top of page

పాపం ప్రాణాలు


'Papam Pranalu' - New Telugu Story Written By Pitta Gopi

'పాపం ప్రాణాలు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మధు హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంచెం తొందరపాటు ఎక్కువ అతనికి. ఆ తొందరపాటుతో చాలాసార్లు తప్పులు చేశాడు. ఆ తప్పులతో మరలా తర్వాత బాధ పడతాడు. ఒక్కోసారి తాను చేసే పనుల్లోను ఆ తొందరపాటు వలన నష్టపోతు చింతిస్తు ఉంటాడు.


ఒకరోజు ఆ తొందరపాటు వలన తన విలువైన ఐ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఎవడో బైక్ మీద వచ్చి లాక్కుపోయాడు. ఆరు నెలలు కింద కొన్న ఖరీదైన ఆ ఫోన్ కోసం చాలా బాధపడ్డాడు మధు.


కిర్రో మొర్రో అంటూ మరో కొత్త ఫోన్ కొనుక్కుని పాత నంబర్ కలిసి రాలేదని మరో కొత్త నంబర్ తీసుకున్నాడు. కొత్త ఫోన్ అయితే తీసుకున్నాడు కానీ.. ఎప్పుడూ పాత నంబర్ కి ఫోన్ చేస్తూ ఎవరైనా రింగ్ చేస్తారేమో అనే ఆశతో ఎదురు చూస్తుండేవాడు.


అలా చాలాకాలం తర్వాత ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. మధు కళ్ళు మెరిశాయి.


ఒక అమ్మాయి గొంతు..

"హాల్లో.."అని వినిపించింది మధుకు.


ఆ గొంతు మధుని మైమరిపించింది. తేరుకుని "ఎవరండి మీరు? ఆ ఫోన్ నాది" అన్నాడు గద్దిస్తూ


"మీ ఫోన్ తో నాకేం పని.. ఓ నంబర్ కొన్నాళ్ళు వాడకపోతే ఇంకొకరికి ఇస్తారని తెలియదా" అందామె.


దీంతో ‘సారీ’ చెప్పి ఫోన్ పై ఆశలు వదులుకున్నాడు మధు.


కానీ ఆ గొంతులో మాధుర్యాన్ని మర్చిపోలేక ఆ మరునాడు ఫోన్ చేసి "ఇంతకీ మీరు ఎవరో చెప్పనే లేదు" అన్నాడు.


"మీ మగాళ్ళంతా ఇంతే! అమ్మాయి దొరికితే చాలు ప్లర్టింగ్ చేయటమేనా మారండ్రా బాబు" అని ఫోన్ కట్ చేస్తుంది.


ఆ ఘటనతో ఆమె పై పుట్టిన ప్రేమంతా గంగలో కలిసినట్లు అయింది మధుకు.


"తన జోలికి మనమెందుకులే వెళ్ళటం" ఆనుకున్నాడు.


ఇదిలా ఉండగా ఒకరోజు తానే ఫోన్ చేసి "అలా మాట్లాడినందుకు సారీ రోజు ఎంతో మందికి చూస్తాం ఆడవాళ్లు కి కూడా బాద్యతలు ఉంటాయి కదా.. నాన్న గారికి అప్పులు ఉన్నాయి అందుకే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను" అంది.


"ఓ.. హైదరాబాద్.. హ.. నాదీ హైదరాబాద్ నే. ఎక్కడ ఉంటారు మీరు" అన్నాడు మధు ఆత్రతగా.


"హాల్లో.. అదే వద్దంటాను. తగ్గించుకోండి కాస్త" అని ఫోన్ పెట్టేసింది.


మధు ఆశ వదులుకోలేదు. ఎలాగైనా తనను లైన్లో పెట్టుకుని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు.


నెల తర్వాత మరలా ఫోన్ చేసి తన ఫ్రెండ్ కి ఏదో ఆపరేషన్ అంట

"బ్లడ్ ఇస్తారా.. రెండు యూనిట్లు కావా"లంది


ఫ్రెండ్ ని తీసుకుని ఒక గంటలో ఆమె చెప్పిన చోట వాలిపోయాడు మధు.


ఆమె ను చూడగానే ఎగిరి గంతేశాడు. పేరు రాణి. చాలా పద్దతిగా ఉంది. బహుశా పల్లెటూరు పిల్ల అని కనిపెట్టేశాడు మధు.


అప్పటి నుండి అప్పుడప్పుడు ఫోన్ చేస్తు పలకరిస్తూ ఉండేది. చాలా తక్కువ మాట్లాడేది. దీంతో మధుకు రాణి పై ఇష్టం పెరిగింది. ఆమె ఫ్రెండ్స్ ద్వారా వివరాలు తెలుసుకున్నాడు మధు. ఆమె లాగానే తమ కుటుంబం కూడా పద్దతైన కుటుంబం అంట.


మధుకి ఎలాగూ మంచి ఉద్యోగం ఉంది ఎలాగైనా రాణిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు మధు.

ఒకరోజు తాను ఫోన్ చేయగా ఆలస్యం చేయకుండా "నన్ను పెళ్ళి చేసుకుంటావా" అని అడిగాడు.


"నా పెళ్ళి బాద్యత నా కుటుంబం చూసుకుంటుంది" అని చెప్పింది రాణి.


ఇంకేముంది.. మధు ఎగిరి గంతులేశాడు. తనకు ఉన్న ఉద్యోగం బట్టి తన మనస్తత్వం బట్టి ఖచ్చితంగా తనకు రాణితో పెళ్లికి తమ పెద్దలు ఒప్పుకుంటారని వారిని ఒప్పిస్తే పోలా అనుకుని

మరనాడే రాణికి తెలియకుండా ఆమె సొంత గ్రామం వెళ్ళాడు మధు.


"నమస్కారమండి. నా పేరు మధు, హైదరాబాద్ లో సాప్ట్వెర్ ఉద్యోగం చేస్తున్నాను. మీ అమ్మాయి చాలా మంచిదండి. తానంటే నాకిష్టం. మా ఊర్లో నాకు పొలాలు కూడా ఉన్నాయి" మధు మాటలు ఇంకా పూర్తి కానేలేదు.


రాణి తండ్రి ఫోన్ తీసి "ఏంటే.. సిటీ కి పోయి నువ్వు చేస్తున్న పనులు..? వీడెవడ్నో ఇంటికే పంపిస్తావా.." గట్టిగా అరుస్తూ రాణిని తిడుతున్నాడు.


అది ఊహించక బిత్తరపోయి చూస్తున్నాడు మధు.


అంతలోనే రాణి పెద్దనాన్న కొడుకు వచ్చి మధుని లాగిపెట్టి ఒకటి కొట్టాడు.


జీవితంలో మొదటి అవమానం అని ఊహించుకున్నాడు. తన వలన రాణి కూడా మాట కాసినందుకు బాధపడ్డాడు. బాధ దిగమింగి రాణిది తప్పు లేదని చెప్పాలనుకుంటున్నా మధుకి మాట రావటం లేదు. అక్కడితో ఆగకుండా తలో మాట అంటూనే ఉన్నారు మధుని.


పది నిమిషాలు గడిచాక రాణి తండ్రి ఫోన్ మోగింది.


"అయ్యో.. ఎంత పని చేసింది అయ్యో.. ఏ హాస్పిటల్" అని ఆయన అరుస్తుంటే మధుకి మెదడు మొద్దుబారింది.


రాణి ఏదో అఘాయిత్యానికి పాల్పడీందని అర్థం అయింది మధుకి. రాణి అన్న పోలీసు కంప్లీట్ ఇవ్వటంతో మధుని పోలీసులు అరెస్టు చేశారు. , కొట్టారు.


అయినా మధు మనసులో ఒక రాణి బాధ మాత్రమే ఉంది. రాణి తనకు దక్కకపోయినా పర్వాలేదు కానీ.. ఆమె ప్రాణాలతో బయటపడి తమ కుటుంబానికి దక్కాలని కోరుకున్నాడు. కానీ రాణి ఈ లోకం వదిలి పోయింది.


విషయం తెలుసుని మధు కూడా లాకప్ లోనే ప్రాణాలు వదిలాడు. మధు పోలీసులు కొట్టిన దెబ్బలువలన కారిన రక్తంతో ఓ లేఖ రాశాడు. ఆ విషయాన్ని రాణి తండ్రికి చెప్పి లేఖ ఇచ్చారు పోలీసులు.


జరిగింది అంత అందులో రాసి “క్షమించండి! రాణి ఏ తప్పు చేయలేదు. తనని అడిగితే కుటుంబం చూసుకుంటుంది అని చెప్పటంతో మీ నిర్ణయం కోసం వచ్చానని ఎటువంటి దుర, చెడు అలవాట్లు లేవు. పైగా రాణి ఎలాగైనా బతికాలని లాకప్ లో దేవుని కి ప్రార్ధించానని తాను లేని ఈ లోకంలో తాను ప్రేమించకున్నా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నేను కూడా చనిపోతున్నాను. పోలీసులను తప్పుపట్టకండి. నేను బతికుంటే నా ప్రేమకు విలువ ఉండదు కదా..”


అది చదివిన రాణి కుటుంబం ‘పాపం.. వారి పెళ్లికి ఒప్పుకుంటే పోయేది ఏమీ లేదు కదా.. తమ తొందరపాటు కు నిండు ప్రాణాలు పోయా’యని దుఃఖ సంద్రంలో మునిపోయింది.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పిట్ట గోపి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం







70 views1 comment
bottom of page