top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 31/10/2023

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది. వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.


కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు ఏసీపీ యాది రెడ్డి. వాళ్ళు పార్టీ చేసుకున్న గెస్ట్ హౌస్ ను పరిశీలిస్తాడు. మనోరమ హత్యకు గురైనట్లు అనుమానిస్తాడు.


మనోరమ చనిపోయినట్లు, ఆమె శవాన్ని మినిష్టర్ గారి తోటలో పూడ్చి పెట్టినట్లు చెబుతాడు వాచ్‌మెన్‌ యాదయ్య.

మినిష్టర్ గోవిందరావు కేసునుండి తన కొడుకును తప్పించే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14 చదవండి.


చంద్రం పనిచేసే చోట మఫ్టీలో కానిస్టేబుల్‌ను పంపించి అతడి ఇంటి చిరునామా, వగైరా వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ప్రస్తుతం అతడు వైజాగ్ కాంపులో ఉన్నా,డని ఆఫీసు పని పూర్తి చేసి అక్కడ నుంచే అతడు వారం రోజులు సెలవు పెట్టాడని, ఆఫీసు వాళ్ళు చెప్పారు.


వైజాగ్‌ లో అతడు ఆఫీసు పని మీద ఎక్కడెక్కడ తిరిగాడో, సాధారణంగా అక్కడ ఏ లాడ్జిలో దిగుతాడో, ఎక్కడ దిగాడో వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ఆ వెంటనే విశాఖ పోలీసులకు పోన్‌లో వర్తమానం పంపించాడు. తక్షణం అదుపులోకి తీసుకోమని.


చంద్రానికి ప్రొద్దునే దిలీప్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపో. వాచ్‌మెన్‌ పోలీసుల దగ్గర అంతా కక్కేసాట్ట అని. అతడికి రెండు సిమ్‌లున్నాయి.


ఒకటి అందరికీ తెలిసిన నంబరు. రెండోది సీక్రెట్‌. ' రవళి కి చెప్పాలనుకొన్నాడు కానీ అది ముందే పోలీసులకు అంతా చెప్పేసింది. కొన్నిరోజులు కనబడకుండా తిరిగితే ఈ

లోగా దిలీప్‌ ఏదో విధంగా మానేజ్‌ చేస్తాడు. యాదిరెడ్డిని ట్రాన్స్‌ఫర్‌ చేయించడమే.. ఇంకేదైనా సరే చేయించగలడు.


దిలీప్‌ గురించి బాగా ఎంక్వయిరీ చేయించాడు. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. ఫోన్‌లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సిమ్‌ మార్చేశాడని ఎప్పుడో ఊహించాడు. ఎందుకంటే ఎన్నో రకాల బెదిరింపులు వచ్చాయి. కొన్ని వందల క్రిమినల్‌ కేసులను చూశాడు. అదీ కాక రాజకీయ వత్తిళ్ళు ఎదురుకొన్నాడు.


కుటుంబాన్నే నాశనంచేస్తామని బెదిరించారు. కానీ బెదరలేదు. కానీ జీవితం, పరిస్థితులు పాఠం నేర్పించి

ధైర్యానిచ్చాయి. పోలీసు ఆఫీసర్‌ గ తన మీద ముద్ర పడితే అప్పటి నుంచి, ఎవరినీ లెక్క చేయనక్కరలేదని, వాళ్ళు తననేమీ చేయలేరని తెగించి ముందు కెళుతున్నాడు.


ట్రాన్స్‌ఫర్స్‌ మామూలే. అప్పటి నుంచి మొత్తం పని అయిపోతే గానీ పత్రికలకు చెప్పే అలవాటు లేదు. ఊరికే ముందు వాళ్ళకి చెబుతే, ఉన్న రహస్యం కాస్తా బట్ట

బయలై పోతుందని అతని నమ్మకం.

------------------------------

ఆ రోజు రాత్రి కాళరాత్రే అయ్యింది వెన్నెలకు. రాత్రి అస్సలు పడుకోలేదు. ఏవేవో ఆలోచనలు. తెగని ఆలోచనలు. తన జీవితం ఏ మలుపులు తిరగబోతోంది. ఎన్నెన్ని మలుపులు తిప్పుతాడో ఆ దేముడు. మెల్లగా ఆలోచనలు తప్పించుకునేందుకు రేడియో పెట్టుకుంది. ఎఫ్‌. మ్‌. వివిదభారతి స్టేషన్‌ పెట్టింది. ఎన్నెన్నో మధురమైన గీతాలు ప్రసారొం చేస్తూంటాడు.


ఆ రోజు లతామంగేష్కర్‌ పుట్టినరోజు.

సుమధుర్‌ గీత్‌ మాలా--- ఎన్నో నా కిష్టమైనవి వేశాడు.

* ఆయేగా.. ఆనే వాలా( చిత్రం: మహల్‌- 1949, సంగీతం; ఖేమ్‌చంద్‍ ప్రకాశ్‌. ఈ పాట లోని పల్లవీ చరణాలు ఎంత హృద్యంగా ఉంటాయో, సాకీ అంత కంటే హృద్యంగా ఉంటుంది. అంతకు ముందు శాస్త్రీయ సంగీతానికే పరి

మిత మైన వారు ఈ సాకీ పల్లవులసమాగమాన్ని చూసి పరవశించి పోతారు. పాట స్వర రచనకు లతాజీ గాత్రంలో వేయి సోయగాలు పోతుంది.


* ఔరత్‌ నే జనమ్‌ దియా మర్దోంకో( సాధన-1958, దత్తానాయక్‌)


పురుషాదిక్య సమాజంలో ఎంత క్రూరంగా అణచివేతకు గురవుతుందో తెలిపే పాట ఇది. ' భావోక్తంగా పాడటంలో లత అంత శ్రద్ర చూపరు' అని కొంత మంది విమర్శిస్తుంటారు. ఈ పాటతో ఆ విమర్శలకు గట్టిగా బదులు ఇచ్చినట్లు అయ్యింది.


*ప్యార్‌ కియాతో డర్‌ నా క్యా-( మొఘల్‌-ఏ -ఆజమ్‌): 1960, నౌషాద్‍.

పాట పల్లవి మాత్రమే వింటూ అదేదో హుషారైన రొమాంటిక్‌ పాట లా అనిపిస్తుంది. పల్లవి దాకా పాడే తీరు కూడా అలాగే ఉంటుంది. కానీ, చరణాల్లోకి వెళ్ళాక గానీ అది ధిక్కార స్వరమని ( నాదమని) స్ఫురించదు. పాడటం లో అంతటి వైవిధ్యాన్ని చూపారు లత. ఆరు దశాబ్దాల క్రితం ప్రాణం పోసుకున్న పాట ఈ నాటికీ శ్రోతల హృదయాలలో మారు మ్రోగడానికి ఇదో బలమైన కారణం.


* కహీ దీప్‌ జలే, కహీ దిల్‌( బీస్‌ సాల్‌ బాద్‍- 1962, హేమంత్‌కుమార్‌)

లత కంటే ముందున్న గాయనీమణులలో అంత ఉచ్ఛస్వరంతో పాడగలిగే వారు

లేరనే చెప్పాలీ. ' కహీ దీప్‌ జలే'పాటలో లత స్వరం ఆకాశపు అంచులని తాకుతుంది. అది పుట్టుకతో వచ్చిన గాత్ర ధర్మం అనుకుంటే పొరపాటే అవుతుంది. నిరంతరమైన సాధన వలన మాత్రమే సాధించింది.


*తూ జహా జహా చలేగా( మేరా సాయా-1966, మదన్‌మోహన్‌)

నువ్వు ఎటు వెళ్ళినా సరే, నా నీడ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అనే భావంతో ఈ పాట సాహిత్యం ఉంటుంది. ఆ భావాన్ని స్వరబద్దం చేయడానికి సంగీతదర్శకుడు మదన్‌మోహన్‌ పడ్డ శ్రమ కూడా తక్కువేమీ కాదు. కానీ అంతకు ఎన్నో రెట్లు లత శ్రమించారు. అందుకే ఐదు దశాబ్దాలుగా ఈ పాట శ్రోతల హదయాలలో మారుమ్రోగుతూనే ఉంది.


* యే మేరే దిలే నాదా తూ గమ్‌ సే న ఘబ్‌రానా( టవర్‌హౌస్‌-1962, రవి)

హాయిగొలిపే, హుషారెత్తించేవి.. ఇలాంటి వేల పాటలు మనకు ఎప్పడూ వినపడుతూనే ఉంటాయి. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదా

ర్పునూ ఇచ్చే పాటలు చాలా అరుదు. అలాంటి అరుదైన పాటలలో ' యే మేరే దిలే నాదా' ఒకటి. ఈ పాటలో ని భావుకతను మరింత హృద్యంగా, ఆర్ద్రంగా పాడటం

లో లత అద్భుతమైన పరిణతి చూపుతారు.


* ఛోడ్‌ దే సారీ దునియా కిసీకే లియే -( సరస్వతీ చంద్ర 1969, కళ్యాణ్‌జీ -ఆనంద్‍జీ. ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు దూరం అయుతేనే అని కాదు. ఆత్మీయులు తమ ప్రాణ

సమానులైన వాళ్ళను కోల్పోవడం ఎంత విషాదం. అలాంటి విషాద స్థితిలో కాస్తంత ఆత్మస్థైర్యాన్ని, ఓదార్పునూ ఇచ్చే పాటలు చాలా అరుదుగానే ఉన్నాయి. ఆ అరు

దైన పాటల్లో ఇదొకటి. గుండె బరువెక్కిన ప్రతి ఇంటా ఈ పాట దశాబ్దాలుగా మారుమ్రోగుతోంది.


* సత్యం శివం సుందరం ( సత్యం శివం సుందరం-1978, లక్ష్మీకాంత్‌ -ప్యారేలాల్‌)


రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో వచ్చిన 'సత్యం శివం సుందరం'సినిమా పెద్దగా ఆడకపోయినా, లత పాడిన ఈ పాట గుండె గుండెలో ప్రతిధ్వనించింది. గుడిలోని ఒక

సేవకురాలు రోజూ ఉదయం ఆ పురప్రజలని మేలుకొల్పేందుకు పాడే పాట ఇది.


ఆకాశం చిల్లుల పడుతుందేమో అన్నంతగా గొంతెత్తి పాడే ఈ పాట ఆధ్యాత్మిక జీవులలో ఒక చెరగని ముద్రగా మిగిలిపోయింది.


* యే మేరే వతన్‌ కే లోగో(ప్రెవేట్ర సాంగ్‌-1963, సి. రామచంద్ర)

ఇదెక దేశభక్తి గీతం. 1962 లో జరగిన భారత్‌-చైనా యుద్దం ముగిసిన తరువాత

అమరవీరుల సంస్మరణార్థం డిల్లీలో ఒక సభ జరిగింది. రామ్ లీలా మైదానంలో జరిగిన ఈ సభలో అప్పటి ప్రదానమంత్రి నెహ్రూ వేదిక పైనే కంటతడి పెట్టుకున్నారు.

* తుమ్హీ మేరీ మందిర్‌, తుమ్హీ మేరీ పూజ( ఖాన్‌దాన్‌-1965, రవి)


ప్రేయసీప్రియులు కావచ్చు. జీవన సహచరులు కావచ్చు. ఒక మహోద్విగ్ని స్థితిలో ఒకరికొకరికి ఒకరు దైవంలా కనిపిస్తారు. ఆ స్థితిలో ఒకరినొకరు ప్రేమించడమే కాదు.

ఒకరికొకరు దేవాలయాల వెంట పడుతారు. ఆ ఆరాధనను గొంతులో నిండుగా పలికించడం ద్వారా లత కోటానుకోట్ల. రసహృదయుల నీరాజనాలు అందుకున్నారు.


* ఆప్‌ కీ నజ్‌రోనే సమ్‌ఝా ప్యార్‌ కీ ఖాబిల్‌ ముఝే.

( అన్‌పడ్‌- 1962, మదఞమోహన్‌)

ఈ పాటలో లతలోని ఒక విశేష గాత్ర సౌలభ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా, చరణాన్ని

అంత తారస్థాయిలో ఆలపించి, ఆ వెంటనే మంద్రంగా పల్లవిని అందుకోవడం

చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాటను హోరెత్తించే తన సహజశక్తితో పాటు, స్త్రీలోని

నిర్మలత్వాన్ని కూడా ఆ పాటలో ఆమె ఒలికించారు.

--------------------

'సార్‌, ఆ అమ్మాయి హత్య కేసులో చంద్రం అనే అతణ్ణి అదుపు లోకి తీసుకున్నారట' పిఏ మణి చెప్పాడు మంత్రి గోవిందు తో. ఆయన ముఖం చిరాగ్గా పెట్టాడు.


' అవును సార్‌!.. కానిస్టేబుల్‌ ఇప్పుడే ఫోన్‌ చేసి చెప్పాడు. లాడ్జిలో దొరికిపోయాడట.

' కాస్తంత జాగ్రత్తలు తీసుకోలేదా? వాడిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారని తెలీదా? వాచ్‌మెన్‌ ను అదుపులోకి తీసుకున్నప్పుడు చంద్రంని అదుపు లోకి తీసుకున్నారు ఇలా ఒక్కొక్కరూ దొరికిపోతే తన కొడుకు కూడా దొరికిపోతాడేమో? తన కొడుకు గతేం కానూ? అనుకున్నాడు మంత్రి గోవిందు. ఎవరు అరెస్ట్‌ అయినా సరే తన కొడుకు పేరు లేకపోతే అంతే చాలురా భగవంతుడా అని ఆలోచించాడు.


' సరే, కానిస్టేబుల్‌ కి చెప్పు. ఎఫ్‌ఐఆర్‌ లో మా వాడి పేరు లేకుండా చూడమను.. వాచ్‌మెన్‌ గాడు వాగేశాడు కదా, ఇంతకు ముందరే.. కానీ ఈ కేసులో దిలీప్‌ లేడని

అసలు ఆ రోజు ఉళ్ళోనే లేడని, గెస్ట్‌హౌస్‌ వైపు వెళ్ళలేదని చెప్పమనండి. కానిస్టేబుల్‌ ని మానేజ్‌ చెయ్యమనండి.. చంద్రం గానీ ఇంకెవరయినా సరే దిలీప్‌ పేరు బయటకు రాకుండా ఉంటేనే వాళ్ళు గూడా సేఫ్‌ గా బయటకు వస్తారని చెప్పండి' ఆలోచిస్తూ మధ్య మధ్య ఒక్కో మాట చెప్పాడు గోవిందు.


"ఇంతకు ముందే అన్ని విషయాలు కానిస్టేబుల్‌ కి చెప్పానండి. వాడు చూసుకంటానన్నాడు. ఇలా కాకుండా రైటర్‌ కి కూడా చెప్పానండీ, ఎఫ్‌ఐఆర్‌ రాసేటప్పుడు దిలీప్‌

పేరు రాకుండా చూడమని. కానీ కేసు చూస్తున్నది ఏసీపీ యాదిరెడ్డి. కనుక ఏఫ్‌ఐఆర్‌ అతని చేతిలోనే ఉంటుంది. యాదిరెడ్డే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడని రైటర్‌

చెప్పాడు', సార్‌ చెప్పాడు పిఏ మణి.


దాంతో మళ్ళీ గోవిందు ఆలోచనలో పడ్డాడు.

“సిఐని, ఎస్‌ఐ ని మేనేజ్‌ చేసి చూడు”.


“సిఐ శేఖర్‌ యాదిరెడ్డి లాంటి వాడే సర్‌.. ప్రస్థుతం ప్రమోషన్‌ లిస్టులో ఉన్నాడు.. ఇంక ఎస్‌ఐ ని మానేజ్‌ చెయ్యవచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్య అతని మాట చెల్లదు. తన దగ్గరున్నంత వరకూ దిలీప్‌ పేరు రాకుండా చూసుకుంటానన్నాడు. వాచ్‌మెన్‌ విషయం కూడా ముందే చెప్పి ఉంటే చూసుకునేవానన్నాడు. కానీ మన దురదృష్టం” మణి చెప్పాడు.


“పెద్ద పెద్ద డాక్యుమెంట్స్‌ తిరగరాస్తున్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఓ లెక్కా?.. చూద్దాం. సి. యం. పర్సనల్‌సెక్రటరీ తో నేను మాట్లాడాను. ఐజీ తో మాట్లాడతానన్నాడు.. చూద్దాం..” అన్నాడు గోవిందు తన కొడుకు కు ఏమీ కాదన్న ధీమాతో.


“ఐజీ తలచుకొంటే కాని దేమున్నది?.. కానీ యాదిరెడ్డి లాంటి వాళ్ళు.. ఐజీ మాటకూడా వినరు. పైగా తప్పు చేయరు. తప్పు చేయమంటావా అని ఎదురు అడుగుతారు. అప్పుడు ఐజీకే ప్రాబ్లమ్..” చెప్పాడు మణి తనసొంత అనుభవంతో.


'అదీ చూద్దాం.. అప్పుడు ఈ మొండోడు కి ట్రాన్స్‌పర్‌ చేయించడమే.. అది మన చేతిలో పని కదా! అప్పుడు హోంమంత్రి ని పట్టుకోవాలి.. చూద్దాం. ఏం జరుగుతుం

దో..” గోవిందు అన్నాడు మళ్ళీ అదే ధీమాతో.


గోవిందు అల్లాటప్పా రాజకీయ నాయకుడు కాదు. సెంట్రల్‌ రాజకీయాల్లో చేయి తిరిగిన మనషి. ఒక్కొక్కసారి ఈయన్ని కాదని కాబినెట్‌ ఏర్పాటు చేయడం కుదరలేదు. కానీ ఇప్పటి పరిస్థితులలో అది వేరు. సి. యం కూడా ఈ మధ్య సెంట్రల్‌ లో పలుకుబడి పెంచుకున్నాడు. అందుకే ఇదివరకటిలా గోవిందు కు ఆటలు సాగటం లేదు. ఈ తిప్పలు కూడా తప్పటము లేదు.


“ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఇన్నేళ్ళ రాజకీయజీవితం గడిపినా కొడుకునువవిడిపించుకోలేక పోతే నేనెందుకు? నా పవర్‌ ఎందుకు? గోదాట్లో దూకటానికా?” అన్నాడు క్రోధావేశంతో గోవింద్‍.


మణికి అప్పుడు అర్థమయ్యింది. గోవిందు చాలా పావులు కదుపుతున్నాడని. లేకపోతే బామ్మర్దికి జడ్‌. పీ. చైర్మన్‌ పదవి, తన తమ్ముడిని ఎమ్‌. ల్‌. సి. పదవి, పేపర్‌ప్లాంట్‌, పవర్‌గ్రిడ్ ప్లాంట్. అనతి కాలం లోనే ఇవన్నీ

సాధించాడంటే మామూలు విషయమూ కాదు, అని మణి అనుకున్నాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసంమేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

78 views0 comments

Comments


bottom of page