USA రాష్ట్రపతిని కాపాడింది ఎవరు???
- P. V. Padmavathi Madhu Nivrithi

- 46 minutes ago
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #USAరాష్ట్రపతినికాపాడిందిఎవరు, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

USA Rashtrapathini Kapadindi Evaru - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 07/02/2026
USA రాష్ట్రపతిని కాపాడింది ఎవరు? - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
ఆ రోజు అమెరికా (USA) రాష్ట్రపతి నివాసమైన వైట్‌హౌస్‌కు (WHITE HOUSE కు) ఫోన్ వచ్చింది... ఆదుర్దా అయిన కంఠంతో... ఇలా...
"ఈ రోజు రాష్ట్రపతిని రాత్రి 9 గంటలకు తుపాకీతో కాల్చి... లేక ఇతర పద్ధతులతో... ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త."
"అయితే ఏమి చేయమంటారు?", వైట్‌హౌస్ నుండీ ఆందోళనకరమైన స్వరంలో ప్రశ్న.
"రాష్ట్రపతిని బయటికి పోకుండా ఆపండి... రాత్రి అంతా ఇంట్లోనే ఉండాలి వారు... కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది నడుమ!"... ఆ మనిషి ఆదుర్దా అయిన కంఠంతో సూచన!
‘‘అయ్యో... అతడు బహిరంగ సభకు ర్యాలీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు తిరిగి రావటం అసాధ్యం"... వైట్‌హౌస్ అధికారి ఆందోళనకరమైన స్వరంలో జవాబు.
"అయ్యో...", ఆ మనిషి లైన్ కట్ చేశాడు.
2)
రాష్ట్రపతి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.
సరిగ్గా రాత్రి 9 గంటల సమయం.
ఎవరో తుపాకీతో కాల్చిన శబ్దం... కానీ గురి తప్పింది. ఎందుకు? ఆ క్షణంలో లైట్ ఆఫ్ అవ్వడం వల్ల... గాఢాంధకారం లో తుపాకీ గురి తప్పింది. ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యుంటుంది. దేవుడి కృప వల్ల రాష్ట్రపతి బ్రతికిపోయాడు.
ఆ కిల్లర్ (హంతకుడు) పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు తదుపరి విచారణకు తరలించారు.
---------------
3)
USA రాష్ట్రపతి ప్రసంగంలో ఇలా కొనసాగించారు... ఆయన చెప్పారు, "దైవానుగ్రహం వల్ల... ఆ క్షణంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కరెంట్ పోయింది. అంధకారం అయి హంతకుడు తుపాకీ గురి తప్పింది. నేను బ్రతికి బయటపడ్డాను. ఆ దేవుడికి... నా శ్రేయోభిలాషులైన మీ అందరికీ ధన్యవాదాలు."
----------------------
4)
మరునాడు వార్తల్లో అమెరికా (USA) రాష్ట్రపతి మాధవ్ అనే వ్యక్తిని గౌరవిస్తున్నారు... "ఇతడే ఆ రాత్రి 9 గంటల సమయంలో కావాలని షార్ట్ సర్క్యూట్ చేసి... ఆ క్షణంలో విద్యుత్ సరఫరా పోయేలా చేసి... నా ప్రాణాలు కాపాడిన మొనగాడు. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. THANKS for saving my life"
-----------------------------
5)
మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు... "రాష్ట్రపతి ప్రాణాలు కాపాడింది నేను కాదు."
అక్కడ చేరిన వారందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యంగా అడిగారు, "మరి ఎవరు?"
మాధవ్ ఇలా కొనసాగించాడు...
"ఇంద్రధనుస్సు అమెరికా అమ్మాయిలు (SWEET VIBGYOR - RAINBOW American GIRLS) + బెట్టీ + వెరోనికా + సన్నీ... వారే సలహా ఇచ్చారు. 9 PM సమయానికి ఆ క్షణంలో ఎలాగైనా షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ పోయి అంధకారం అయ్యేలా చేయమని.
...
ఎందుకంటే? నేను వైట్‌హౌస్‌ను అప్రమత్తం చేసే సమయానికే అమెరికా రాష్ట్రపతి బహిరంగ సభకు ర్యాలీగా తరలి వెళ్ళిపోయారు బయటికి. ఇంత చక్కటి తెలివైన ఇంద్రధనుస్సు అమెరికా అమ్మాయిలను + బెట్టీ + వెరోనికా + సన్నీ లను నాకు స్నేహితులుగా + కుటుంబంగా ఇచ్చినందుకు... ఆ దేవుడికి కృతజ్ఞతలు."
-------------------------------
------- చిన్న కథ సమాప్తం -------
నీతి:-
1) అపాయంలో ఉపాయం ముఖ్యం, దిగులు కాదు.
2) తర్కంతో ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు తేలికగా.
3) ఇష్టము లేని, తగని వారితో, పనులతో, స్థలాలతో దూరంగా ఉంటే మంచిది. శత్రుత్వాలకు, కోట్లాటలకు, యుద్ధాలకు, వాదనలకు తావు ఉండదు. ఉద్రిక్తత, బిపి, వాదనలు లేకుండా ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉత్పాదక, సానుకూల పనులతో మంచిని పంచుతూ, పెంచుతూ దయతో, సహాయకారిగా, ప్రగతి అభ్యుదయం పధంలో, భూతతత్వం లేకుండా జీవితం సాగించవచ్చు. హ్యాపీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (సంతోష పూరిత నిర్వహణ), గెలుపు-గెలుపు ఆనందకరమైన విజయ పరిష్కారాలు నిర్వహణతో అందరికీ అద్భుతమైన ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు మరియు పురోగతిని, మంచితనం వ్యాప్తి చేస్తూ... భూతతత్వం రవ్వంత లేకుండా... (దేవుడు చేసిన మనుషులు అన్నాక)!
4) During a crisis, don't panic. Think of a remedy (happy development, joyful success solution/logic).
5) ALWAYS every (God-made) human being should do 100% HAPPY Development management and WIN-WIN JOYFUL success SOLUTIONS. Lead a life of CONSTRUCTIVE nature. Spreading excellent health, peace, prosperity, and progress + good nature to all, WITHOUT an iota of devilish nature at all.
6) Keep AWAY FROM people, places, and work of your dislike, to AVOID/PREVENT tension, BP, and bad health.
---------- నీతి సమాప్తం -------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments