top of page
Original.png

చెడుసావాసం

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Vidhi Leela, #చెడుసావాసం, #TeluguMoralStories, #తెలుగునీతికథలు


Chedu Savasam - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 07/02/2026

చెడుసావాసం - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

సముద్రం పైన ప్రయాణం చేస్తున్న ఒక పడవ మునిగిపోయింది. చాలామంది మునిగిపోయారు. ఈత వచ్చిన కొంతమంది మాత్రం తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అందున ముగ్గురు...ఒక దీవి దగ్గరకు చేరుకొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.


ఆ ముగ్గురు తమను తాము పరిచయం చేసుకున్నారు...


మొదటి అతను: "నేను మా ఊరిలో రామాలయంలో పూజారిని..నిత్యం నాకు అదే కాలక్షేపం"

రెండవ అతను: "నేను మా ఊరిలో సర్పంచ్. ఊరి బాగుకోసమే ఎప్పుడూ నా తపనంతా"

మూడవ అతను: "నేను పేకాట ఆడుటలో నేర్పరి..రండి! మీకూ నేర్పుతాను" అని అన్నాడు 


"తర్వాత చూద్దాము. చాలా ఆకలిగా ఉంది...ఏదైనా తినడానికి వెతుకుదాం" అని మిగతా ఇద్దరు అన్నారు. 


ఆ దీవిపైన దొరికే వాటిని తింటూ, ఎవరైనా కాపాడడానికి వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.వాళ్ళ ప్రయత్నాల్లెవో వాళ్ళు చేస్తున్నారు. అలా రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఎవరు రాలేదు.


కాలక్షేపం కోసం, పేక ఆడడం నేర్పమని అడిగారు ఆ ఇద్దరు. కొద్ది సమయంలోనే, ముగ్గురు బాగా ఆడుకోవడం మొదలుపెట్టారు.


ఒకసారి వారికి ఒక సీసా కనిపించింది. దాని మూత తీయగా, అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది. దాన్ని చూసి ముగ్గురు భయపడ్డారు.


"భయపడకండి..! మీరు నన్ను విడుదల చేసారు. మిమల్ని నేను ఏమీ చెయ్యను. మీ కోరికలు తీరుస్తాను" అంది ఆ భూతం


"అయితే సరే.." అని ముగ్గురు వారి కోరికలు కోరారు 


మొదటి అతను "నన్ను నా ఊరిలో వదిలేయండి..ఆ దేవుని సేవలో తరిస్తాను"

రెండో అతను "నా ఊరిలో నన్ను దింపండి..అక్కడ బోలెడు పనులున్నాయి..ఇక్కడ ఉండలేను"

మూడవ అతను..ఇందాక తీసుకెళ్ళిన ఇద్దరినీ మళ్ళీ ఇక్కడికే తీసుకురా" అదే నా కోరిక 


"అలాగే" అని ఆ భూతం అనగానే 


వెళ్ళిన ఆ మొదటి ఇద్దరు మళ్ళీ అక్కడికే వచ్చేసారు. భూతం తన పని అయిపోయిందని, మాయం అయింది.


"ఇదేంటి మళ్ళీ ఇక్కడకు వచ్చేసాము" అనుకున్నారు ఆ మొదటి ఇద్దరు


"అదా..నేను మళ్ళీ మా ఊరు వెళ్ళి, అక్కడ పేక ఆడితే నన్ను మా ఇంట్లో తిడతారు. ఊరిలో తిడతారు. ఇక్కడైతే తినడానికి లోటు లేదు...ఆడుకోవడానికి మీరు ఉన్నారు. తిట్టేవారు ఉండరు. అందుకే అలా కోరిక కోరాను.." అన్నాడు మూడవ అతను 


చెడుసావాసం చేస్తే, ఇలాంటి గతే పడుతుందని ఆ ఇద్దరు గ్రహించారు.


***********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page