top of page

ఆపదలో అక్షర

Writer: Sandeep GadirajuSandeep Gadiraju

వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా ఎంపికైన కథ


 'Apadalo Akshara' - New Telugu Story Written By Sandeep Gadiraju

Published In manatelugukathalu.com On 04/09/2024

'ఆపదలో అక్షర' తెలుగు కథ

రచన: సందీప్ గాదిరాజు


భద్రత కష్టతరమైపోతోంది.

అమ్మకు ఆరాటం తప్పటంలేదు. 

అది తమిళనాడైనా తెలుగు నాడైనా…

                             **

ఎఱ్ఱ మోటారు సైకిల్ పై 

వచ్చి ఆగింది తెలుగమ్మ నవీన, తన అక్షర  కోసం.


కళ్ళముందు కనిపించక పోయేసరికి భయంతో కడుపులో ఱంపపుకోత మొదలైంది అమ్మకి.

బడిలోకి చొఱబడింది. బడివదిలినప్పటికీ ఇంకా ఏదో చూస్తూ తరగతిగదిలో తన బిడ్డ  అక్షర ను ఆపేసిన పంతులు కనబడేసరికి, అతని పుఱ్ఱె లో బుఱ్ఱే లేదనిపించింది ఆమెకి.


కానీ…

తాను చెప్పిన వ్యాసాన్ని సరిగా  వ్రాసిందా లేదా అని  చూస్తున్నాడు తెలుగు పంతులు.

'కొత్తగా  ఈ స్కూల్ కి మేస్టారుగా వచ్చావా? లాస్ట్ బెల్ కొట్టి టెన్ మినిట్సయింది.

బఱ్ఱెలేమైనా మేపుకొనేవాడివా ఈ జాబ్ కి రాకముందు? "

పది నిముషాలపాటు బిడ్డ కనబడకపోయినందుకే చిఱ్ఱుబుఱ్ఱు

లాడుతున్నది  నవీన. అయితే అతని చెవులకి వినబడలేదు.


'ఆపదలో ఉన్నావా?

అంతరించి పోయావా?

అంతరిక్షానికే పోయావా ?

ఓ బండిఱా! రా!

వీలుంటే తిరిగి రా!

మా తెలుగు వాడుక లిపి లోకి కలిసి రా!'

అనే కవి సగధీర రాసిన

మాటల్ని స్మరించుకుంటున్నాడు పంతులు .


'అది ఇంకా మీ చేతుల్లోనే ఉంది'

అన్న అక్షర మాటలతో 

స్పృహలోకి వచ్చేశాడు.


అవునన్నట్లు గాఢంగా ఊపిరి పీల్చుకుని,

తనచేతిలో  ఉన్న బుక్కు లో

ముర్రుపాలు బిడ్డకు రక్ష

గుర్రానికి వేగం సహజ లక్షణం

అంటూ రాసిన రాతపై

తప్పు  అంటూ  గుఱుతుపెట్టి.

ముఱ్ఱుపాలు బిడ్డకు రక్ష

గుఱ్ఱానికి వేగం సహజ లక్షణం

అని వ్రాసి ఇలా వంద సార్లు రాసుకురండి

అంటూ హోంవర్క్ ఇచ్చాడు , మీరూ రాస్తారని నాకుతెలుసని ఆమె అమ్మవైపు చూస్తూ… మనసులో అనుకుంటూ.


'అ' కు అలా అడుగు నొక్కుపడితే బండి 'ఱ'.


పాతికేళ్ళ క్రితం  ఆ చివరి అక్షరాన్ని తాను  నేర్చుకుంటున్నప్పుడు పడిన తపన గుఱుతు కొచ్చింది అతనికి అలా. నీవూ  గురువు వయ్యావు అంటూ  ఆపదలో  అక్షరం ఉందంటూ కర్తవ్యం గుర్తు చేస్తూ.

*** *** *** *** *** *** ***


సందీప్ గాదిరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: సందీప్ గాదిరాజు

Profile:


పేరు: సందీప్ గాదిరాజు

వృత్తి: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బెంగుళూరు

విద్య: M.Tech.VIT Vellore.

జన్మ స్థలం: బెంగుళూరు

 
 
 

1 Comment


mk kumar
mk kumar
Feb 17

'ఆపదలో అక్షర' కథ భాషా సంరక్షణ, తెలుగు లిపి ప్రాముఖ్యత, గురువు-శిష్య సంబంధాన్ని చర్చిస్తుంది. నవీన అనే తల్లి తన కుమార్తె అక్షర కనిపించకపోవడంతో కలిగే ఆందోళన, తెలుగు పంతులు భాషా విలువలను అర్థం చేసుకునే విధానం కథలో ప్రధానాంశంగా నిలుస్తాయి. కథలోని సంభాషణలు సహజంగా, ఉద్వేగభరితంగా ఉండి, పాత్రల భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తాయి. 'ఱ' వంటి అక్షరాల ప్రాముఖ్యత ద్వారా భాషపైన గాఢమైన ప్రేమను ప్రతిబింబించడం రచయిత సృజనాత్మకతను చూపిస్తుంది. భాష అనేది కేవలం మాధ్యమం మాత్రమే కాకుండా, సంస్కృతికి అద్దం పడే సాధనమనే సంకేతాన్ని కథ స్పష్టం చేస్తుంది. మొత్తానికి, ఈ కథ మనం భాషను గౌరవించడం ఎంత అవసరమో గుర్తు చేస్తూ, మనసుకు హత్తుకునే భావోద్వేగాన్ని కలిగిస్తుంది.


Like
bottom of page