top of page

విధి వైపరీత్యం

#VidhiVaiparithyam, #విధివైపరీత్యం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Vidhi Vaiparithyam - New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 23/05/2025

విధి వైపరీత్యం - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


అభినవ్, అనూజ డిగ్రీ చదివే రోజుల్లోనే మంచి స్నేహితులు. అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. తర్వాత ఇద్దరూ బీఈడీ చేశారు. అనుకోకుండా పీజీ కోర్సులు వేరైనా ఒకే విశ్వవిద్యాలయంలో చేరారు. చివరి ఏడాది, ఈ ఆరేళ్ల స్నేహ బంధం కాస్తా ప్రేమ బంధంగా మారింది. ప్రతి రోజూ సాయంత్రం హాజరు కావాల్సిందే, ఊసులాడాల్సిందే. చూసేవారికి అమర ప్రేమికులుగా అగుపించేవారు. కోర్సు అనంతరం వారివారి ఇళ్లకు వెళ్లారు.


రెండేళ్ల తర్వాత అభినవ్ వ్యవసాయం ప్రారంభించాడు. అనూజ డీఎస్సీలో పోస్ట్ కొట్టి ఎస్.జీ.టీ అయ్యింది. ఇక ఇంట్లో మొదలయ్యాయి పెళ్లి అడుగులు.


"అమ్మా! మొన్నేగా ఉద్యోగం వచ్చింది, అప్పుడే అంత తొందరెందుకు?"


 "నీకేం! అలాగే అంటావు. లోకం తీరు నీకు తెలీదులెమ్మా!"


ఇక పెళ్లిళ్ల పేరయితో తల్లిదండ్రులు ముచ్చటించడాన్ని చూసిన అనూజ, అభినవ్ ప్రస్తావన తెచ్చి విషయం చెప్పింది.


"సరే! చిరునామా చెప్పమ్మా. నేను వెళ్లి మాట్లాడి ఖాయం చేసుకోస్తా," అన్నాడు తండ్రి, దీర్ఘ స్వరంతో.


ప్రేమించినవాడే తనవాడవుతుంటే కలిగిన ఆనందంలో ఒక్కసారిగా అనూజ పాత జ్ఞాపకాల్లో ఊగిపోయింది. ఎప్పుడైనా ఒకసారి అభినవ్ రాకపోతే, అనూజ చింతాక్రాంతు రాలయ్యేది. అప్పుడు ఆత్మీయ స్నేహితురాలు శుభ, జిల్జీలంటూ మ్రోగింది అనూజ గుండెల్లోనే ప్రాయం!" అంటూ ఆటపట్టించేది. అభినవ్ తలంపుతో ముసిముసి నవ్వులు చిందిస్తూ తండ్రి రాక కోసం వేచి చూస్తోంది.

"ఏంటబ్బాయి? నీకు ఉద్యోగం సద్యోగం లేదు. మా కూతురు ప్రభుత్వ టీచర్. ఏమెట్టీ పోషిస్తావు?" అని చెడామడా వాయించేసాడు.


 అగ్నిపర్వతంలా మారిన అభినవ్, "ఓహో! మీ కూతురు ఏమైనా అప్సరసా? వెళ్ళండి, వేరే సంబంధం చేసుకోండి," బదులిచ్చాడు ఆవేశంతో.


కొన్ని నెలలు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది. ఒక రోజు అభినవ్‌ను కలవాలని వెళ్లిన అనూజ, నిష్చేష్టురాలయింది. అభినవ్ వేరొక అమ్మాయితో ఏడడుగులు వేస్తున్నాడు.


"అభి! ఎందుకిలా చేశావు? మన ప్రేమకు అర్థం లేకుండా ప్రవర్తించావు?"


 "నీ నాన్న మాటలతోనే మన ప్రేమ బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇప్పుడేం కొత్తగా? వెళ్లు, నీ దారి నువ్వే చూసుకో," అన్నాడు అభినవ్.


తీవ్ర సంక్షోభానికి గురైన అనూజ, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు విషయాల్ని సమూలంగా విశదీకరించి అఖిల్‌కి చెప్పింది. 


"సరే" అన్నాడు అతను.


 రెండేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగారు. రాను రాను అఖిల్‌లో విపరీతమైన మార్పులు. సిగరెట్‌తో ఒళ్ళు కాల్చడం, తాగి తందానాలాడీ, రోజూ కొట్టడం, జీతాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, పిల్లలను సరిగా చూసుకోకపోవడం చేస్తూ వచ్చాడు అఖిల్.


ఒక వైపు భర్త పెట్టే శారీరక యాతన, మరోవైపు మానసికంగా చంపుకున్న ప్రేమ, చేజారిపోయిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమిలి కుమిలి కృంగి, కృశించి, శుష్కించి గుండెపోటుతో గతుక్కుమంది అనూజ.


తన కూతురు సంపాదనలో ఉంది కదా అని అహంకారానికి గురై, ఆమె మనస్సు తెలుసుకోకుండా పెద్దరికం నిలబడాలని ప్రవర్తించిన తండ్రి, కళ్ల ముందే కూతురు వెళ్ళిపోతుంటే — బిడ్డలు తల్లిలేని పిల్లలుగా మిగిలినందుకు తట్టుకోలేక పోయాడు.


స్నేహితురాలు శుభ ద్వారా విషయం తెలుసుకున్న అభినవ్, చిన్నపాటి కోమాలోకి వెళ్లిపోయాడు. ఎక్కడో ఒకక్కడ ప్రియురాలు ఆనందంగా ఉందనుకున్న అభినవ్, ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని నెలలు పట్టింది తేరుకోడానికి.


చిలకా గోరింకల్లా ఉండాల్సినవారు, విధి వైపరీత్యానికి గురై శేషంగా మిగిలిపోయారు.


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


1 Comment


విషాద గాధ. అలా హీరోయిన్ నిస్సహాయంగా చనిపోవడం, దారుణం. ఇది ఈ రోజు కథ కాదని నా నమ్మకం! ప్రార్ధన!

Like
bottom of page