top of page

అవ్వతో అనుబంధం

#AvvathoAnubandham, #అవ్వతోఅనుబంధం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #సైనికకథలు

Avvatho Anubandham - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 26/06/2025

అవ్వతో అనుబంధం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


కొన్ని బంధాలు ప్రాంతాలు భాషలతో సంబంధం లేకపోయినా మనుషుల మధ్య మానవత్వం, సుహృద్భావం ఏర్పడితే వారు ఎక్కడ ఉన్నా ఆ అనుబంధాలు వెన్నంటే ఉంటాయి. 

 

నేను సిక్కిమ్ రాష్ట్రంలో రక్షణదళ వైద్య విభాగంలో మేల్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు 'రాంగ్లీ ' అనే చిన్న నేపాలీ గ్రామంలో మా వైద్య శిబిరం ఉండేది. 


దేశ సరిహద్దు ప్రాంతమైనందున మన రక్షణదళ సిబ్బంది రాత్రింబవళ్లు చాలా ఎలర్టుగా పహరా కాస్తూంటారు. 


సిక్కిం రాష్ట్రం ఒకప్పుడు స్వతంత్ర్య రాజ్యంగా చోగ్యాల్ రాజుల పాలనలో ఉండేది. తర్వాత భారత దేశంలో విలీనమై సిక్కిం రాష్ట్రంగా ' గాంగ్ టాక్' రాజధానిగా అవతరించింది. 


 సిక్కిం రాష్ట్రంలో నేపాల్, భూటాన్ నుంచి వలస వచ్చిన కొండ జాతులు గూర్ఖాలు, భుటియాలు చదునైన కొండల మీద తండాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూంటారు. 


ఎత్తైన హిమాలయ సానువుల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లో నాగరిక ప్రపంచానికి దూరంగా నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, కట్టుబాట్లు, అనారోగ్యంతో దుర్భర జీవితాలు గడుపుతూంటారు. 


వారుండే కొండప్రాంతంలో భూమిని చదును చేసి గడులు గడులుగా మెట్ల మాదిరి గట్లు వేసుకుని ఊట నీటిని పొదుపుగా వాడుకుంటూ మొక్కజొన్న, అల్లం, పసుపు వంటి పంటలు పండించి మైదాన ప్రాంతం వారం సంతల్లో అమ్మి దైనందిన అవుసరమైన వస్తువులు, ఉన్నిదుస్తులు వంటివి తెచ్చుకుంటారు. 


మైదాన ప్రాంత పట్టణాలు సిలిగురి, జల్పాయ్ గురి నుంచి వర్తకులు జీపులు చిన్న ట్రక్కుల మీద సంతలకొచ్చి గిరిజనుల నుంచి ముడి సరుకులు చవకగా కొని డబ్బులు బదులుగా వారికి కావల్సిన వస్తువులు అందచేస్తారు. 


ఇక్కడి గిరిజనులు అమాయకులు, కష్టజీవులు, బయటి నాగరిక ప్రపంచం ఎలా గుంటుందో తెలియదు. ఎముకలు కొరికే చలి, మైనస్ డిగ్రీల వాతావరణం ఉంటుంది. వారికి స్నానం చేసే అవకాశం ఉండదు. దంతధావనం ఉండదు. కేశ సంరక్ష ఉండదు. రక్షిత తాగునీటి సౌకర్యం లేదు. కొండ సానువుల్లే పారే ఊటనీటిని తెచ్చి వాడుకుంటారు. కట్టెలు తెచ్చుకుని ఇళ్లలో దాచుకుని వాడుకుంటారు. 


పొగల వల్ల ఊపిరి తిత్తుల వ్యాధులతో బాధ పడుతూంటారు. చిరిగిన చలిబూట్లు, తలకి ఉన్నిటోపీలు, శరీరానికి ఎండ తగలక పాలిపోయి కనిపిస్తారు. 


మా రక్షణ దళ వంటశాలల్లో పనులు, వంటశాలకి కట్టెలు తేవడం, ఘాట్ రోడ్ల మరామ్మత్తు లేబర్ పనులతో దినాలు గడుపుతారు. వంటశాలల్లో మిగిలిన ఆహార పదార్దాలతో కడుపు నింపుకుంటారు. 


ఎక్కువగా అక్కడ ఉండే రక్షణ దళాల మీదే వారి జీవితాలు ఆధారం. సిక్కిం రాజు భారతదేశ ప్రభుత్వ ఒడంబడిక ప్రకారం అక్కడి గిరిజన ప్రజలకు విద్య, వైద్యంలో రక్షణ దళాలతో పాటు వైద్య సదుపాయాలు అందించాలి. 


నేను వైద్య విభాగంలో సీనియర్ మేల్ నర్సుగా విధులు నిర్వహిస్తు న్నందున మా మెడికల్ కేంప్ లో పరిసర నేపాలీ తండాల గిరిజన ప్రజలకు వైద్యం అందిస్తూంటాను. వారిలో ఎక్కువగా రక్తహీనత, దంత ఉదర చర్మ సంబంధ వ్యాధులు ఊపిరి తిత్తుల వ్యాధుల వారే ఉండేవారు. 


ఒకరోజు ఒక నేపాలీ గూర్ఖా తాత కట్టెలు కొట్టేటప్పుడు పొరపాటున కుక్రీ (వాడిగా ఉండే గూర్ఖా కత్తి) తగిలి చేతిమండ సగం తెగి రక్తం కారుతూ మా మెడికల్ కేంప్ కి వచ్చాడు. వెంట అతని భార్య ముసలి అవ్వ సాయంగా వెంట వచ్చింది. 


నేను ముందు అతని చేతి గాయం చూసి భయపడినా మా దగ్గరున్న వైద్య పరికరాలతో రక్తస్రావం ఆపి శుభ్రం చేసి బేండేజీతో కట్టుకట్టి నొప్పి నివారణ మాత్రలు, యాంటీ బయాటిక్స్ ఇచ్చి పంపాము. 


అలా పది రోజుల పైన రోజూ డ్రెస్సింగు చేసి మందులు ఇవ్వడంతో నేపాలీ తాత కోలుకున్నాడు. 


రెక్కాడితేనే కాని డొక్క నిండని బ్రతుకులు వారివి. అడవిలో కట్టెలు కొట్టి రక్షణ దళాల వంటశాలకు తీసుకు వస్తే వారు పెట్టే తిండితో రోజులు గడుస్తూంటాయి. మానవతా దృక్పధంతో మన రక్షణ దళాలు ఆ గిరిజన ప్రజల్ని ఆదుకుంటున్నాయి. 


కొద్ది రోజుల తర్వాత నేపాలీ తాత కోలుకుని తన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. 


మేము నేపాలీ తాతకి చేసిన వైద్య సాయానికి కృతజ్ఞతగా అతని భార్య ముసలి అవ్వ ఏదో ఒక వస్తువు మా మెడికల్ కేంప్ లో ఇస్తూండేది. కాల్చిన మక్క బుట్టలు, దుంపలు, పచ్చి అల్లం, సంత్రాలు వంటి పళ్ళు తెచ్చి ఇచ్చేది. 


ముఖ్యంగా తాతకి నేనే ఎక్కువగా వైద్య సేవ చేసాను కనక ముందుగా నన్నే పిలిచి అందచేసేది. నన్ను ' బేటా బేటా ' అని. హిందీలో సంబోదించేది. 


అందువల్ల మా స్టాఫ్ దూరం నుంచి ముసలిఅవ్వ రావడం చూసి "నీ నేపాలీ మమ్మీ " వస్తోందని హాస్య మాడేవారు. 


కొద్ది నెలల తర్వాత నేను అక్కడి నుంచి మైదానప్రాంతానికి ఉద్యోగ బదిలీ మీద వెళిపోతున్నానని తెలిసి నేపాలీ అవ్వ వచ్చి కళ్లనీళ్లు పెట్టుకుంది. నా కోసం ప్రత్యేకంగా పళ్లూ, పచ్చి అల్లం, పెద్ద ఏలకలు మూట కట్టి చేతిలో పెట్టింది. 


నేను ఆ ప్రాంతంలో ఉన్నది కొద్ది కాలమైనా ఆ అమాయక నేపాలీ గిరిజనంతో వీడని అనుబంధం ఏర్పడింది. స్వంత కుటుంబ సభ్యులకు దూరమవుతున్నంత బాధ కలిగింది. 

 

నా ఈ మిలిటరీ సర్వీస్ అనుభవాలు సుమారు నలబై సంవత్సరాల పైన జరిగినవి.. అప్పటి పరిస్థితుల్ని బట్టి రాసాను. 


ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వల్ల సైనిక దళం, గిరిజన ప్రజల్లో ఎన్నో మార్పులు జరిగి ఉండవచ్చు. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comentários


bottom of page