అంజూరపు చెట్టు - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- Oct 10
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AnjurapuChettu, #అంజూరపుచెట్టు, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "అంజూరపు చెట్టు" పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో
Anjurapu Chettu - Book Unveiling ceremony At Narasaraopet - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/10/2025
అంజూరపు చెట్టు - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న విరచిత 79వ పుస్తకం"అంజూరపు చెట్టు" పుస్తకావిష్కరణ రవీంద్ర భారతి, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ వాగ్గేయకారుడు, సినీ గేయ రచయిత ఎం. ఎల్. సి డా. గోరేటి వెంకన్న, తెలంగాణ సాహిత్య తొలి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి, విశ్రాంత అటవీ శాఖ అధికారి యన్. వి. రఘువీర్ ప్రతాప్, అవధాని భానుప్రకాష్ మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకావిష్కరణ జరగడం గమనార్హం, సువిశేషం. దీనితోపాటు యన్. వి. రఘువీర్ ప్రతాప్ గారి యశోభూషణం అభినందన సంచిక కూడా ఆవిష్కరించారు. అత్యల్ప కాల వ్యవధిలో 79 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహిత్యప్రముఖు లెందరో పాలొగొన్నారు.
-గద్వాల సోమన్న














Comments