ఆనంద దీపావళి
- Neeraja Prabhala

- Nov 12, 2023
- 1 min read
Updated: Dec 5, 2023

'Ananda Deepavali' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 12/11/2023
'ఆనంద దీపావళి' తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
చిరు నవ్వు దివ్వెల కాంతుల దీపావళి - శుభములనిచ్చే ఆనంద దీపావళి.
చీకటిని తరిమి వెలుగులను దశదిశలా ప్రసరించే దీపావళి.
మన మనసులోని బాధలను మరిపించే దరహాస జ్యోతుల దీపావళి.
అజ్ఞానాంధకారాన్ని తరిమి అంతరంగాన జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసే దీపావళి.
చిన్నా, పెద్దా తేడా లేకుండా సంతోసాగరంలో తన్మయత్వంతో ఓలలాడే దీపావళి.
కళకళలాడే దీప కాంతులతో మన ఇంట లక్ష్మీదేవి స్ధిర నివాసమాయే.
సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో మన ఇల్లు శోభిల్లే దీపావళి.
దీప ప్రజ్వలనతో శోభాయమానంగా మన మానసమందిరాన ప్రకాశించే శుభ దీపావళి.
కులమత తారతమ్యం లేకుండా సంతోషంగా ప్రతి ఇంటా దీపాలను వెలిగించే ఆవళి దీపావళి.
అందరం సమిష్టిగా, సంతోషంగా ఆనందసాగరంలో ఓలలాడే దీపావళి.
నిత్త నూతనోత్సాహాన్నిచ్చి మదిలో జ్యోతి వెలుగులను ప్రసరించే దీపావళి.
కనులారా, తనివితీరా తిలకించి మనసారా ఆనందించే దీపావళి.
ఈ ఒక్కరోజే కాదు మన ఇంట దీపావళి.
నిత్యం రావాలి మన ఇంట దీపావళి.
అదే అసలైన దీపావళి - ఆనంద కాంతుల దీపావళి.
….నీరజ హరి ప్రభల.




Comments