంది. స్నానం అయ్యాక డిన్నర్ చేస్తుంటే, "రాజేష్, మీ అమ్మగారు ఈ రోజు మూడు సార్లు ఫోన్ చేశారు. మీ ఫోను అందుబాటులో ఉండటం లేదని, అందుకే నాకు, బాబుకు చేసారు. మీతో అర్జంటుగా మాట్లాడాలట" చెప్పింది రజని.

ఆ మాటలు వింటుంటే కోపం నశాలానికి ఎక్కింది నాకు. " ఈ ముసలోళ్ళకు పనీ పాట ఉండదు కాబోలు. చేతిలో ఫోన్ వుంటే చాలు, నెంబర్లు నొక్కుతూ వుంటారు. సోమవారం నుండి శని వారం వరకు ఒక్క క్షణం తీరిక వుందదన్న సంగతి తనకు తెలుసు. అయినా ఎందుకో అదేపనిగా ఫోన్లు చేస్తుంటుంది. "

" ఆ విషయమే నేనూ అడిగాను కాని నాకు ఏ సంగతి చెప్పలేదు, మీ తోనే మాట్లాడాలట, అర్జంట్ అని చెప్పారు. బహుశా ఏవో రహస్యాలు వుండి వుంటాయి" నిష్టూరం ధ్వనించింది రజని స్వరంలో.

" అర్జంటా పాడా ? ఏవో డబ్బవసరం వచ్చి ఫోన్ చెసి వుంటుంది, ఒక్క రవ్వ ఓపిక లేకపోయినా ఊరందరి బాధ్యతలు నెత్తిన వేసుకుని వుంటుందిగా, ఏ దారిన పోయే దానయ్య ధర్మం అడిగి వుంటాడు, కాదనలేక నాకు ఫోన్ చేస్తోంది. సరే, ఈ సమయంలో ఆవిడ ప్రసక్తి ఎందుకు, ఈ ఆదివారం మాట్లాడుతానులే" చికాకుగా అన్నాను.

ఆ రోజు మంగళ వారం. ఆదివారం లోపల మా అమ్మ కనిసం నాలుగు సార్లైనా ఫోను చెసి వుంటుంది. కేసుల కారణం గా నేను ఫోన్ ఎత్తలేదు. రజని నా చికాకును కనిపెట్టి నాకు వాట్సప్ చెసి వూరుకుంది కాని భోజనాల దగ్గర ఆ ప్రసక్తి తేలేదు.

ఆ ఆదివారం ఖమ్మం లో నా కొలీగ్ కూతురి పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత ఆదివారం ఢిల్లీకి కార్డియాలజీ లో స్పెసలిస్ట్ ల కాన్ఫరెన్స్ కు అటెండ్ అయ్యాను. పని ఒత్తిడి, టూర్ల కారణం గా అమ్మకు ఫోన్ చేయలేకపోయాను. అమ్మంటే ప్రేమ లేక కాదు. ఆవిడంటే ఎంతో ఇష్టం, అభిమానం వున్నాయి కాబట్టి నాన్న పోయాక పల్లెటూరిలోనే వుండిపోతానని పట్టుబడితే అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, ఆవిడకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను. హైదరాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో వున్న ఆ పల్లెటూరు ఏడాదికి ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళి ఆవిడను కలిసి వస్తుంటాను. నెలకొకసారి వీడియో కాలింగ్ తప్పక చేసేవాడిని. ఈ మధ్య కేసుల తీవ్రత కారణంగా ఆ ఫ్రీక్వెన్సీ తగ్గింది. అయితే ఆవిడకు కేర్ టేకర్ గా పని చెసే భద్రం ఆవిడ క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే గత రెండు నెలలుగా భద్రం కూడా మెసేజిలు పెట్టడం తగ్గించాడు. ఏమయితేనేం ఒక నెలలోపల వీరవరం వెళ్లి అమ్మని చూద్దామని నిర్ణయించుకున్నాను.


ఆ సుముహూర్తం మరో మూడు నెలలకు వచ్చింది. ఒక ఆదివారం ఉదయం కారేసుకుని ఆ పల్లెటూరు బయలు దేరాను. బాబు, ‘డర్టీ కంట్రీ విలేజ్, అక్కడ రావడం వేస్ట్ ఆఫ్ టైం, పైగా అన్ హైజెనిక్’ అన్నాడు. పెళ్ళి నాటి నుండి అమ్మను ఒక పనికిరాని వస్తువుగా చూస్తూ అమ్మని చూడడానికి వచ్చే అలవాటు అసలే లేని రజని నేను రాలేననేసింది. పదయ్యెసరికి వీరవరం చేరుకున్నాం. ఇంటి ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా వుంది. బయట కుర్చీలో భద్రం కునికి పాట్లు పడుతున్నాడు. నన్ను చూడగానే ముఖం చేటంత అయ్యింది. “రండి డాక్టర్ బాబూ, చానళ్ళకు వచ్చారు. అమ్మ మీకోసమే ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు" అంటూ నా బ్యాగును అందుకొని లోపలికి దారి తీసాడు. బెడ్ రుం లో అమ్మ పడుకుని నిద్ర పోతొంది. ఆవిడను చూసిన నేను స్థాణువునై నిలబడిపోయాను. చిక్కి శల్యమై, అస్థిపంజరం లా వుంది. కిందటి ఏడాదికి, ఇప్పటికీ ఎంత తేడా ? నవ్వుతూ, తుళ్ళుతూ, విసుగు, చికాకు అనేది వ్యక్తం చేయకుండా చలాకీగా తిరిగే మా అమ్మేనా ఈవిడ ?


ముఖం లో కాంతి తగ్గింది. కాళ్ళు, చేతులు తోటకూర కాడల్లా వేలాడుతున్నాయి. కళ్ళు లోతుగా వెళ్ళిపోయి జీవకళ తగ్గింది. ఆరోగ్యం అనే అంసం ఆవిడలో నాకు ఏకోశానా కనబడలేదు. ఆవిడను పరీక్షగా చేస్తుంటే నాలో ఏదో కంగారు మొదలయ్యింది. మధ్యమధ్యలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతొంది. ఆయాసం కూడా ఎక్కువగా వున్నట్లు వుంది ఊపిరి భారంగా తిస్తొంది, నాడి కుడా బలహీనంగా వుంది..


నిద్ర లేపాను నేను. నన్ను చూసిన వెంటనే ఆవిడ ముఖంలో వెయ్యి వాట్ల కాంతి కనిపించింది. " వచ్చావా బాబు, నిన్ను ఫోన్లతో విసిగించాను, వద్దనుకున్నాను కానీ భద్రం బలవంతం మీద చేయాల్సి వచ్చింది. ఏమి అనుకోకు, నాకు తెలుసురా, క్షణం తీరిక లేకుండా గడిపే జీవితం ఎలా వుంటుందో ?" నా తలను ఆప్యాయంగా నిమురుతూ అంది.


అమ్మ వాత్సల్యం తన చేతుల్లో నుండి నా తలలోకి ప్రవేశించగానే శరీరం పులకరించిపోయింది. ఎప్పటినుండో ఆ స్పర్శకు పలవరిస్తున్నవాడిలా స్పందించాను. అమాంతం అమ్మ చేతిని పట్టుకొని గబ గబ ముద్దాడాను.


"ఏమయ్యిందమ్మా ? ఇలా అయిపోయావేమిటి ? ఆయాసం ఎందుకు వస్తొంది ? ఇంత ఎక్కువయ్యే వరకు నాకు ఎందుకు చెప్పలేదు> వేలకు వేలిచ్చి పెట్టుకుంటే భద్రం ఏం చేస్తున్నాడు. డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళవచ్చు కదా ? నాకు ఫోను చేసి ఈ పరిస్థితి చెప్పొచ్చు కదా? నా కోపం అంతా భద్రం మీద మళ్ళింది. అంత కోపం లోనూ కళ్ళు చెమర్చాయి. రెండు బొట్లు తప టప రాలి అమ్మ అరచేతులపై పడ్డాయి. " గత ఆర్నెల్లుగా అమ్మగారు ఆరోగ్యం ఏమీ బాలేదు బాబు. మన ఊర్లో డాక్టర్ కి చూపించాం. ఆయనిచ్చిన మందులు వాడుతున్నాం, అయినా గుణం కనిపించలెదు. ఈ మధ్య అమ్మగారు నడవలేకపోతున్నారు కూడా. ఓపిక లేదంటూ పడుకొనే ఉంటున్నారు. భయమేసి నేనే ఫోన్లు కలిపి ఇచ్చాను మాట్లాడమని. సరిగ్గా మాట్లాడలేక పోతున్నారు కూడా. మన డాక్టర్ గారు గుండెకు సంబంధించిన సమస్య అయి వుందవచ్చునని, పట్నం వెళ్ళి పెద్ద డాక్టరు గారికి చూపించమని చెప్పారు కదా. మీరేమైనా సలహా ఇస్తారేమోనని నేను ఫోన్లు చేసాను.


అసలు నేనే హైదరాబాద్ వద్దామనుకున్నాను కాని ఈవిడను ఒంటరిగా వదలడం కుదరలేదు. ఆ మధ్య రెండు మెస్సేజిని కుడా ఇచ్చాను" సంజాయిషీ చెప్పుకున్నాడు భద్రం. ఆ మాటలు గుండెల్లో పదునైన శూలాల్లా గుచ్చుకున్నాయి నాకు. ఫోన్ల మీద ఫోన్లు, అదీ భద్రం బలవంతం మీద తన అనారోగ్యం గురించి చెప్పదానికి చెస్తుంటే పని పాటా లేక చాదస్తం కొద్దో, ఆర్ధిక సహాయం కొద్దో చెస్తొందేమో అని తానెంత అపోహ పడ్డాడు ? క్షణాలలో అమ్మను పరీక్ష చేశాక అసలు పరిస్థితి అర్దం అయ్యింది. హార్ట్ బ్లాకేజ్ వున్నటు వున్నాయి. వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళి యాంజియోగ్రాం చేయించాలి. తర్వాత స్ట్తెంట్ అవసరం కూడా రావచ్చు. ఎంత త్వరగా అది చేయిస్తే తన ఆరోగ్యం కుదుట పదే అవకాశాలు అంత ఎక్కువ.


" భద్రం, అమ్మ బట్టలన్నీ సర్ది వుంచు. రేపు ఉదయమే హైదరాబాద్ వెళ్దాం. నువ్వు కూడా రా ! వెంటనే యాంజియోగ్రఫీ చేసి పరిస్థితి తెలుసుకోవాలి" అంటూ భద్రానికి పనులన్నీ పురమాయించాను. నా దగ్గర వున్న ఎమర్జెన్సీ కీట్ లోంచి కొన్ని మందులు భద్రానికి ఇచ్చి అవి ఎలా వాడాలో చెప్పాను. " ఇంత హడావిడి ఎందుకురా ? ఏదో చిన్న సమస్య, నువ్వు వచ్చావు గా అది వెంటనే సర్దుకుంటుంది. ఎప్పుడనగా అక్కడ బయలుదేరావో ? పద, భోజనం చేద్దువు గాని" అమ్మలో ప్రేమ, కరుణ, ఆప్యాయత రవ్వంతైనా తగ్గలేదు. ఎప్పుడు కలిసినా తన ఆరోగ్యం గురించి మాట్లాడక, ముందు నా క్షేమ సమాచారాలు కనుక్కుంటుంది. స్వయంగా తన చెసిన వంటను దగ్గర కూర్చుని ప్రేమగా తినిపిస్తుంది. నా కడుపు నిండితే తన కడుపునిండినంత సంబర పడుతుంది. తల్లి ప్రేమంటే ఇదేనేమో . దానీ కొలవగలిగే సాధనాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు..


అమ్మ అన్నింటా ముందుండి, మనల్ని మంచి మార్గం లో నడిపిస్తుంది. అమ్మంటే మరో బ్రహ్మ కాదు కాదు. ఆ బ్రహ్మే మన అమ్మకు మరో జన్మ. ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తి అమ్మ. నీ జీవితంలో ఎవరు తోడు ఉన్నా.. లేకపోయినా.. మన వెన్నంటే ఉండి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు దూసుకెళ్లమని చెప్పే శక్తి ఒకే ఒక అమ్మకు మాత్రమే ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనకు ప్రేమంటే ఏంటో తెలియని వయసులోనే ప్రేమ గురించి నేర్పుతుంది మన అమ్మ. అదొక్కటే కాదు మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యే వరకు అమ్మ నేర్పించని విషయం అంటూ ఏదీ ఉండదంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. రోజంతా అమ్మ నేను పక్క పక్కనే కూర్చోని ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము.


చిన్నతనం లొ నాన్న అర్ధాంతరంగా కాలం చేసాక, అమ్మ ఎన్ని కష్తాలు పడి నన్ను పెంచి, ఉన్న ఆస్తులు ఒక్కటొక్కటే అమ్ముకుంటూ ఎలా డాక్టర్ ను చేసింది అన్ని కళ్ళ ముందు రీలుగా తిరుగుతుంటే నాలో ఏదో తెలియని పరివర్తన రాసాగింది. నా కోసం అనుక్షణం తన జీవితం త్యాగం చేసిన అమ్మను పట్టించుకోకుండా ఎలా అసలు వుండగలిగాను? అమ్మను, అమ్మ ప్రేమను మర్చిపోయీ, కెరీర్, డబ్బు సంంపాదన, ఆస్తులు వెనకేసుకోవడం వెనక అసలు ఎలా పడ్డాను? అమ్మ ఆరోగ్యం ఇంత విషమించేవరకు అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండకుండా అసలు ఎలా వున్నాను ?


వృద్ధాప్యంలో అమ్మకు ఇవ్వాల్సిన ఆసరా ఇవ్వడంలో దారుణంగా విఫలమయ్యాను. ఇన్నాళ్ళు ప్రలోభాలతో మూసుకుపోయిన కరడు కట్టిన హృదయం కరగసాగింది. బాధ్యత అంటే కేవలం వృత్తే కాదని, తన వాళ్ళను కంటికి రెప్పలా చూసుకోవదం కూడా అందులో ఒక భాగమేనని, ముఖ్యంగా జీవితమంతా కష్టించి, సర్వం త్యాగం చేసి, పెంచి ఒక స్థాయికి తీసుకువచ్చిన మన తల్లిదండ్రులకు కనీసం వృద్ధాప్యంలో చేయూత నిచ్చి ఆసరాగా నిలబడదం ఒక ముఖ్యమైన బాధ్యత అని అవగతమయ్యింది.


ఆ రోజంతా అమ్మ ఎంతో హుషారుగా వుంది. భద్రాన్ని పంపించి స్వీట్లు తెప్పించింది. నా కిష్టమైన తీయ ఆవకాయను భద్రం ఇంటి నుండి తెప్పించింది. నా ఇష్టా ఇష్టాల గురించి భద్రానికి ఆపకుండా చెబుతునే వుంది. నా చిన్నప్పుడు అలకలు, అల్లర్లు, మారాంలు, అనుకున్న పని అయ్యేవరకు విశ్రమించని తత్వం, ఎలాంటి విషయాన్నైనా వెంటనే ఆకళింపు చేసుకునే మనస్థత్వం, నా అభ్యున్నతి చూసి తానెంత సంతోషపడింది, నా విజయాలను గురించి చుట్టుపక్కల వారికి ఎలా గొప్పలు చెప్పుకునేదో అన్నీ భద్రానికి చెబుతుంటే నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది.

అమ్మను చూస్తూంటే మదర్స్ డే సందర్భంగా ఒక కొలీగ్ పంపిన మెస్సేజ్ అప్రయత్నంగా నా మనస్సులో మెదిలింది. ‘అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ.. అలుపెరుగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మ.. అపురూపమైన కావ్యం అమ్మ.. అరుదైన రూపం అమ్మ‘‘


‘నీవు ఓడిపోతే నీ వెన్నంటే ఉండి.. నీకు ధైర్యం చెబుతూ నిన్ను విజయం వైపు నడిపించేది అమ్మ.. అంతేకాదు మనకు చిన్న ఆపదొచ్చినా మన కన్నా ఎక్కువ బాధపడేది అమ్మ‘‘

దానీతోపాటు ఆమ్మను ఇంతకాలం నిర్లక్ష్యం చేసినందుకు చెప్పరాని గిల్టీ కూడా అనిపించింది. సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇకనుండి అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాలని అప్పటికప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.


అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడంటారు. ఒక్కసారిగా ఎక్కువైన ఆనందాఅన్ని ఆమె ముసలి గుండె తట్టుకోలేకపోయంది. సాయ్తంత్రం ఏడుగంతలవెళ ఒక్కసారిగా ఆయాసం ఎక్కువైపోయింది. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయింది. నా దగ్గర వున్న ఎమర్జన్సీ మందులతో పాటి నాకు తెల్సిసిన డాక్తర్ పరిజ్ఞానాం అంతా ప్రయోగించాను కాని ఫలితం లేకపోయింది. అమ్మ నా చేతిని ఆప్యాయంగా నిమురుతూ" జాగ్రత్తరా బాబు. ఎక్కువగా కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకోకు, నా గురించి ఆందోళన పడొద్దు, శ్రీరాముడు మీ అందరినీ చల్లగా చూస్తాడు" అంటూ నన్ను ప్రేమగా చూస్తునే నవ్వుతూ ప్రాణాలు వదిలెసింది.


ఈ హఠాత్పరిమాణానికి స్థాణువునైపోయాను. నా నవనాడులు కృంగిపోయాయి. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. హైదరాబాద్ లో టాప్ టెన్ కార్డియాలజిస్టులలో ఒకడినైన నేను అమ్మ గుండె క్షీనిస్తుంటే ఏమీ చెయ్యలేకపోయాను. నా నిర్లక్ష్యం, అత్యాశ, డబ్బు పిచ్చి, కెరీర్ వలన తలకెక్కిన అహంకారం, ఆస్తుల పిచ్చి వలన నన్ను కనిపెంచీ అమ్మను నిర్లక్ష్యం చేసి చివరకు ఆవిడను శాశ్వతంగా పొగొట్టుకున్నాను. కడుపు చించుకు పుట్టాక, తల్లి పట్ల కొడుకు వున్న బాధ్యతను విస్మరించి ఘోరమైన పాపం చేశాను. ఈ పాపానికి నిష్కృతి అనేది వుందా ? నేను అహర్నిశలు శ్రమించి కూడబెట్టిన ఆస్తులన్నింటినీ ఇచ్చేసినా అమ్మను తిరిగి తెచ్చుకోగలనా ?


అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అమ్మ ప్రేమ అంత తీయన కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది.. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుంది.


అందుకే ఈసృష్టిలో ఏ ఋణమైనా తీర్చుకునేందుకు మార్గాలు వున్నాయి గాని ఆజన్మాంతం తలకిందులుగా తపస్సు చేసినా తల్లి ఋణం తీర్చుకోవడం అసాధ్యం అన్ని వేదాలు తెలిపాయి.


“ అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ, చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ. వచ్చే జన్మలో నీ కడుపున పుట్టి నీ ఋణం తప్పక తీర్చ్కుంటానమ్మా. ఈ జన్మలో నేను చేసిన పాపాలకు నన్ను మనస్పూర్తిగా క్షమించమ్మా ?అపరాధ భావం నిలువెత్తూ దహిస్తూ వుంటే అమ్మ కాళ్ళు పట్టుకొని భోరున విలపించసాగాను. ‘

ఏ అమ్మ అయినా తన బిడ్డను ఎందుకు చదివిస్తుందంటే.. తన ఆకలి బాధ తీరుస్తాడని మాత్రం కాదు.. తన బిడ్డ ఒక ముద్ద కోసం ఎవ్వరి ముందు చేయి చాపకుండా గర్వంగా బతకాలని ! మహాతల్లి. జీవితమంతా ఒంటరిగానే బ్రతుకీడ్చింది.


పలకరించేవారు లేకపోయినా తమ గతం లోని మధురస్మృతులనే తలుచుకుంటూ వటి నుండి ఎంతో ధైర్యాన్ని తెచ్చుకునేది. తనకంత పెద్ద ఆపద వచ్చినా తన కష్టం తన కొడుకుకు బరువు, అడ్డంకి కారాదని చెప్పకుందా తనే భరించింన మహా ఇల్లాలు. ఆవిడ తల దగ్గర దీపం వెలిగిస్తూ అంటున్నాడు భద్రం. ఆ మాటలు వింటుంటే ఏదో తెలియని అపరాధ భావం హృదయాన్ని దహించివేయసాగింది. ఒక్క వారం ముందు వచ్చి వుంటే వెంటనే ఆపరేషన్ చేయించి ఆవిడను దక్కించుకోగలిగే వాడినేమో ? తన అశ్రద్ధ, అలక్ష్యం, బాధ్యతారాహిత్యం, తనకు అమ్మను శాశ్వతంగా దూరం చేసాయి. బహుశామొదలు నరికిన వృక్షంలా కూలిపోయాను.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.


2,522 views0 comments

Comments


bottom of page