'Pelli Pilupu' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 30/10/2023
'పెళ్ళి పిలుపు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కరోనా పోయినా...ఇంకా మా ఆఫీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ లో నా వర్క్ కోసం ఒక రూమ్ రెడీ చేసుకున్నాను. నేను వర్క్ చేస్తున్నప్పుడు.. ఎవరినీ లోపలికి రావడానికి ఒప్పుకోను. చివరకి నా భార్య అయినా సరే! కొత్తగా పెళ్లైంది..ఇంకా పిల్లలు లేరు..నేనూ, మా ఆవిడే ఇంట్లో ఉంటాం. నేను నా రూమ్ లో, మా ఆవిడ వంటింట్లో నే ఎక్కువ సమయం ఉంటాము.
ఒక రోజు మా ఆవిడ నాతో ఏదో చెప్పాలని.. తెగ వెయిట్ చేస్తుంది. అప్పుడు నేను ఆఫీస్ కాల్ లో బిజీ గా ఉన్నాను. మా ఆవిడ ఏదీ ఎక్కువ సేపు దాచుకోలేదు..వెంటనే చెప్పేయాలి...లేకపొతే ఏమీ తోచదు. తలుపు కొడితే, నేను తిడతానేమోనని భయం ఒక పక్క..ఈ లోపు నా ఫోన్ లో ఒక మెసేజ్ పెట్టింది మా ఆవిడ.. "వేడి వేడి పకోడీ రెడీ..బ్రేక్ లో రండి!" అని.
నాకు పకోడీ అంటే చాలా ఇష్టమని మా ఆవిడ ఈ ప్లాన్ వేసిందని నాకు తర్వాత తెలిసింది. ఉల్లిపాయ పకోడీ సువాసన వంటింటి కిటికీ లోంచి, బెడ్ రూమ్ కిటికీ ద్వారా నా ముక్కు కు తాకింది. ఇక ఆగలేక, వెంటనే కాల్ మ్యూట్ లో పెట్టేసి..తలుపు తీసాను.
"కవితా! ఎక్కడ? ..పకోడీ ఎక్కడ?"
"ముందు ఇవి తింటూ ఉండండి...ఇంకో ప్లేట్ తెస్తాను"
పకోడీ తినడం మొదలుపెట్టానో..లేదో..
"ఏమండీ! మీకొక విషయం చెప్పాలి. టైం ఉందా?"
"చెప్పు కవిత! "
"మా బాబాయ్ కొడుకు పెళ్ళంట..మా పిన్ని ఫోన్ చేసింది! మీరు ఆ సెలవులు..అవీ ముందుగానే అడిగేయండి..అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు మరి!"
"ఇంతకీ పెళ్ళి ఎప్పుడో?"
"వచ్చే నెలలోనే.."
ఆ మాట చెప్పగానే, మా ఆవిడ ముఖం క్రికెట్ స్టేడియం లో ఫ్లడ్ లైట్స్ లాగ వెలిగిపోయింది. అంతే మరి! పెళ్ళంటే..చీరలు, నగలు...ఆ హడావిడంతా ఆడవారిదే కదా! వేడి వేడి పకోడీ పంటి కింద నలుగుతూ ఉంటే.. మా ఆవిడ ఇంకో విషయం హాట్ గా చెప్పింది..
"పెళ్ళి సింపుల్ గా చేస్తామని ఆడపెళ్ళివారు ముందే చెప్పారంట..మొత్తం ఒక వంద మంది తోనే పెళ్ళి...దానికి సరిపడే ఫంక్షన్ హాల్ మాత్రమే బుక్ చేసారంట. భోజనాలు కుడా సెంచరీ కి మించి లేవంట! మంచి సంబంధం అని.. మా బాబాయ్ ఒప్పుకున్నాడు"
"ఇంతకీ మనల్ని పెళ్ళికి పిలిచారా?లేదా?"
"అక్కడికే వస్తున్నాను..కొంచం మంచినీళ్ళు తాగండి.."అని ముందే హింట్ ఇచ్చింది మా ఆవిడ.
"అక్కర్లేదు..చెప్పు.."
"ఆడపెళ్ళివారికి, దగ్గర చుట్టాలే చాలా ఎక్కువ...ఫిల్టర్ చేయగా, ఒక యాభై వరకూ ఉన్నారంట...మిగిలిన యాభై లో ఇరవై మంది విఐపి ల కోసం ..ఇంకా ఉన్నవి ముప్పై మాత్రమే..దీనిగురించే ఇప్పుడు మా లేడీస్ గ్రూప్ లో డిస్కషన్ అంతా! ఎవరిని పిలవాలో మా బాబాయ్ కి అర్ధం కావట్లేదంటా!మా బాబాయ్ కి దగ్గర బంధువులంతా కలిపి...కనీసం వంద కు పైనే ఉన్నారు..ముందు లక్కీ డిప్ వేద్దాం అనుకున్నారు...కానీ బాగోదని..ఒక ఆఫర్ పెట్టారు.."
"ఏమిటో ఆ బంపర్ ఆఫర్?"
"ఉన్న ముప్పై పిలుపులకి..ఇంత పోటీ ఉంది కాబట్టి..ఎవరైతే..ఖరీదైన కొత్త బట్టలు, నగలు వేసుకుని పెళ్ళికి వస్తారో..వాళ్ళకే ఇన్విటేషన్..
అందుకే మనం వేసుకునే బట్టలు, నగలు వేల్యూ ముందే చెప్పాలి..టాప్ ముప్పై మంది కి పెళ్ళి పిలుపు వస్తుంది..ఇప్పుడు ఆ వేల్యూ ఎంత నడుస్తుందో తెలుసా?"
"ఎంతో చెప్పు కవిత!"
"ఒక ఐదు లక్షలు..మనకి కనీసం పది లక్షలు వర్త్ ఉంటే గానీ, మనకు ఇన్విటేషన్ రాదండీ!..రేపు మనం షాపింగ్ కు వెళ్ళాలి."
"పెళ్ళికి వెళ్లడం అంత అవసరమా? చెప్పు కవిత!"
"ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ అండి...తప్పదు!"
భార్య చెప్పిన విషయం.. పకోడీ లో మిర్చి కన్నా ఘాటుగా తగిలి..వెంటనే గ్లాస్ నీళ్ళు గడ గడా.. తాగేసాడు.
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comentários