top of page
Original.png

 ఆనంద విహార్

#AnandaVihar, # ఆనందవిహార్, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Ananda Vihar - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 19/07/2025

ఆనంద విహార్ - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


'ఆనంద విహార్', వృద్ధాశ్రమం పదవ వార్షికోత్సవం ఘనంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తయాయి. వృద్ధాశ్రమ పరిసరాలు, మెడిటేషన్ హాలు, గదులు సుందరంగా ముస్తాబు చేసారు. 


ముఖ్య అతిథిగా వృద్ధాశ్రమ ట్రస్టీ ప్రొఫెసర్ సుధాకర్ గారు హైదరాబాదు నుంచి వస్తున్నారు. సమయం చిక్కినప్పుడు ఆయన ఆనంద విహార్ కు వచ్చి వయోవృద్ధులకు మనోదైర్యాన్ని కలగజేస్తు మానసిక సమస్యలు-- నివారణ విషయాలపై ప్రసంగ భాషణ ఇస్తుంటారు. 


అనుకున్న సమయానికి ఆనందవిహార్ వృద్ధాశ్రమం ముఖద్వారం ముందు ప్రొఫెసర్ సుధాకర్ సూట్ లో హుందాగా కారు దిగారు. 


వృద్ధాశ్రమం నిర్వాహకులు ఎదురెళ్లి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి వృద్ధాశ్రమం పరిసరాలు, వృద్ధులకు అందచేస్తున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాలు వివరంగా తెలియచేసి అక్కడి వయో వృద్ధుల్ని పేరుపేరున పరిచయం చేస్తున్నారు. 


వారిలో సన్నగా పీలగా మాసిన గెడ్డం మానసికంగా దిగులుగా ఉన్న మిత్రుడు రామచంద్రరావును చూసి ఆశ్చర్యానికి గురయారు ఆయన. విద్యార్థిగా ఉండేటప్పుడు ఎంత ఆడంబరంగా చలాకీగా ఉండేవాడు. రామచంద్రరావు మాత్రం ప్రొఫెసర్ గారిని గుర్తు పట్టలేకపోయాడు. తర్వాత వివరాలు తెలుసుకోవచ్చని ముందుకు సాగిపోయారు. 


మెడిటేషన్ హాల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేదిక మీదకు చేరుకున్నారు ప్రొఫెసర్ సుధాకర్. ఎదురుగా కుర్చీలలో వయోవృద్ధులు ఆశీనులయారు. వారిలో జుత్తు నెరిసి నీర్సంగా ఉన్న రామచంద్రరావు కూడా ఉన్నారు. 


మానసిక నిపుణులు ప్రొఫెసర్ సుధాకర్ తన ప్రసంగం ప్రారంబిస్తూ "వృద్ధాప్యం మనిషి జీవితంలో చివరి అంకం. వయసు శరీరానికే కాని మనసుకు కాదు. బాల్యం, యవ్వనం, మధ్యస్థ జీవితం ఎలా గడిచినా వార్ధక్యంలో అనేక ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. 


వార్ధక్యం స్వయంకృతాపరాధాలతో శాపంగా మారితే, నియమబద్ద ప్రణాళికతో గడిపితే వరంగా సాగిపోతుంది జీవితం. 


ఎప్పుడో జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ ఆలోచనలతో మానసికంగా కుంగిపోతు వార్ధక్యం నరకప్రాయం చేసుకోవద్దు. కుటుంబ బాధ్యతలు పూర్తయినాక విశ్రాంత జీవితంలో మరుగుపడిన అభిరుచులను బయటకు లాగి సమయం సద్వినియోగం చేసుకోవాలి. 


సాహిత్య పరంగా, సంగీత సాధన, లలితకళలు, ఆధ్యాత్మికంగా ఏదో ఒక వ్యాపకంతో సమయం గడపాలి. పార్కులు స్నేహితులు, పుణ్యక్షేత్రాల దర్శనం, కుటుంబ సభ్యులు, బంధువులు సన్నిహితులతో వీలైనంత సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలి. 


డబ్బుంటే సుఖాలు వస్తాయంటారు. డబ్బు కొంతవరకే మనిషికి ఆనందాన్నిస్తుంది. మానసికంగా మనిషి బాగుంటె శరీర ఆరోగ్యం ఆనందం అదే వస్తుంది. 


వార్ధక్యంలో నియమిత ఆహారం, వీలైనంత వరకు నడక యోగ ప్రాణయామం ఆధ్యాత్మిక జీవనం సుఖనిద్రకు ఎంతో మేలు చేస్తుంది. నలుగురిలో కలిసి సమయం గడపాలి. 


అనుభవాలు అడిగితేనె తప్ప అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు. రెక్కలొచ్చిన పిల్లలు గూడును వదిలి పోవడం సహజం. గూడులో ఎల్లకాలం ఉండేవి తల్లి తండ్రి

పక్షులే. పాతరోజుల్లో చదువులు ఉద్యోగ అవకాశాలు లేక ఇంటి దగ్గరే ఏదో పనిచేసుకుంటు యువత జీవితం గడిపేవారు. 


రోజులు మారేయి. చదువులు సౌకర్యాలు అవకాశాలు కలిగి పిల్లలు బ్రతుకుతెరువు కోసం కన్న తల్లిదండ్రుల్ని పుట్టిన ఊరిని వదిలి విదేశాలకు పోయి అక్కడే ఉండిపోతున్నారు. 

జీవిత చివరి అంకం ఎటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు కుటుంబ సబ్యులతో లేదా తమ వయసు వారితో కష్టసుఖాలు మాట్లాడుకుంటు వృద్ధాశ్రమాల్లో ప్రశాంత జీవితం గడనడమే కర్తవ్యం. ఈ సూత్రాలు పాటిస్తే వృద్ధాప్యం జీవితం వరంగా మారుతుంది " అని తన ప్రసంగం ముగించారు ప్రొఫెసర్. 


కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నిర్వాహకుల ద్వారా హైస్కూలు మిత్రుడు రామచంద్రరావును తన దగ్గరకు పిలిపించుకుని ఈ వృద్ధశ్రమంలో ఎందుకు చేరాల్సి వచ్చింది వివరాలు అడిగారు. 


రామచంద్రరావు, మిత్రుడు సుధాకర్ని ముందు గుర్తించలేకపోయినా ఆయన గతాన్ని జ్ఞాపకం చేస్తె హైస్కూలు రోజులు మదిలో మెదిలాయి. 


"సబ్ కలెక్టర్ గా నాన్నగారు హోదా ఉద్యోగంలో ఉండటంతో కష్టం తెలియకుండా రోజులు గడిచిపోయాయని, తర్వాత కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి నాన్న గారి సిఫారసుతో రెవిన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించి అక్రమ మార్గాల్లో డబ్బు కూడబెట్టినట్టు తర్వాత పెళ్లి జరగడం, శ్రీమతి కూడా విలాస జీవితానికి అలవాటు పడి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసేదని, ఇద్దరు కొడుకుల్ని గారాబం చెయ్యడంతో వారు స్నేహితులు చెడుతిరుగుళ్లతో తాగుడు జూదానికి అలవాటు పడ్డారని, ఇంజనీరింగ్ చదివే పెద్దకొడుకు మద్యం మత్తులో మోటారు సైకిల్ నడుపుతు యాక్సిడెంట్లో చనిపోయాడని, రెండవ కొడుకు డి. ఫార్మసీ చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి అమ్మాయితో ప్రేమలో పడి ఇండియా రావడం మానేసాడని,


భార్యకు కేన్సర్ వచ్చి చాల డబ్బు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదని, తనకు MRO గా ప్రమోషన్ రావడం, ఒక అవినీతి కేసులో ఇరుక్కుని ఉన్న డబ్బంతా లాయర్ కు ఖర్చు చేసి ఇప్పుడు ఎవరు లేని వంటరి పక్షిగా మిగిలానని, అన్యాయంగా సంపాదించిన డబ్బు పాపాల పుట్టలా నన్ను చుట్టి జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసింది. జీవితం మీద 

 విరక్తితో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఈ ఆనంద విహార్ వృద్ధాశ్రమంలో చేరేనని " తన గతం చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్రరావు. 


జరిగిన విషయాలు తెల్సి ప్రొఫెసర్ సుధాకర్ ఎంతో బాధపడ్డారు. తన గురించి చెబుతు, 


"మీ ఊళ్లో నాన్న గారు టీచర్ గా ఉద్యోగం చేసేటప్పుడు నీతో స్నేహం ఏర్పడింది. అప్పుడు మేము ఆర్థికంగా చాల ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. మీ నాన్న గారు చాల సహాయం చేసేవారు. నేను హైస్కూలులో ఉండగానె నాన్న గారికి పదోన్నతి మీద మరో ఊరు బదిలీ జరగడంతో నీతో అనుబంధం తగ్గింది. 


నేను హైస్కూలు తర్వాత కాలేజీలో డిగ్రీ, పిజి, తర్వాత పిహెచ్ డి కంప్లీట్ చేసి కాలేజీ లెక్చరర్ గా ఆపైన సైకాలజీ ప్రొఫెసర్ గా యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాను. నాన్న గారు హైస్కూలు హెడ్మాస్టరుగా పదవీ విరమణ పొంది నావద్దే ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వయసు 80 సం. పైనే ఉంది. 


ఇప్పటికీ మా కాలనీ వెల్ఫేర్ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేస్తు ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మ గతించి పది సంవత్సరాలైంది. నా శ్రీమతి కూడా కాలేజీ లెక్చరర్ గా జాబ్ చేస్తోంది. ఒకే ఒక అమ్మాయి మెడిసిన్ పూర్తి చేసి గైనకాలజిస్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తోంది. 


భగవంతుడి దయవల్ల ఆర్థికంగా అన్ని సౌకర్యాలు సమకూరి ప్రశాంతంగా జీవితం సాగిపోతోంది. అవకాశం ఉన్నంత వరకు గవర్నమెంట్ స్కూల్సు, వృద్ధాశ్రమాలకు, ధార్మిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయగలుగుతున్నాము" అని తన జీవితం గురించి చెబుతూ ఇటుపైన రామచంద్రరావు గారిని ప్రత్యేక గదిలోకి మార్చి అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్వాహకులకు చెప్పారు. వీలున్నప్పుడు వచ్చి పలకరిస్తానని ఎటువంటి అధైర్యం వద్దని మాట ఇచ్చి తిరుగు ప్రయాణమయారు ప్రొఫెసర్ సుధాకర్. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page