అందాల బొమ్మ
- Mohana Krishna Tata
- May 25
- 1 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #అందాలబొమ్మ, #AndalaBomma, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Andala Bomma - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 25/05/2025
అందాల బొమ్మ - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
ఆ బ్రహ్మ తనకొరకు సృష్టించుకున్న అందాల బొమ్మకు
ప్రాణం పోసి.. పొరపాటున పంపెనా పుడమి మీదకు
శిల్పి చందమామను రాతిగా తలచి
ఈ అందాన్ని మలచనేమో కదా!
ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక వంతు!
నీ అందం ఒక్కటే దానికి తూగు సరివంతు!
నీ ముఖవర్చస్సు చూసి దినకరుడు చినబోడా!
సృష్టికర్త తన అందమైన సృష్టికి మురిసిపోడా!
అలనాటి మహాభారత కాలాన నీవు జనించలేదు..
అటులైన భీష్ముడు బ్రహ్మచర్యం పాటించునా..లేదు
పాకిస్తాన్ బోర్డర్ వద్ద నువ్వు నిల్చొని ఉంటే చాలు..
నీ అందమైన చూపుకే మన శత్రువులంతా మటాష్..
నీకోసం కుర్రకారు మనసుల్లో ఎన్ని యుద్ధాలో కదా!
ఇంకెందరు దేవదాసు తీర్ధం పుచ్చుకొందురో కదా!
ఏదిఏమైనా నీ అందం అపురూపం!
ప్రపంచంలోనే ఒక మహాద్భుతం !
********

-తాత మోహనకృష్ణ
Comments