'Pellam Chebithe Vinali' - New Telugu Story Written By Mohana Krishna Tata
'పెళ్ళాం చెపితే వినాలి' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"నాన్నా! ఒక విషయం అడగనా?"
"అడుగు శ్యామ్"
"మీరు అమ్మ మాట వింటారా? అడిగిన అన్నింటికీ ఒప్పుకుంటారా?"
"ఎందుకు అలాగా అడుగుతున్నావు"
"మా ఫ్రెండ్స్ అంతా, పెళ్ళాం మాట వింటేనే, మొగుడు హ్యాపీ అంటున్నారు"
"పెళ్ళైతే నీకే తెలుస్తుంది రా కన్నా"
"నేను మాత్రం, పెళ్ళాం మాట వినను. నేను స్వతంత్రంగానే ఉంటాను నాన్న!"
"ఆల్ ది బెస్ట్ మై సన్"
***
సంవత్సరం పోయాక, శ్యామ్ కు పెళ్ళిచూపుల హడావిడి..
ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్ "ఒరే శ్యామ్! మంచి పెళ్ళాం వస్తే లైఫ్ హ్యాపీ రా! లేకపోతే అంతే రా!” అన్న మాటలు గుర్తొచ్చాయి.
పెళ్ళి చూపులలో అమ్మాయి, అబ్బాయి ఎదురుగా కూర్చుంది. ఫార్మాలిటీ రౌండ్ లో ప్రశ్నలు అయిపోయాయి.
అమ్మాయి పేరు మేఘన. చదువు డిగ్రీ. ఇంటి పని, వంట పని వొచ్చు. ఇవే ఫార్మాలిటీ రౌండ్ ప్రశ్నలకు సమాధానాలు.
"నాన్నా శ్యామ్! అమ్మాయి నచ్చిందా? "
"అమ్మాయి చాలా అందంగా, అమాయకంగా ఉంది నాన్న! అమ్మాయి చాలా నెమ్మదిగా, గౌరవంగా మాట్లాడింది"
"అయితే! నచ్చిందంటావు! మీ అమ్మకు చెప్పు మరి..."
"నాకు అమ్మాయి నచ్చిందమ్మ... పెళ్ళి చేయండి" అడిగాడు శ్యామ్.
"మేఘన వెడ్స్ శ్యామ్" లైటింగ్ బోర్డు కల్యాణమండపం ముందు పెట్టారు. పెళ్ళి ఘనంగా జరిగింది.
***********************
మేఘన అత్తారింట్లో కుడికాలు పెట్టింది. రోజూ, పెళ్ళాం కమ్మగా వండి పెడుతుంటే, భలే పెళ్ళాం వచ్చిందని మురిసిపోయాడు శ్యామ్.
"ఏమండి! మనం వేరే ఇల్లు తీసుకుందాం అండి. ఎంచక్కా ప్రైవసీ ఉంటుంది కదండీ. ఆలోచించండి......"
"ఇప్పుడెందుకే?! సారీ! నేను మా అమ్మ నాన్నలతోనే ఉంటాను"
మర్నాడు "పప్పు లో ఉప్పు తక్కువైందేమిటే?" అన్నాడు శ్యామ్, మేఘనను చూస్తూ..
"ఈ చిన్న ఇంట్లో, వంట మీద ఏకాగ్రత కుదరట్లేదండీ!"
"తప్పదు మేఘనా!" అన్నాడు శ్యామ్.
మర్నాడు వంట లో అసలు ఉప్పే లేదు.
శ్యామ్ డిస్టర్బ్ అయ్యాడు..
ఆ రాత్రి శ్యామ్ తన తండ్రి తో "నాన్న! బొత్తిగా పప్పు లో ఉప్పు ఉండట్లేదు నాన్న!"
"అవునా? కన్నా! అందుకే పెళ్ళాం చెబితే వినాలి కన్నా!"
"మీరూ అంతేనా నాన్న!"
అవునని తలూపాడు తండ్రి...
"నీ పెళ్ళాం మాట కు 'ఎస్' చెప్పి చూడు ఈ ఒక్కసారి" అన్నాడు తండ్రి.
ఆ రాత్రి “మేఘన డార్లింగ్! నువ్వు మరీ ఆడుతున్నావు గనుక... కొత్త ఇల్లు గురించి ఆలోచిస్తా"
"అవునా అండి!" అంటూ శ్రీవారి కాళ్లుపట్టడం ప్రారంభించింది.
మర్నాడు డిన్నర్ విందు భోజనమే!
"ఏంట్రా కన్నా! పెళ్ళాం మాట కు ఓకే చెప్పావా?"
శ్యామ్ కు కోపం వచ్చింది...అమ్మ దగ్గరుకు వెళ్ళి, పెళ్ళాం గురించి ఫిర్యాదు చేద్దామనుకున్నాడు.
"అమ్మా! నీతో ఒక విషయం చెప్పాలి!"
"ఏమిటది శ్యామ్? పప్పు లో ఉప్పు గురించా? టేబుల్ మీద ఉంటుంది.. వేసుకోవాలి రా"
"అది కాదు... కొత్తింట్లో కాపురం పెడదామంటుంది మేఘన… నాకేమో ఇష్టం లేదు…
మీ ఆడవారంతా ఇంతేనా అమ్మా?"
"ఎవరు నీకు ఇలా చెప్పింది?"
"నాన్న చెప్పారు" అని తడబడుతూ... అన్నాడు శ్యామ్.
మీ మగవాళ్ళకి ఆడవారి గురించి చాలా తక్కువ తెలుసు కన్నా! మీ నాన్న తో కూడా అప్పట్లో నేను వేరే కాపురం పెట్టించాను...స్వతంత్రంగా బ్రతకడం, ఆలోచిండం వస్తుందని....అందుకే ఈ రోజు ఇంత డెవలప్ అయ్యాము...
మేము నగలు అడుగుతాం...ఎప్పుడైనా అవసరానికి పనికొస్తాయని....మేము పట్టుబట్టి ఏమైనా అడిగితే.. అంతా.. ఫ్యామిలీ కోసమే రా...
ఇది విన్న శ్యామ్ "చాలమ్మా! చాలు! అంతా అర్ధమైంది… మీరు చాలా గ్రేట్! పెళ్ళాం చెప్పినట్టు వింటానమ్మా"...అని కళ్ళు తుడుచుకుని వెళ్ళాడు.
********************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments