రేప్పొద్దున!

Reppodduna - Telugu Inspirational Article | Kotha Viritha
రేప్పొద్దున! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 23/10/2026
రేపటి గురించి ఆలోచించడం మంచిదే. కానీ భవిష్యత్తుపై అతిగా భయపడుతూ ఈరోజు అవకాశాలను కోల్పోతున్నామేమో!
మన ఆలోచనలను సరదాగా ప్రశ్నిస్తూ, జీవితానికి అవసరమైన సందేశాన్ని అందించే కొత్త విరిత గారి రచన “రేప్పొద్దున!”
పెళ్లి సంబంధం వచ్చింది… అమ్మాయి, అబ్బాయి నచ్చారు.
అయినా మనసులో ఒక ప్రశ్న“రేప్పొద్దున ఎలా ఉంటారో?”
చదువులో మంచి కోర్సు దొరికింది
“ఇది చదివితే రేప్పొద్దున ఉద్యోగం వస్తుందా?”
ఇల్లు కొనాలనిపించింది,
“ఈ ప్రాంతం ఇప్పుడు బాగుంది… రేప్పొద్దున ఏం అవుతుందో?”
పిల్లలకు మంచి విలువలు నేర్పాలనిపించింది, “రేప్పొద్దున వీటిని పాటిస్తారా?” ఏమో!!
అంటే మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాలంటే… రేపటి రిపోర్ట్ కార్డు ముందే కావాలన్నమాట!
పెళ్లికి ముందే భవిష్యత్తు జీవిత భాగస్వామి ఎలా మారతారో తెలిసిపోవాలి. చదువు మొదలుపెట్టే ముందే పదేళ్ల జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియాలి. స్థలం కొనేముందే అక్కడికి మెట్రో వస్తుందో, ట్రాఫిక్ పెరుగుతుందో, రేటు ఎంత పెరుగుతుందో చెప్పాలి.
పిల్లలకు నీతి చెప్పేముందే, దాని వల్ల వాళ్ల భవిష్యత్తు ఎంత మారుతుందో కూడా లెక్క పెట్టాలి. ఇంత ముందుచూపు ఉంటే మనం మనుషులం కాదు, టైమ్ మెషీన్ ఓనర్లం! రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఈరోజు ఏం చేయాలో కూడా వాయిదా వేస్తున్నాం. “చూద్దాం… తర్వాత చూద్దాం…” అంటూ జీవితాన్ని మొత్తం ‘రేపు’ అనే ఫోల్డర్లో దాచేస్తున్నాం.
నిజానికి భవిష్యత్తు మనం ముందే రాసుకున్న ప్రాజెక్ట్ ప్లాన్ కాదు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం మంచిదే కావచ్చు…కానీ రేపటి పరిస్థితులు మారొచ్చు. అందుకే రేపటిపై భయం కంటే, ఈరోజు మన బాధ్యతపై దృష్టి పెట్టాలి. పిల్లలకు విలువలు నేర్పాలి, వాళ్లు రేపు ఎలా స్పందిస్తారో తెలియకపోయినా.
మనకు నచ్చిన చదువు ఎంచుకోవాలి, భవిష్యత్తు ఉద్యోగానికి గ్యారెంటీ లేకపోయినా.
మనకు సరైనదనిపించిన నిర్ణయం తీసుకోవాలి, రేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా.
ఎందుకంటే రేపటిని గ్యారెంటీ చేసుకునే ప్రయత్నంలో… ఈరోజునే కోల్పోతున్నాం. రేప్పొద్దున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు…కానీ “రేప్పొద్దున” అని భయపడుతూ ఈరోజును చంపేయడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments