top of page

అతి తెలివి


'Athi Thelivi' New Telugu Story


Written By Jidigunta Srinivasa Rao


రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శేఖర్ ది పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నగార్లు, ముగ్గురు బావమరుదులు, భార్య అప్పచెల్లెలు 5గురు, వీరు కాక వియ్యంకుడి సైడ్ ఆరుగురు. యింత మంది బలగం. అందరు కాకినాడ లోనే వుంటారు.


శేఖర్ మొదటి కూతురు గర్భం తో పురుడికి వచ్చింది. ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నాడు పిల్లని.

అయితే ఏ పని చేసినా లాభం లేకుండా చేయకూడదు అని అతని సిద్ధాంతం.

అందుకనే భార్య తో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతని భార్య కూడా అదే సిద్ధాంతం అనుసరిస్తుంది కాబట్టి ఒక మంచి రోజున శేఖర్ తన చుట్టాలందరికి ఫోన్ చేసి ‘మా అమ్మాయి మొదటి కాన్పు కి వచ్చింది. అంతా సవ్యంగా జరగాలని మీలాంటి పెద్దల ఆశ్వీర్వాదాలు తీసుకోవాలిని అనుకుంటోంది. కాబట్టి మీరు వీలుచూసుకుని ఏ రోజైన సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంటికి వచ్చి దానిని దీవించండి’ అని చెప్పాడు.


అతని భార్య కూడా తన వైపు చుట్టాలకి ఫోన్ చేసి చెప్పింది. శేఖర్ ప్రతీ రోజూ ఒక అర లీటర్ పాల ప్యాకెట్ తీసుకుని వచ్చి ఫ్రీజ్ లో పెట్టి ఎవరైనా వస్తే టీ ఇవ్వటానికి రెడీ గా వుంచేవాడు.


అతని చుట్టాలందరు మర్యాదస్తులు, అదికాక శేఖర్ కూతురు అంటే యిష్టం కూడా అవటం తో రోజుకు ఒక కుటుంబం, లేక రెండు కుటుంబాలు రావడం, వట్టి చేతులతో వస్తే బాగుండదని, చీర, జాకెట్, పళ్ళు, పసుపు కుంకుమ తీసుకుని వచ్చేవారు.


పాపం నెలలు పెరగటంతో ఆయాసం వలన విశ్రాంతి తీసుకుంటున్న కూతురిని బలవంతం చేసి, వచ్చిన చుట్టాల చేతిలో నాలుగు అక్షింతలు యిచ్చి కూతురిని వారికి వంగి నమస్కరించమనే వాడు.

పాపం ఆ పిల్ల అతి కష్టం మీద వంగి ‘నన్ను దీవించండి పెద్దనాన్న, పెద్దమ్మా’ అంటూ అడిగేది.


ఆ పిల్ల పడే కష్టం చూసి, వచ్చిన వారు, తీసుకువచ్చిన బట్టలు, పళ్ళు వాటిపైన వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా డబ్బు పెట్టి, ఆ నాలుగు అక్షింతలు వేసి దీవించేవారు.

దీవెనలు అయినా అయిదు నిమిషాలకి, టీ వచ్చేది. ఆ టీ తాగి బయట పడే వారు.

ఒక్కొక్క రోజు ఒకరో ఇద్దరో వట్టి చేతులతో రావడం, వాళ్లకి దూరం నుంచే నమస్కారం పెట్టడం, వాళ్ళే వెళ్లి ఆ రెండు అక్షింతలు వేసి, కాసేపు మాట్లాడి వెళ్లిపోవడం జరుగుతో వుండేది.


ఈ విధంగా అటు, యిటు చుట్టాలందరు రావడం పిల్లని దీవించడం, కానుకలు యివ్వడం అయిపొయింది.

మొత్తం కానుకలు హాస్పిటల్ లో పురుడుపోయటానికి అయ్యే ఖర్చు కి సరిపడుతుంది అని లెక్క వేసుకుని, కొడుకుని పిలిచి యిదిగో ఈ డబ్బు వుంచు, చెల్లెలు పురుడు కర్చుకి వాడు అన్నాడు.


‘మీ నాన్న ని చూసి నేర్చుకోరా తెలివితేటలు’ అన్న భార్య ని చూసి మురిసిపోయాడు శేఖర్ తన తెలివితేటలకి.


....... శుభం...

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


Podcast Link


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1618841511596298240?s=20&t=2rXFmWdgp5dLJ2TFhFuXZA



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.

https://www.manatelugukathalu.com/profile/jsr/profile


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










41 views1 comment
bottom of page