top of page

అమృత - అనంత


'Amrutha - Anantha - New Telugu Story Written By Mohana Krishna Tata

'అమృత - అనంత' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆనంద్ హడావిడిగా బ్యాగ్ లో బట్టలు సర్దుతున్నాడు. వారం మునుపు ఢిల్లీకి ట్రైన్ బెర్త్ రిజర్వేషన్ చేసుకున్నాడు. పెద్ద కంపెనీ లో సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది.


ఆనంద్ చాలా తెలివైన వాడు. కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళమ్మ కల - తన కొడుకు పెద్ద ఉద్యోగం చెయ్యాలని. అమ్మ ఆశీర్వాదము తో ఢిల్లీ బయల్దేరాడు.


బుక్ చేసిన క్యాబ్ గుమ్మం ముంది ఆగింది. ఆనంద్ బ్యాగ్ తీసుకొని బయల్దేరాడు. దారిలో తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి..


**************************


ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి. ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉండేవి ఆ రోజులు. సీనియర్స్ - జూనియర్స్ తో కాలేజీ అంతా చాలా సందడిగా ఉండేది. అలాంటి ఒక సందర్భంలో, ఆనంద్ ఒక అందమైన అమ్మాయిని చూసాడు.


కొత్తగా జాయిన్ అయిన జూనియర్. సీనియర్ అవడం తో, ఆనంద్ చొరవ తో, అమ్మాయి దగ్గరకు ర్యాగింగ్ నెపంతో, పేరు అడిగి తెలుసుకున్నాడు.


"నా పేరు అమృత" అన్నది తన తీయటి గొంతుతో..

"నా పేరు ఆనంద్"- మీకు సీనియర్ని. చదువులో, ఏమైనా డౌట్స్ ఉంటే, నన్ను అడగండి. "


"అలాగే" అంది అమృత


అమృత తో స్నేహం రోజు రోజు కు ప్రేమ గా మారింది. ఆనంద్ తన ప్రేమ గురించి చెప్పడానికి సమయం కోసం చూస్తున్నాడు.


**********************


"సార్! స్టేషన్ వచ్చింది" అన్నాడు క్యాబ్ డ్రైవర్.


"ఓకే" అని చెప్పి బ్యాగ్ తీస్కొని లోపలికి వెళ్ళాడు. ట్రైన్ ఇంకా రాలేదు.


అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి.


*****************

"ఆనంద్, అమృత తో ఆ రోజు అరకు టూర్ ప్లాన్ చేసాడు. ఆ రోజు ఇలాగే, స్టేషన్ లో అమృత కోసం వెయిట్ చేసాడు. కాని, అమృత రాలేదు. "


***************


ప్రస్తుతం ఎక్కాల్సిన ఢిల్లీ ట్రైన్ వచ్చింది. ఎక్కి, సీట్ లో కూర్చున్నాడు. విండో పక్క సీట్ తనది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకో 5 మినిట్స్ ఉందనగా, ఒక అందమైన అమ్మాయి తన సీట్ వెతుకుంటూ ఆనంద్ దగ్గరకు వచ్చింది.


"హలో! ఇది సీట్ 60 అండీ?"

"అవును" అన్నాడు.


తన ఎదురుగా కూర్చున్న తనని చూస్తుంటే, అమృతే గుర్తొచ్చింది ఆనంద్ కు.


"బెర్త్ వేయనా? కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది"


"అలాగే" అంది అమ్మాయి.


"బై ది వే, మీ పేరు తెలుసుకోవచ్చా" అన్నాడు ఆనంద్.


"అనంత" అంది.


అనంత తన వైపే చూస్తునట్టు గమనించాడు ఆనంద్. అనంత ఎదో ఆలోచిస్తుంది. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు వుంది అనుకుంది.


"మీ పేరు ఏమిటండి? అడగడం మర్చిపోయాను."


"ఆనంద్” అన్నాడు. “ఢిల్లీ లో జాబ్ జాయిన్ అవడానికి వెళ్తున్నాను”.


ఈలోపు టీసీ వచ్చి టికెట్ అడిగాడు. టికెట్ ఆఫ్ లైన్ లో తీసుకోవడం చేత, టికెట్ కోసం వెతికింది అనంత.


"టికెట్ చూపించు అమ్మాయి" అన్నాడు టీసీ.


"మర్చిపోయానంది" అనంత.


"ఫైన్ కట్టు, లేకపోతే -నెక్స్ట్ స్టేషన్ లో దిగిపో" అన్నాడు.


ఎదురుగా ఉన్న ఆనంద్ "నేను హెల్ప్ చేయనా అనంత గారు"


"నా బ్యాగ్ దారిలో పోయిందండి.. ఫైన్ కట్టడానికి డబ్బులు కూడా లేవు"


నేను కడతానని, ఆనంద్ ఫైన్ కట్టేసాడు.


"థాంక్స్ ఆనంద్ గారు" అంది అనంత.


"ఇట్స్ ఓకే " అన్నాడు ఆనంద్.


వెంటనే " ఐ లవ్ యు" అన్నది అమృత.


షాక్ కొట్టినట్టయింది ఆనంద్ కు.


"నాకు ఏమి అర్ధం కాలేదు మీరు ఏమన్నారో”

"ఐ లవ్ యు నంద్" అన్నది అనంత మళ్ళీ.


"నన్ను ‘నంద్’ అని పిలిచేది అమృత మాత్రమే. నీకు అమృత ఎలా తెలుసు? ఇంత పరిచయం లో నాతో లవ్?" అన్నాడు ఆనంద్


"మీరు నాకు ఇంతకు ముందే తెలుసు. "


"ఎలా"


“నేను ఒక సారి అక్క డైరీ లో మీ ఫోటో చూసాను. ఫోటో వెనుక, నంద్ అని రాసుంది. మా అక్క మీకు బాగా తెలిసిన అమృత”


"ఇప్పుడు అమృత ఎక్కడుంది?"


"ఆ రోజు మిమల్ని కలవడానికి స్టేషన్ కు బయల్దేరింది అక్క. దారిలో క్యాబ్ కు ఆక్సిడెంట్ అవడం చేత హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్క, చనిపోయేముందు నాతో, మీ గురించి చెప్పింది. మీ ఫోటో, తన డైరీ చదవమని చెప్పింది. "


ఇది విన్న ఆనంద్ కంట్లో నీళ్లు తిరిగాయి. “అమృత కాలేజీ మారిందని ఎవరో చెప్పారు. మీరు వేరే ఊరు వెళ్ళిపోవడం చేత, మీ గురించి నాకు తెలియలేదు".


"అక్క డైరీ చదివాక, తాను మిమల్ని ఎంత ప్రేమిస్తుందో నాకు అర్థమైంది. అరకు లో ప్రపోజ్ చేద్దామనుకుంది. ఈలోపు ఘోరం జరిగింది. మీరు చాలా మంచివారని, నన్ను పెళ్ళి చేసుకోమని చెప్పింది అక్క.


మిమల్ని చూసిన తర్వాత, మీ మంచితనం చూసిన తర్వాత, నేను నిజంగానే మీతో లవ్ లో పడిపోయాను. మీకు నచ్చితే, మిమల్ని పెళ్ళి చేసుకుంటాను. అక్క ఆత్మ కూడా శాంతిస్తుంది"


అంతా విన్నాక, ఆనంద్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. అనంత బుజం మీద తల పెట్టి బాధ పడుతున్నాడు.


"నంద్! మీరు అక్క ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. నేను మిమల్ని మా అక్క లాగే చూసుకుంటాను. ప్రామిస్! నచ్చితే నవ్వండి నంద్"


ఆనంద్ స్మైల్ ఇచ్చి, అనంత ను కౌగిలించుకున్నాడు.


అనంత లో అమృతను చూసుకున్నాడు ఆనంద్. ఇద్దరూ పెళ్ళి చేసుకొని జీవితాంతం హ్యాపీ గా ఉన్నారు.

***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ54 views0 comments

Comments


bottom of page