top of page

అమ్మ వచ్చింది'Amma Vachhindi' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 02/07/2024

'అమ్మ వచ్చింది' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్రామారావు సీత ఆదర్శ దంపతులు.  రామారావు చేసే ఉద్యోగం మంచిది అయినా, జీతం టైముకి యిచ్చే వాళ్ళు కాదు. సీతమ్మ గారు ఆ అన్నపూర్ణాదేవిలా వున్న డబ్బుతోనే పిల్లలకి భర్త కి ఏ లోటు రాకుండా గడిపేది.  రామారావు కూడా రెండే పంచెలు, నాలుగు చొక్కాలతోనే గడిపి పిల్లలకు  ఎటువంటి లోటు రాకుండా చేసి పెద్ద కొడుకు ని, రెండవ కొడుకుని బ్యాంకు ఆఫీసర్స్ గా చేసాడు. మిగిలిన పిల్లలని కూడా డిగ్రీ వరకు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగల శక్తిని యిచ్చాడు. 


అది వేసవికాలం, రామారావు మూడో కొడుకు కుమార్ సెలవు పెట్టి తల్లిదండ్రులతో గడపాలని వచ్చాడు. యితను ప్రయివేట్ కంపెనీ లో ఉద్యోగం కాబట్టి జీతం కూడా అతి తక్కువ. అయినా తండ్రికి యిష్టమైన పుల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కుని తీసుకుని వచ్చాడు.

కొడుకు వస్తున్నాడు అనే సంతోషంలో సీతమ్మ గారు నూతన్ స్టవ్ మీద పెనం పెట్టుకుని దోశలు వేస్తోంది.


కుమార్ లోపలికి వచ్చి, పెట్టి గదిలో పెట్టి, ‘అమ్మా’ అంటూ వంట గదివైపుకి వెళ్ళాడు. కుమార్ గుండె తరుక్కుపోయింది, అటు తిరిగి దోశలు వేస్తున్న అమ్మ జాకెట్ వీపు వైపున చిరిగి ఉండటం చూసి!


పట్నంలో తన కూతురు, అన్నగారి పిల్లలు వేసుకునే బట్టలు ఒకసారి తలుచుకుంటే, ‘ఛీ, చివరికి యింత మంది కొడుకులు ఉద్యోగాలు చేస్తో కూడా తల్లిదండ్రులకి ఒక్కసారైనా బట్టలు కొని తీసుకుని రావాలి అని అనిపించనందుకు సిగ్గు పడ్డాడు. తనకి నాన్నాలా రెండే ప్యాంటులు, వచ్చిన జీతం తో జీవితం లాగుతున్నాడు. అయితే ఇంతో అంతో మంచి ఉద్యోగాలు చేస్తున్న మిగిలిన అన్నదమ్ములకి కూడా తల్లిదండ్రుల అవసరం చూడాలి అనిపించకపోవడం బాధగా అనిపించింది.  బహుశా వాళ్ళు తల్లిదండ్రులని అంతగా గమనించలేదు అనుకుంట.

ఎందుకంటే, రామారావు కొడుకులందరు ధర్మం పాటించేవారే.కొన్నాళ్లకి రామారావు, ఆ కొన్నాళకి సీతమ్మ ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయారు. పెద్దకొడుకు, తమ్ముళ్ల సహాయంతో తల్లిదండ్రుల మరణానంతరం చేయవలిసిన కార్యక్రమాలు అన్నీ చక్కగా చేసి, వేద పండితులకి చేయవలిసిన దానధర్మాలు చేసారు.


రామారావు మూడో కొడుకుకు, కోడలికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. జీవన స్థితి మారింది. మంచి యిల్లు అద్దెకు తీసుకున్నాడు. ఎవ్వరి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటో సంఘం లో స్టేటస్ పెంచుకున్నారు. కార్లు, మేడలు కొనుకున్నారు. రామారావు పెద్ద కొడుకు సునీల్ తల్లిదండ్రులు అబ్ధికం తప్పకుండా పెడుతూ తమ్ముళ్ళందరిని గౌరవంగా చూసుకునే వాడు.


కుమార్, అతని భార్య నాగపూర్ లో వున్న కొడుకు దగ్గరికి వెళ్లారు. ఒక శనివారం తల్లిదండ్రులతో కుమార్ కొడుకు చెప్పాడు 'ఈ రోజు మిమ్మల్ని షిర్డీ తీసుకుని వెళ్తాను సిద్ధం గా వుండండి’ అని. కుమార్ తన కొడుక్కి తండ్రి పేరు ‘రామ్’ అని పెట్టాడు.


కారులో వెనుక తల్లిదండ్రులను, కూతురును, ముందు తను తన భార్య కూర్చుని షిర్డీ బయలుదేరారు. రామ్ కి కారు డ్రైవింగ్ అంటే మహా యిష్టం. కారు నడుపుతూ అద్దం లో వెనుక కూర్చుని వున్న తల్లిదండ్రులని చూసాడు. తండ్రి కళ్ళలో నుంచి బుగ్గల మీదకి నీళ్లు కారడం చూసి, “ఏమిటి నాన్నా,, మీ కన్ను యింకా నీరు కారుతోంది, డ్రాప్స్ వేసుకోవడం లేదా” అన్నాడు రామ్.


“అబ్బే! కన్ను బాగానే వుంది, మనసు బాగుండలేదు, మా అమ్మా నాన్నా అంటే నీ తాతయ్య, బామ్మ గుర్తుకు వచ్చారు. వాళ్ళు మా సుఖం కోసం వాళ్ళ సుఖాన్ని త్యాగం చేసి మమ్మల్ని వృద్ధి లోకి తీసుకుని వచ్చారు. మాకు కొద్దిగా బాధ్యతలు తెలుసుకుని వాళ్ళని సుఖ పెడదాం అనుకునే సమయానికి వాళ్ళు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.


నేను మొదట కారు కొన్నప్పుడు అనుకున్నాను అమ్మా నాన్న ఉండి వుంటే వాళ్ళని కారులో ఎక్కించుకుని పుణ్యశేత్రాలు తీసుకుని వెళ్లి వుండే వాడిని కదా అని.  ఆ అదృష్టం మాకు కలిగింది, మా అబ్బాయి మమ్మల్ని కారులో షిర్డీ తీసుకుని వెళ్తున్నాడు అని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయ్.  


తల్లిదండ్రులు అడ్డం అనుకోక, తమకి ఈ శరీరం, ఈ స్టేటస్ యిచ్చింది వాళ్లే అని తెలుసుకుని, వారి శేషజీవితం సుఖంగా గడిచే విధంగా చుడాలిసిన బాధ్యత ప్రతి కొడుకుది” అన్నాడు.


“యిప్పుడు పెద్దనాన్నగారు ప్రతీ ఏడాది బామ్మ, తాతయ్య అబ్ధికం పెళ్లి చేసినంత గొప్పగా చేస్తున్నారు, మీరు బాబాయిలు హాజరు అవుతున్నారు,  యిప్పటికి మీ మాట నెగ్గాలిసిందే గాని నా మాట వినరు మీరు, ముందు కోపం వచ్చినా తరువాత ఫలితం బట్టి, నాన్నా చెప్పింది కరెక్ట్ అని అర్ధం అవుతోంది” అన్నాడు నవ్వుతూ రామ్.


జులై వచ్చింది. కుమార్ తల్లి అబ్ధికం అన్నగారింట్లోనే. ఒక రోజు ముందు తమ్ముళ్ళందరు అన్నగారింటికి చేరారు. వదినగారు వండిన వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా, కొబ్బరి పచ్చడితో రాత్రి ఫలహారం కానిచ్చారు. 


“నువ్వు తినడం లేదేమిటి అన్నయ్యా?” అని అడిగాడు కుమార్.


“అబ్ధికం పెట్టే వాడిని. ముందు రోజు రాత్రి ఉపవాసం వుండాలి, మీరు తద్దినం పెట్టే వాడి తమ్ముళ్లు కాబట్టి మీరు తినవచ్చులే” అన్నాడు నవ్వుతూ సునీల్.


అన్నగారి తో పాటు తమ్ముళ్ళందరు హాల్ లో పరుపులు వేసుకుని చిన్ననాటి కబుర్లు చెప్పుకుని నిద్రపోయారు.


తెల్లారింది, అందరూ స్నానాలు చేసి శాస్త్రి గారి కోసం ఎదురు చూస్తున్నారు.  సునీల్ ఎందుకైనా మంచిది అని ఒక పాతిక ఇడ్లీలు తెప్పించాడు, షుగర్ పడిపోకుండా తినాలి అనుకునే వాళ్ళు తినడానికి.


శాస్త్రి గారు, భోక్తలు వచ్చేసారు. సునీల్ కి డెబ్భై అయిదు ఏళ్ళు, చిన్న కుర్చీలో కూర్చున్నాడు. తమ్ముళ్లు అతనికి దగ్గగా కూర్చుని వున్నారు. పూజ మొదలైంది. రాత్రి ఏమి తినలేదు కదా సునీల్ చేతులు వణుకుతున్నట్టుగా గ్రహించాడు కుమార్. 


“అన్నయ్యా! కొద్దిగా హార్లిక్స్ తాగుతావా, నీరసంగా వున్నావు” అన్నాడు. 

“వద్దులే, పరవాలేదు” అన్నాడు సునీల్.  


ఈ వయసు లో కూడా అన్నయ్య తల్లిదండ్రుల తిధి శ్రద్దగా పెట్టడం మెచ్చుకోవాలిసిందే.


“అయ్యా! మీరు మాట్లాడు కుంటూవుంటే ఎలా, శ్రాద్దం అంటే శ్రద్దగా పెట్టాలి” అని రొటీన్ డైలాగ్ చెప్పిన శాస్త్రి గారు, కుమార్ కి అగ్నిహోత్రం లో పుల్లలు వేసి, పొగ రాకుండా విసరమన్నాడు. మిగిలిన వాళ్ళని వాళ్ళ అన్నగారి భుజం పట్టుకుని చెప్పే మంత్రం శ్రద్దగా వినమన్నాడు.


మొత్తానికి పూజ అయ్యింది, భోక్తలకు, శాస్త్రి గారికి దక్షిణ యిచ్చి పంపిం, అన్నదమ్ములు భోజనానికి కూర్చున్నారు. వంటావిడ మడి కట్టుకుని వడ్డించటం మొదలుపెట్టింది. గారెలతో సహా నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు వడ్డించి, ‘మీ తల్లిగారిని తలుచుకుని తినడం మొదలు పెట్టండి’ అంది.


ఇంతలో కిటికి దగ్గర చప్పుడు అవ్వడం తో అందరూ కిటికి వంక చూసారు.


ఆశ్చర్యం! నుదుటిన పసుపు, కుంకుమ తో ఒక ఆవు కిటికి లోంచి లోపలికి చూస్తోంది. ఆవు అంతవరకు రావాలి అంటే పది మెట్లు ఎక్కి రావాలి. ఎలా వచ్చింది అనుకోగానే, “అవును. అమ్మే వచ్చింది ఈ రూపంలో, తన పిల్లలని చూసుకోవాడానికి” అంటూ సునీల్ తన విస్తరి తీసి జాగ్రత్తగా పట్టుకుని బయటకు వచ్చాడు. అన్నగారిని తమ్ముళ్లు అనుసరించారు. 


పదార్ధాలతో నిండుగా వున్న విస్తరి ని గోమాత ముందు వుంచి, దాని చుట్టూ తిరిగి దణ్ణం పెట్టుకున్నాడు. ఆడవాళ్లు కూడా వచ్చి అత్తగారే ఆ రూపంలో వచ్చింది అనుకుని ఇప్పుడైనా మనస్ఫూర్తిగా సేవ చేద్దాం అనుకుని గోమాత కి పూజ చేసి, హారతి యిచ్చారు.


పెద్దన్న గారు కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ “అమ్మా, యిన్నాళ్ళకి మా మీద దయ కలిగి నీ పిల్లలని చూసుకుని ప్రసాదం తినడానికి వచ్చావు, నా జన్మ ధన్యం అయ్యింది” అన్నాడు. 


తమ్ముళ్లు అన్నగారి భుజం తట్టి “వూరుకో అన్నయ్య, అమ్మ వచ్చి మనల్ని దీవించింది. అది చాలు” అంటూ గోమాత కి వీడ్కోలు  చెప్పి భోజనాలకి కూర్చున్నారు.


తల్లిదండ్రులు దేవుడికి మారు రూపాలు. వాళ్ళు వృద్ధాప్యంలో విసిగించినా, పిల్లలు తమ తల్లిదండ్రులని ఆప్యాయంగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా అదే ఆప్యాయత చూపిస్తారు. 


                                      ... శుభం.....


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
 


66 views0 comments

Comentarios


bottom of page