top of page

నెరవేరిన కల

#NeraverinaKala, #Neraverina Kala, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Neraverina Kala - New Telugu Story Written By Palla Deepika

Published In manatelugukathalu.com On 22/05/2025

నెరవేరిన కల - తెలుగు కథ

రచన: పల్లా దీపిక

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



శివపురంలో సునీల్ అనే అబ్బాయి ఉండేవాడు. చిన్ననాటి నుంచి అతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఎప్పుడూ బ్యాట్, బంతి పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. వారంలో ఏడు రోజులు అతడు మైదానంలోనే కనిపించేవాడు. అతడి క్రికెట్ పిచ్చిని అర్థం చేసుకున్న ఆయన నాన్న బాగా ప్రోత్సహించేవాడు. సునీల్ స్కూల్ టోర్నమెంట్‌లలో ఎక్కువగా పాల్గొనేవాడు. అలా ఊర్లో గల్లీ నుంచి మొదలుపెట్టి స్కూల్ టోర్నమెంట్లు, క్లబ్ మ్యాచులు అంటూ జిల్లా స్థాయికి వచ్చేశాడు. అతడిని చూసి టీచర్లు, మిత్రులు అందరూ –

"నీకు క్రికెట్‌లో బంగారు భవిష్యత్తు ఉంది సునీల్," అని అనేవారు.


సునీల్ డిగ్రీ చదివే సమయంలో తండ్రికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఎంత నష్టాలంటే వాళ్లు వారి ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చేంత. ఇంటికి ఆదాయం కావలసిన పరిస్థితి వచ్చింది. దాంతో సునీల్ చదువు, క్రికెట్ రెండూ మధ్యలోనే ఆగిపోయాయి. ఇంటికి సహాయంగా ఉండాలంటే సునీల్ ఉద్యోగం చేయక తప్పలేదు. అలా తను మైదానాన్ని వదిలి ఆఫీసులో కూర్చుని ఫైల్స్ తిప్పడం మొదలుపెట్టాడు. ఉద్యోగంలో చేరాడు కానీ తన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ క్రికెట్ మీదే ఉండేవి.


"సరే, నా జీవితం ఇలా అయింది. నేనైతే సాధించలేకపోయాను కానీ నా కొడుకు నేను అనుకున్నది సాధించేలా చేస్తాను,"అని అనుకున్నాడు.


కొంతకాలం గడిచాక సునీల్ పెళ్లి చేసుకున్నాడు. ముందు కంటే ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. ఒక రోజు సునీల్ ఆఫీసులో పని పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అక్కడే ఉన్న భార్య, సునీల్ చేతికి ఒక చీటి ఇచ్చింది. దానిలో –

"త్వరలో మనమిద్దరం ముగ్గురం కాబోతున్నాం," అని ఉంది.


అది చూసిన సునీల్ ఆనందంతో పులకించిపోయాడు. తొమ్మిది నెలల తర్వాత భార్యను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఆపరేషన్ అయిపోయాక గదిలో నుంచి నర్సు వచ్చి –

"సార్! మీకు పాప పుట్టింది," అని చెప్పి, పాపను అతని చేతిలో పెట్టి వెళ్లిపోయింది.


చాలా ఆనందంతో పాపను తీసుకున్నాడు. కానీ లోలోపల ఏదో చిన్న నిరాశ. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా తను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలనుకున్నాడు కానీ పాప పుట్టింది.


నామకరణం చేసే రోజున ఆ పాప అక్కడున్న పెన్ను, డబ్బు, బంగారం — ఏదీ ముట్టుకోకుండా పక్కనే ఉన్న ఒక రబ్బర్ బాల్‌ను పట్టుకుంది.

అది చూసిన సునీల్‌లో కొత్త ఆశ మొదలైంది.


"అవును... అమ్మాయి ఎందుకు క్రికెటర్ కాకూడదు?" అని అనుకున్నాడు. పాపకు స్నేహ అని పేరు పెట్టాడు.


తన ఉద్దేశాన్ని అనుసరించి, స్నేహకి రెండేళ్లు రాగానే బ్యాట్‌ను చేతికి ఇచ్చాడు. తను బంతిని కొట్టే తీరులో సునీల్‌కి ఏదో ప్రత్యేకత కనిపించింది. ఆమె ఐదేళ్లు అవ్వడానికి ముందు, అతడు ఫ్రీగా ఉన్న టైంలో క్రికెట్ వీడియోలు చూపించేవాడు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా బ్యాటింగ్, బౌలింగ్ బేసిక్స్ నేర్పించేవాడు. మొదట్లో క్రికెట్‌ను ఆటగా చూసిన స్నేహకి, పెరిగేకొద్దీ దాని మీద ఆసక్తి పెరిగింది.


ఆ తర్వాత సునీల్, స్నేహకు మంచి కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ ఇప్పించాడు. క్రమశిక్షణతో మరియు సునీల్ ప్రోత్సాహంతో స్నేహ స్కూల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయికి ఎదిగింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వచ్చింది.


స్నేహ రాష్ట్ర జట్టులో ఎంపికయ్యాక ఆమె ఆడిన తొలి మ్యాచ్‌లో, చివరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాలి. అందరూ మౌనంగా చూస్తున్నారు... స్నేహ బ్యాట్ ఊపిన వెంటనే బంతి బౌండరీలకి దూసుకెళ్లింది. దాంతో వాళ్ల జట్టు గెలిచింది. స్టేడియంలో అంతా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు.


అది చూసిన సునీల్‌కి –

"ఇదే కదా నేను కలలు కన్నది! ఆడా, మగా అనే తేడా లేకుండా ఎవరికైనా కలలు నెరవేర్చే హక్కు ఉంది!" అని గర్వంగా అనిపించింది.


తర్వాత స్నేహ భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.


***

పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక


వయసు: 21


చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్


హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం


నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.

Comments


bottom of page