top of page

అంతా నా మంచికే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Antha Na Manchike' New Telugu Story By Kotthapalli Udayababu


రచన : కొత్తపల్లి ఉదయబాబు



''ఈమధ్య ఆ మొహం ఎలా తయారైందో చూసుకున్నారా అద్దంలో? ఎన్ని సార్లు చెప్పాలి మీకు... నా మాట వినమని?'' అంది ఆదిలక్ష్మి భర్తమీద రయ్ మని లేచింది .


''40 ఏళ్ల నుంచి నీ మాట వినబట్టే చలపతి రావు అన్న నా పేరు జనాలు మర్చిపోయి ఆదిలక్ష్మి మొగుడు గారు అని పిలిపించుకుంటున్నాను... నీ పుణ్యమా అని. 60 ఏళ్లు దాటినా నీ మాటే వినాలా ? నాకంటూ ఒక సొంత అభిప్రాయం ఉండకూడదా?"' అన్నాడు చలపతిరావు కోపంగా.


''ఆ మన పెళ్లి అయ్యేనాటికి కుక్కర్ లో ఉడికించి ఇనిమిన ముద్దపప్పులా ఉండేవారు. అలా పెంచింది మీ అమ్మ మిమ్మల్ని. మీ స్నేహితులందరూ ముద్దుగా బూరె అని పిలుచుకునేవారట. అలాంటి మిమ్మల్ని చాలినంత ఉప్పువేసినట్టు నలుగురిలో తిరిగే విధానం నేర్పుకుని , కొత్త హెయిర్ స్టైల్ తాలింపు పెట్టుకుని, ఆపైన తిరగమోత వేసినట్టు మీ అందానికి సరిపోయి రంగు రంగుల డ్రస్సెస్ కొనిపించి, మీ చేత తొడిగించి , ఆపైన కొత్తిమీరతో గార్నిష్ చేసినట్టు తలకు రంగు వేసి ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్లో లేటెస్ట్ హాట్ టిఫిన్ లాగా ఇన్ని రకాలుగా మిమ్మల్ని తయారు చేసుకున్నాను కాబట్టే అందరూ మిమ్మల్ని 'ఆదిలక్ష్మిగారు వచ్చాకా చలపతిరావు గారు చాలా మారారు ' అని అంత గౌరవిస్తున్నారు. ఆ సంగతి మర్చిపోకండి'' అంది ఆదిలక్ష్మి.


"ఉద్యోగ విరమణ అయ్యాకా మనవాళ్ళు అందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. మనం కూడా అక్కడే సెటిల్ అవుదాం అన్నావు. సరేనని ఏభై ఏళ్ళు ఉన్న ఊర్లోంచి ఇక్కడకొచ్చి స్థిరపడ్డాం.ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణంకి తగ్గట్టు మారాలంటే నా వయసు అరవైమూడు. ఆసంగతి గుర్తుందా నీకు!"


"ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ వాతావరణంకి తగ్గట్టు మారి జీవించినంతకాలం సంతోషంగా ఉందామండి"


"అదేనా నీ నిర్ణయం?"


"పార్కుకు వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారే."


"వాళ్ళు అలా మీవల్ల సంతోషం పొందుతున్నారంటే ఎంత అదృష్టవంతులండీ మీరు. బ్రహ్మానందంగారు తెరమీద కనిపిస్తే ప్రతీ ప్రేక్షకుడి పెదాలమీద అసంకల్పితంగా నవ్వు మెరుస్తుంది. అదండీ జన్మసార్ధకత. వాళ్ళు నవ్వుకుంటే మాత్రం మీకు ఏం నష్టం కలిగిందో చెప్పండి. పోనీ ఒక్కరైనా మీ ఎదురుగా వచ్చి 'మీరు వరస్ట్' అన్నారా? చెప్పండి "


"లేదు."


"మరెందుకండీ బాధ?కొద్దీ రోజులు నేను చెప్పినట్టు వినండి. పార్కులో అందరూ మిమ్మల్ని ఫాలో అవకపోతే నాపేరు ఆదిలక్ష్మి కాదు.రండి టిఫిన్ చేద్దాం"


చలపతిరావు ఏ భావం కనిపించనీకుండా లేచి ఆమె వెనుక నడిచాడు గానీ...టిఫిన్ చేస్తున్నంతసేపు అతని బుర్ర పాదరసంలా ఆలోచిస్తూనే వుంది. ''నీ అభిప్రాయం నూటికి నూరు శాతం తప్పు '' అని భార్యచేత చెప్పించాలని.


****************


పడుకున్నాడే గానీ అతనికి నిద్ర పట్టలేదు. పక్కన ఆదిలక్ష్మి దీర్ఘ నిద్రలోకి జారుకున్నట్టు సన్నగా ఆమె పెడుతున్న గుర్రు తెలుపుతోంది.


తమ వూరిలో ఉన్నంతకాలం ఆదిలక్ష్మి తానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవరు ఏ ఫంక్షన్ కి పిలిచినా బాధ్యతలు తీరిపోవడంతో క్రమం తప్పకుండా వెళ్లేవారు తామిద్దరూ.


''పార్వతీ పరమేశ్వరులలాంటి మీ దంపతులదే మాకు మా పిల్లలకు తొలి ఆశీర్వచనం.'' అనేవారు ఆహ్వానించిన వాళ్ళు.


హైదరాబాద్ వచ్చాకా మొదటిసారి అపార్టుమెంట్లో జరిగే వినాయక చవితి పూజల్లో ''అందరి కన్నా పెద్దవారు ..మీరు మొదటిరోజు పూజలో పాల్గొనాలి'' అని కోరడంతో పాల్గొన్నారు.


ఆరోజు అన్నికుటుంబాలలో జంటలు పూజ చూడటానికి వచ్చాయి, అందరిలోనూ స్వచ్ఛమైన వెండిలా తెల్లగా ఉన్న జుట్టు తామిద్దరిదే.


మిగతావాళ్ళల్లో చాలామందికి కంఠం కింద కోడిమెడలా చర్మం జారిపోయినా, జుట్టు ప్రతీ జంటకి తుమ్మెద రెక్కల్లా నిగ నిగ లాడిపోతోంది. బుగ్గలు జారిపోయినా, ఒకటి రెండు పళ్ళు ఊడిపోయినా...దాదాపు అందరి జంటలూ అలాగే ఉన్నాయి. ఆ జంటల్లో మగవాళ్లకు లోపలి 'తెలుపులు' కనిపిస్తూనే ఉన్నా ఆడవాళ్ళకు మాత్రం ఒక్క వెంట్రుక తెల్లగా ఉంటె ఒట్టు.


భర్త ఎలా ఉన్నా తాము 'ముసలి చిలక'లా అలంకరించుకున్న వారి శ్రద్ధకి ఆశ్చర్యపోయాడు. ఆమాటే పూజ అయ్యాకా భార్యతో చెప్పాడు.


అంతే.


మరుసటి రోజు ఉదయమే కాఫీ కూడా ఇవ్వకుండా రంగు కలిపిన డిష్ తో అద్దం ముందు నిలబడి తలకు రంగు వేసుకుంటోంది ఆదిలక్ష్మి.


''ఇదేమిటోయ్..నువ్వు కూడా..నాకు వయసుకు తగ్గట్టు ఉండాలని ఇష్టమని నీకు తెలుసుగా.''అన్నాడు.


''మన వూళ్ళో ఉన్నంతకాలం మీ భార్యగా మీరు చెప్పినట్టే చేసాను. మీకు రంగేసుకోవడంలాంటివి ఇష్టం ఎలాగూ ఉండవు. నన్ను అదుపులో పెట్టాలని చూస్తే మాత్రం బాగోదు. ఈవేళనుంచి నేనూ ఈ నగరపు వాతావరణానికి తగ్గట్టుగా ఉండటానికి ప్రయత్నం చేస్తానని వినాయకునికి పొద్దున్న పూజలో నమస్కారం చేసుకున్నాను.'' అంది


చలపతిరావు ఇంకా మాట్లాడలేదు. ''నన్ను నా ఇష్టానికి వదిలేసావ్. సంతోషం. ''అని నవ్వుకున్నాడు.


ఆ సాయంత్రం పూజలో మరెవరో జంట కూర్చున్నారు. ఆదిలక్ష్మి ని చూసి ''మీ ఇంటికి చుట్టాలు వచ్చారా?'' అని అడిగాడు ఒకాయన చలపతిరావును.


''ఎవరూ రాలేదండీ.'మా ఆవిడే..'' అన్నాడు చలపతి రావు. ఆయన కళ్ళు, నోరూ రెండూ తెరిచాడు.


ఒకావిడ ఎవరో ఆదిలక్ష్మిని అడిగింది '' ఆ తెల్ల జుట్టాయన మీ నాన్నగారా?'' అని


''కాదండీ ...మావారు.''సిగ్గుపడుతూ చెప్పింది ఆదిలక్ష్మి.


మరునాడు ఆదిలక్ష్మి అన్నం తినలేదు.


'' ఏమీ?'' అని అడిగితే ''ఒంట్లో బాగాలేదు.'' అంది.


''అదేమిటోయ్...నిన్న రాత్రివరకూ బాగానే ఉన్నావుగా.'' అన్నాడు .


''ఆవిడెవరో మిమ్మల్ని చూపిస్తూ 'మీ నాన్నగారా?'' అని అడిగింది. అంతకన్నా అవమానం నాకు ఇంకోటి ఉంటుందా?...రేపటినుంచి నేను కొంప కదిలి ఎక్కడికీరాను. తిండి తినకుండా ఇంకా ముసలిదాన్నయిపోయి ''ఆవిడ మీ అమ్మగారా?'' అని మిమ్మల్ని అందరూ అడిగేలా చేస్తాను.'అంతా నా ఖర్మ.'' అని ఏడుస్తూ పడుకుంది. రెండురోజుల ఆ నిరాహార దీక్ష ఫలింప చేస్తూ మూడో రోజు పొద్దున్న ''నా తలకు రంగు తగలెయ్యి.'' అన్నాడు చలపతిరావు .


వేసుకుని స్స్నానం చేసాకా చూసుకుంటే తనలో ఊహించని మార్పు కనిపించి లోపల మనసు సంతోషపడింది.


''చూసారా? నేను చెప్పానా? శోభన్ బాబులా ఎంతబాగున్నారో?ఇపుడు ఎవత్తినైనా నోరెత్తమనండి చెబుతాను.'' అంది ఆది లక్ష్మి.


నిజంగా మళ్ళీ అపార్టుమెంట్లో ఒక్కరు నోరెత్తలేదు. ఈవయసులో కూడా ఎంత ముచ్చటగా ఉన్నారో..ఉంటే అలా ఉండాలి జంట. అని దాదాపు వయసు మళ్ళిన అన్ని జంటలు అనుకున్నాయి. రెండేళ్లనుంచి జరుగుతోంది ఇదే ప్రహసనం.


ఇంకా బుద్ధిగా రంగు వేయించుకోవడానికి కూర్చుంటుంటే చాలా చిరాగ్గా ఉంటోంది తనకి. ఇక ఈ తలకు రంగు వేషం చాలు. వయసుకు తగ్గట్టుగా ఉండాలి...పెద్దతిరుపతి కార్యక్రమం పెట్టి స్వామికి తలనీలాలు ఇచ్చేస్తే...ఆనాటినుంచి రంగు పూర్తిగా వేయడం మానేస్తే తనకి మనశాంతి కలుగుతుంది. ఈలోగా రేపు ఉదయమే తనకు చెప్పకుండా వెళ్లి క్షవరం చేయించేసుకోవాలి. ముందు కొంత నల్ల జుట్టు పోతుంది. తిరుపతి వెళ్లేంతవరకు అలా క్షవరం చేయించుకుంటూ ఉంటె ఆ నలుపు రంగు జుట్టు ఇక్కడే పోతుంది. తన తలనొప్పి వదులుతుంది. అనుకుని హాయిగా పడుకున్నాడు చలపతిరావు.


************


మరునాడు భర్తకు కాఫీకలిపి తీసుకొచ్చిన ఆదిలక్ష్మికి భర్త హాల్లో కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూనే ఉంది. చల్లగా ఎనిమిది దాటాకా వచ్చాడు చలపతి రావు.


మొగుణ్ణి చూస్తూనే ముందు కెవ్వుమంది.


దానికి కారణం చలపతి రావు డిప్ప చుట్టూ మిషన్ తో గొరిగించేసుకున్నట్టు చుట్టూ తెల్లటి తెలుపు జుట్టు కనిపిస్తోంది. నడినెత్తిమీద నల్లటి జుట్టు పొట్టిగా నిలబడి ఉండి బ్లాక్ అండ్ వైట్ సినిమాలా సూపర్ గా ఉంది.


వేడి వేడి కాఫీ పట్టుకొచ్చి అతనికి ఇచ్చేసి అతని చుట్టూ ప్రదక్షిణగా తిరిగింది.


''లేటుగా చేయించుకున్నా లేటెస్టుగా చేయించుకున్నారు. ఈ క్రాఫ్ మన కాలనీలో ఒక్కడికి లేదు. మీరు రేపటినుంచి ట్రెండ్ సెట్టర్ అయిపోతారు.'' అంది సంతోషపడిపోతూ.


''నీ మొహమూ, నా బొందానూ ''అని తన తిరుపతి పధకం చెప్పాడు ఆమెకు.


''మీరే చూస్తారుగా?"' సవాలు విసిరింది ఆదిలక్ష్మి.


************


మరునాడు పార్కులో చలపతి రావు అనుసరించిన కుర్రాళ్ళ లేటెస్ట్ ఫ్యాషన్ చూసి ముసలాళ్ళకు దిమ్మ తిరిగింది. తాము కూడా ఆ క్రాఫ్ వేయించుకుంటే ఎలా ఉంటుందా అని చర్చ మొదలెట్టారు. ఇవేవీ పట్టని చలపతిరావు రౌండ్లు వేయసాగాడు.


వాళ్ళల్లో ''వెంకట్రావు'' అనే ఆర్భాటం ముసలాయన ఉన్నాడు. ఆయన ఆ కాలనీ హెల్త్ క్లబ్ శాఖకు ప్రధాన కార్యదర్శి కూడాను.


తమ సంస్థలో చలపతిరావు ఆరోగ్య రహస్యం...ఆయన ఉత్సాహం..వృద్ధులు ఆ వయసులో అటువంటి లేటెస్ట్ ఫ్యాషన్లు అనుకరిస్తూ హుషారుగా ఉండేలా ఏమేం చెయ్యాలో వారిద్వారా తెలుసుకునే ఒక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటుచేసేసి, అతనికి సన్మానం ఏర్పాటు చేయించేసి,కమిటీ అనుమతితో కరపత్రం వేయించేసి నాలుగో రోజు చలపతి రావుకు మొదటి కరపత్రం అందజేసి , మిగతా అందరికీ పంపిణీ చేయించేసాడు.


ముందు నసిగినా సన్మానం ఉండటంతో నోరు కుట్టేసుకున్నాడు చలపతిరావు.


ఆది లక్ష్మి ఆనందానికి అవధులు లేవు. తన పధకం ఇలా రూపాంతరం చెందినందుకు చలపతిరావు ముందు కలత చెందినా, ఆతరువాత మనసు చెప్పడంతో సరిపెట్టేసుకున్నాడు.


ఏమిటో లోకమంతా '' వెర్రి వేయి విధాలు - పిచ్చి పలురకాలు''గా తయారయ్యింది. తానూ ఒకందుకు చేస్తే ఆ పని మరి కొందరికి మరో భావనలో తోచినందుకు నవ్వుకున్నాడు. లేకపోతె తనకు సన్మానం ఏమిటి?


నా ఆదిలక్ష్మి ఏం చెప్పినా ''అంతా నామంచికే!" అనుకున్నాడు.


ఆ మూడో రోజు ఆ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాలనీ లో ముసలివాళ్ళు అందరూ, యువత ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు.


కొసమెరుపు ఏమిటంటే వారంతా అచ్చంగా '' చలపతిరావు '' క్క్రాఫ్ ని అనుసరించి హాజరవ్వడమే!


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు

తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంటా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్




78 views5 comments

5 Comments



Javvadi Prasad • 2 days ago చక్కని కథ కి కామెడీ కలర్ బాగా నప్పింది భలే రాశారు సార్

Like

Javvadi Prasad • 1 day ago

కథ బాగుంది కామెడీకలర్ అదిరింది అభినందనలు సార్

Like

Maa Medam Kitchen • 33 minutes ago

రంగు మానేద్దామనుకుని చవట క్రాఫ్ చేయించుకుంటే అది కూడా ఫ్యాషన్ అనుకుని అనుసరించారా... నగరాల్లోఏదైనా ఫ్యాషనే. హ హ హ.. 👌👌👌

Like

Gudala Santoshita • 36 minutes ago

Vow...మంచి హాస్య కథ. 👏👏👏👏👏👌👌👌

Like

nani rk • 38 minutes ago

భలేగా ఉంది సర్ ఫన్నీ గా. అభినందనలు 🌹🙏🌹

Like
bottom of page