top of page

అందమైన అనుభవం


'Andamaina Anubhavam' - New Telugu Story Written By Mohana Krishna Tata

'అందమైన అనుభవం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


కళ్ళు తెరిచి చుట్టూ చూసాడు రాజు.


"నేను ఎక్కడ ఉన్నాను?" అనుకున్నాడు రాజు. చుట్టూ చూస్తే, పెద్దగా మెరిసిపోతున్న భవనాలు, జిగేలు మనే వాతావరణమే అంతా! రాజు కు ఏమీ అర్ధం కాలేదు.


కొంచం, లేచి, నడవడం మొదలుపెట్టాడు. దూరాన, మధురమైన సంగీతం వినిపిస్తుంది. ఆ సంగీతం, చెవులకు చాలా ఇంపుగా ఉంది. "ఇంత మంచి సంగీతం ఇంతవరకు, నా జీవితం లోనే వినలేదు" అనుకున్నాడు రాజు.


మొన్న, వెళ్ళిన పెళ్ళిచూపులలో...అమ్మాయి పాడిన పాటతో, పాడైన తన మైండ్, ఇప్పుడు ఈ సంగీతం తో చాలా రిలాక్స్ అవుతుంది. కొంచం దూరం వచ్చాక, ఒక సభ కనిపించింది. చూస్తే అది ఇంద్ర సభ లాగా ఉంది. అక్కడ అప్సరసలు నాట్యం చేస్తున్నారు.


మనసుకు వినసొంపు సంగీతం ఇక్కడ నుంచే వస్తున్నది అనుకున్నాడు. సభ అనంతరం, కొంచం ముందుకు వెళ్ళగా, అప్సరసలు ముగ్గురు ఒకే చోట మాట్లాడు కుంటున్నారు.


అప్పుడు ఒక అప్సరస "ఓ రాజు మానవ! ఇక్కడకు రమ్ము" అనగానే, రాజు అక్కడకు వెళ్ళాడు.


“మీరు ఎవరు? నేను ఇక్కడకు ఎలా వచ్చాను?”


"మేము అప్సరసలం - రంభ, ఊర్వశి, మేనక. మా గురించే వినే ఉంటావు. నువ్వు ఇప్పుడు ఉన్నది స్వర్గంలో. మేము నిన్ను ఇక్క డకు రప్పించాము”.


"ఎందుకు" అడిగాడు రాజు


"భూలోకం లో నీ వంటి రూపవంతుడు, గుణవంతుడు, జాలి, దయ ఉన్న మనిషి నువ్వే అనిపించావు ఈ కలికాలంలో. నిన్ను వలచి, ఇక్కడకు పిలిపించాము ముగ్గురము"


"ముగ్గురకు నేను నచ్చానా?"


"అవును"


"మాలో నీకు ఎవరు నచ్చారు"


"రాజు ఒకొకల్ని తదేకంగా చూస్తూ, “ముగ్గురూ నచ్చారు” అన్నాడు.


"నచ్చితే ఏమిటి చేస్తారు"


"పెళ్ళి చేసుకుంటాం"


"నీకు భూలోకం లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు కదా! అందుకే తక్షణం ఇక్కడకు రప్పించాము."


"నేను ఇక్కడే ఉండిపోతే, మరి ఎవరైనా, చుస్తే మీకే ఇబ్బంది కదా?"


"నీవు, మాకు తప్ప, ఇంకెవరకు కనిపించవు, నీ మాట ఎవరికీ వినిపించదు"


"నిజమా!? భూలోకంలో కూడా, ఇంత మంచి ఆఫర్ ఎక్కడ లేదనుకున్నాడు రాజు"


"నాకైతే, ముగ్గురూ ని పెళ్ళి చేసుకోవాలని ఉంది. ఎవరి అందం వారిది, ఎవరి ప్రతిభ వారిదే కదా!"


"మీలో మీరు నిర్ణయించుకొని, చెప్పండి" అన్నాడు రాజు.


"అలాగ కాదు, ఒక్కరినే నువ్వు పెళ్ళి చేసుకోవాలి?"


రాజు కోసం, ముగ్గురు అప్సరసలు వాదించుకున్నారు. నాకు కావాలంటే, నాకని వాదించుకున్నారు.


ఈ గొడవ లో, రహస్యం బయటకు చెప్పేసారు. మనం మానవుని పెళ్లాడితే, మన శక్తులు రెట్టింపు అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారు.


"అయితే నన్నే ఎందుకు?, భూలోకం లో చాలా అందమైన యువకులు ఎందరో ఉన్నారు కదా!" అని సందేహం వచ్చింది రాజు కు.


రాజు ధైర్యంగా, అప్సరసల దగ్గరకు వెళ్ళి… “మీ మాటలు నేను విన్నాను. నాకు విషయము తెలిసిపోయింది. నా కోసం రంభ, ఊర్వశి, మేనకలు గొడవపడటం విచిత్రం గా ఉంది"


"అవును! నువ్వు పుట్టిన తిధి, వార, నక్షత్రాలు, చాలా శ్రేష్టమైనవి. నీలాంటి కారణ జన్ములు భూలోకం లో మరొకరు లేరు."


"అయితే, ముగ్గురూ పెళ్ళి చేసుకోండి" అన్నాడు రాజు.


"ముగ్గురిని చేసుకుంటే, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో, వారికే శక్తులు ఉంటాయి".


"నా ప్రేమని ముగ్గురికి సమానంగా పంచుతాను. అప్పుడు ముగ్గురకు శక్తుల ఫలం లభిస్తుంది కదా!" అన్నాడు రాజు.


"అలాగే!” అన్నారు అప్సరసలు. “మాకు సమ్మతమే"


అలాగ, రాజు ముగ్గురు అప్సరసలతో సరదాగా ఉన్నాడు.


"నన్ను వదులు రంభ!


ఓ ఊర్వశి ! నన్ను విడువు!


ఓ మేనకా! ఇక చాలు" అంటున్నాడు రాజు.


ఈలోపు వర్షం పడుతున్నట్టు అనిపించింది...చూస్తే, బకెట్ తో నీళ్లు ముఖం పై కొట్టింది రాజు తల్లి.


రాజు! లే రా ఇంక! పగటి కలలు కనడం.......... కలవరించడం...... రోజూ.. ఇదే తంతు......


*****************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


45 views0 comments

Comments


bottom of page