top of page

అమృత

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Amrutha' New Telugu Story Written By Venkateswara Rao Mandalika

రచన: వెంకటేశ్వర రావు మండలీక

అమృతం లాంటి హృదయం ఉన్న అమృత అతని జీవితంలోకి వచ్చింది. పల్లెటూరి అమ్మాయి అయినా పట్నం వాళ్ళని మించిన పరిణితి కనపరిచింది. ఈ కథను ప్రముఖ రచయిత వెంకటేశ్వర రావు మండలీక గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం

ప్రదీప్ ఇంజనీరింగ్ పాస్ అయి మద్రాస్ లో ఐ.ఐ.టీ.లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేడు. ఇది 1965 నాటి మాట. చదువు తరవాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం , నాలుగేళ్లు ఆర్మీ అయి ప్రదీప్ ౩౦ ఏళ్ల దగ్గరలో పడ్డాడు. లైఫ్ లో అంతవరకూ పెద్ద నగరాల్లో గడిపినా ఆధునిక భావాలున్నవాడైనా, ప్రదీప్ అమ్మ చాటు బిడ్డ. తన పెళ్ళికి తొందర పెడుతున్న అమ్మతో "అమ్మా! పెళ్లి చూపులంటూ అమ్మాయి ని ముద్దాయి లా కూర్చోపెట్టి ప్రశ్నలు వెయ్యడం నాకు ఇష్టం లేదు. నువ్వు, నాన్న, ఏ అమ్మాయిని ఎంపిక చేసినా నాకు సమ్మతమే" అని చెప్పేడు.

సరే, ప్రదీప్ తల్లి రాజేశ్వరి సంబంధాలు చూడడం ఆరంభించింది. ఆ రోజుల్లో మ్యారేజ్ బ్యూరో లు వెబ్ సైట్ లు ఎక్కడ ? తెలిసిన బంధువులు, స్నేహితులతో చెప్పడం వల్లే ఏవో సంబంధాలు తేవడం, పెళ్లి చూపుల ఫార్మాలిటీ, మొదట నిశ్చయించిన సంబంధం ఖరారు చెయ్యడం.

అలాగే ప్రదీప్ పెళ్లి ఒరిస్సా లోని ఒక కుగ్రామం లోని పిల్లతో కుదిర్చేరు. ఒరిస్సా లో చాల భాగం పూర్వం మద్రాస్ స్టేట్ లో ఉండడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్ళు తరవాత ఒరిస్సా వాసులయ్యేరు. పెళ్లి కూతురు తాలూకు కుటుంబం తెలిసిన వాళ్ళు. ప్రదీప్ కి కొంచెం సిటీ బ్రెడ్ పిల్ల కాదు, తనతో ఎలా ఉంటుందో జీవితం అన్న ఆలోచన రాక పోలేదు. అదీ కాక అమ్మాయి బి.ఏ.వరకు చదివింది. కొన్ని కారణాల వల్ల ఫైనల్ పరీక్ష రాయలేకపోయింది అని చెప్పేరు. సరే వాళ్ళ మంచి చెడ్డలు అమ్మా నాన్నా చూసే ఉంటారులే అని మనసులో ఎన్ని అనుమాన్నాలు ఉన్నా ఓ కే చెప్పేడు.

పెళ్లి సన్నాహాలు ఇద్దరి ఇళ్లలోనూ మొదలయ్యేయి. ఆడ పెళ్లి వారింట్లో మొదటి శుభకార్యం అవడం తో వాళ్ళింట్లో అతిధులు చాలా మంది చేరేరని తెలిసింది. ప్రదీప్ ఫామిలీ, బంధువులు, స్నేహితులు, నాన్నగారి జూనియర్ ప్లీడర్లతో రెండు బస్సు ల్లో బయలు దేరేరు వాళ్ళ ఊరికి. పెళ్లి వారి ఊరు రెండు రోజులు ప్రయాణం. అందరూ నవ్వులతోను, కబుర్లతోను, పాటలతోను అలసట తెలియకుండా ప్రయాణం సాగించేరు.

కానీ ప్రదీప్ మనసంతా ఆలోచనలు.పల్లెటూరి అమ్మాయి అంటే తన ప్రవర్తన ఎలా ఉంటుందో.. పెళ్లి చూపులలో తెలివైన అమ్మాయి లాగే కనిపించింది చాలా అందం గా ఉంది. పేరు అమృత. తనకి చాలా నచ్చింది. అయినా ఒక కుగ్రామం లో పుట్టి పెరిగిన పిల్ల. తనేమీ తప్పు చెయ్యడం లేదు కదా. ఈ ఆలోచనలతో ప్రయాణం లో కొంచెం ముభావం గానే ఉన్నాడు.

మర్నాడు సాయంత్రం పెళ్లి వారి ఊరు చేరుకున్నారు. ఊరి పొలిమేరలో పెళ్లికూతురు తండ్రి తో మరొక ఇరవై మంది దాక వచ్చి దండలతో స్వాగతం పలికేరు. బస్సులు దిగి వాళ్ళిచ్చిన ఫలహారాలు, కాఫీ లు తాగేక బారాత్ ని గ్రామం లో ఒక సత్రానికి తీసుకు వెళ్ళేరు. సత్రం పెద్దది గానే ఉంది. రూంలు కాక చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాల్ కి కామన్ బాత్ రూమ్ లున్నాయి. 'గ్రామాల్లో ఇలాగే ఉంటాయిరా' అన్నారు ప్రదీప్ నాన్న గారు.

అయినా అందరి మనసులోనూ ఎదో భయం లేకపోలేదు. ఇంక వీళ్ళ ఇల్లు కూడా ఈ సత్రం లాగే ఉంటుందా? అసలు పక్కా ఇల్లేనా లేక ఒక పెద్ద ఇంటి మీద ఆస్బెస్టాస్ లేక ఐరన్ షీట్ రూఫింగ్ ఉంటుందా.. ఎండా కాలం లో ప్రదీప్ ఈ వేడి భరించగలడా... అసలు ఇక్కడ కరెంటు ఉంటుందా లేక రోజుకి ఇన్ని గంటలనే ఇస్తారా... అందరి మనసులు పరి పరి విధాలా పోతున్నాయి

మర్నాడు సత్రం లో సుధీర్ ని పెళ్లి కొడుకు ని చేసే కార్యక్రమం అయ్యేక పెళ్లి వారింటికి వెళ్లి పెళ్లి కూతురుని చేసీ కార్యక్రమం చూద్దామని అందరూ బయలు దేరేరు. వాళ్ళిల్లు సత్రానికి కొంచెం దూరం లోనే ఉంది.

ఒక్క సారి ఇల్లు చూసేసరికి అందరికీ ఆశ్చర్యం వేసింది. అదొక పెద్ద మండువా లోగిలి. మూడు పోర్షన్ లు గా ఉన్న ఇంట్లో అమృత ఫామిలీ, వాళ్ళ పెదనాన్నల ఫ్యామిలీలు ఉంటాయి. ఎడంవేపు ఉన్న మామగారి ఇల్లు రెండు ఫ్లోర్ల లో ఉంది. పైన కింద కలిపి ఒక పెద్ద హాలు, కిచెన్, నాలుగు బెడ్ రూములు అన్నీ అధునాతనం గా ఉన్నాయి. ఇంట్లో అవసరాలకేమీ తక్కువలేదు. ఇంటి కి ముందర ఒక పెద్ద హాలు మామగారి ప్లీడరీ ఆఫీస్. ఇంత చిన్న గ్రామం లో ఎన్ని కేసులుంటాయిలే అనుకునేవారికి కూడా ఒక చిన్న షాక్. హాలంతా క్లయింట్ లతో నిండి ఉంది.

ఇంటి ముందర పెద్ద ఆవరణ, ప్రహరీ గోడ. అక్కడే పందిళ్లు వేసి పెళ్లి ఘనం గా జరిపించేరు. ఎంతో మంది లాయర్లతో భూకామందులతో పెళ్ళికి చాలా మందే హాజిర్ అయ్యేరు.

ఇల్లు చూసేక ప్రదీప్ కి కొంత ఊరట కలిగింది. తాను అనుకున్న కంటే చాలా

ఏక్కువగా ఉంది. మెల్లిగా పెళ్లికూతురు వాళ్ళ విషయం తెలిసింది. అమృత కి నలుగురు

తమ్ములు, ఇద్దరు చెల్లెల్లు. పెద్ద బావమరిది మెడిసిన్ చదువుతున్నాడు. మిగతావాళ్ళందరూ హై

స్కూల్ లో అక్కడే చదువుతున్నారు. అంటే ఇక్కడ హై స్కూల్ ఉందన్నమాట అంటూ నవ్వుతూ చెప్పేడు అక్క లక్ష్మికి..

"ఒరేయ్ నువ్వు ఎం ఊహించుకున్నావో గాని ఈ రోజుల్లో గ్రామాలు టౌన్ ల కేమీ తీసిపోరు. అక్కడున్న సౌకరాలన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తరవాత ప్రభుత్వాలు అద్భుతాలు చేసేరు . అయితే ముందర నించి సరి అయినా ప్లాన్ లు లేక పోడం తో ఇక్కడ కొంచెం రోడ్ లు భవనాలు వెనక పడ్డాయి"

అది నిజమే! వీళ్ళ ఇల్లు చూస్తేనే తెలుస్తోంది. ఇంట్లో సోఫాలు, రేడియో, టేప్ రికార్డర్, డైనింగ్ టేబుల్, ఫ్రిజ్, బాత్ రూమ్ ల లో గీజర్లు... ఏ నగరానికి తీసిపోకుండా ఉన్నాయి.

పెళ్లి ఘనం గా జరిగిన తరవాత, రెండు బస్సు ల లో అందరూ తిరిగి వెళ్లి పోయేరు. ప్రదీప్ అమృత తో మరొక నాలుగు రోజులుండి అమృత తో స్వంత ఊరు వెళ్లి మరో నాలుగు రోజులుండి వ్రతం, పూజ చేసుకొని మద్రాస్ బయలు దేరేరు. వాళ్ళ తో మామగారు, అత్తగారు కూడా వచ్చి ఇంటికి కావలిసిన సరంజామా ఏర్పాటు చేసి, వారం రోజుల తరవాత భారమయిన మనసులతో గ్రామం వెళ్ళిపోయేరు.

ఇక ప్రదీప్ సంసారం ప్రారంభమయింది. అమృత లో ఊహించని గుణాలని చూసి ఆశ్చర్యం వేసింది ప్రదీప్ కి. అమృత సిటీ లో పెరిగిన వారెవరికంటే తక్కువకాదని గ్రహించేడు. అమృత వెంటనే ప్రదీప్ తో యూనివర్సిటీ కి వెళ్లి పరీక్క్ష ల నిబంధనల్ని గురించి తెలుసుకుంది. అవసరమైన పుస్తకాలు బుక్ స్టోర్ నించి కొనుక్కొచ్చింది . ఆలస్యం చెయ్యకుండా అప్లికేషన్ ఫారం నింపి చదువులో పడింది. ఒక పక్క ఇల్లాలు, ఒక పక్క కొత్తగా పెళ్ళైన జీవితం, మరొక పక్క చదువు సందడి. పక్క ఫ్లాట్ వాళ్ళ తో స్నేహం చేసి రెండు రోజుల్లో పని మనిషిని కుదిర్చింది. అన్ని పనులూ చేసి రోజూ ఉదయాన్నే పాలు తేవడం కూడా ఆమె డ్యూటీ.

ఇలాగె సంతోషమైన జీవితంతో రెండేళ్లు గడిచి పోయేయి. అమృత బి.ఏ .పాస్ అయి, బి. ఈడీ కావలిసిన సమాచారం సేకరించడం ఆరంభించింది .

ఇంతలోనే ప్రదీప్, అమృత, ఇంటికి ఒక కొత్తసభ్యుడో సభ్యురాలో రాబోతున్నారని తెలిసింది. వాళ్ళ అంనందానికి అంతు లేదు

కానీ కొన్ని నెలలలోనే ప్రదీప్ ఒంటరి గాడయ్యేడు. అమృత అమ్మగారు పురుడు మరొక నాలుగు నెలలుందనగానే వచ్చి కూతురిని పుట్టింటికి తీసుకెళ్లి పోయేరు. పుట్టింటికి వెళ్లే ముందర అమృత తనకి పిల్లల పెంపకాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్పింది. పిల్లైనా పిల్లాడైన ఎలా పెంచాలి, ఏ ఏ టీకాలు ఎప్పుడెప్పుడు వేయించాలి. పిల్లల పెంపకం లో తండ్రి పాత్ర ఎంత అని రోజూ చెప్పేది. ఇది విన్న ప్రదీప్ కి ఆశ్చర్యం వేసింది ఈ అమ్మాయినేనా విలేజ్ గర్ల్ అని ముద్ర వేసేడు? ఇంకా అమృత సిటీ బ్రెడ్ ల కంటే చాలా ఎక్కువ అనిపించింది. ఇన్ని పనుల మధ్య అమృత కి దైవ భక్తి, రామాయణ మహాభారతం లోని విశేషాలు ఎన్నో తెలుసు..

తన జీవితం లో రెండేళ్లు నెరవేసుకుంటూ అమృత ఊరినించి వచ్చేక ఒక అతిధి తీసుకొస్తుందన్న సంతోషం,అమృత ఇక కొన్నాళ్లు తన దగ్గర ఉండదన్న బెంగ, తో ఆలోచిస్తూ ఉండి పోయేడు ప్రదీప్.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


48 views0 comments

留言


bottom of page