top of page

ఒరిజినల్ హస్బెండ్


'Original Husband' - New Telugu Story Written By Pitta Gopi

'ఒరిజినల్ హస్బెండ్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో ప్రేమించని వారు ఎవరూ ఉండరు.


అలాంటి సమాజంలో కూడా రవి ఎవరిని ప్రేమించలేదు.

కారణం..


తనకు త్వరగా ఉద్యోగం వచ్చింది.


ఓ ఎస్ బి ఐ బ్యాంకు లో కొలువు కొట్టి సరాదాలు, సంతోషాలు, స్నేహితులు తో విహారాలు, ప్రేమ దోమ ఏమి లేకుండా కాలం వెళ్ళదీస్తు వచ్చాడు.


తల్లిదండ్రులు కూడా కోల్పోవటంతో బాబాయ్ రమ్య అనే అమ్మాయి తో ఒక మంచి పెళ్ళి సంబంధం కుదిర్చి ఘనంగా పెళ్ళి చేశాడు.


రవి బ్యాంకు ఉద్యోగి. మంచి మనసు ఉన్నోడు. అన్ని విషయాలు తెలిసిన వాడు. ఎదుటోడు చెప్పకుండానే అర్థం చేసుకునే మనస్థత్వం. ముందుచూపు కలవాడు. ఒకరకంగా చెప్పాలంటే రవి చాలా తెలివైనవాడు.తన స్నేహితులు చక్కగా అమ్మాయి ప్రేమలో ఉంటూ పొందిన ఆనందం ను రవి ఉద్యోగం వలన పొందలేకపోయాడు కదా..


ఇప్పుడు రమ్య తో చక్కగా తాను ఎంజాయ్ చేస్తూ ఆ చోట ఈ చోట తిప్పుతూ ఇద్దరు మిక్కిలి ఆనందంతో గడపసాగారు.

ఎంతగా అంటే బార్యభర్త లు అంటే ఇంత ఆన్యోన్యంగా ఉండాలి అని పదిమందికి చాటి చెప్పేలా.


ఇలా ఒక ఏడాది గడిచిపోయింది. తమ మొదటి వివాహ వార్షికోత్సవం నకు ఒక బహుమతి ఇచ్చాడు రవి.


ఇస్తూ..


"దీన్ని నువ్వు తీవ్రమైన దుఃఖంలో, నిరాశ నిస్పృహలో, నీలో నువ్వు లేకుండా చేసే పరిస్థితులు వచ్చినపుడు మాత్రమే ఓపెన్ చేసి చూడాలి. అప్పటి వరకు ఇది నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి" అన్నాడు.


‘ఏంటీ.. మొదటి పెళ్లి వార్షికోత్సవం కు ఇంత చిన్న గిఫ్ట్..’ అనుకుంటు "సరే "అంది రమ్య.


రవి రోజు ఉద్యోగానికి వెళ్ళటం, సాయంత్రానికి ఇంటికి రావటం. వచ్చిరాగనే రమ్యతో ఇంటి పని, వంట పనిలో కలిసిపోవటం.


ఆదివారం అయితే చాలు ఏదో ఒక ప్రదేశానికి రమ్యను తీసుకెళ్తూ.. బాదంటే తెలియని బార్యగా, కన్నీరే ఎరుగనివ్వకుండా చూసుకోసాగాడు.


తనకు ఏమి కావాలంటే అవి కొనిచ్చేవాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడకు తీసుకెళ్ళేవాడు. నిజాయితీగా ఉద్యోగం చేసేవాడు.


తను కోరినవన్నీ తీర్చేవాడు. అలా అని భర్త ఆర్థిక బలానికి మించి తాను కూడా ఆశించేది కాదు. ఎందుకంటే రమ్య కు కూడా రవి అంటే ఎక్కడ లేని ప్రేమ మరి.


ఇంత చక్కగా సాగుతున్న వీరి కాపురానికి అందరూ ముగ్దులైపోతారు. కొన్నిరోజుల నుండి రమ్య రవిని పట్టించుకోవటం లేదు

కారణం..

ఈ మద్యనే రమ్య కు ఒక ఐఫోన్ కొనిచ్చాడు రవి.


ఆ ఫోన్ తో తన ప్రియుడు తో మాట్లాడటం, చాట్ చేయడం లో మునిగిపోయేది. అయినా రమ్యని అనుమానించలేదు రవి. ఎందుకంటే నమ్మకం. ఆ నమ్మకమే రవికి బలహీనతగా, రమ్యకు బలంగా మారింది.


ఒకరోజు రాత్రి రవి నిద్రపోగానే రమ్య ముందే పిలవటంతో ఇంటికి వచ్చాడు. ప్రియుడు.

రవి నిద్రలో ఉన్నాడనే భ్రమలో పడి ప్రియుడు తో ముద్దు ముచ్చటలో మునిగటం, రవి చీకట్లో వారిని చూడటం జరిగిపోయాయి.


మనసులో బాద ఉన్నా రెండో పెళ్లి వార్షికోత్సవం కు ఏర్పాట్లు చేశాడు రవి.


ఈసారి బహుమతి గా ఏకంగా మనిషంత పొడవుతో రెడీ చేసి.

తనకు శుభాకాంక్షలు చెప్పి కళ్ళు మూసి, ఆ బహుమతిని స్నేహితుడి సహాయం తో ఓపెన్ చేశాడు.


రమ్య కళ్ళు తెరవగానే షాక్ అయింది. ఎదురుగా ప్రియుడు రాజేష్.


"ఇంతకంటే మంచి బహుమతి నేను ఇవ్వలేను. రెండేళ్లుగా నాకు మంచి బార్య గా ఉన్నందుకు ధన్యవాదాలు. నన్ను మోసం చేసిన నీకు ఇష్టమైన వాడితో కలిపి నీకు మేలు చేశాను. ఇకనుంచి వీడే నీకు భర్త" అంటూ వెళ్ళిపోతాడు రవి.


పుట్టుడు దుఃఖంతో రాజేష్ ఇంట్లో అడుగు పెట్టిన రమ్యకు

రాజేష్ తో సహా అత్తమామలు వేధించసాగారు.


పనికి వెళ్ళకుంటే తిండి పెట్టేవారు కాదు.అంత క్షోభా అనువిస్తుంది రమ్య. ప్రేమించకుండా పెళ్ళి చేసుకున్నవాడు మంచిగా చూసుకుంటే ప్రేమించిన వాడు నరకం చూపిస్తున్నాడు.


రమ్య కు రవి ఇచ్చిన మొదటి బహుమతి గుర్తుకు వచ్చి ఇంట్లో తలుపు గడియ వేసుకుని ఓపెన్ చేసింది.


ఆశ్చర్యం!


అందులో ఓ లేఖ ఉంది.


"ప్రియమైన నా ప్రాణం, నా జీవితమైన రమ్యకు.. నేను నా జీవితంలో తల్లిదండ్రులు ను కాకుండా ఇంకెవరినైనా ఇంత గొప్పగా ప్రేమించిన వారెవరైనా ఉన్నారంటే అది నువ్వే.


నన్ను మోసం చేయకుండా ఉండాలంటే నిన్ను బాగా చూసుకోవాలని నాకు తెలుసు. నీకు ఏలోటు రానివ్వను.

నన్ను విడవనివ్వను.

అయినా నీ దుర ఆలోచన వలన కానీ ఇతరుల దుర ఆలోచన వలన కానీ నువ్వు మారిపోయి నన్ను మోసం చేస్తావని తెలుసు. నీకోసం ప్రతి రాత్రి, ప్రతి ఆదివారం కేటాయిస్తూనే ఉన్నాను.


పెళ్ళి అయ్యాక భార్య ను, కుటుంబాన్ని చూసుకునేందుకు, డబ్బులు సంపాదించటానికి భర్తకు బాధ్యతలు ఉంటాయి.

ప్రియుడు ఎంత మంచివాడు అయినా.. పెళ్లి వేరొకడితో జరిగాక ఆ ప్రియుడికి నీ శరీరం పైనే తప్ప నీ మీద ఎటువంటి ప్రేమ ఉండదు. అర్థం చేసుకోకుండా నన్ను మోసం చేశావ్..


నువ్వు నిజంగా తప్పు తెలుసుని పశ్చాత్తాపం చెందితే నీ కోసం నా ఇంట్లో, నా గుండెల్లో ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి"..


ఇదీ లేఖ సారాంశం.


అది చదివిన రమ్యకు ఎక్కడ లేని ఆనందం తన్నుకొచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా రవి దగ్గరకు వెళ్ళి కాళ్ళపై పడి ఏడవసాగింది.


తన మొదటి వార్షికోత్సవానికి ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడని మనసులో అనుకుంటూ రవి ఎదలో వాలిపోయింది రమ్య.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

87 views0 comments

Comments


bottom of page