అమ్మో!
- Mohana Krishna Tata

- 3 hours ago
- 3 min read

Ammo! - Telugu Comedy Story |Mohana Krishna Tata
అమ్మో! - తెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ
Published In manatelugukathalu.com On 26/04/2026
“పని వదిలేశాడు… కానీ పని అతన్ని వదల్లేదు!”
‘అమ్మో’ అంటూ అతని కష్టాన్ని వివరించారు తాత మోహన కృష్ణ గారు.
"బాలూ! వీఆర్ఎస్ తీసుకుందామని అనుకుంటున్నాను."
"ఎందుకు రఘు?"
"ఎంతకాలం చేస్తాం చెప్పు జాబ్? మాకు పిల్లలు కూడా లేరు. చక్కగా వీఆర్ఎస్ పెట్టేసి, పనికి గుడ్‌బై చెప్పేసి, ఇంట్లో పెళ్ళాం పెట్టినవి తింటూ ఎంజాయ్ చేస్తాను. సిటీకి పోయి అక్కడ అన్నీ ఎంజాయ్ చేస్తాను."
"బాగా ఆలోచించుకో రఘు! సంపాదించే మొగుడికి, రిటైర్ అయిన మొగుడికి చాలా తేడా ఉంటుంది."
"నన్ను భయపెట్టకు!"
"మొన్న మా ఫ్రెండ్ నీలాగే వీఆర్ఎస్ పెట్టి ఇంట్లో ఉంటే, వాళ్ళావిడ ఎప్పుడూ 'ఏమండీ..!' అని ప్రేమగా పిలిచేది, ఇప్పుడు 'ఏరా' అంటోందని వాడు ఫోన్‌లో ఒకటే ఏడుపు."
"అందరూ అలాగే ఉంటారా ఏమిటి? నా పెళ్ళాం చాలా మంచిది. ఈ పల్లెటూరులో ఏముంది చెప్పు? వీఆర్ఎస్ పెట్టేసి, సిటీకి పోయి అక్కడ అన్నీ ఎంజాయ్ చేస్తాను... లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యాలి బాలు. నువ్వూ నా బాటలోకి వచ్చేయ్!" అన్నాడు రఘు.
"లేదు రఘు! రిటైర్ అయితే ఎక్కువ టైమ్ పెళ్ళాం ఎదుటే ఉంటాం, ఆవిడకే కనిపిస్తాం. ఆవిడ ఏమైనా అనొచ్చు, ఏదైనా అడగొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు కూడా. పైగా మనకి పెన్షన్ కూడా ఎక్కువ రాదు కదా."
"నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఇప్పటికే వీఆర్ఎస్ పెట్టేశాను. ఇప్పుడు సిటీకి పోయి ఎంజాయ్ చేస్తాను. నాకూ, మా ఆవిడకూ వచ్చే ఆ పెన్షన్ సరిపోతుందిలే."
"నీ ఖర్మ!"
మొత్తానికి వీఆర్ఎస్ పెట్టేసి, పెళ్ళాంతో సిటీకి వచ్చేశాడు రఘు.
"ఏమండీ! హ్యాపీగా ఆ పల్లెటూరులో ఉండక, ఈ సిటీలో ఎందుకండీ?"
"సిటీలో ఎంజాయ్ చెయ్యాలి కాంతం."
"మామిడి కొమ్మలు కావాలన్నా చాలా కష్టం ఈ సిటీలో. కొమ్మ పది ఇచ్చి కొనుక్కోవాలంట కదా. మనకి ఇక్కడ అవసరమా చెప్పండి?"
"చిన్న చిన్న వాటికి భయపడిపోతే, సిటీలో మెట్రోలు, మాల్ లైఫ్, సినిమాలు ఎన్నో ఉన్నాయి... ఎలా ఎంజాయ్ చేస్తావు?"
"నాకు మాత్రం సౌకర్యంగా ఉండేట్టు మీరే చూడాలి. లేకపోతే నేను సిటీలో ఉండలేను," అంది కాంతం.
"సామానులు అన్నీ సర్దేశాము. ఇప్పుడు పనిమనిషిని మాట్లాడాలి. మన పల్లెటూరులో అయితే ఎప్పుడూ పనివాళ్ళు పిలిస్తే పలికేవారు. ఇక్కడ ఎలాగో మరి?"
"చూద్దాం."
"రెంట్ తక్కువని, ఈ ఊరి చివర ఇల్లు తీసుకున్నారు. ఇక్కడ పనిమనిషి దొరకడము కష్టమేనా?"
"మనకొచ్చే పెన్షన్‌కి ఈ ఇల్లే కరెక్ట్. పక్కింటి ఆయనని అడిగాను. అతనేదో ఆన్‌లైన్‌లో చూసుకోమన్నాడు. రిక్వెస్ట్ పెట్టాను. పనిమనిషిని రేపు పంపిస్తానన్నారు. చూశావా? సిటీలో ఉంటే, ఆన్‌లైన్ వాడడం అన్నీ వస్తాయి. ఇదీ ఎంజాయ్‌మెంటే."
"చెయ్యండి చెయ్యండి... ఎంజాయ్‌మెంట్."
మరునాడు ఉదయం బెల్ మోగింది.
"మీరు పనిమనిషిని కావాలని అడిగారుగా..." అంది బెల్ కొట్టిన టిప్ టాప్‌గా రెడీ అయిన అమ్మాయి.
'ఈ అమ్మాయిని చూస్తే పని చేసే వాలకం లాగ ఏమీ లేదు. ఇక్కడ సిటీలో ఇలాగే ఉంటారు కాబోలు' అనుకుంది కాంతం.
"ఏం పనులు చేయాలి... తొందరగా చెప్పండి. మీ విషయం తేల్చేసి, నేను వేరే పనికి వెళ్ళాలి."
"ఇప్పుడే వచ్చిందో లేదో... అప్పుడే వెళ్ళిపోతుందా? స్థిరత్వం లేదు. మా ఊరిలో అయితే, కాఫీ ఇస్తే చాలు, అన్ని పనులు చేసి పెడతారు చక్కగా."
"తొందరగా చెప్పండమ్మా!"
"అంట్లు, ఇల్లు, బట్టలు - మూడు పనులు."
"అంటే... అ.ఇ.బ. ప్యాకేజీ అనమాట. మనిషికి బేస్ ప్రైస్ వెయ్యి ఫిక్స్. ఇంతకీ మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా? అంట్ల మెషిన్ ఉందా? ఉంటే ఐదు వేలు, లేకపోతే పది వేలు. నచ్చితే చెప్పండి."
"ఏమిటి పని చేయడానికేనా... అంత డబ్బులు?"
"మా ఇంట్లో మెషిన్లు ఏమీ లేవు," అంటూ రఘు వైపు చూసింది కాంతం.
"అవును... అవును... మా ఇంట్లో ఏమీ లేవు."
"అయితే పది వేలు అవుతుంది."
"అమ్మో పది వేలా? ఆలోచించి రేపు చెబుతాను," అంది కాంతం.
"చూశారా సిటీలో పనిమనుషులు ఎలా ఉన్నారో? ఆ మెషిన్ ఏవో కొంటారా?"
"మెషిన్ కొని, మళ్ళీ నెలకు ఐదు వేలు ఇచ్చుకోవాలా? నో... సిటీలో అన్నీ కాస్ట్‌లీగానే ఉన్నాయే!"
"మీరు ఎలాగో ఖాళీగా ఇంట్లో చేసేదేముంది... టీవీ చూడడం, బయట తిరగడం తప్పితే. ఇంట్లో ఉండి, కాస్త ఆ ఇంటి పనులు చేసేయండి."
"నేనా...?" ఆశ్చర్యంతో కూడిన బాధతో అన్నాడు రఘు.
"ఏముంది! అంట్లు తోమేయడమే, వంటకి కూరలు కట్ చేసేయండి. బట్టలు ఉతికి ఆరేసేయడమే. ఇల్లు మెరిసేటట్టు అద్దంలా తుడిచేయడమే. వీటిలో నాకు హెల్ప్ చేయండి. ఇద్దరమే కదా. పనిమనిషికి పది వేలు ఎందుకు ఇవ్వడం చెప్పండి? మీకూ కాలక్షేపం అవుతుంది. ఏదో పని చేసినట్టుంటుంది."
"అనవసరంగా వీఆర్ఎస్ పెట్టాను... ఇప్పుడు ఇరుక్కున్నాను. మా ఫ్రెండ్ మాట విని ఉండాల్సింది," అని తల పట్టుకున్నాడు రఘు.
సమాప్తం.
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments