top of page
Original_edited.jpg

అదేదో సామెత చెప్పినట్టు!

  • Writer: Amaraneni Mahesh
    Amaraneni Mahesh
  • Oct 23
  • 2 min read

#MaheshAmaraneni, #మహేష్అమరనేని, #AdedoSamethaCheppinatlu, #అదేదోసామెతచెప్పినట్టు , #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Adedo Sametha Cheppinatlu - New Telugu Story Written By - Mahesh Amaraneni

Published In manatelugukathalu.com On 23/10/2025

అదేదో సామెత చెప్పినట్టు - తెలుగు కథ

రచన: మహేష్ అమరనేని

"లక్ష్మీ… లక్ష్మీ…" అని హరి, కింద నుండి పైకి వస్తూ పిలిచాడు.


"ఏమిటండి?" అని, వంటగదిలో ఉన్న లక్ష్మి అడిగింది.


"కింద పార్కింగ్‌లో మన బండి లేదు. ఎక్కడుంది?"


"అది నేనే పక్కింటి వాళ్లకి ఇచ్చాను. వాళ్ల బండి టైర్ పంచర్ అయింది. వాళ్ల అబ్బాయిని ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కి తీసుకెళ్లటానికి మన బండిని ఉపయోగిస్తున్నారు."


హరి కొంచెం కడుపు మంటతో,"నీకు ఎన్ని సార్లు చెప్పాలి? ఇలా ఇవ్వకూడదని. పెట్రోల్ ఉరికే వస్తుందా? ఈ నెల ఎంత ఖర్చు వచ్చిందో తెలుసా?


మరి మొన్న డి-మార్ట్‌కి వెళ్ళినప్పుడు అనవసరమైనవన్నీ కొన్నావ్. బిల్ చూడు ఎంత వచ్చిందో!

ఇక కరెంట్ బిల్ ఎందుకు ఈసారి ఎక్కువ వచ్చింది? లైట్స్, ఫ్యాన్స్ వేసి అలాగే వదిలేస్తావు కదా.


మొన్న ఎందుకు ఇరవై వేల రూపాయలు పెట్టి గోల్డ్ రింగ్ కొన్నావు? ఎందుకు ఇలా అనవసరమైన ఖర్చులు చేస్తున్నావు లక్ష్మి?"


లక్ష్మి వంటగదిలోంచి బయటకి వస్తూ కాస్తా నవ్వుకుంటూ,"స్వామి… అయిందా మీ పురాణం?"


"ఇప్పుడు వినండి.మన పక్కింటి వాళ్ళు కూడా మన పిల్లలను స్కూల్‌ నుంచి తెస్తున్నారు వాళ్ల కారులో, మనకు కుదరకపోతే. వాళ్లు ఎప్పుడూ పెట్రోల్ కోసం మన దగ్గర డబ్బులు అడిగారా? లేదు కదా. ఇది ఒకరికి ఒకరు చేసుకునే సహాయం అంతే.


మరి డి-మార్ట్‌లో అనవసరమైనవి కొన్నానా? అవి మీ పిల్లల కోసం బిస్కెట్లు, నూడుల్స్ ప్యాకెట్లు, పెన్ బాక్స్‌లు, నోట్‌బుక్స్, రాత్రికి వేసుకునే షార్ట్‌లు. ఇవన్నీ ఉపయోగపడేవే. ఐనా మనం లాస్ట్ మంత్ డి-మార్ట్‌కి వెళ్లలేదు. అంతకుముందు తెచ్చిన సరుకుతోనే మేనేజ్ చేశాను.


కరెంట్ బిల్ గురించి చెబుతున్నారా? గత నెల మీ అమ్మా-నాన్న వచ్చినప్పుడు గీసర్ ఎక్కువ సేపు వేసేవారు. ‘గోరువెచ్చని నీళ్లతో సరిపెట్టుకోండి’ అన్నా ఒప్పుకోలేదు.


గోల్డ్ రింగ్ కొన్నది నా కోసం కాదు. మీ తమ్ముడికి అమ్మాయి పుట్టింది కదా? అన్నగా మీ తరపున పెట్టానది. అది కూడా మీ మర్యాద నిలబెట్టుకోవటానికే."


లక్ష్మి మళ్లీ వంటగదిలోకి వెళుతూ ఏదో సామెత అంటూ చెప్పింది.


హరి కూడా వెనుక వెళ్లి అడిగాడు."ఏదో అన్నావు కదా చివర్లో. అదేదో సామెత అంటూ, ఏమిటది?"


"ఏమీ కాదు స్వామి… మీరు వెళ్ళి మీ పని చూసుకోండి." అంది లక్ష్మి.


"కుదరదు. చెప్పాల్సిందే…" అన్నాడు హరి.


లక్ష్మి నెమ్మదిగా తిరిగి, చిరునవ్వుతో,"వెనుక ఏనుగంత పోతుంటే పట్టించుకోరు కానీ, ముందు చీమంతే పోతే తెగ బాధపడతారు." అంది. 


హరి ఆశ్చర్యంగా "అంటే?" అన్నాడు.


లక్ష్మి చెప్పింది,"మీరు పది లక్షలు మీ ఫ్రెండ్‌తో కలిసి బిజినెస్‌లో పెట్టారు. ఇంతవరకు మీ ఫ్రెండ్‌ నుంచి రెస్పాన్స్ లేదు. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇది వెనుక ఏనుగంత పోయినట్టే. దీని గురించి మీరు ఆలోచించాలి, ఎలా రాబట్టుకోవాలి మన డబ్బుని అని.”


ఇక ముందు చీమంత పోవడం అంటే ప్రతి నెలలో ఉండే చిన్న చిన్న ఖర్చులు. దీని కోసం మీరు ఇలా బాధపడనవసరం లేదు. నేను పొదుపుగానే ఖర్చు చేస్తున్నాను స్వామి."


హరి నవ్వుకుంటూ,"నీకు ఎలావస్తాయే ఇలాంటి సామెతలన్నీ…" అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు, ఇన్వెస్ట్మెంట్ పది లక్షలు గురించి. లక్ష్మి చెప్పింది నిజమే, ముందు, వెనుక పోతున్న ఏనుగంత డబ్బుని రాబట్టుకోవాలి.


శుభం.


మహేష్ అమరనేని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ree

రచయిత పరిచయం: నా పేరు మహేష్. 

సాధ్యమైనంత వరకు, నిజ జీవితంలో చూసిన సంఘటనలు మీద కథలు రాస్తూ ఉంటాను. ఇంతకు ముందు కొన్ని కథలు ప్రతిలిపి లో ప్రచురించాను.







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page