అన్నదమ్ముల అనుబంధం
- Addanki Lakshmi
- 5 days ago
- 4 min read
#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #AnnadammulaAnubandham, #అన్నదమ్ములఅనుబంధం

Annadammula Anubandham - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 05/10/2025
అన్నదమ్ముల అనుబంధం - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
"డాక్టర్ ! నాన్న గారికి ఎలా ఉంది పర్వాలేదు కదా?"
పెద్దకొడుకు గోపాలు వర్రీగా అడుగు తున్నాడు.
"పర్వాలేదండి, పెద్ద వయసు కదా!మెల్లిగా తేరుకుంటారు పల్స్ కొంచెం డౌన్ అవుతోంది బీపీ వల్ల తేడా వచ్చింది, మెడిసిన్ ఇచ్చాను కదా, దానివల్ల తగ్గుతుంది, వర్రీ పడకండి, " అంటూ డాక్టర్ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. గోపాలు డాక్టర్ని కారులో ఎక్కించి లోపలికి వచ్చాడు.
తండ్రి దగ్గరికి వెళ్లి చూస్తే.
"ఒరేయ్ చిన్నోడా ఇలా రారా, ఇలా రారా, నా చేయి పట్టుకో, నిన్ను మోసం చేశాను రా. నిన్ను మోసం చేశాను రా"అంటూ కలవరిస్తున్నాడు.
"నాన్నగారు నాన్నగారు.. ఇటు చూడండి, బాబాయ్ కి ఫోన్ చేశాను. ఆయన బయలుదేరాడు. మిమ్మల్ని చూడడానికి తప్పకుండా వస్తాను అన్నాడు," అంటూ గోపాల్ తండ్రి చెవిలో మెల్లగా చెప్పాడు.
"ఆ వస్తున్నాడా.. వస్తున్నాడా? ఎప్పుడొస్తాడు, ఎప్పుడు వస్తాడు ?" అంటూ కలవరిస్తూ మళ్ళీ మగతలోకి వెళ్లిపోయారు పరంధామయ్య,
ఈమధ్య ఎందుకో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. వయసు 60 ఏళ్లు దాటాయి. అంతే, మానసికంగా ఏదో బాధ పడుతున్నాడు.అందుకే ఆరోగ్యం క్షీణిస్తోంది.
తల్లి సీతమ్మ, భార్య సుశీల ఆయనకు సేవలు చేస్తున్నారు,
"ఒరేయ్ చిన్నోడా. ఒరేయ్ చిన్నోడా.. నామీద నీకు కోపం పోలేదురా.. నన్ను క్షమించరా.. నిన్ను ఒక్కసారి చూడాలని ఉందిరా” అంటూ మధ్య మధ్యలో మగతగా మాట్లాడుతున్నారాయన.
&&&&&&
ఆ పల్లెలో రామయ్య సీతమ్మకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పది ఎకరాలు భూమి ఉండేది. తిండికి గుడ్డకు లోటు లేక, హాయిగా ఆనందంగా జరిగిపోయేది
రామయ్యసంసారం.
పెద్ద కొడుకు పరంధామయ్య, చిన్నవాడు పరమేశం.
పెద్దవాడికి చదువు సంధ్యలో వెనకబడి ఉండేవాడు. తండ్రితో పొలానికి వెళ్లి పనులు చేసేవాడు. ఎలాగో ఎస్ఎల్సి వరకు చదివాడు.
పరమేశం బాగా తెలివైనవాడు. చదువులో ఎప్పుడు ఫస్ట్.
అన్నదమ్ములిద్దరూ కలిసి మెలిసి ఆడుకునేవారు. పరంధామయ్య తమ్ముడిని ముద్దుగా చూసేవాడు.
చిన్నోడా చిన్నోడా అని పిలిచేవాడు. సైకిల్ మీద ఎక్కించుకొని పక్క ఊర్లో ఉన్న హై స్కూల్ కి తీసుకెళ్లేవాడు.
తమ్ముడు అంటే పిచ్చి ప్రేమ. ఎవరైనా క్లాసు పిల్లలు వాడిని ఏడిపిస్తే ఈగ వాల నిచ్చేవాడు కాదు. ‘మా పరంధామ పెద్ద ఇంజనీర్ అవుతాడు’ అంటూ గొప్పగా అందరి పిల్లలతో చెప్పేవాడు.
రామయ్య, సీతమ్మ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసి పంపారు.
రామయ్య పెద్ద కొడుకు పరంధాము పొలం పనులు చూసుకునేవాడు. రామయ్యది చక్కటి సంసారం. ఆ పల్లెలో వారికి ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి.
పరంధాముకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు పుట్టారు.
పరమేశం పట్నం లో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
అతనికి ఇద్దరు పిల్లలు. అప్పుడప్పుడు పల్లె వచ్చి తల్లిదండ్రులతో అన్నా వదిన పిల్లలతో సరదాగా గడుపుతూ వెళ్లేవాడు.
పరంధాముకు వయసు వస్తున్న కొద్దీ మనిషిలో మార్పు వచ్చింది. తమ్ముడు సంసారాన్ని చూస్తే ఒక విధమైన ఈర్ష పుట్టుకొస్తుంది. తమ్ముడు మంచి సంపాదనతో పట్నంలో హాయిగా ఉన్నాడు. తను రేయింబవళ్లు పనిచేస్తే అతివృష్టి అనావృష్టి. పంట చేతికి రాదు. పెట్టుబడి డబ్బులు కూడా రావు. మెల్లిగా స్వార్థం మొదలైంది.
ఇంతలో తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేశారు.
ప్లీడరు తో లాలోచీ చేసి ఆ 10 ఎకరాల పొలము తనకు రాయించేసుకున్నాడు.
తమ్ముడు పరమేశంతో చెప్పాడు “నాన్నగారు, 10 ఎకరాలు నాకే రాశారు. నాకు చదువు లేదు కదా. నీకు చదువు చెప్పించారు. అందుకేనే పొలంలో వాటా నీకు రాయలేదు” అని వాడితో అబద్ధం చెప్పారు.
తాను చేసిన తప్పు పని వల్ల వాడితో మాట్లాడానికి కూడా మొహంచెల్లేది కాదు. తల్లిదండ్రులు పోయిన తర్వాత, తమ్ముని ఇంటికి రమ్మని కూడా పిలవడం మానేశాడు. మొహం చెల్లదు కదా..
అన్నగారిలో వచ్చిన మార్పు పరమేశం గమనిస్తూనే ఉన్నాడు. తనకు తెలుసు అన్నగారు తనని మోసం చేశాడు పొలం విషయంలో అని.
పోనీలే పొలం ఏముంది..
అన్నగారు చిన్నప్పటి నుంచి పొలంలో పనిచేస్తూ ఎంతో కష్టపడ్డాడు, నిజానికి అది తినడానికి అతనికి హక్కు.. అనుకుని సంతృప్తి పడ్డాడు.
తనకి మంచి జాబు ఉన్నది కదా అని పరమేశం
మనసులో సర్దుకుని ఊరుకున్నాడు.
ఇప్పుడు అన్నగారి పిల్లలు తన పిల్లలు అందరూ పట్టణంలో చదువుకుంటున్నారు. వాళ్ల జీవితాలు వారు చూసుకుంటారు.
పరమేశానికి చిన్నతనంలో తన అన్న గారు తనని ఎంత ప్రేమ అభిమానంగా చూసేవారో జీవితంలో మరిచిపోలేడు.
తాను పట్టణంలో చదువుకుంటున్నాడని సెలవుల్లో ఇంటికి వస్తే ఒక్క చిన్న పని కూడా చేయించేవాడు కాదు.
"ఒరేయ్. ఈ మట్టిలో తిరగకు రా. నీ బట్టలు మాసిపోతాయి.. నువ్వు పెద్ద ఆఫీసర్ వి. ఇంజనీర్వి..” అంటూ, మురిసిపోయేవాడు.
నిజానికి తండ్రి కన్నా తన అన్న గారు తనని ప్రేమగా చూసేవాడు అనిపించేది. అన్నగారిపై ఆ విశ్వాసం మనసులో ఎప్పుడూ ఉండేది పరమేశంకు.
డబ్బే మనిషిని ఎంత నీచాని కైనా దిగజారుస్తుంది.
మనుషుల్లో స్వార్ధము, ఈర్ష, కుళ్ళుతనము, తనకంటే ఎదుటివారి బాగున్నారని ఏడుపు..
ఈ విధంగా మనిషి వక్రంగా ఆలోచిస్తూ సొంత అన్నదమ్ములు అప్పచెల్లలతో విరోధాలు పెంచుకుంటూ ఆఖరికి మనసుకు శాంతి లేకుండా జీవిస్తూ ఉంటారు మానవులు. ఆఖరి క్షణాలలో పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటారు.
&&&&&&_
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,
Comments