top of page

మాతృ ప్రేమ


'Mathru Prema - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 30/10/2023

'మాతృ ప్రేమ' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


నిజ గర్భంబున నవ మాసముల్ మోసి

నవమ పుత్రుని జూచి అహ్లాదము తోడన్

పోలికల్ లెక్కించి పొంగిపోవును తల్లి

పాలు గుడుపించి బాలుణ్ణి బరుండబెట్టు


కళ్ళు తెరచి కాళ్ళు చేతులతోడ కసరత్తు చేయ

ఒళ్ళు పులకరించియా తల్లి బాలు నుల్లంబున హత్తుకొనుచు

ముద్దుల వర్షాలు కురుపించు పసికందును హద్దుమీరి

పొద్దు పొడుపుల జాడలింకెరుగ బోదు పొలతి జూడ


దిన దినము కను విందు గల్పించు

దినకరుణి కిరణాల కరుణి బాలుని పెరుగు జూచి

అటు జూచు ఇటు జూచు కేకిసల అలికిడిని జేయు

చాటుగా జేరి చంటితోనాడ తంటాలు బడును తల్లి


రంగు రంగుల చొక్కాలు తొడగి రమణి

ఉంగరాల జుట్టుకు చమురద్ది శిశువు

ముంగురులు సవరించు వ్రేలుతో ముద్దుగాను

కొంగుతో తుడుచు ముఖము కొంగ్రొత్త మోము జూచు


బోసి నవ్వుల పాపణ్ణి గూర్చుండబెట్టి

బొమ్మలెన్నియొ దెచ్చి ముంగ్రుమ్మరించి

ఆడుకొనుము నా పనికి అడ్డురాకనుచు

వేడుకొనును బాబును వీడ లేదు విధులు మరుచు


తప్పటడుకులు వేయ తాపత్రయము నొంద

దెప్పి పొడుచును బాలుని త్రాగిన తావెక్కడనుచు

చతికిల బడ జూచి చప్పున చంకనిడుకొనుచు

బతికితిని పో బాబు నేడు బహు మంచి రోజటంచు


జోల పాటలు పాడిజోకొట్టి పాపణ్ణి నిద్రింపజేసి

జాలి యెంతయొ గలిగి జాగరణ జేసి తల్లి సుతు

మేలుకొను వరకును అలికిడికి వీలు లేకుండ

బాలు నిద్ర భంగము గానీదు అటనుండి కాలు కదుపబోదు


నడక నేర్చెడి పట్టిని దా నాదుకొనుచు

పడక మంచము బట్టించి పదిల పరచు

పట్టు వీడగ చేబట్టి వీపుదట్టు

ఎట్టకేలకు కేలూత యొసగు పట్టి కాలు కదుప


బారెడు దూరను పరుగిడి జారగ

చారెడు నీళ్ళకేడ్చి చతికిలబడ నా బాలుతోడ

మారెడు గుణము నీకిక రాదుపో యనుచు

పోరెడి యా తల్లి ఆరాటము తలువగ తరమే.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


22 views1 comment
bottom of page