top of page
Writer's pictureMaddala Bhanu

అమ్మ


'Amma' New Telugu Story

Written By M. Bhanu

'అమ్మ' తెలుగు కథ

రచన: M. భాను


అమ్మా!!!


ఆ పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుంది!


అమ్మ ఒక స్నేహితురాలు, అమ్మ అంగరక్షకురాలు. అమ్మ ఒక శ్రేయోభిలాషి. అమ్మ ఒక పనిమంతురాలు.

అవి నేను టెన్త్ క్లాస్ చదివే రోజులు. అప్పట్లో నాకు నెలసరి వలన చాలా నీరసంగా ఉండేది. పదిహేను రోజులకొకసారి అయిపోయి చాలా ఎక్కువగా రక్తస్రావం జరిగేది. లేచి నిలబడి బాత్రూమ్కు వెళ్లడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఒకపక్క పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు. ఎలా వెళ్లాలి.. రాయాలి..


అమ్మ ఇంట్లో పనంతా చేసుకుని అందర్నీ స్కూలుకు పంపించిన తర్వాత మధ్యాహ్నం బార్లీ నీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ పట్టుకుని నాకు ఎక్కువైపోతే మళ్లీ బట్టలు కావాలని ఒక నాలుగైదు గుడ్డలు మడతపెట్టుకుని బాస్కెట్లో పెట్టుకుని నన్ను తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చేది.

మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో చెట్టుకింద కూర్చుని ఉండేది పాపం. నా పరీక్షలయ్యేవరకు ఉండేది. మధ్యమధ్యలో రూమ్ దగ్గరికి వచ్చి దూరంనించే ఇన్విజిలేటర్ను అడిగేది.. ఏమైనా కావాలా మా అమ్మాయి కి అని.

ఎందుకంటే మా నాన్నగారు స్కూల్ హెడ్మాస్టర్ కాబట్టి అందరు టీచర్లకి తెలుసు. ముందరే అందరితో చెప్పడంతోటే అందరూ నా మీద శ్రద్ధ తీసుకున్నారు.

అలా పదవ తరగతి పరీక్షలు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంది. ఇంట్లో పని చేసుకుని వంటచేసి నాన్నమ్మకి చేసి నన్ను తీసుకువచ్చి పరీక్ష రాయించి మళ్లీ సాయంత్రం ఇంట్లో పనులు చేసుకునేది.

నాకు ఓపిక లేకపోతే నా బట్టలన్నీ కూడా తనే వేడి నీళ్లల్లో నానబెట్టి డెట్టాల్ వేసిన శుభ్రంగా ఉతికి ఆరబెట్టేది.


అలాగే నాకు పెళ్లయి మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా నాకు బలమైన ఆహారం పెట్టేది. చాలా నీరసంగా ఉండడం వల్ల పిల్లాణ్ని కూడా ఎక్కువగా అమ్మే చూసుకునేది.


తిండి తినక పోతే దెబ్బలాడి మరీ పెట్టేది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి వాము పొడి వేసి, కమ్మటి చారు వేసి చక్కగా పిసికి పెట్టేది.


ఇప్పటికీ ఫోన్ చేసి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అందరిలాగా ‘ఏమీ తెలీదు.. ఇలా ఈ పని చేసుకో’ అని సులువైన మార్గాలు చెబుతుంది.


మా అన్నయ్య చనిపోయినప్పుడు సంవత్సరీకాలకి నేను మంచం పట్టేస్తే ఓ పక్క తన బాధను దిగమింగుకుంటూ నన్ను చూసుకుంది.


నన్ను ఒక్కదానిదే కాదు, ప్రతి ఒక్కరినీ అలాగే చూస్తుంది. నాన్నమ్మ ను, మేనత్తలను అందర్నీ తన సొంత బిడ్డలాగే చూస్తుంది. పెద్దాచిన్నాఅని లేదు.


అందరికీ ఒకటే ఆప్యాయత చూపిస్తుంది.


నాకు చీరలు కొనుక్కోవడం రాలేదని చెప్పి మా అమ్మే కొంటుంది. ‘ఈ రంగు నీకు బాగుంటుందని తీసాను, కట్టుకో..’ అంటూ ఆప్యాయంగా ఇస్తుంది.


నేను ఇంత పెద్ద అయిపోయినా మా పిల్లలతో అంటుంది.. ‘మీ అమ్మకేమీ తెలియదురా.. చూసుకోండి, మీరు అన్నీ’ అని చెబుతూ ఉంటుంది వాళ్లకి.


అది విని మా పిల్లలు నవ్వుతారు, ‘అమ్మమ్మా! మా అమ్మ చిన్న పిల్లా ఏమిటి..’ అని.


‘అవును. నాకు అందరూ చిన్నపిల్లలే’ అంటుoది.


అలాంటి మా అమ్మ ఇప్పటికీ ఒంటరిగానే కాలం గడుపుతోంది.

***

M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.

ధన్యవాదములు 🙏



50 views0 comments

Comments


bottom of page