top of page

నాకు పెళ్ళాం కావాలి


'Naku Pellam Kavali' - New Telugu Story Written By Mohana Krishna Tata

'నాకు పెళ్ళాం కావాలి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఒరేయ్ ప్రేమ్! ఏమిటి రా?.. రాత్రివరకు ఇంటికి రావు.. ఎక్కడ తిరుగుతున్నావు రా.."


"ఏం లేదమ్మా! ఫ్రెండ్స్ తో సరదాగా.. అలా ఎంజాయ్ చేస్తున్నాను అంతే.."


"ఆఫీస్ అయ్యాక, ఇంటికి వచ్చి కొంచం నాకూ, నాన్నకు సాయం చెయ్యరా!"


"అందుకే నువ్వు ఒక కోడలిని తొందరగా తెచ్చుకో అమ్మా!"

"నాకు పెళ్ళాం కావాలి" అనొచ్చు కదరా!"


"అలాగే నమ్మా! మా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళయింది.. అందుకే 'నాకు పెళ్ళాం కావాలి'.. నీకు కోడలు రావాలి.. అందుకు నాకు పెళ్ళి చెయ్యాలి తల్లీ!"


"మా రోజుల్లో అయితే, అమ్మ నాన్న ఎవరిని చూపిస్తే, మాట మాట్లాడకుండా పెళ్ళి చేసుకునేవాళ్లం.. ఇప్పుడు రోజులు వేరు కదరా!.."


"నేను నీ కొడుకునమ్మా! పెళ్ళికూతురు విషయం లో మా ఫ్రెండ్స్ కున్న అన్ని కోరికలు నాకు లేవు.. చాలా తక్కువే ఉన్నాయ్"


"కోరికల లిస్ట్ ఎంత చిన్నగా ఉంటే, అంత తొందరగా పెళ్ళవుతుంది కన్నా!"


"రేపు ఇస్తాను నా లిస్ట్"..


"రేపు నీ లిస్ట్ పట్టుకుని, మ్యాట్రిమోనీ లో రిజిస్టర్ చేస్తాము.. నేను.. నాన్న వెళ్ళి"


"అలాగే" అన్నాడు ప్రేమ్.

***


మర్నాడు, మ్యాట్రిమోనీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళారు.. సునీత శ్యామ్ దంపతులు.


"చెప్పండి మేడం!" అంది అక్కడ ఇంచార్జ్.


"మా అబ్బాయి డీటెయిల్స్ ఇవిగోండి.. పేరు ప్రేమ్, అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయ్.."


"ఓకే.. నండి"


"ఇదిగోండి ఇంకో లిస్ట్.. తీసుకోండి" అని సునీత ఇచ్చింది.


"ఏమిటిది"


"మా అబ్బాయి పెళ్లికూతురు కుండాల్సిన క్వాలిటీస్ లిస్ట్. కాస్త అమ్మాయిల ఫొటోస్ చూపిస్తారా?"


"ఇవిగోండి అమ్మాయిల ఫొటోస్.. ఇవిగోండి వాటి లిస్ట్స్" ఇచ్చింది ఇంచార్జ్.


"ఇంకొక మాట.. కట్నం కావాలంటే ఒక త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది.."


"ఎందుకు?"


"అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు! వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు.. మీ అబ్బాయి ఇచ్చిన లిస్ట్ కి పదింతలు పెద్ద లిస్ట్ ఉంటుంది అమ్మాయిల లిస్ట్"


"చూడండి.. !" అని లిస్ట్ ఇచ్చింది ఇంచార్జ్


"చూస్తే, ఇందులో ఎక్కువ ఆస్తి, NRI, లక్షల్లో జీతం.. చాటింగ్.. డేటింగ్.. ఇవే ఎక్కువ ఉన్నాయి.."


"అవును! అందరు అమ్మాయిలకు ఇప్పుడు అంచనాలు పెరిగాయి"


"మా రోజుల్లో అయితే, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా.. పెళ్ళిళ్ళు అయిపోయాయి.. ఇప్పుడేమో చాటింగ్.. డేటింగ్.. కర్మ రా బాబు! మా అబ్బాయి ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మేము ఏం చెయ్యాలి?.."


"మీరు కనీసం ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మీ అదృష్టం.. ఈలోపు మీ అబ్బాయి ఫారిన్ వెళ్తే.. వెయిటింగ్ టైం బాగా తగ్గుతుంది.."


"అప్పటికి మా అబ్బాయి వయసు అయిపోతుంది కదండీ!.."


"ఇప్పుడు అబ్బాయిలందరు 40 తర్వాతే పెళ్ళి చేసుకుంటున్నారు.. అదే ట్రెండ్ కూడా.. మీరు 5 ఇయర్స్ ముందు రిజిస్టర్ చేసుకుని ఉంటే, మీ వెయిటింగ్ లిస్ట్ బాగా తగ్గేది.."


డీటెయిల్స్ ఇచ్చి.. పేరెంట్స్ ఇంటి దారి పట్టారు..


ఇంటికొచ్చిన తల్లి తో..


"అమ్మా! అమ్మాయి ఎవర్నైనా ఓకే చేసారా?"


"మనం ఓకే చేయడం కాదు.. అమ్మాయిలే ఓకే చెయ్యాలి నిన్ను.."


"ఏమిటి ఈ చిత్రం! అక్కడ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది.. అమ్మాయిల అంచనాలు బాగా ఉన్నాయ్.. డిమాండ్ కూడా.."


"నీకు తొందరగా పెళ్ళాం కావాలంటే.. ఒకటి.. నీ కోరికల లిస్ట్ తగ్గించు.. లేకపోతే.. ప్రేమించి పెళ్ళి చేసుకో.. మేము రెండు అక్షింతలు వేస్తాం.."


***************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


71 views0 comments

Comments


bottom of page