ఆత్మస్థైర్యం


'Athma Sthairyam' New Telugu Poem

Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


పెను తుఫానులు వచ్చినా

సముద్రాలు పొంగిపొర్లినా

కెరటాలు ఒక్కసారి కింద పడి

అదే వేగముతో పైకి లేవడం లాగే

మనిషి తన బలంతో

జీవితంలో ఒడుదుడుకులకు లొంగిపోకుండా

ఎదురొడ్డి నిలబడడమే ఆత్మస్థైర్యం


ఆశ అనే చేప పిల్ల

ఏటికి ఎదురు ఈదుతూ

తను పెద్ద చేపలకు ఆహారం కాకుండా

ఎదురవ్వ బోతున్న సమస్యల నడుమ

మనోధైర్యమే తన బలంగా

ఎదిరించి జీవించడమే ఆత్మస్థైర్యం


గుండెధైర్యాన్ని తన బలంగా భావించి

చలి అనకా వేడి అనకా మంచు కొండలలో

రాత్రి పగలు సరిహద్దులు కాపాడుతూ

తన మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ

భారతదేశాన్ని అనుక్షణం కాపాడుతున్నాడు మన వీర జవాన్

అతనిలో నిండి ఉన్నది ఆత్మస్థైర్యం


ప్రజలకు అన్నం పెట్టే కర్షకుడు

మోడు బారిన బీడు భూములను

పచ్చటి పంట పొలాలుగా మార్చడానికి

అతనికి ఉన్నది కేవలం ఆత్మ స్థైర్యం.

ప్రతి మనిషి తన బలంతో, ఆత్మ స్థైర్యంతో,

తన ఆత్మవిశ్వాసం పెంచుకొని

మన సస్యశ్యామలమైన భారతదేశ ప్రగతికి

కారణ భూతులు అవ్వాలి.

జై జవాన్! జై కిసాన్

వందేమాతరం

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


https://www.manatelugukathalu.com/profile/velpuri/profile





29 views0 comments