పరోపకారం
- Karlapalem Hanumantha Rao
- May 27
- 2 min read
#పరోపకారం, #Paropakaram, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నీతికథలు

Paropakaram - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 27/05/2025
పరోపకారం - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి..
వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి "హెల్ప్,హెల్ప్" అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు..
తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు.. ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు..
"నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి" అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు.. అప్పుడు రైతు "క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, " అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు..
ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,
ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
"అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయ పడుతుంటాడు" అంటాడు రైతు..
"అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు" అంటాడు.
ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు..
పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు,
కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది.. డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు..
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా.. ??
పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త.. అలెగ్జాండర్ ఫ్లెమింగ్.
ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా.. ??
బ్రిటీష్ ప్రధాన మంత్రి.. విన్స్టన్ చర్చిల్
అందుకే అంటారు..
"పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది" అని. !!
అలాగే పాపం కూడా ఊరికే పోదు తరతరాలు వేధిస్తుంది.. !!
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments