'Avva Puvvulu' New Telugu Story
Written By M. Bhanu
'అవ్వ పువ్వులు' తెలుగు కథ
రచన: M. భాను
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఐదు మూరలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు అవ్వా!” అన్నాడు మురళి. అవ్వ: లేదు నాయనా! ఈ రేటు తగ్గేదేమీ లేదు మురళి: అదేమిటి అవ్వా! కొద్దిగానైనా తగ్గించు ఐదుమూరలు అని చెబుతున్నాను కదా.. అవ్వ “నువ్వు అయిదు మూరలు తీసుకున్నా, పదిమూరలు తీసుకున్నా ఇదే రేటు. తగ్గేదేమీ లేదు. నీకు ఇష్టమైతే తీసుకో. లేకపోతే లేదు” అని మొహమాటం లేకుండా ఖరాఖండిగా చెప్పింది. మురళి చుట్టూ చూసేడు. అందరి దగ్గర ఉన్నాయి గానీ చిన్నచిన్నవిగా పసిరికగా, విడిచి విడవనట్లుగా ఉన్నాయి. కొన్ని వడిలిపోయి ఉన్నాయి. అవ్వ దగ్గర పువ్వులు మాత్రం తాజాగా పెద్దగా బావున్నాయి. ‘ఎంత తాజాగా ఉన్నాయి.. కాబట్టే రేటు తగ్గడం లేదు’ అనుకుని సరే ఏంచేస్తాం.. అవసరం కదా అని “ఇవ్వు అవ్వా!” అన్నాడు అవ్వ అయిదు మూరలు జాగ్రత్తగా కొలిచి పువ్వులు నలగకుండా చక్కగా పొట్లంకట్టి కవర్లో వేసి ఇచ్చింది. అవ్వ అంత సుకుమారంగా పొట్లo కట్టడం చూసి ఆశ్చర్యపోయాడు మురళి. “అవ్వా! పువ్వులు ఎక్కడ్నుంచి వస్తాయి” అనడిగాడు. అవ్వ “నేను ఎవరి దగ్గరా కొనను బాబు, మా ఇంట్లో నా చేతులతో స్వయంగా పూయిoచిన పువ్వులు ఇవి. ఉదయం వేళల్లో కాయగూరలు కూడా అమ్ముతాను. మీరు ఈ ఏరియాకి కొత్తలా ఉన్నారు” అ౦ది బోసినోటితో నవ్వుతూ అవ్వ. మురళి “ అవును అవ్వా! మేము వారం క్రితమే ఇక్కడికి వచ్చాం. మా ఇంట్లో పూజ ఉందని పువ్వుల కోసం వచ్చాను. పువ్వులు చాలా బావున్నాయి. అందుకే అంత రేటు చెబుతున్నావ్” అన్నాడు. మురళి మాట్లాడుతూ ఉండగానే అవ్వ ఎవర్నో పిలుస్తోంది. అవ్వ “ఒరేయ్ కాశీ ఇలా రా! ఈ పువ్వులు పట్టుకెళ్లి మీ ఆవిడకు ఇవ్వు” అని పక్కనే పెట్టిన పొట్లాం తీసి పైన పెట్టింది. కాశీ అన్న అతను ఆ మాటలు విని అవ్వ దగ్గరకు వచ్చాడు. కాశీ “ఎందుకు రోజు పిలిచి పువ్వులు ఇస్తావు.. ?” అని మొహమాట పడుతూ తీసుకున్నాడు. అవ్వ “సరేలే, తీసుకుని వెళ్లు” అని పంపించేసింది. మురళి ఆశ్చర్యంగా చూస్తూ “అదేంటవ్వా? నేను రేటు తగ్గించమన్నా తగ్గించలేదు. అతనికి ఊరికినే ఇచ్చావు” అన్నాడు. అవ్వ “వాడికి కొత్త గా పెళ్ళి అయ్యింది. రోజు కూలి చేస్తాడు. పని ఉన్నప్పుడే డబ్బులు వస్తాయి. కొత్త పెళ్ళానికి పువ్వులు కూడా కొనలేకపోతే ఎలా? కొద్ది రోజులు పోతే ఆ పిల్లే అర్థం చేసుకుoటాది. కొత్త లోనే కోరికలు ఉoటాయి. పువ్వులు కూడా తేలేదు అనే చులకన భావనవస్తే కష్టం కదా! అoదుకే అలా ఇచ్చాను” అoది నిర్మలమైన నవ్వుతో. మురళి అవ్వ ఆలోచనకు మనసులోనే మెచ్చుకుని మరో ఐదు మూరలు కొన్నాడు. అవ్వ “వెళ్లే దారిలో వెoకన్న బాబు గుడిలో ఇవ్వు బాబు” అని చిన్న వెదురుబుట్టలో పూలు ఉoచి ఇచ్చింది. మురళి “రోజూ రెండు మూరలు పక్కన పెట్టు అవ్వా!” అని బుట్ట తీసుకొని గుడి వైపు బయలుదేరాడు అవ్వ వ్యక్తిత్వం తలుచుకొoటూ, . తనకి రేటు తగ్గించలేదని తిట్టుకున్న విషయం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. తగ్గించడానికి ఏమీ లేదు అని అవ్వ మాటలు లీలగా వినపడుతున్నాయి. *** |
M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన.వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.
ధన్యవాదములు 🙏
Comments