top of page

దసరా టు దీపావళి


'Dasara To Deepavali' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 12/11/2023

'దసరా టు దీపావళి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


సుబ్బారావు చిన్ననాటి నుంచీ చాలా పొదుపు పాటించే మనిషి. ప్రతీ రూపాయి ఎంతో అలోచించి ఖర్చు చేస్తాడు. అతను చాలా జాగ్రత్త అని అనుకుంటాడు.. కానీ, చుట్టూ చూసే జనం మాత్రం పిసినారి అంటుంటారు. సుబ్బారావు ఇలాంటి మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు.


ఇలాంటి మనిషికి పెళ్ళి చేద్దామని అనుకున్నారు తల్లిదండ్రులు. అమ్మాయి ఫోటో చూసి పెళ్ళిచూపులు అరేంజ్ చేసారు. పెళ్ళి చూపులలో.. కట్నం అడిగితే బాగుండదు అనుకుని.. ఒక ప్లాన్ వేసాడు సుబ్బారావు. పెళ్ళి ఖర్చు అంతా ఆడపెళ్ళివారిదే.. దానితో పాటు అమ్మాయికి ఒక పెద్ద వడ్డాణం చేయించాలనేది షరతు గా పెట్టాడు. పెళ్ళికూతురు నడుము కొలత ముందే చూసి.. బంగారం లెక్క వేసాడు సుబ్బారావు.. ఎంత కాదన్నా.. ఎక్కువే ఉంటుంది బంగారం.


"ఈ వడ్డాణం.. మీరు కొంచం లూజు గా చేయించండి.. మీ అమ్మాయి వొళ్ళు చేసినా సరిపోతుంది" అని సుబ్బారావు అన్నాకా.. ఆడపెళ్ళి వారంతా చాలా ఆశ్చర్యపోయారు. అయినా తప్పక ఒప్పుకున్నారు కాబోయే మావగారు..


ఆడపెళ్ళి వారిదే కదా ఖర్చు మరి.. పెళ్ళి కార్డ్స్ ఊరంతా పంచేసాడు సుబ్బారావు.. ఎంతకాదన్నా.. కట్నం డబ్బులు బదులు చదివింపులు బాగానే కిట్టు బాటవుతాయని ప్లాన్ వేసాడు . అనవసరంగా.. ఒక గ్లాస్ మంచినీరు కుడా తాగని సుబ్బారావు.. పెళ్ళి లో అందరికీ కూల్ మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలని అడిగాడు మావగారిని.


తన ప్యాంటు షర్టు కొలతలు తెచ్చి.. పెళ్ళివారి అందరికీ చాలా కాపీలు పంచాడు సుబ్బారావు..


"ఇది ఎందుకండీ! అని అడిగారు కాబోయే మావగారు"

"ఏమీ లేదు! అందరూ.. ప్యాంటు షర్టు ముక్కలు పెట్టేస్తున్నారు.. కొలతలు ఇస్తే.. కుట్టించి పెడతారని.. నాకూ గ్రాండ్ గా ఉంటుందని.. "


పెళ్లి గ్రాండ్ గా జరిగింది.. ఆడపెళ్ళివారికి తప్పదు కదా! ఎంతైనా.. ఎక్కడైనా మరి!


పెళ్ళి కానుకల విషయం లో ముందే చాలా క్లారిటీ తో ఉన్నాడు సుబ్బారావు.. ఒక్కొక్కరికి ఒక్కో ఐటెం అసైన్ చేసేసాడు గిఫ్ట్ కింద. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, డిష్‌వాషర్‌, కూలర్, ఇలా ఐటమ్స్ లిస్టు అందరినీ పంచుకోమన్నాడు. హనీమూన్ ట్రిప్ ఒకటి మిగిలింది. లక్కీ గా మావగారు.. టికెట్స్ ముందే బుక్ చేసేసారు. కూతురి కోసం చెయ్యాలి కదా మరి!


హనీమూన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసారు కొత్త జంట.. ఎంతైనా ఫ్రీ యే కదా!.. బిల్ వర్రీ మాత్రం మావగారికి..


కొత్త పండక్కి అల్లుడుకి ఆహ్వానం వచ్చేసింది..


"అల్లుడుగారూ! మీరు అమ్మాయిని తీసుకుని ఈ దసరా పండక్కి ఒక వారం రోజులు సెలవు పెట్టి మా ఇంటికి రావాలి. ఇదే మా ఆహ్వానం!"


"మావగారు! నేను ఆఫీస్ లో కొంచం బిజీ గా ఉన్నాను. అందులోనూ.. ఈ మధ్య అస్సలు ఖాళీ ఉండట్లేదు.. మీరే ఆ టికెట్స్ బుక్ చేసేయండి. నేనూ.. మీ అమ్మయీ పది రోజుల ముందే వచ్చేస్తాము. అంతగా పిలుస్తుంటే, ముందే రావాలనిపిస్తుంది మరి!"

ఆ మాటలు విని మావగారు బిత్తరపోయాడు (ఇదేమిటి సెలవు ఉండదు.. ఒక రోజే వస్తారేమోననుకుంటే.. ముందే వస్తానంటాడేమిటి అల్లుడు?.. మనసులో అనుకున్నారు మవగారు)


"ఏమండీ! అదేంటి అలా చెప్పారు? మీకు అన్ని రోజులు సెలవులు ఎక్కడ దొరుకుతాయి?"

"అదేమిలేదే! 'వర్క్ ఫ్రొం అత్తారిల్లు' చేస్తాను. నాకు సెలవు పెట్టక్కర్లేదు.. అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా!"

"ఏమిటో.. ?"

"మనం ఇంట్లో లేకపోతే, మనకి.. కరెంటు ఖర్చు మిగిలిందా! పాలు, కిరాణా.. అన్నీ ఆదా.. సెలవు పెట్టను కాబట్టి జీతం కుడా నష్టం లేదు.. టికెట్స్ ఎలాగో ఫ్రీ యే కదా!.. పైగా.. మీ అమ్మ ఎలాగో.. తీసుకుని వెళ్ళమని ఆవకాయలు ఒక అరడజను రకాలు.. ఆ పొడి.. ఈ పొడి అని ఇస్తుంది కదా!.. మనకి అంతా లాభమే కదా! మరి.. "


"అలా మూతి విరవకే సుమిత్రా!.. ఈ ట్రిప్ లో ఎలా ఆనందంగా ఉండాలో ఆలోచించు!"

"ఇన్ని పిసినారి బుద్ధులున్నా.. మా పుట్టింటికి ముందుగా తీసుకెళ్తున్నారు.. అదే హ్యాపీ నాకు!"

"నీ ఆనందాన్ని డబల్ చేసే ఇంకో విషయం తర్వాత చెబుతాను !!!"


"హమ్మయ్యా! నవ్వింది మా ఆవిడ!"


"ఏమండీ! అయితే బ్యాగ్ సర్దేస్తాను"


"ఒసేయ్ ! రెండు జతలే పెట్టు"


"అదేంటి!"


"పండుగ కదా! ఎలాగో నీకో అరడజను చీరలు.. నాకో మూడు జతలు పెడతారు.. అవి వేసేసుకుంటే సరిపోతుంది.. ఎక్కువైతే మళ్ళీ ఆ పోర్టర్ కు అనవసరంగా మొయ్యడానికి డబ్బులు తగలెయ్యాలి!"


ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది..


ట్రైన్ లో బెర్త్ ఎక్కి కూర్చున్నారు సుబ్బారావు దంపతులు. మనము ఒక నాలుగు గంటల్లో మీ ఊరు వెళ్లిపోతాము కదా! ఈ రెండు బెర్తులు మనకి అవసరమా చెప్పు! పాపం ఆ అమ్మాయి చూడు.. నిల్చొని ఎంత కష్టపడుతుందో.. ఒక బెర్త్ ఇచ్చేద్దాము సుమిత్రా!.. మనం ఒకే బెర్త్ లో పడుకోవచ్చుగా..


"బాగుండదేమోనండి!"

"కొత్తగా పెళ్లైంది గా.. ఏమీ అనుకోరు లే.. మనకీ బాగుంటుంది!"

"ఆ అమ్మాయిని పిలిచి బెర్త్ ఇవ్వు శ్రీమతి.. "

"ఇచ్చేసానండీ శ్రీవారు!"

"అదేంటి.. డబ్బులు తీసుకున్నావు?"

"మీకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాను, మీతో కాపురం చేసి. ఫ్రీ గా ఎందుకు ఇవ్వడం అని.. ఒక ఐదొందలు అడిగా.. ఇచ్చేసింది.


"పాపం! ఆ అమ్మాయికి బాగా నిద్ర వస్తున్నట్టు ఉంది మరి! మొత్తానికి నా లైన్ లోకి వచ్చేస్తున్నావే సుమిత్రా డియర్!" అన్నాడు సుబ్బారావు


"సుమిత్రా! ఆకలి వేస్తోందే! ఏమైనా తెచ్చావా ఇంటి నుంచి?"

"సమోసా తింటారా?"

"మళ్ళీ అదో ఖర్చు లేవే !"

"మీరు ఏది కావాలంటే అది తినండి. నేను చూసుకుంటాను!"

"ఇంక చుసుకో.. నా ఆర్డర్ లిస్టు.. "


ఈలోపు సుమిత్ర ఫోన్ అందుకుంది. "నాన్నా! మేము బయల్దేరాము.. ఉదయానికి అక్కడ ఉంటాము.. నా ఫోన్ లో బ్యాలన్స్ లేదూ.. ఊ .. ఊ.. "


"అయ్యో! ఎందుకు కష్టపడతావు తల్లీ! ఒక వెయ్యి వెయ్యనా?"


"మా నాన్నకి నేన్నంటే ఎంత ప్రేమో.. ఉంటాను నాన్నా!"


"నువ్వు సూపర్.. సుమిత్రా!"


"ఏమనుకున్నారు.. అవును మరి.. ఆరు నెలలు సావాసం చేస్తే, వారు వీరు అవుతారంటారు.. ఇదేనేమో"


"నువ్వు ఇంకా ముందే మారిపోయావు సుమిత్రా! నీలో ఇంత మార్పు వచ్చింది కనుకా.. ఆ విషయం చెప్పాల్సిందే మరి!"


"చెప్పండి ప్లీజ్!!"


"నీ సంతోషం కోసం.. ఈ దసరా ట్రిప్ దీపావళి వరకూ పొడిగించాలని నిర్ణయించుకున్నాను.. దీనికి నీ సపోర్ట్ కావాలి నాకు"


"దానికేముందండీ! మా నాన్న ఎలాగో పైసా ఖర్చు చెయ్యడు.. నా కోసం అయితే, బాగా ఆలోచించి ఖర్చు చేస్తాడు.. ఇప్పుడు మన కోసం ఖర్చు చేయిస్తాను .. ఆయన మీకన్నా పిసినారి"


"నేను పిసినారి కాదు.. జాగ్రత్త పడతాను అంతే!"


"మీరు ఎలాగనుకుంటే, అలగేలెండి!"


"మరి మీ ఇంట్లో ఏమిటి చెబుతావు?"


"దసరా టు దీపావళి ఎన్నో రోజులు లేవు కదా.. అలాగ అక్కడ చుట్టు పక్క ప్రదేశాలు తిరిగితే సరి! అదీ మా నాన్న చేత స్పాన్సర్ చేయిస్తాను.. "


"చూస్తూ ఉంటే.. మీ నాన్న తో చాలా చేయించుకునే లాగ ఉన్నవే!"


"ఇప్పుడు మనిద్దరి కోసం మా నాన్న కు తప్పుదు!"


"అయితే.. దసరా టు దీపావళి సంబరాలు స్టార్ట్! పైసా ఖర్చు లేకుండా!"


****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


50 views0 comments

Comentários


bottom of page