top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/11/2023

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది. వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.


కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు ఏసీపీ యాది రెడ్డి. వాళ్ళు పార్టీ చేసుకున్న గెస్ట్ హౌస్ ను పరిశీలిస్తాడు. మనోరమ హత్యకు గురైనట్లు అనుమానిస్తాడు.


మనోరమ చనిపోయినట్లు, ఆమె శవాన్ని మినిష్టర్ గారి తోటలో పూడ్చి పెట్టినట్లు చెబుతాడు వాచ్‌మెన్‌ యాదయ్య.


మినిష్టర్ గోవిందరావు కేసునుండి తన కొడుకును తప్పించే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. చంద్రాన్ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.

చంద్రాన్ని కలవడానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది వెన్నెల.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16 చదవండి.


తనను చూడడానికి వచ్చిన వెన్నెలను చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇలా ఆమె వస్తుందని అతను కలలో కూడా ఊహింలేదు. పైగా ఈ పరిస్థితులలో ఆమె పోలీస్‌ స్టేషన్‌ రావడం అతడు నమ్మలేక పోయాడు.


ఆమె కేసి నేరుగా చూడలేకపోయాడు. చూసే ధైర్యం అతడికి లేకపోయింది. ఇద్దరూ ఎదురెగురుగా నిలుచున్నారు. వాళ్ళకి కాస్త ఎడంగా యమున నిలుచుంది.


ముందు ఎవరు మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి ? ఇద్దరి లోనూ సంధిగ్ధత.. కాసేపు.. వెన్నెలకి సంజ్ఞ చేసింది యమున. మాట్లాడమని. అప్పటికే వెన్నెల కళ్ళు

బాగా చెమర్చాయి. భర్తని అలా చూసే సరికి. బాగా గడ్డం పెరిగింది. మనిషి బాగా కృంగి, కృషించిపోయినట్లున్నాడు. ముఖంలో కళ తప్పింది.


" సారీ. ".. అంది వెన్నెల.


చంద్రం తలూపాడు. ఎందుకు ఊపాడో అతడికి తెలీదు. ఆమె అన్న మాటకి చంద్రం తలూపాడు. అసలు తల ఎందుకు ఊపాడో అతనికి తెలీదు. వెన్నెల అన్న

మాటకి ప్రతిస్పందనగా తల ఊపాడు అంతే.


ఎప్పుడో జమానా లో భానుమతి పాడిన పాట " ఆలుమగలు విడిపోయినంతనే, అనురాగాలే మారునా, అనురాగాలే మారునా----- అన్నట్లుగా ఉంది వాళ్ళ పరి

స్థితి. సందర్భానికి తగ్గట్లుగా ఉంది కదా!

“సారీ నువ్వు కాదు తెప్పాల్సింది.. నేను.. నేను.. చెప్పాలి” అన్నాడు.


ఆ మాట వెన్నెలకి ఒక రకమైన సంతృప్తి ని ఇచ్చింది. అంటే తప్పు చేసినట్టు అతడు ఒప్పుకుంటున్నాడు అన్న ఆలోచన మనస్సులో చురుక్కుమనిపించింది.


" ఈ కేసులో ఎలా ఇరుక్కున్నారు? " ఏదో మాట్లాడాలని మాట్లాడింది కానీ, ఏదో అడగాలి కనుక అన్నట్లు అడిగింది.


" బుద్ది గడ్డితిని.. ఆ పార్టీకి వెళ్ళాను.. ".. నెమ్మదిగా అని నుదురుకొట్టుకుంటూ మాట్లాడాడు చంద్రం.


" దయచేసి మీరు ఆవేశపడకండి. ".. వెన్నెల అన్నది.


సరే.. అన్నట్లు. తల పంకించాడు. ఆ తరువాత ఆ రోజు పార్టీలో జరిగిన విషయాలన్నీ వెన్నెలకి చెప్పాడు. నెమ్మదిగా. “ఆమె చావులో నా ప్రమేయం ఏమీ లేదు వెన్నూ!”

అని అన్నాడు.


వెన్నూ అన్న పిలుపు ఆమె మనసును తాకింది. ఏవో మధురమైన ఊహాలోకాలకి తీసుకెళ్ళింది. ఒక క్షణం. పెళ్ళయిన క్రొత్తలో, ఆ తరువాత రెండు మూడేళ్ళ వరకూ

ఆ పిలుపు తనకి ఎంత హాయిగా అనిపించిందో ఇప్పుడు గుర్తుకు వచ్చింది వెన్నెలకి.


" బెయిల్‌ కు అప్లికేషన్‌ అదే ట్రై చేయనా” అనడిగింది.

అడిగాక ఒక్కసారి నుదురు కొట్టుకుని ‘చెయ్యనా ఏమిటీ.. చేస్తా.. అనాలి గానీ ?’ అని.

అతడు ఊ కొట్టాడు.


"దయచేసి మీరు ఎక్కువ ఆవేశపడవద్దు. మీరు చాలా ఆవేశపడుతున్నారు. శాంతంగా ఉండండి. అడిగిన దానికి సరియైన సమాధానాలు చెప్పండి.. మీకు బెయిల్‌

తప్పకుండ వస్తుంది. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. మీ మీద పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరు. ఒక స్నేహితుడుగా చూసుకుంటారు. వేరే ఫెసిలీటీస్‌ అంటే వేరే

సెల్‌, అన్ని సదుపాయాలు ఉన్నది ఇస్తారు. ' ఈ ఏసీపీ యాదిరెడ్డి ఎవరో కాదు.


మేమందరం అనగా మా క్లాస్‌మేట్స్‌ యాదిరెడ్డి. స్కూల్‌ నుంచి డిగ్రీ వరకూ ఇద్దరము కలిసి చదువుకున్నాము. ఒకే కాలేజీ, ఒకే స్కూల్‌, ఒకే క్లాస్‌, ఒకే సెక్షన్‌. మీ కింక బావ

గారి మర్యాదలు చేస్తాడు. మీ మీద ఈగను కూడా వాలనివ్వడు. మీరు ఎటొచ్చి అన్నీనిజాలే చెప్పాలి.. త్వరలో బయటికి వస్తారు.. " అన్నది ఓదార్పుగా వెన్నెల.


అప్పుడు అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించాడు చంద్రం వెన్నెలకి. వెన్నెల కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి.


"ఎంతలో ఎంతగా జీవితం మారిపోయిందో చూశావా వెన్నెలా!..” పోలీస్‌స్టేషన్‌ బయటికి వచ్చాక అన్నది యమున వెన్నెల తో.

“మామూలుగా అయితే మీ ఆయన అంత. సౌమ్యంగా మాట్లాడడు కదా! సౌమ్యంగా కూడా ఉంటాడా?.. ఉండడు

కదా? ఈ రెండు రోజులలో అతడు బాగా కుమిలిపోయి ఉంటాడు. నా కలా అనిపిస్తోంది. జీవితపు విలువలు, భార్య విలువ బాగా తెలిసి వచ్చి ఉంటుంది” అని

వెన్నెల మొహం చూసింది యమున.


"అంతే కదా.. నాకూ అలానే అనిపిస్తోంది”.


“ఎనీ హౌ.. ఆ మార్పు శుభసూచకం అనిపిస్తోంది నాకు”. యమున చిరునవ్వుతో అంది.


"అలా అయితే బావుంటుందే.. " ఆశావాదంతో అన్నది వెన్నెల.


“మనం ఆశాజీవులం. వెన్నూ.. ఇది మంచి పరిణామం.. మంచి జరగాలని ఆశిద్దాం.. అంతా మంచే జరుగుతుంది.. జరుగుతుంది”.


“ఇప్పుడు మనం ఓ మంచి లాయర్‌ ను చూడాలి, బెయిల్‌ కోసం. అన్నట్లు మరిచిపోయాను.. మా వూరే సుధాకర్‌ అనే ఆయన ఉన్నాడు. నేను అన్నయ్యా అని పిలుస్తాను. ఆయన స్నేహితుడు రవిప్రకాశ్‌ క్రిమినల్‌ లాయర్‌. మా ఇద్దరి మధ్యా కొంతకాలం మూగప్రేమ కూడా నడిచింది. ఈ రవిప్రకాశ్‌ కూడా రోజూ కేసుల విషయమై యాదిని కలుస్తూంటాడు. ఈ కేసు విషయమై లో బెయిల్‌ విషయం కోసం కూడా యాదీతో డీల్‌ చేయిద్దాం. యాదీ తోనే రవిప్రకాశ్‌ కు ఫోన్‌ చేయించి సంగతంతా చెప్పి మొత్తం కేసు సాల్వ్‌ చేసుకోవచ్చు. ప్రస్థుతం మన కర్తవ్యం చేయవలసిన పని

ఇదే.

------------------

స్త్రీలకూ ఒక మెదడు ఉంటుంది. దానికి ఆలోచన ఇవ్వాలి. స్త్రీలకు హృదయం ఉంటుంది. దానికి అనుభూతి నివ్వాలి. ఆడువారి హృదయపు లోతులెన్నో ఎరగడమే కష్టం' పైకి నటించి, లోన కుయుక్తులు పన్నే కుహనా మనషులంటే

అసహ్యం కూడా.


' దువాయేదే మెరే బాద్‍ ఆనేవాలే మేరీ వహషత్‌కో

బహూత్‌ కాంపేనికర్‌ ఆయే మెరే హమ్‌ రాహ్‌ మంజిల్‌ సే'

( నా తరువాత వచ్చినవారు త్రోవలోని ముండ్లు చాలవరకు నాతోనే వచ్చినవి).


ప్రేమ ఎంత కఠిన మాయె! వదలజమే కష్టం !

' కహెతా న థా మై ఐ దిల్‌ ఇన్‌ కామ్ సే తూ బాజ్‌ ఆ.. దేభా మజాన తూనే నాదాన్‌ ఆస్కీకా ( ఓ అమాయక హృదయమా! నీకు ప్రేమ రుచి తెలియదు. ఈపని విరమించుకెంని నే ననలేదా) అంటారు.


" భాషణమే భూషణము. "అన్నది వాగ్భూషణం అన్నట్టుంది.

ప్రేమ, వియోగం, జీవితమథనం, హృదయనిధానం, మధువు, భగ్న ప్రేమ ల గురించి

అద్భుతమైన గజల్‌.

కనురెప్పల ఉప్పెనంత పొంగి పొంగి ఎడారాయె

గయమైన గుండెలోతు కొలవబడితే ఎలా మరి!!

..

వసంతమాయె గ్రీష్మమాయె.. యెదను సెగలు రగిలిపోయె

నీ ప్రేమను తుషారమై తాకిపోతే ఎంత హాయి!

..

నీవు పాడిన ప్రేమగీతం హృదయవీణను మీటగా

తీగ తెగినా బతుకు భారము శేకరసములు ఏమిటో !

..

ఆడదాన్ని అగ్గి చేయు కఠినమైన లోకమిది

రాతి నాతిగా చేసిన చరితము కద మిగిలేది!

------

దిగులుగా మేఘం నల్లనై కమ్ముకొన్న మనసునేమనను?

గట్టు దాటిన చెలమనై చేరుకున్న మనసునేమనను?

..

వనమున మొలచిన వెదురుకర్రయే రాగాలెన్నో నేర్పెనులే

కరుణతో నిండిన హృదయవిపంచిక పాఠాలెన్నో నేర్పెనులే!

------పాపం ఆ రోజు రాత్రంతా వెన్నెల మదిలో ఎన్నెన్నో కొంగ్రొత్త ఊహల ఊయలలు

మెదిలాయి. తను రాసుకున్న డైరీ తీసుకుని అందులో గజళ్ళు కొన్నింటినీ తదేకంగా

చదూతూ ఉండిపోయింది.

------------------------

వెన్నెల వచ్చి వెళ్ళిన తరువాత చంద్రం విషయాలన్నింటినీ బేరీజు వేసుకుంటే యాది

రెడ్డికి పరిస్థితి అర్థమయ్యింది. ఎక్కడెక్కడ నుంచో ఫోన్‌లూ, ఏ టవర్‌ నుంచి వస్తు

న్నాయి.. ఎంక్వైరీ చేయమన్నాడు శేఖర్‌ ను. ఆ సాయంత్రం కల్లా అర్థమయ్యింది. ఆ

విషయమూ ట్రేస్‌ అయ్యింది. ఆ కాల్స్‌ డిల్లీ టవర్స్‌ నుంచి వచ్చినట్లు రికార్డ్‌ అయ్యింది. పరిస్థితి చేయి దాటకముందే దిలీప్‌ ని పట్టుకోవాలి. దిలీప్‌ డిల్లీలో ఏ కేంద్ర మంత్రి ఇంట్లోనో లేదా ఏ విఐపి ఇంట్లోనో ఉండవచ్చని ఊహించాడు. గోవింద్‍ పార్టీకి చెందిన ఎం. పీల ఇళ్ళలో దిలీప్ ఉండే అవకాశం ఉంటుందనుకున్నాడు.


యాదిరెడ్డి సలహా మేరకు సిఐ శేఖర్‌ స్వయంగా డిల్లీ వెళ్ళాడు, మరో కానిస్టేబుల్‌

ని తీసుకుని దిలీప్‌ నిఅదుపులోకి తీసుకోవడానికి ఆ విషయం రహస్యంగా ఉంచ

డానికి యాదిరెడ్డి, శేఖర్‌ ప్రయత్నించినా కావాల్సిన వాళ్ళకు తెలిసిపోయింది.

గాదెకింద పందికొక్కుల్లాగా తాము పని చేసే డిపార్ట్‌మెంట్ కు గోతినే తియ్యడానికి

కొంతమంది ఎల్లప్పుడూ సదా అదే పనిలో ఉంటారు. పోలీస్‌స్టేషన్‌ లోని విషయము

ఎప్పటికప్పుడు చేరవేసే గుణం గల నయవంచకులు, ధగుల్భాజీలూ మినిష్టర్‌ గోవింద్‍ కు, పిఏ కి చేరవేశారు. దాంతో డిల్లీ లో ఉన్న తన కొడుకుని అప్రమత్తం చేశాడు గోవింద్‍.

ఒకదశలో కొడుకుని అక్కడనుంచి మారుద్దామనుకున్నాడు. కానీ.. ఇంతకుమించి

సురక్షిత ప్రదేశం అతడికి కనుపించలేదు. ఇంటినుంచీ అస్సలు బయటికి రావద్దనీ

కట్టడి చేశాడు. చెడిపోయిన వాడిని సరిదిద్దాల్సింది పోయి, ఇంకా చెయ్యమని

ప్రోత్సహించే దగుల్భాజీ తండ్రిగా తయారయ్యాడు గోవిందు.


నాలుగు రోజులుగా తీవ్రంగా గాలించిన తరువాత దిలీప్‌ ఆచూకీ తెలిసింది.

ఎస్‌ఐ శేఖర్‌ ఊహించినట్లు గోవిందు బావయైన ఎమ్‌. పి. క్వార్టర్‌ లో రాజభోగాలు

అనుభవిస్తున్నాడు దిలీప్‌. ఎలుకని బయటికి లాగాలీ అంటే పొగబెట్టాలి అన్న విధంగా శేఖర్‌ పన్నిన వలలో దిలీప్‌ పడ్డాడు. అందుకు స్థానిక పోలీస్‌ సహకారం తీసుకున్నాడు.

యాదిరెడ్డి ట్రైనీగా ఉన్నప్పుడు తనకు ఏసీపీ గా ఉన్న ఆయన ఇప్పుడు డిల్లీలో స్పెషల్‌ డ్యూటీ మీద సెంట్రల్‌ హోం మినిష్టర్‌ ఎస్‌ఓడీ గా ఉన్నాడు. ఆ పరిచయం ఇప్పుడు శేఖర్‌ ద్వారా దిలీప్‌ ను పట్టుకునేందుకు ఉపయోగించాడు. ఓరల్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ అన్ని పోలీసుస్టేషన్‌ లకు వెళ్ళిపోయాయి. శేఖర్‌ కు సహకరించి నేరస్థుడిని పట్టుకునేటట్లుగా.


శేఖర్‌ అదృష్టం కొద్దీ అతడికి పరిచయమైన పోలీస్‌ కు రాజకీయనాయకు

లంటేనే అసహ్యం. ఈ పాయింట్‌ శేఖర్‌ కు లాభించింది. ఎంపీ ఇంట్లో లేని సమయం

లో బాంబుకలకలం సృష్టించారు. అంతా బయటకు వచ్చేశారు దిలీప్‌ తో సహా. సెక్యూ

రిటీ గార్డ్స్‌ అంతా హడావుడీ పడుతున్న సమయంలో స్థానిక పోలీస్‌ దిలీప్‌ చెయ్యి

పట్టుకుని లాగాడు. ' అరే బాయ్‌ తుమ్‌ డేంజర్‌ మే.. అ ని అంటూ బయట మారుతీ వ్యాను లో ఎదురు చూస్తున్న శేఖర్‌ చటుక్కున దిలీప్‌ని వాన్‌ లోకి లాగేశాడు. రయ్‌మని వేన్‌ పరుగెట్టింది. ఏం జరగిందో దిలీప్‌ కు అర్థం కాలేదు. అర్థమయ్యే లోపు డిల్లీ సిటీ లిమిట్స్‌ దాటి వెళ్ళిపోయారు.


" దిలీప్‌ అరవడం మొదలెట్టాడు. " అరవకు, .. మేం పోలీసులం.. నిన్ను అదుపు

లోకి తీసుకున్నాం. అరెస్ట్‌ చేశాం. మనోరమ హత్య కేసులో నువ్వే మొదటి నిందితుడి

వి అని శేఖర్‌ గంభీరంగా ముఖం పెట్టి అతని కేసి చూస్తూ. ఇంక దిలీప్‌ కు ప్రతిఘ

టించలేకపోయాడు. చాలా దూరం తీసుకెళ్ళాక చేతులకు బేడీలు వేశారు. కాస్సేపటికి

దిలీప్‌ సెల్‌ రింగయ్యింది. కానిస్టేబుల్‌ అతని జేబులోని సెల్‌ను తీసి శేఖర్‌ కిచ్చాడు.

స్పీకర్‌ ఆన్‌ చేసి దిలీప్‌ ను మాట్లాడమని ఇచ్చాడు. అరెస్ట్‌య్యానని చెప్పవద్దన్నారు.


' ఏరా, ఎక్కడికి వెళ్ళావ్‌? నువ్వు కనబడటం లేదని మామయ్యఫోన్‌ చేసి

చెప్పాడు. అంతా కంగారుపడుతున్నారు. ' అనడిగాడు గోవిందు. దిలీప్‌" హల్లో"

అనగానే.


" నేను సేఫ్‌ గా ఉన్నాను, డాడీ. టిఫిన్‌ చేద్దామని ప్రక్క హోటల్‌ కు వచ్చాను"

అన్నాడు దిలీప్‌.


నిన్ను బయటికి వెళ్ళవద్దన్నా కదా!.. హోటల్‌ కెళ్ళడమేమిటీ?.. అర్జంటుగా

ఇంటి కెళ్ళు. ఇక్కడ నుంచి సిఐ వచ్చాడు. నిన్ను పట్టుకోవడానికి. వాడు వచ్చాడు. వాడి కంట పడ్డావంటే నిన్ను అరెస్టు చేస్తాడు. జాగ్రత్తగా ఇంటి కెళ్ళు' అన్నాడు

గోవిందు. ఫోన్‌ కట్టయీంది.


ఆ తరువాత ఈ సారి మళ్ళీ ఫోన్‌ చేశాడు గోవిందు. కానీ మాట్లాడే అవకాశం ఇవ్వ

లేదు సిఐ శేఖర్‌. తరువాత ఫోన్‌స్విచ్చాఫ్‌ చేశాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







64 views0 comments
bottom of page