top of page
Original_edited.jpg

అతిక్లిష్టమైన అలంకారం

  • Writer: Sudha Vishwam Akondi
    Sudha Vishwam Akondi
  • May 27
  • 1 min read

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #తెలుగుహాస్యకథలు, #అతిక్లిష్టమైనఅలంకారం, #AthiKlishtamainaAlankaram

ree

Athi Klishtamaina Alankaram - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 27/05/2025 

అతిక్లిష్టమైన అలంకారం - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


తొమ్మిదో తరగతి పిల్లలు ఇంకా టీచర్ రాలేదని గోల గోల చేస్తూ కూర్చున్నారు. ఇంతలో తెలుగు టీచర్ వచ్చారు. ఆయన రాగానే పిల్లలు అందరూ సైలెంట్ అయిపోయారు. 


 పిల్లలతో టీచర్ " పిల్లలూ! అలంకారాలు ఎనిమిదో క్లాస్ లోనే చెప్పుకున్నాం కదా! మీకు ఎంత వరకు గుర్తు ఉందో చూస్తాను. ఒక వాక్యం చెబుతాను అందులో ఏ అలంకారం ఉందో టకటకా చెప్పేయాలి" అంటూ

 "లక్ష భక్ష్యములు భక్షించు కుక్షికొక భక్ష్యమొక లక్ష్యమా!" ఇందులో ఏ అలంకారం ఉందో చెప్పుకోండి" అని ప్రశ్నించారు. 

 

అందరూ తర్జనభర్జనలు పడుతున్నారు. 


ఇంతలో ఒక కొంటె విద్యార్థి లేచి. . . 

 "అతిక్లిష్టమైన అలంకారం సార్" అన్నాడు. 


 "అదేమి అలంకారం రా! తప్పు చెబుతున్నావు?" అన్న సార్ తో


 "సార్! ఉగాది పండక్కి మా అమ్మ అభిరుచి ప్రోగ్రాం చూసి, చేసిన ఒక్క భక్ష్యం (అంటే బొబ్బట్లు) తినలేక చచ్చిపోవాల్సి వస్తోంది. మళ్ళీ కొడుతుందేమోనని ఎప్పుడూ భయంతో తింటున్నాను. అలాంటిది లక్ష భక్ష్యాలు ఎవడైనా తింటాడా సార్? అందుకని అతిక్లిష్టమైన అలంకారం అన్నాను" అంటూ వివరించాడు ఆ విద్యార్ధి విచారంగా ముఖం పెట్టి.


 పిల్లలందరూ నవ్వారు. 


 పిల్లవాడి ఈ వివరణ విన్న టీచర్ మాత్రం అవాక్కయ్యాడు. 


మీరూ అవాక్కయ్యారా?

మరి ఇంతకీ ఈ వాక్యం లో ఏ అలంకారం వుందంటారు? అలంకారాలు రెండు రకాలు. . శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఈ వాక్యం ఈ రెండింటి లో ఏ కేటగిరీ లోకి వస్తుంది? ఆ కేటగిరీలో ఏ అలంకారం? చిన్నప్పుడు చదివింది ఆలోచించి చెప్పండి. . . 


 కొన్ని ప్రాంతాల్లో బొబ్బట్లను భక్ష్యాలు అంటారు. కానీ ఇక్కడ వాక్యంలో భక్ష్యం అంటే ఆహారం (తినే పదార్థం) అని అర్థం. ఆ పిల్లవాడు ఆ పదాన్ని బొబ్బట్లకు అన్వయించుకున్నాడన్నమాట. 



ree

-సుధావిశ్వం





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page