top of page
Writer's pictureNallabati Raghavendra Rao

అతని కొమ్ములు విరిగిపోయాయి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Athani Kommulu Virigi Poyayi' New Telugu Story


Written By Nallabati Raghavendra Rao


రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


ప్రద్యుమ్నరావు, తను ఎంతటి కోటీశ్వరుడో అతను ఎప్పుడూ లెక్కలు చూసుకోలేక పోయాడు..... ఆ లెక్కలు చూసుకునే ఆ సమయంలోనే... అతను మరొక... కోటి సంపాదించగల దిట్ట.. !


ఆ మహానగరంలో అతడు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో అప్పుడే నిద్ర లేచిన ప్రద్యుమ్నరావు...

కుళాయిల నుండి నీరు రాకపోవడంతో.....


బజర్ నొక్కాడు......


కాసేపటికి ఒకతను డోర్ జరిపి లోపలికి వచ్చాడు.


''సార్.. మొత్తం సిటీలో ఈ రోజునుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. నా సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితి నీటి విషయంలో చూడలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకునేవాళ్ళం ... కానీ ఆ పరిస్థితి ఇంత తొందరలో వస్తుందని మాత్రం అనుకోలేదు సార్. సరే.. అన్ని రోజులు, అన్ని కాలాలు మనవి కాదు కదా... సృష్టి తో పోరాటం చెయ్యలేము సార్.. రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడే వరకు కుళాయిలనుండి నీళ్లు రావు. మాకు వచ్చిన కోటా ప్రకారం.. ఉన్న వాడైనా, లేని వాడైనా.. ఒక మనిషికి ఉదయం ఒక్క వాటర్ టిన్ మాత్రమే. మంచి చెడులన్ని ఆ ఒక్క టిన్ తోనే సరి పెట్టుకోవాలి సార్.. అలాగే సాయంత్రం ఒక టిన్ను.... ఈ విషయం ప్రతిరూమ్కి వెళ్లి ఇలాగే చెప్తున్నాను సార్"


అంటూ రన్నింగ్ ట్రే తో తెచ్చిన ... వాటర్ టిన్ను లోపల పెడుతూ అన్నాడు ఆ హోటల్ వాటర్ సప్లై అండ్ మెయింటనెన్స్ ఆఫీసర్ శరభేశ్వరo.


ప్రద్యుమ్నరావు కు ఎక్కడో కాలినట్లు అయింది..

తన ఎదురుగా ఇంతసేపు ఏమాత్రం జంకు లేకుండా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఇత నొక్కడే అనుకున్నాడు ప్రద్యుమ్నరావు.


భ్రుకుటి ముడిచి శరభేశ్వరo వైపు ఏగాదిగా చూస్తూ... అతనిని వెళ్ళిపోకుండా ఆగమని, తన సెల్ ఆన్ చేశాడు..


"హలో.. ఎమ్మెల్యే సుబ్బరాజు... ఏం చేస్తున్నావ్.

నేను ఈ సిటీలోనే ఉన్నాను.... హోటల్ త్రినేత్ర లో ఉన్నాను. వివరాలు అడగొద్దు.. నాకు ఈ హోటల్ కావాలి .. అర్జెంటు.. డీల్ ఎంతైనా పర్వా లేదు... పదినిమిషాల్లో పని పూర్తవ్వాలి... " .

... అంటూ ఆర్డరేశాడు.


ప్రద్యుమ్నరావు శరభేశ్వరo వైపు ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు.. అతని 10 వేళ్లకు ఉన్న పది ఉంగరాలను... మెడలో ఉన్న లావుపాటి గోల్డ్ చైన్ లను నిమురుకుంటూ....


పది నిమిషాలు పూర్తయింది. అవతల నుండి ఎమ్మెల్యే సుబ్బరాజు ఫోన్ చేసి డీల్ ఓకే అయి నట్లు చెప్పాడు.


ఇప్పుడు ప్రద్యుమ్నరావు.. శరభేశ్వరo వైపు మహా కోపంగా చూస్తూ "ఈ క్షణం నుంచి ఈ హోటల్ మేనేజర్ నేనే. నా స్నానానికి వంద వాటర్ టిన్స్ కావాలి అర్జంటుగా తీసుకురా. పో.. అంతేకాదు ఒక్కొక్క .. టిన్ నువ్వే కింద నుండి పైకి మోసుకొని పట్రా" అన్నాడు.


ఆ మాటలకు శరభేశ్వరo నొచ్చుకుంటూ..

" క్షమించండి సార్.. ఈ హోటల్ వరకే కాదు. ఈ సిటీ లో మొత్తం హోటల్స్ అన్నింటి మీద వాటర్ సప్లై విషయంలో.. నన్నే ఆలోచన అడుగుతుంటారు. ప్రస్తుతం ఈ విధానమే అమలు. మీరు మేనేజర్ అయినా సరే.. ఈ సర్దుబాటు వెంటనే మార్చలేం సార్.. నా విధానం మీకు నచ్చనప్పు డు ఇక్కడ పని చేయలేను సార్. క్రింద రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాను. "

అంటూ శరభేశ్వరo వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు


**


వారం రోజులు పోయాక...


ప్రద్యుమ్నరావు... విజయవాడ లో విమానం దిగి

తన ఊరు వెంకటాద్రిపురం చేరుకున్నాడు.. ఐదు ఎకరాల సువిశాల స్థలంలో ఎప్పుడో తన పెద్దలు అమోఘంగా ఏర్పాటు చేసిన భవంతి అది. కారు దిగేసరికి ఆ ఇంటి వ్యవహారాలు చూసే వెంకట కృష్ణారావు.. మరి ఇద్దరు ముగ్గురు పనివాళ్లు దగ్గరికి వచ్చారు.


చుట్టూ చూసిన ప్రద్యుమ్నరావు.. వెంకట కృష్ణారావు మీద ఉగ్రుడైపోయాడు.


" మీ తాతల కాలం నుండి కొలువు చేస్తున్నారు కదా అని నీకు నా ప్రాపర్టీ బాధ్యత అప్పచెప్పి వెళితే ఇంటి చుట్టూ... ఈ మురికి గోతులు ఏమిటి.. నీకేమైనా పిచ్చి పట్టిందా?''.... అంటూ అరిచాడు.


వెంకటకృష్ణారావు ఏమాత్రం బాధపడకుండా...

'' పెద్దయ్యా.. అవి మురికి గోతులు కాదయ్యా... వర్షపు ఇంకుడునీటిగుంటలు.. అందులో నిల్వ ఉన్న నీరు ఈ నేలతల్లి పీల్చుకుంటుంది... దాని తో ఎప్పుడైనా మనకు నీరు కరువు వస్తే మన దొడ్లో ఉన్న చేతిపంపులు పనిచేస్తాయి. అట్లా ఈ భూమాతను మనం గౌరవిస్తే... ఆ నేలతల్లి మన ప్రాణం నిలుపుతుందయ్యా... ఈ మంచి పని మీకు ఫోన్ లో చెప్పడం ఎందుకని నేనే చేయించాను క్షమించండి'' అంటూ.. సవివరంగా వివరించాడు వెంకట కృష్ణారావు.


'' క్షమించడం కుదరదు .. ఏమీ తెలియని అమా యకుడు తో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావ్. నీది పిచ్చిఆలోచన... వందసంవత్సరాలలో ఎప్పుడు జరగని చిత్రాలు ఇప్పుడు జరుగు తాయా? 24 గంటలలో నువ్వు ఈ పిచ్చిగోతు లన్నీ పూడ్చిపెట్టు. అంతే కాదు.. నాకారు ఇంటి చుట్టూ సుఖంగా తిరిగేలా సిమెంటు రోడ్డు వేయించు... '' అంటూ భీకరంగా అరిచి లోపలకు వెళ్ళిపోయాడు ప్రద్యుమ్నరావు.


... లారీ నిండా పోగు పెట్టి తీసుకెళ్లి బయట పొయ్య వలిసిందిగాఆజ్ఞాపించాడు.. పనిలోనికి వెళ్లి ఒకసారి చూసి.. ఆమెకు సేవ చేస్తున్న ఇద్దరు ఆయాలతో విషయాలన్నీ మాట్లాడి మళ్లీ క్రిందకు వచ్చి.. ఇల్లంతా తిరిగి చూశాడు.


ఇంట్లో అన్ని గదుల్లో పనికిరాని చెత్తను చూసి

... లారీ నిండా పోగు పెట్టి తీసుకెళ్లి బయట పొయ్య వలిసిందిగా ఆజ్ఞాపించాడు.. పనిలోనికి

వచ్చిన లారీ డ్రైవర్ మరియు క్లీనర్ తో.


సాయంత్రానికి తమ లారీ నిండా పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలు .. ప్లాస్టిక్ కవర్లు పోగుచేశారు వాళ్ళిద్దరూ


వాటన్నింటినీ సందు మలుపు ఖాళీలో గుమ్మ రించి రమ్మన్నాడు.. ప్రద్యుమ్నరావు.


వెంకటకృష్ణారావు మళ్లీ కలగజేసుకుని ముందుకు వచ్చి ఇలా అన్నాడు....


''అయ్యా.. అది ఊరికి మంచిది కాదయ్య. మునిసి పాలిటీ వాళ్లు కూడా ఒప్పుకోరు... ఈ నేల తల్లిని.. అలా కరగని వ్యర్థాలు పోసి అగౌరవ పరచటం మన భవిష్యత్తుకు మనపిల్లల ఆరోగ్యాలకి కూడా ఎంత మాత్రం మంచిది కాదయ్యా.. '' అన్నాడు


'' ఏ .. కొంపలు మునిగిపోతాయా.. ? '' అరిచాడు ప్రద్యుమ్నరావు


'' నన్ను క్షమించండి సార్ .. మా తాత కాలం చేసిన తర్వాత, మీతో నేను కొనసాగించటం ఈ రోజే మొదలు.. మీకు చెప్పేంత శక్తిమంతుడను కాదు సార్.. కానీ వాతావరణ స్థితిగతులను బట్టి చెప్పక తప్పటం లేదు.. ఇదంతా మీకు తెలిసిన విషయమే .


ఈ వారంలో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు మేత అను కుని పశువులు తిని చాలాచోట్ల చచ్చిపోయా యట. మనకు కూడా చాలా పశువులు ఉన్నా యి కదా. ఇలాంటి చెత్త ఉన్నచోట మొక్క కూడా మొలవదు. మీకు తెలియంది ఏముందయ్యా... ఈ చెత్త మన ఇంటికి దూరంగా ఉన్న మన ఖాళీ గొడౌన్లోనే ఉంచుదాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆలోచనతో అప్పుడు నిర్ణయం తీసుకుందాం''...

అన్నాడు కొంచెం ముందుకువచ్చి.. వెంకట కృష్ణారావు... వినయంగా చేతులు కట్టుకుని తల వంచుకుని.


ప్రద్యుమ్నరావు కు చేతులు కట్టుకు నిలబడిన వెంకటకృష్ణారావుని చూడగానే అతని శరీరం మీద తేళ్ళు... జెర్రులు పాకుతున్న అనుభూతి కలిగి ఇలా అన్నాడు.. కళ్ళతో ఎర్రగా చూస్తూ..


''ప్రతి నిమిషం భయపడుతూ చచ్చిపోతూ బ్రతక మంటావు. అది నీ లాంటి అర్భక ప్రాణు లకు.. మాలాంటి వాళ్లకు కాదు.. నీవల్ల నా పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. ఉదయం నీళ్ల గురించి పాఠాలు చెప్పావు. ఇప్పుడు నేల తల్లి అంటూ లెక్చర్లు ఇస్తున్నావు. ఆ రెండింటి మీద నువ్వేమైనా హక్కులు రాయించుకున్నావా?...


అక్కడికి.. ఈ ప్రపంచం ఏదో సర్వనాశనమై పోతున్నట్టు బాధపడిపోతావ్ ఏమిటి . ఒక్క

రోజులోనే నీ పద్ధతి నాకు నచ్చలేదు. నచ్చని చోట ఉండటం నీకే మంచిది కాదు.. నీ తలలో జేజెమ్మ లాంటి వాడిని పెట్టుకొంటాను.. నువ్వు ఒక అసమర్థ సామాన్య మనిషివి బయటకు పో... ''

అంటూ వెంకటకృష్ణారావుని నానాచీవాట్లు పెట్టి.. తీవ్రంగా అవమానించి... అసభ్యం గా మాట్లాడి.. జీవితంలో ముఖం చూపించకుండా వెళ్లిపొమ్మన్నాడు... ప్రద్యుమ్నరావు. చేసేది లేక వెంకటకృష్ణారావు దిగాలుపడిన ముఖం తో ఆ కొలువు విరమించుకుని వెళ్లిపోయాడు..


***



లారీ నిండా నిండిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను.... కవర్లను... తీసుకెళ్లి ఊరికి బాగా చివర్న స్మశానానికి వెళ్ళే దారిలో దారి పొడుగునా ఉన్న గోతులను, గుంటల ను ఈ వ్యర్థాల తో మూసి.. పైన మట్టి పోయమని.. అలా ఆ దారి కవర్ చేయమని సలహా ఇచ్చాడు.. ప్రద్యుమ్నరావు...


డబ్బులకోసం.. ఆ లారీ డ్రైవర్.. క్లీనర్ ఆ స్మశా నపు దారి రెండు కిలోమీటర్లు పొడుగునా ఆయన చెప్పి నట్లే చేసి పైన అవి కనపడకుండా మట్టికప్పి వెళ్లిపోయారు మారుమాట్లాడకుండా.



**



ఇక్కడ... వెంకటకృష్ణారావు నివాసముండే ఊరి చివర... మట్టి దిబ్బలు దాటాకచిట్టిపాకలు .....


సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద మనిషిగా మంచిమనిషి గా చలామణి అవుతున్న వెంకటకృష్ణారావుకి జరిగిన అవమా నం దృష్ట్యా.. అతనిమీద ఉన్న గౌరవంతో చుట్టు పక్కల ఏ ఒక్కరుకూడా ప్రద్యుమ్నరావు కొలువు లో చేరలేదు. ఆ నిర్ణయం... ఎవరికివారే తీసు కున్నారు . ప్రస్తుతం ఆ కొలువు లో పనిచేస్తున్న వాళ్ళలో కూడా కొందరు మానేశారు.


సిటీ నుండి కాంట్రాక్టు పద్ధతిలో నలుగురు మను షుల్ని తెప్పించాడు ప్రద్యుమ్నరావు.



*



నెలలు గడిచాయి వాతావరణ ప్రభావం మారింది.


భార్య ఆరోగ్యం మెరుగుపడటం లేదు. ఈలోగా ప్రద్యుమ్నరావు వ్యాపార రీత్యా తను వెళ్ళవల సిన రాష్ట్రాలు .. దేశాలు వెళ్లివస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం వెంకటాద్రిపురం లో తన ఇంటి దగ్గరే ఉన్నాడు.


వర్షాకాలం అయినా ఒక్క చినుకు పడలేదు. పైగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండతా పానికి కొన్ని ప్రాణాలు హరించుకుపోయాయి. చెరువుల్లో బావుల్లో ఒక నీళ్ల చుక్కలేదు. ప్రద్యు మ్నరావు చేతి పంపు కొట్టి నీళ్లు తెమ్మన్నాడు... అది నీళ్లు రాకుండా మొరాయించిoది. దాంతో

.... అది తను చేసిన పాపం వల్లే అన్నట్టు అత నికి ఏదో సంఘటన గుర్తు వచ్చినట్టు అనిపిo చింది.. !!!


తల విదిలించుకున్నాడు.


చుట్టుపక్కల వాళ్ళను అడిగినా చుక్కనీరు అప్పుగా కూడా ఇవ్వలేదు. మూర్ఖులు దుష్టులు దుర్మార్గులు.. పాతతరం మారిపోయి కొత్తతరం లో కొత్తగా తయారైన వెధవలు.. దమ్మిడీముఖం గాళ్లు.. వీళ్ళకి ఏం తెలుసు నా హోదా అనుకు న్నాడు మనసులో.


కాంట్రాక్టు పద్ధతిలో వచ్చిన నలుగురు పనివాళ్లు ఇక్కడ విధానాలు తాము తట్టుకునేలా లేవని.. జీతం నాలుగు రెట్లు ఇచ్చినా ఉండలేమని.. వెళ్లి పోయారు.


**


ఇక మేడపైన రెండవ అంతస్తులో వినబడిన శబ్దంతో పైకి వెళ్ళాడు... ప్రద్యుమ్నరావు. తన భార్య మంచం మీద నుండి కిందపడి ప్రాణాలు కోల్పో యి ఉంది!


అదే గదిలో ఉన్న బంగారు ఉయ్యాలలో కూర్చు ని ఊగుతున్నాడు ప్రద్యుమ్నరావు, ఏం చేయా లో తోచక.


తన సంతానం ఎప్పుడో తనను కాదని వెళ్ళిపో యారు... బంధువర్గం తన పద్ధతులు నచ్చక దూరంగా ఉన్నారు... లేదు లేదు ....

'' నేనే ఆ వెధవలను అందరిని దూరం పెట్టాను. '' అని సమర్థించుకున్నాడు మనసుతో.


ఇక ఇరుగుపొరుగు.. తన హోదా తెలియని అట్టడుగువాళ్ళు......


ప్రస్తుత సమస్య.... ఇప్పుడు ఏం చేయాలి???? ఈ శవాన్ని ఎలా తీసుకెళ్లాలి... ???... !!!


ప్రద్యుమ్నరావు ఊగుతున్న బంగారపు ఉయ్యా ల గొలుసులు తెగిపోయి ఒక పక్కకు వాలిపో యింది. దాంతోపాటు అతను కూడా జారి కిందపడ్డాడు.

.


***



ఏది ఆగినా.. ఈ కాల చక్రంలో మార్పులు ఆగవు కదా... ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు....


ఉన్నట్టుండి... ఎండ పూర్తిగా తగ్గిపోయి వాతా వరణం మారిపోయింది. పెద్ద గాలి దుమారం మొదలయింది. ఆకాశం నల్లగా నిగనిగలాడు తోంది... మేఘాలతో... వర్షం భయంకరంగా ప్రారంభమయిపోయింది.


ఆ చుట్టుపక్కల భూ మార్గాలన్ని.. బురద మయం అయిపోయాయి... ఆ భయంకర రాకాసి వర్షానికి గంటల వ్యవధిలో వీధులలో అడుగు లోతు నీరు నిలిచిపోయింది... ఎంత చిత్రం??


గంట ముందు ఈ భూ తల్లికి.. ఇప్పటి భూతల్లి కి ఎంత మార్పు??


గంట క్రితం నీటి కటకటకు ఇప్పటి నీటి ప్రవాహా నికి ఎంత.. తేడా??


ప్రద్యుమ్నరావు సెల్ఫోన్ అందుకని ఒక నెంబర్ నొక్కాడు.... అది దగ్గరలోని మునిసిపల్ ఆఫీస్.


'' హలో.. మునిసిపల్ మహేశ్వరరావుగారా.. నమస్తే నేను ప్రద్యుమ్నరావుని.. ఏంలేదు.. మా ఇంటి నుండి ఒక డెడ్ బాడీ స్మశానానికి తీసు కెళ్లాలి. అర్జెంటుగా వాహనాన్ని ఇద్దరి మనుషు లను పంపండి... ఏమిటి వారం నుండి అందరూ స్ట్రైక్ లో ఉన్నారా.. మీకేమో కడుపులో నొప్పి వస్తుందా సరే ఫోన్ పెట్టేయండి '' అంటూ గట్టిగా అరిచాడు .

మళ్లీ మరో నెంబర్కు ఫోన్చేశాడు.

'' హలో నాయుడు.. నేను రా.. వాయిదాల పద్ధ తిలో నీకు కారు కొనిపెట్టిన ప్రద్యుమ్నరావుని.

నీ కారు అప్పు మొత్తం నేను తీర్చేస్తానుకానీ.. నువ్వు కారుతో ఒకసారి మాఇంటికి రా......

ఏమిటి... కారుకు యాక్సిడెంట్ అయిందా..... నువ్వు కాళ్ళు విరిగి హాస్పిటల్ లో ఉన్నావా ..

సరే ఫోన్ పెట్టేయ్''.


ప్రద్యుమ్నరావు చిరాకుతో చిర్రెత్తి పోయాడు...


ప్రద్యుమ్నరావు సెల్ ఆఫ్ చేసి.. వీధిలోకి వచ్చాడు


గతంలో ఎప్పుడు చూడని ఓ వ్యక్తి ఒంటెద్దు బండి తోలుకుంటూ వెళ్తున్నాడు. అతడిని ఆపి లోపలకు పిలిచి విషయం చెప్పాడు ప్రద్యుమ్న రావు.


దానికతను చేతులు కట్టుకుని ఇలా అన్నాడు ..

'' అయ్యా నా పేరు పరోపకారం.. పేరుకు తగ్గట్టు నాకు అందరికీ ఉపకారం చేయాలని పిస్తుంది.. అమ్మగారిని స్మశానం వరకు తీసు కెళ్తాను బాబు నా గూడు బండి లో.. మీరు లక్ష రూపాయలు చూపిస్తున్నారు.. నాకొద్దు. మీదగ్గరే ఉంచుకోండి బాబయ్య.... ''.. అన్నాడు..


''ఇలాంటి మహా బాధ శత్రువుకి కూడా రాకూ డదు బాబయ్య ... '' అనుకుంటూ నెత్తి మీద పడుతున్న ధారాపాతవర్షపు నీటితో పాటు తన కళ్ళలో నీళ్ళు కూడా తుడుచుకున్నాడు బండి పరోపకారం .


అప్పటికే చెడువాసన కొడుతున్న.... శవాన్ని గూడు బండిలో నెమ్మదిగా పడుకోబెట్టి స్మశానం వైపు వెళుతున్నారు... ఆ ఇద్దరూ.


గాలి ఉధృతి పెరిగింది.. ఒంటెద్దు బండి తిరగ బడి పోతుందన్నoత.... నీటి ప్రవాహంలో నుంచి వెళ్తుంది ఆ బండి.... ఇంచుమించు మోకాలి లోతు నీరు.


చాలా సేపటికి... ఒంటెద్దు బండి నెమ్మది నెమ్మ ది గా స్మశానం దారిలో కి వచ్చింది. అయినా అలా మరో రెండు కిలోమీటర్లు వెళ్తేనేగాని.... స్మశాన స్థలం రాదు.


అంతే ఆ దారిలో ఒకచోట పెద్ద గొయ్యి ఏర్పడి అందులో బండి చక్రం దిగబడిపోయింది. క్రింద కు దిగి చూశాడు పరోపకారం.. ప్రద్యుమ్నరావు సహాయంతో బండిని ముందుకు లాగాలని చూశాడు.... ఇద్దరు.. ఎంత ప్రయత్నించినా.. పని జరగలేదు.


బండి పరోపకారానికి గుండెల్లో మండిపోయి నట్లు అయిపోయింది.. ఆ పరిస్థితికి... దాంతో ఇలా బాధపడుతూ అన్నాడు...


''అయ్యా ఏ.. వెధవన్నర వెధవ చేశాడో చూడం డి ఈ పని.. నేల తల్లిని చంపేసేరయ్యా .. పనికి రాని ప్లాస్టిక్ చెత్త ఈ దారి పొడుగు అంతా పోసి పైన మట్టి కప్పి పెట్టాడయ్యా . వాడు తల్లికి తండ్రికి పుట్టిన సన్నాసి అయి ఉండడు.. అంద రికీ పనికొచ్చే దారి కదా.. ఈ నేల తల్లిని ఇలా పాడుచేయొచ్చా... ఆ వెధవ అశుద్ధం తినే మనిషి.. ! ఓ పక్క అమ్మ గారు మొఖం చూడండి.. వానకు తడిసి భరించరాని కంపుతో.. 'నన్ను త్వరగా స్మశానానికి తీసు కెళ్లి కప్పెట్టం డి రా...' అన్న ట్టుoది కదూ.


నేను ఆ తల్లి ముఖం చూడ లేనయ్యా.. ఈ కష్ట మంతా పడేసరికి నాకు కూడా నీరసంతోఆయా సంగా ఉంది. నేను వెళ్ళిపోతానయ్యా... మాట ఇచ్చి పని పూర్తిగా చేయలేకపోతున్నందుకు క్షమించండి మిగతా కార్యక్రమం ఎలా పూర్తి చేస్తారో మీరే చేసుకోండి.. ఇక నావల్ల కాదు... ముందు నాప్రాణం పోయేలా ఉంది. నా పెళ్ళాం పిల్లల విషయం చూసుకోవాలి కదా'' అంటూ వెళ్లిపోయాడు.. ఒంటెద్దు బండి పరోప కారం... బండిని అక్కడే వదిలేసి.


ఒక పెద్ద ఉరుము పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు మీద పడి ఆ చెట్టు భస్మం అయిపోయింది...

ప్రద్యుమ్నరావులో.. మానవుడు మొదటగా కళ్ళు తెరిచాడు... ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తన భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి ఎవరు.. ?


ఆ కార్య సాధన కోసం.... తను ఎవరిని అభ్య ర్థించాలి.. ?!


ఆలోచించడం ప్రారంభించాడు. ప్రద్యుమ్నరావు.



***



ఇప్పుడు అతని అడుగులు..... అతనికి తెలియ కుండానే.. ఆ యొక్క ఉన్నతమైన కార్యసాధన కోసం బండిని .. భార్యశవాన్ని అక్కడే వదిలేసి వెనక్కు తిరిగి వెళుతున్నాయి..


బురద.. గోతులు.. గుంటలు... ఆ దారి మార్గ మంతా.... అయోమయంగా ఉంది.. !!!!!????


'' అమ్మా.. నేలతల్లి.. నిన్ను తొక్కుకుంటూ వెళ్తు న్నాను ... నీకు తీరని ద్రోహం చేసిన... నన్ను క్షమించమ్మా... నాకు సరైన మార్గం చూపించు నేలతల్లి''


ఇన్ని సంవత్సరాల జీవితంలో మొట్టమొదటి సారి గా... మనసులో స్మరించుకున్నాడు...

కోటానుకోట్ల రూపాయల పడగలు కింద కాపు రం ఉంటున్న ... ప్రద్యుమ్నరావు ...


అంతేకాదు... సృష్టిలో కనపడని ఒక నిరుపయో గమైన కన్నీటి బొట్టు కార్చాడు మొట్టమొదటగా

ప్రద్యుమ్నరావు.


తనను ముందుకు వెళ్లనివ్వకుండా పక్కకు తోసి పాడేస్తున్న మోకాలిలోతు నీటి ప్రవాహాన్ని కూడా.. చేతులెత్తి వేనోళ్ల నమస్కరించాడు.. నీటి విలువ తెలుసుకోకుండా అహంకారంతో లెక్కలేనితనంగా బ్రతికిన తనను క్షమించమని ఈ పరిస్థితినుండి రక్షించమని.. ఎంత అరిచినా సృష్టిలో ఎవరికీ విన పడనంత గట్టిగా అరుస్తూ ఏడుస్తూ... పడుతూ లేస్తూ... నడుస్తు న్నాడు..

ప్రద్యుమ్నరావు... ఒక కార్య సాధన దీక్ష కంకణ బద్ధుడై.


అలా అలా... అతి కష్టం మీద ఆ ఊరి చివర మట్టి దిబ్బలు... చాలా ప్రయాసతో అవన్నీ దాటాక.... చిట్టిపాకలు ప్రాంతం.. అది కూడా పడుతూ లేస్తూ దాటాక... ఆ సన్నపాటి సందు మార్గం లాంటి దారి చివర ఒక క్రుంగిపోతున్న రెల్లుగడ్డి గుడిసె.... దాని తాలుక వీధి తాటాకు తలుపు మీద.. వాలిపోయి.. పడ్డాడు.. నీరసంగా... ప్రద్యుమ్నరావు.


వెంటనే కళ్ళు తెరచి చూసేసరికి.. లోపల ఎర్ర మట్టి పిట్టగోడ మీద కూర్చున్న ఒక.. అసమర్థ సామాన్య మనిషి వెంకటకృష్ణారావు పాదాలపై తన శిరస్సు ఉన్నట్టు గ్రహించగలిగేడు.....

ద గ్రేట్..... ప్రద్యుమ్నరావు... !!!!!!!!

* సమాప్తం *

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


*


69 views0 comments

Comentarios


bottom of page