top of page

అనుకోని కలయిక

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #AnukoniKalayika, #అనుకోనికలయిక, #తెలుగుపల్లెకథలు

ree

Anukoni Kalayika - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 23/10/2025

అనుకోని కలయిక - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మొన్నీమధ్య పోరుమామిళ్ళకు చిన్న పని మీద పోయింటి. పని చూసుకొని బస్సుస్టాండు వొచ్చాంటే సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కనిపించ. 


"ఎమబ్బా వెంకట్రామిరెడ్డి బాగుండావా!" అని పలకరిస్తి. 


"ఆఁ వెంకటసుబ్బయ్య ఏమి ఇట్ట వచ్చివి. దా! టీ తాగుదాం" అని ఆప్యాయంగా పిల్చా. 


పక్కనే టీ స్టాల్ ఉంటే ఆడికి పోయి టేబుల్ దగ్గిర కుర్చుంటిమి. టీ షాపు అతను టీ ఇచ్చా. ఇద్దరం తాగుతా ఆమాట ఈమాట మాట్టాడుకుంటిమి. 


"వెంకట్రామిరెడ్డీ! నువ్వు పల్లె కథావస్తువులనే తీసుకుని కథలు నవలలు రాస్తుంటావు. ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా?" అడిగితి. 


దానికి, "పల్లెలో పుట్టినందుకు పల్లె రుణం తీర్చుకోవాలి కదా వెంకటసుబ్బయ్యా!" 


ఆయన మాటల్లో పల్లెపై వల్లమాలిన అభిమానం కనపడె. 


"రిటైర్మెంట్ అయినాక తీరిక దొరికింది. కథలు గానీ నవలలు గానీ ఈమధ్య రాసినావా?" అడిగితి. 


"కథాంశాలు చాలానే ఉన్నాయి. రాయాల" చెప్పె. 


"అద్సరె గానీ వెంకటసుబ్బయ్యా! నువ్వు కవిత్వం చాల చిక్కగా రాస్తావ్. నీ "ఎద మీటిన రాగాలు, తుమ్మెద పదాలు" బాగా పాఠకుల్లోకి పోయినవి. ఉన్నట్టుండి కథలు రాయడం మొదలు బెట్టితివి. విషయం ఏమైవుంటది." అడిగ.


"నేను కథలు రాయడానికి నువ్వు, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి ప్రేరణ. నువ్వు ఒక అంశంపై కవిత రాస్తావ్. అద్భుతంగా వస్తుంది. ఐనా చెప్పాల్సినది పూర్తిగా చెప్పలేక పోయానే అని అసంతృప్తి పడతావ్. అప్పుడు కథను ఆశ్రయిస్తావ్. కథ రాస్తావు. అది సంచలనం సృష్టిస్తోంది. అప్పుడు కూడా తృప్తి కలగదు. అదే అంశాన్ని విస్తృతంగా చెప్పడానికి నవల రాస్తావు. నేను అలాగే కవితలో చెప్పలేనిది కథలో చెప్పదలచ. "


"నా గురించి బాగా అంచనా వేశావ్. నువ్వు మాత్రం కవిత్వం ఎంత బాగా రాస్తావో కథ కూడా అంతా బాగా రాస్తావ్. ముఖ్యంగా "పెన్నేటి బతుకు, మల్లక్కయ్య, పొలిమేర, అల్లెం గుండు, సాంబుడి సాహసం, సుబ్బిగాడు కథలు మాస్టర్ ఫీసులు అని చెప్పాల. " అనె వెంకట్రామిరెడ్డి. 


ఇట్లా కబుర్లు చెప్పుకుంటావుంటె బొల్లు రామ్మోహన్ రోడ్డు మీద పోతా మిమ్మల్ని చూసి మా దగ్గిరకి వచ్చె. ఇతను మంచి కవిత్వం రాస్తాడు. సాహిత్య సభలు నిర్వహిస్తుంటాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతులు, వర్ధంతులు జరుపుతుంటాడు. 


మా వెనుక కుర్చీల్లో ఎప్పుడొచ్చి కుర్చున్నారో కథా రచయిత అక్కంపేట ఖాదర్, "సగిలేటి కథలు" రచయిత బత్తుల ప్రసాద్. 


అందరితో ఖుషిగా మాట్లాడి "ఇక పోయెచ్చ. ప్రొద్దుటూరుకి పోయేసరికి పొద్దు పోతది. " అంటి. 


అందరూ వచ్చి బస్సు ఎక్కించిరి. బస్సు కదిలి పాయ. 


మైదుకూరులో బస్సు దిగి ప్రొద్దుటూరు బస్సు ఎక్కాల. మైదుకూరులో బస్సు దిగగానే బడిలోంచి వస్తూ తవ్వా ఓబుల్ రెడ్డి కనిపించ. నన్ను చూసి "అన్నా! యాడికి వచ్చివి అన్నా! బాగుండవా అన్నా" అని ఎంతో అభిమానంగా పలకరించ. 


బాగండా ఓబుల్రెడ్డి! పోరుమామిళ్ళకు చిన్న పని మీద పోయింటి ఓబుల్రెడ్డి!" మాట్లాడుకుంటా టి అంగడికి పోతిమి. టి తాగుతా ముచ్చట్లలో పడితిమి. 


ఓబుల్రెడ్డి! నీ "కడపాపాత్రం" కథలు ఎక్కడలేని ప్రాచూర్యం పొందినై ఓబుల్రెడ్డి! ఎన్ని సమీక్షలు ఎంత ప్రచారం బాగా క్లిక్ ఐనై ఓబుల్రెడ్డి!" అంటి.


"ఔను అన్నా! కడుపాత్రం కథలు మంచి ప్రచారమే అందుకున్నాయ్ అన్నా! అద్సరె గానీ అన్నా! నీ "ఎద మీటిన రాగాలు" కవితా సంపుటిలోని 'మనిషి రెండు ముఖాలు, కరువు దావానలం, పట్నం వెళ్ళిపోతున్నా, దారి కాచిన ప్రమాదం' మొదలైన నలబై కవితలు పాఠకుడిని వెంటాడే కవితలన్నా!" ఓబుల్రెడ్డి చెప్పకొచ్చా. 


" ఇంతకు నీ 'పినాకిని కథలు' ఏమైనాయ్ అన్నా!" మల్లా అడిగ.


డిటిపి జరుగుతాండయ్ ఓబుల్రెడ్డి! వచ్చే జనవరికి పుస్తకాలు బయటికి రావచ్చు" చెప్పుతాండగానే కవి తోట రాంమోహన్, "పాలెగత్తె వన్నూరమ్మ" చారిత్రక నవల రచయిత, చరిత్ర పరిశోధకుడు బొమ్మశెట్టి రమేష్ టీ తాగడానికి వచ్చిరి. ఆ వెనుకే ఆజానుబాహుడు, పంచెకట్టులో ఉండే లెక్కల వెంకటరెడ్డి వచ్చా. 


ఈయన "భైరవ చరిత్ర" అనే పద్యకావ్యం రాసిండు. అందరితో చాల సేపు కబుర్లాడి ప్రొద్దుటూరు బస్సు వచ్చేసరికి అందరికి బాయ్ చెప్పి బస్సు ఎక్కితి. 

ప్రొద్దుటూరులో బస్సు దిగుతావుంటే అంతదూరంలో చదువులబాబు, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి మాట్లాడుకుంటూ కనిపించిరి. 


బస్సు దిగేటప్పుడు నన్ను చూసి కాశీవరపు వెంకట సుబ్బయ్య యాడికో పోయి వచ్చాండడే. అనుకొనిరి. ముగ్గరం మాట్లాడుకుంటా గాంధీ రోడ్డు దిక్కుగా పోతిమి. 

“విశ్వప్రసాద్! నీ ‘నల్లరేగడి నేలలో..’ కథలు పాఠకులు హృదయాల్లోకి చొచ్చుకు పోయినై. " అంటి. 


"నిజమే వెంకటసుబ్బయ్యా! ‘చుక్క పొడిచింది’ కథలు కంటే ‘నల్లరేగడి నేలల్లో..’ కథలు బాగా జనంలోకి పోయినై" అనే. 


"నీవల్లే నేను కథా రచయితనైతి" అంటి. 


'అదెట్టా చెప్పు" అశ్చర్యపడ్తూ అడిగ విశ్వప్రసాద్. 


"చాల దినాల కిందట నీతో మా రైతు సమస్యలన్నీ చెప్పి వీటి మీద కథ రాయమంటి. నువ్వు మనస్సు పెట్టి విని ‘ఇది నీ కథ. నువ్వు రాస్తేనే కథకు న్యాయం జరుగుతుంది. నువ్వు రాయ్’ అని నాపై వత్తిడి తెచ్చివి. 


‘సరే నేనే కథ రాస్తా’ అని పూనుకుంటి. కథ రాసి, దాన్ని మల్లా ఎత్తి రాసి, అట్టా పదితూర్లు చేసినాక బాగా వచ్చిందని తృప్తి పడితి. ఆ కథకు ‘పెన్నేటి బతుకు’ అని పేరు పెట్టి అరుణతార పత్రికకు పంపితి. కథ పత్రికలో ప్రచురణై మంచిపేరు తెచ్చె. కథ చదివి ప్రముఖ కథారచయిత, నవలాకారుడు శాంతినారాయణ ఫోన్ చేసి పది నిమిషాలు కథ మీద మాట్లాడి ప్రశంసించ. ఈ కథను కర్నూలు రచయితలు రాయలసీమ రైతు కథల సంకలనంలో వేసుకొనిరి. కాబట్టి నేను కథారచయిత కావడానికి నీవే కారణం విశ్వప్రసాద్" అంటి.


ఔనా! అని ఆనందపడే విశ్వప్రసాద్. 

"కవిత్వంలో కథా రచనలో వెంకటసుబ్బయ్య దూసుకుపోక పోతాండడు" చదువులబాబు పలిక. 


“చదువులబాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం వల్ల ప్రొద్దుటూరుకే పేరు వచ్చింది” అంటి. 


సి వి సురేష్, బసవరాజు వేణుగోపాల్ బైకులో పొతా ఎదురు పడి ‘ముగ్గురికి నమస్తే’ అనిరి. 


సివి సురేష్ 'నిసర్గ' పేరుతో ఒక కవితా సంపుటి తేవాలని అనుకుంటాండడు. వేణుగోపాల్ కవిత్వం, సాహిత్య వ్యాసాలు చక్కగా రాస్తాడు. 


"వెంకటసుబ్బయ్య అన్నా! ఆరోగ్యం బాగుందా అన్నా!" అభిమానంతో అడిగ సివి సురేష్. 


"అఁ బాగుంది సురేష్" అంటి. వాళ్ళిద్దరూ చిన్న ఫంక్షన్ ఉందని వెళ్లి పోయిరి.


మేం ముగ్గరం గాంధీ రోడ్డులో అడుగు పెడ్తిమి. ప్రసిద్ద కథారచయిత దాదా హయాత్, కథారచయిత, నవలాకారుడు ఎన్నెస్ ఖలందర్, కవి షేక్పీర్ల మహమూద్ యాడికో పోతా కనిపించిరి. మమ్మల్ని చూసి హాయ్ అనిరి. మేమూ హాయ్ అంటిమి. 


"కాశీవరపు వెంకటసుబ్బయ్యా! నీ కథా యాత్ర యమగా సాగుతోంది" అనె దాదాహయాత్. నేను థాంక్స్ చెప్పుకుంటిని. 


మాకు అర్జంట్ పని ఉందని వాళ్ళు ముగ్గరు వెళ్ళిపోయిరి. 

మేం ముగ్గరం దీక్షు టీ స్టాల్ లోకి పోతిమి. మేం రోజు కర్చోనే రెండువ టేబుల్ దగ్గిర కొత్తపల్లె శీను. ఇతను నటనలో నంది అవార్డు, గురుజాడ అవార్డు తీసుకున్నాడు. అంతేకాదు ప్రసిద్ధ సాహితీవేత్త కెజి వేణు తమ్ముడు కూడా. 


ప్రముఖ సాహితీవేత్త, కార్యక్రమాల నిర్వాహకుడు జింక సుబ్రహ్మణ్యం, పల్లా వెంకట రామారావు.. ఇతను రాయని సాహితీ ప్రక్రియ లేదు, కథలు, బాలకథలు నవలలు రాశాడు, "చిట్టి చేతులు" బాలకథా సంపుటి వెలువరించాడు, 


బాలగంగాధర తిలక్- ఇతను పాటలు రాసి, తానే బాణిగట్టి పాడే వాగ్గేయకారుడు, భూక్యా గోపాల్ నాయక్.. ఇతను చాల మంచి కవిత్వం రాస్తాడు. కంభం పామిలేటి.. ఇతను నటనలో అనేక సన్మానాలు సత్కారాలు బిరుదులు పొందిన వ్వక్తి. 


వీరందరూ కుర్చొని ఉన్నారు. అందరితో కలిసి టీ తాగుతూ అనేక సాహిత్య విషయాలపై చాల సేపు చర్చించుకుంటా వుంటే పల్లా కృష్ణ, కామనూరు రాంమోహన్ వచ్చి మా పక్కన కుర్చునిరి. పల్లా కృష్ణ కడప జిల్లా కథా సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. కామనూరు రాంమోహన్ 'కోకిలమ్మ పదాలు, ఒక పద్య శతకం రాసిండు. 


అందరు కలిసి ఒక నిర్ణయం చేసిరి. రాబోయే కాశీవరపు వెంకటసుబ్బయ్య "పినాకిని కథలు" గ్రాండ్ గా ఆవిష్కరణ చేయాలని, బయటి నుండి ఉపన్యాసకులను రప్పించాలని తీర్మానం. 


ఇక నేను టైం చూసుకుని అందరి దగ్గిర సెలవు తీసుకొని రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరితి. 


 -------

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments


bottom of page