top of page

అమ్మకో బహుమతి'Ammako Bahumathi' - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 04/04/2024 

'అమ్మకో బహుమతి'  తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్"జన్మ దిన శుభాకాంక్షలు చిన్నీ!" కూతుర్ని నుదుటి మీద ముద్దు పెడుతూ లేపింది స్వాతి.


"థాంక్ యూ మామ్!" నవ్వుతూ కళ్ళు తెరిచింది ఆద్య.


"ఏంటి ఇవాళ నీ ప్లాన్స్?" నిద్ర లేచి మళ్ళీ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న కూతుర్ని అడిగింది.


"ఇంకో పదిరోజుల్లో పై చదువులకి అమెరికా వెళ్తున్నా కదా! ఫ్రెండ్స్ అందరూ కలుద్దామంటున్నారు. అలా షాపింగ్, తరవాత లంచ్. సాయంత్రం ఇంట్లోనే నీతో, నాన్నతో"

అంటున్న కూతురితో "అయితే డిన్నర్ కి ఏమి చేయమంటావు చెప్పు, నీకు ఏం తినాలనిఉంటే అది చేస్తాను" అంది స్వాతి ఆద్య ముంగురులు సవరిస్తూ.


స్ప్రింగ్ లేచినట్టు లేచింది ఆద్య, "అమ్మా!" హుషారుగా అన్నది మళ్ళీ నెమ్మదిగా "వద్దులే" అంది.


"అరే! ఏం కావాలో చెప్పమంటే.." అంది స్వాతి.


"మరి నాతోపాటు యూఎస్ కి మా గ్యాంగ్ మొత్తం ఆరుగురు వస్తున్నారుగా! వాళ్ళకి నీ బిరియాని, మిర్చి కా సాలాన్ అంటే పిచ్చి. మొన్ననే అన్నాడు అర్జున్, ఆంటీ చేతి వంట ఒకసారి తినాలి అని, నిజానికి వెళ్ళేలోగా అందరం అందరి ఇళ్ళకి వెళ్ళాలి అనుకున్నాం.


నీకు కష్టం లేకపోతే వాళ్ళని డిన్నర్ కి రమ్మన్నా!" సంశయంగా అడుగున్న ఆద్యని చూసి నవ్వేసింది స్వాతి.


"మీరందరు ఎల్ కేజీ నుంచి ఫ్రెండ్స్. మా కళ్ళ ముందు పెరిగినవాళ్లు. ఈ ఇంట్లో నువ్వెలా ఉంటావో అందరూ అలానే ఉంటారుగా! డిన్నర్ కి వచ్చేయండి, స్వీట్, ఐస్క్రీమ్ నాన్నని తెమ్మంటాను" అన్న స్వాతిని ముద్దు పెట్టుకుని మంచం మీద నుంచి ఒక్క గంతు వేసి


"అందరికి చెప్పాలి"

అని ఫోన్ పట్టుకుని పరిగెత్తిన ఆద్యాని చూసి, ఇరవైఒక్క ఏళ్ళు వచ్చినా పిల్ల చేష్టలు పోలేదు అని నవ్వుకుంది స్వాతి.


ఏడుగంటలకల్లా వంట చేసి పెడితే, పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అని, మూడు గంటలకల్లా వంట పని మొదలు పెట్టింది స్వాతి. ముందు మిర్చీ కా సాలన్ చేసి, బిరియాని చేయచ్చు అని దానికి అన్నీ తయారు చేసి బిరియాని కి కూరలు తరుగుతూంటే డోర్ బెల్, పిల్లల గొంతులు వినిపించాయి.


అలానే వెళ్లి తలుపు తీసింది స్వాతి. రేగిన జుట్టు, నలిగిన చీర, కళ్ళలోంచి ధారగా కారుతున్న నీళ్లు, ముక్కు ఎగబీలుస్తూ తలుపు తీసిన తల్లిని చూసి


"నాకు తెలుసు నువ్వు ఇలానే ఉంటావని, ఆ ఉల్లిపాయఘాటు నీకు పడదు! అవి తరిగినంతసేపు ఇలా నీళ్లుకారి ఇబ్బంది పడతావు,


'అమ్మ కంట కన్నీరు చూడలేనిక' అందుకే నా పుట్టిన రోజుకి నీకు ఈ వెజిటబుల్ కట్టర్ కానుక గా తెచ్చాను,మిగిలిన ఉల్లిపాయలు దీనితో కట్ చెయ్, అప్పుడు ఇంక నీ కంట కన్నీళ్లు రావు" సినీ ఫక్కీలో ఆ కట్టర్ తల్లి చేతికిస్తుంటే మిగిలిన పిల్లలు 'అమ్మాయి పుట్టినరోజుకి అమ్మకి బహుమతి' అంటూ చప్పట్లు కొట్టారు.

***

శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
121 views0 comments

Comments


bottom of page