'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 21/10/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది. వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.
కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు ఏసీపీ యాది రెడ్డి. వాళ్ళు పార్టీ చేసుకున్న గెస్ట్ హౌస్ ను పరిశీలిస్తాడు. మనోరమ హత్యకు గురైనట్లు అనుమానిస్తాడు.
ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 12 చదవండి.
“మీ పేరు?” లోపలికి వచ్చి టేబుల్ కి ఎదురుగ ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఏసీపీ యాదిరెడ్డి.
"ఊర్మిళ సర్" చెప్పింది ఊర్మిళ బెరుకుగా. ఆమెను ఆ రోజు స్టేషన్ కు రావలసిందని పిలిపించాడు యాదిరెడ్డి.
"ఏం చేస్తూంటారు ? ".
చెప్పిందామె వినయంగా.
"ఎన్నాళ్ళనుంచి మనోరమతో కలిసి ఉంటున్నారు".
“దాదాపు ఏడాదిన్నరగా సర్.. "
“ఆమె కేరక్టర్ ఎలాంటిది? ఐ మీన్.. ఎలా బిహేవ్ చేస్తుంది.. మీతో ?"
"మాతో బాగుంటుంది సర్.. గొడవలూ అదీ పెట్టుకోదు”.
"మీరు ఆమెతో పార్టీలకు వెళతారా?” సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు యాదిరెడ్డి.
"అటువంటి చోట్లకు నేను అస్సలు వెళ్ళను, సర్..” చాలా కంగారుగా చెప్పిందామె.
"మొత్తం ఫ్లాట్‌లో మనోరమతో కలిపి ఎంతమంది ఉంటున్నారు?”
“ముగ్గురం ఉంటున్నాం, సర్.. రవళి, నేను, మనోరమ”.
“పార్టీలకు వెళ్ళి ఇలా రెండు మూడు రోజులు కనిపించకుండా ఉండడం ఆమెకు అలవాటా?”
"లేదు, సర్! ఒక వేళ ఇంటికి రాకపోతే తనుఫోన్ చేసి చెబుతూండేది. ఆ రోజు రానని.. కానీ ఈ సారి అలాంటి ఫోన్ ఏదీ లేదు. పైగా తను వెళ్ళి ఐదురోజులు గడిచి పోయాయి. అందుకే పోలీస్‌స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాం సర్.."
"ఆమె హాబీస్?.. ఐ మీన్.. సినిమాలు.. షికార్లు.. బాయ్‌ఫ్రెండ్సు, పబ్బులు..”
సమాధానం ఏమి చెప్పాలో తోచడంలేదు. మనోరమ తిరుగుళ్ళు అన్నీ చెప్పాలా వద్దా.. చెబుతే ఏమవుతుంది?.. అనుకుంటూ అయోమయంలో పడిపోయింది.
తనను ఏసీపీ పిలిపించిన విషయం తనను వాళ్ళు ప్రశ్నలూ వేసినవన్నీ రవళి చెప్పింది. పోలీసులు చాలాచాలా తిక్కతిక్క ప్రశ్నలు వేస్తారని అవి కొన్ని విషయాలు
ఎంత చెప్పకూడదనుకున్నా వాళ్ళు మనలని కన్‌ఫ్యూజ్ చేసి మన చేత అన్నీ కక్కిస్తారని రవళి చెప్పింది. ఆఫీసు కొలీగ్సు ని కూడా పిలిస్తే వాళ్ళు కంగారుపడుతుంటే
రవళి ఈ విషయాలన్నీ చెప్పింది. ఆమెను విచారించిన మరునాడే వీళ్ళని కూడా పిలిపించాడు యాదిరెడ్డి.
"నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు? మీరు ఉన్నది ఉన్నట్లు చెబితే ప్రశాంతంగా మీరు బయటకు వెళ్ళవచ్చు.. లేకపోతే చిక్కుల్లో పడతారు..” చాలా నిదానంగా
చెప్పాడు యాదిరెడ్డి. ఊర్మిళ ఆ మాటలకు భయపడింది.
"చెప్పండి. ".. అన్నాడు.
"మనోరమ పబ్‌లకు వెళుతుంది సర్, .. ఆమె కోసం బాయ్‌ఫ్రెండ్స్ వచ్చి వాచ్‌మెన్ తో కబురు పంపిస్తారు.. ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడప్పు
డూ..” ఆగిపోయింది. చెబుతే ఏమవుతుందో నని సందేహపడుతూ.
"ఊ.. అప్పుడప్పుడూ.. ?”
"మనోరమ అప్పుడఫడు తాగి వస్తుంది సర్." అని యాదిరెడ్డి ముఖం కేసి చూసింది.
అతడి ముఖం గంభీరంగా మారింది. చెప్పకూడనిది చెప్పానా అని ఊర్మిళ కంగారుపడింది.
"ఆమె కోసం ఎవరూ వాళ్ళ బందువులు రారా? ఆమె ఎప్పుడూ వాళ్ళ ఊరు వెళ్ళదా?”
"లేదు సర్".
"ఆ రోజు మనోరమ ఎన్ని గంటలకు బయటకు వెళ్ళింది".
"ఆఫీసు నుంచి ఆరుగంటలకు కాబోలు వచ్చింది సర్.
వస్తూనే రవళికి ఫోన్ చేసి తొందరగా రమ్మని.. ఆమె వచ్చీ రాగానే ఇద్దరూ వెళ్ళారు, సర్’.
"రవళి, ఇంటి కెప్పుడొచ్చింది. ?"
"మరునాడు ఉదయం ఏడున్నర- ఎనిమది గంటలయిందనుకుంటా, సర్. వచ్చీ
రాగానే మనోరమ వచ్చిందా అని అడిగింది సర్.. ఆ రోజు, మరునాడు కూడా మనోరమ రాలేదు సర్.. దాంతో మాకు భయం వేసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం సర్.."
తల పంకించాడు యాదిరెడ్డి. రెండు క్షణాలు అలానే మౌనంగా కూర్చున్నాక ఊర్మిళను వెళ్ళిపొమ్మనట్లు సంజ్ఞ చేత్తో సైగ చేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ లేచి
బయటికి వచ్చేసింది.
-------------------------
తరువాత యాదిరెడ్డి అలానే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. అప్పుడప్పుడు తన వృత్తి గురించి ఆలోచిస్తూ నైరశ్యానికి లోనవుతాడు. కొన్ని సందర్భాలలో చేయాలనుకున్నది అనేక రాజకీయకారణాల వల్ల చేయలేక పోవడం అతడిని బాధిస్తోంది.
మరికొన్ని కారణాల వల్ల, మరికొన్ని సందర్భాలలో వాస్తవాలు బయటికి రాకపోడము వల్ల జరగాల్సిన పనులు జరగకపోవడం అతడిని బాధిస్తుంది. ఐఏస్, ఐపీస్
చదువుకున్నప్పుడు ఈ దేశాన్ని ఉద్దరించడానికి గొప్పగొప్ప సిద్దాంతాలు మననం చేస్తూంటే ఎంతో హుందాగా అనిపిచ్చేది. కానీ ఆచరణ దగ్గరకు వచ్చే సరికి అందుకు భిన్నంగా వ్యవహరించాల్సి రావడం అతడిని బాధిస్తూనే ఉంటుంది.
బహుశా చదువులకీ, ఉద్యోగానికీ పొంతన అనేది ఎండమావేనా అని చాలాసార్లు అనుకున్నాడు. ఐపీస్ చదివి తప్పు చేశానా అని అప్పుడప్పుడు అనుకుంటున్నాడీ
మధ్య. అసలు ఏ వుద్యోగం లోమాత్రం లేవు సర్దుబాట్లు. ఈ వ్యవస్థే అలాంటిది.. అని సరిపెట్టుకుంటున్నాడీ మధ్య.
కానీ కేసును నీరు గార్చడం, అటకెక్కించడం లాంటిది మాత్రం అతడు ఎంత మాత్రం ఒప్పుకోడు. కాదంటే తనను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎన్ని ట్రాన్స్‌ఫర్ లు చేసుకున్నా నిజాయితీ తో మాత్రం తను రాజీపడకూడదని నిశ్చయించుకున్నాడు.
-------------------------
సాయంత్రం ఐదు గంటలకి యాదయ్య పోలీస్‌స్టేషన్ కి వచ్చాడు. గదిలో కూర్చోబెట్టారు. ప్రక్కన సీఐ. శేఖర్ ఎదురుగా కూర్చున్నాడు.
"నీ పేరేంటి" యాదిరెడ్డి అడిగాడు.
"యాదయ్య సర్"..
"చూడు యాదయ్య.. ఆ రోజు గెస్ట్‌హౌస్‌లో ఏం జరిగిందో అంతా ఉన్నది ఉన్నట్లు చెప్పు.. అబద్దం చెప్పాలని చూస్తే నీ మెడకి చుట్టుకుంటుంది. ఓ ఐదారేళ్ళు జైల్లో చిప్ప కూడు తినాల్సివస్తుంది..” అన్నాడు యాదిరెడ్డి.
“నా కేం తెల్దండి బాబూ.. ఆ రోజు ఆడోళ్ళంతా మందుకొట్టి పదీ, పదకొండు గంటలకు యెల్లిపోనారండి.. అంతే నండి..” అన్నాడు యాదయ్య.
"ఇక్కడే నువ్వు అబద్దం చెబుతున్నవ్.. అంతా వెళ్ళి పోయారా? నిజం చెప్పు?..”
"యెల్లిపోయారండి..” అన్నాడు మళ్ళీ యాదయ్య.
ఆ మాటతో ప్రక్కనే నిలుచున్న కానిస్టేబుల్ లాఠీతో ఒక్కటేశాడు. ఏసీపీ సంజ్ఞతో లాఠీతో మరో రెండు పీకాడు కానిస్టేబుల్.
"అమ్మా, అమ్మా అని గావు కేక పెట్టాడు యాదయ్య.
ఆ అరుపుకు బయట ఉన్న అతడి భార్య మల్లమ్మ గబగబా లోపలికి రాబోయింది. పోలీసులు రానివ్వలేదు. ఆమె అక్కడే గుడ్లలో నీరు కక్కుకుంటూ కూర్చుంది.
"అవును సర్, అంతా యెల్లిపోయారండి.. అమ్మ తోడు సార్.. వెల్లిపోయారండి బాబూ "..
"నిజంగానా..’ యాదిరెడ్డి అడిగాడు.
"సత్తెపెమానకంగా యెల్లిపోనారండి..” అన్నాడు. యాదయ్య.
శేఖర్ సంజ్ఞతో కానిస్‌టేబుల్ లాఠీతో మరో రెండు తగిలించాడు. గగ్గోలు పెట్టాడు యాదయ్య.
"అందరూ వెళ్ళిపోయారన్నావ్, అది అబద్దం. వాళ్ళలో రవళి మాత్రం వెళ్ళలేదు. అక్కడే రాత్రికి పడుకుంది. మరునాడు ప్రొద్దున వెళ్ళిపోయింది.. అవునా?” గద్దించాడు యాదిరెడ్డి.
కంగారుపడ్డాడు యాదయ్య. ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. దొరికిపోయానురో దేవుడా అనుకున్నాడు. అంటే పోలీసులకి చాలా విషయాలు తెలిసే ఉంటాయి.
అనుకుని కంగారుపడ్డాడు.
"రవళి అనే అమ్మాయి వెళ్ళలేదు. వాళ్ళలో మిగిలింది ఇద్దరు మగాళ్ళు, ఒక ఆడమనిషి.. ఎంత మంది బయటికి వెళ్ళారు. నిజం చెప్పు..” సీఐ శేఖర్ అడిగాడు.
ఇప్పుడు యాదయ్య ఇరుకున పడ్డాడు. ఏం చెప్పాలో అతడికి తోచలేదు. ఏం చెబితే కొంపలు అంటుకుంటాయో అని భయంగా ఉంది. చెప్పకపోతే ఈ పోలీసులు తన బొక్కలు సున్నం సున్నం చేయడం ఖాయం అనుకున్నాడు.
"చెప్పు. రవళి తో కలిసి అంతా వెళ్ళిపోయారా? అమ్మాయి మనోరమ ఆ రోజునుంచి కనబడటం లేదు." యాదిరెడ్డి అన్నాడు.
"ఆళ్ళతో ఆమె యెల్లిపోయిందండి.. కానీ ఆ తరువాత ఏం జరిగిందో నాకు.. తెల్దండి..” యాదయ్య చెప్పాడు భయం భయంగా.
ఆ జవాబు నిజం కాదని యాదిరెడ్డికి, శేఖర్ కు అర్థం అయ్యింది.
"నువ్వు చెబుతున్నది నిజమేనా ?" అని శేఖర్ ప్రక్కనున్న కానిస్టేబుల్ కేసి చూశాడు.
కానిస్టేబుల్ లాఠీతో కాళ్ళ మీద రెండు దెబ్బలు వేశాడు. ప్రాణం పోయినంత పని అయ్యింది యాదయ్య కి. ఒక దెబ్బకి అరిచాడు. రెండో దెబ్బకి నోరు పెగలలేదు అరవడానికి.
"నిజం చెబితే దెబ్బలు పడవు.. నువ్వు అబద్దాలు చెబుతున్నావ్.. దెబ్బలు తింటావా ? నిజాలు చెబుతావా ?..’ శేఖర్ అన్నాడు.
బయట హాల్లో ఉన్న యాదయ్య భార్యని పిలిపించాడు యాదిరెడ్డి. ఆమె లోపలికి వచ్చి వినయంగా యాదిరెడ్డికీ, శేఖర్ కి దండాలు పెట్టింది. తన భర్తని ఎగాదిగా చూసి,
దెబ్బలు తిన్న భర్త విలవిలలాడుతూంటే ఆమె కడుపు తరుక్కుపోయింది. ఆమె వెనక ఒక ఆడకానిస్టేబుల్ కూడా వచ్చింది.
"ఏమ్మా ?.. ఆ రాత్రి ఎన్ని గంటలకు వాళ్లంతా వెళ్ళిపోయారు? అంతా వెళ్ళిపోయారా? లేక ఎవరైనా ఉండిపోయారా?..”
తన భర్త కేసి చూసింది, మల్లమ్మ ఏం చెప్పాలా అని.
"నిన్నే అడిగేది?.. అంతా వెళ్ళిపోయారా ?” శేఖర్ గద్దించాడు.
"ఒకామెగోరు పరుండిపోయారండి.. అని"
తరువాత అన్నట్లు చూశాడు శేఖర్. ప్రక్కనున్న కానిస్టేబుల్ కి సంజ్ఞ చేశాడు..
వాళ్ళు లాఠీ లు సవరిస్తూ ఉండగా, ఆడ కానిస్టేబుల్ తో సహా. వెంటనే హడావుడిగా, భయకంపితం తో అన్నాడు యాదయ్య."మగోళ్ళు యెల్లిపోయారండి" దెబ్బ
లు తగిలిన చోట చేత్తో రాసుకుంటూ.
"అవునా" యాదిరెడ్డి మల్లమ్మ కేసి తిరిగి అడిగాడు.
"అవునండి..” చెప్పిందామె.
"మరి మనోరమ?!.. " యాదిరెడ్డి అడిగాడు.
చెప్పడానికి యాదయ్య భయపడ్డాడు.
కొంపలంటుకుపోయాయి రా దేవుడా అనుకు
న్నాడు. ఇక తనని కుమ్మేయడమే భగవంతుడా అనుకున్నాడు. కానిస్టేబుల్ లాఠీ ఎత్తాడు, దెబ్బ వెయ్యడానికి.
"సచ్చిపోయిందండి..” ఠక్కున అనేశాడు యాదయ్య.
"ఎవరు చంపేశారు".. యాదిరెడ్డి అడిగాడు.
"ఎవరు చంపింది తెల్దండి.. సచ్చి పడుంటం చూశానండి..
నన్ను పిలిచే సరికి ఆమె గోరు సచ్చిపోయారండి..” చెప్పాడు యాదయ్య.
"వాళ్ళు వెళ్ళిపోయారు.. ఆమె చచ్చిపోయింది.. మరి ఆ శవాన్ని ఏం చేశారు?” యాదిరెడ్డి అడిగాడు. అతడికి పట్టరాని కోపం వస్తోంది. కానీ తమాయించుకున్నాడు. చావంత తేలికైపోయింది అనుకున్నాడు.
శవాన్ని కారులో తీసుకుపోయారని చెప్పాలనుకున్నాడు. అప్పుడు కేసు తనమీద రాకుండా ఉంటుంది. వాచ్‌మెన్ ఉద్యోగానికి నమస్కారము పెట్టి తన ఊరు వెళ్ళిపోయి కూలిపని చేసుకోవచ్చు అనుకున్నాడు. అతడి మనస్సు అంత వేగంగా ఆలోచిస్తోంది.
"ఏం చేశారు ఆ శవాన్ని?” శేఖర్ అడుగుతూంటే కానిస్టేబుల్ తన లాఠీకి పని చెప్పాడు. ఆడ కానిస్టేబుల్ గూడా మల్లమ్మ మీద రెండు దెబ్బలు వేసింది.
"కొట్టకు తల్లో.. సచ్చిపోతాను.. మావా, చెప్పేయ్.. ఏం జరిగిందో.. బతికుంటే బలుసాకు తిందాం.. ఈ దెబ్బలు పడలేం.. ఈ ఉద్యోగం వద్దు గానీ మనూరు వెళ్ళి
పోదాం.. సెప్పేయ్” అని ఏడుస్తూ అన్నది మల్లమ్మ.
"పూడ్చిపెట్టారండి.. " అన్నాడు గొణిగినట్లు.
"ఏం చేశారు ?" గర్జించాడు యాదిరెడ్డి.
యాదయ్య భయపడిపోయాడు యాదిరెడ్డి కోపానికి.
"పూడ్చిపెట్టారండి..” వాడికి నోరు ఎండి పోతోంది.. పిడచ కట్టుకుపోతోంది. మాటలు రావడం లేదు. ఎలాగో కష్టపడి చెప్పాడు మళ్ళీ.
"ఎక్కడ" శేఖర్ అడిగాడు.
"మంత్రిగారి పొలంలో సార్.. " మల్లమ్మ చెప్పింది మొగుడు అవస్థ చూసి ఇక చెప్పక తప్పదన్నట్లు.
"కమాన్ శేఖర్.. " అంటూ చటుక్కున లేచాడు యాదిరెడ్డి.
కానిస్టేబుల్ ను జీపు సిద్దం చేయమని పురమాయించాడు. "బాడీని బయటకు తీయిద్దాం.. "అన్నాడు శేఖర్ తో బయటకి నడుస్తూ.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
コメント