బాబోయ్.. బాబోయ్ మనుషులు
- Nallabati Raghavendra Rao
- 4 days ago
- 6 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #BaboiBaboiManushulu, #మనుషులు, #TeluguHeartTouchingStories

Baboi Baboi Manushulu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 30/06/2025
బాబోయ్.. బాబోయ్ మనుషులు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఉదయం 9 గంటలు. తూర్పున సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
ఆ వ్యక్తి.. అమర్నాథ్.. సిమెంట్ రోడ్డు మీద తూర్పుగా నడుస్తున్నాడు.. తన గమ్యం చేరడానికి.. అతనికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు.. తూర్పు సూర్యకాంతికి అతని నీడ, అతని వెనుక పడుతుంది.
''ఎవరు నువ్వు?..” అని అడిగాడు.
''నన్నే పోల్చుకోలేకపోయావా.. నీ నీడను. '.. '' అన్నది అతని నీడ.
''అయితే మాత్రం నా వెనుక.. నన్నే అనుసరించి వచ్చే అంత ధైర్యం ఉందా నీకు.. ''
''తప్పటం లేదు మరి.. '' కొంచెం బాధగా చెప్పింది.
'' నాకు ఇష్టం లేదంతే '' తను కోపంగా అన్నాడు అమర్నాథ్.
''నువ్వంటే నాకు కూడా ఇష్టం లేదు. కానీ సృష్టి ధర్మం.. ఇది ఇంతే.. !'' సర్ది చెప్పింది అతని నీడ.
''నాన్సెన్స్.. నీ విధానం మార్చుకో.. ''
''కాస్త ఆగు.. సూర్యుడు నడి నెత్తి మీదకు వస్తున్నాడు గా ఇక నీకు నేను కనబడను. '''. మళ్లీ వినయంగా చెప్పింది అతని నీడ.
''ఇంకెప్పుడూ నా అనుమతి తీసుకోకుండా నా జీవితం లో ప్రవేశించకు.. ఇదే లాస్ట్ వార్నింగ్" చిర్రు బుర్రు లాడుతూ అన్నాడు అమర్నాథ్.
మధ్యాహ్నం అయిపోయింది. నెత్తిమీద సూర్యుడు పడుతున్నాడు కదా.. అందుచేత ఆ నీడ అతని వెనుకగా పడడం కుదరక ఆ నీడ మాయం అయి పోయింది.
కానీ అతని దేహములో ఎవరో తిరుగుతూ గలీజు సృష్టిస్తున్నట్టు అనిపించింది.. '' ఎవరు నువ్వు''
మళ్లీ అడిగాడు. మరింత రెచ్చిపోయిన కోపంతో అమర్నాథ్.
''చెప్పాను కదా నేనే.. నీ నీడ ను. నేను ఇప్పుడు ఉండే ప్రదేశం నీ దేహం లోపల అన్నమాట. ఇది సృష్టి ధర్మం తప్పదయ్య బాబు.. కొంతసేపటి వరకు అంటే సూర్యుడు పడమరకు వెళ్లిపోయే వరకు నేను నీలోపలే ఉంటాను. నువ్వు వద్దు అన్నా కూకలేసినా కుదరదు. అయినా నీకు నేను కనిపించడం లేదు కదా.. ఇప్పుడు. నీకు బాధ ఏమిటి. ?'' ఏ తప్పు చేయటం లేదన్నట్టు చెప్పింది అతని నీడ.
''బాధ కాదు.. నేను ఏది అనుకుంటే అదే జరిగి తీరాలి. మా మానవుల ఉద్దేశం ఇలాగే ఉంటుంది. ఇందాకే వార్నింగ్ ఇచ్చాను కదా మళ్లీ సరాసరి నా దేహంలోనే ఇమిడిపోయావేమిటి?'' కసిగా అడిగాడు అమర్నాథ్.
''అదేమిటయ్యా బాబు చాలా విడ్డూరంగా విచిత్రంగా మాట్లాడుతున్నావ్ ఏంటి.. ఓ రబ్బో.. నీ జోలికి నేను రాలేదు కదా.. నీకు భయపడి దాక్కున్నాను కదా.. ఇదీ తప్పేనా''
''తప్పా తప్పున్నరా.. ?.. ఎక్కడైనా మురికి కుంటలో దాక్కో.. నాలో మాత్రం వద్దు. మనుషులంటే నీకు వేళాకోళం అయిపోయిందా ?.. '' చిరాకు ఎత్తినట్టు అన్నాడు అమర్నాథ్.
''అంత మాట ఎందుకయ్యా బాబు.. ఇంకాసేపు ఆగు.. నీ దేహంలో నుండి బయటకు వచ్చేస్తాను'' కొంచెం ప్రాధేయ పడుతున్నట్టుగానే అంది అతని నీడ.
''ఎంతసేపు.. నీ న్యూసెన్సు భరించలేకపోతున్నాను త్వరగావెళ్ళు'' పిచ్చిగా కేకలు పెట్టాడు అమర్నాథ్.
అతను ఇంకా అలాగే నడుస్తున్నాడు. సాయంత్రం అయ్యింది సూర్యుడు పడమర కి వచ్చి అతని నీడ అతని ముందు కి తూర్పు వైపుకు వెళ్ళి పోయింది.
అమర్నాథ్ కు.. తనకన్నా ముందు తన నీడ.. నడవడం చాలా చిన్నతనం అనిపించింది.
''ఇంత బ్రతుకు బ్రతికీ.. ఆఫ్ట్రాల్ నా నీడ అయిన నువ్వు నాకు దారి చూపిస్తే నేను నడవడం ఏమి టి?.. నన్ను వేళాకోళం చేస్తున్నావా.. కాసేపు నాకన్నా ముందు మరి కాసేపు నా లోపల.. ఇప్పుడు నా కన్నా ముందు కుప్పిగంతులు వేస్తున్నావా. తికమక పెడు తున్నావు.. అసలు ఏమిటి నీ ఉద్దేశం.. అసలు.. నీ గోల్ ఏమిటి ?'' అక్కడే ఆగి నీడను ప్రశ్నించే అడిగాడు అమర్నాథ్.
''అదే నేను అడుగుతున్నాను. '' తను కూడా ప్రశ్నించింది నీడ.
''డామిడ్.. నోరు లెగుస్తుందేిమిటి. నేను నీ మీద చర్య తీసుకోకముందే.. నా జీవితంలో నుంచి నువ్వు పోవాలి. '' బాకుతో పొడిచేయాలనంత కసిగా అన్నాడు అమరనాథ్.
''నాయినా కంగారు పడకు.. అదే నీ కోరిక అయితే అలాగే వెళ్ళిపోతాను. '?'' చివరికి తను భయపడు తూనే చెప్పింది నీడ.
''నీ మాట నాకు నమ్మకం లేదు. అదే మాట మీద నువ్వు నిలబడగలవా ?'' రూల్ గా అడిగాడు అమర్నాథ్.
''మనుషులే బాబు మాట తప్పేది. ఇంకెవరు మాట తప్పరు. '' విసవిసలాడుతూ ఉంది నీడ.
''మరి నిలబెట్టుకో ఇంకా ఆలస్యం దేనికి.. ?''
రెట్టించి అన్నాడు అమర్నాథ్ తన నీడతో.
''ఇంకో పది అడుగులు.. వెయ్.. స.. రి.. పోతుంది''
మనిషికి ఏదో అన్యాయం చేస్తున్నా నేను అన్నట్టు
బాధపడుతూనే చెప్పింది నీడ అతనితో.
అమర్నాథ్.. మరో పది అడుగులు వేశాడు..
ఆ పది అడుగుల దూర ప్రాంతంలో పనివాళ్ళు రిపేర్ కోసం తెరచి ఉంచిన పెద్ద మెన్ హోల్లో కూరుకు పోయాడు.. నిట్టనిలువుగా అమర్నాథ్.
అతని నీడ ఇచ్చిన మాట నిలబెట్టుకుoది..
'.. ఇప్పుడు.. అతనూ ' లేడు అతని ' నీడా '.. లేదు.. ఫినిష్ !
అమర్నాథ్.. అమరుడు కాలేదు.. అసురడై.. యమలోకం ప్రయాణం అయ్యాడు.
''వెళ్తున్న అమర్నాథ్ ని చూసి దూరంగా ఉండి చాయా మాత్రం గా కూడా కనిపించడానికి వీలులేని అతని ''నీడ''.. ఇలా అంటుంది.. నవ్వుతూ”'
''బుల్లోడా.. నేను ఎంత చెప్పినా విన్నావు కాదు. నీ కోరిక తీరిందా.. మీ మనుషులతో ఇదే వచ్చిందయ్యా బాబు చిక్కు. మీరు బ్రతకరూ ఇంకొకళ్లను బ్రతక నివ్వరు.. చి చి. బ్రహ్మదేవుడు మీకు నీడగా ఉండే పని నాకు అప్పజెప్పాడు కనుక తప్పటం లేదు. లేకుంటే మీతో ఒక్క నిమిషం కూడా నేను సాగలేదు. మళ్లీ జన్మంటూ ఉంటే మనుషులకు నీడగా ఉండే పోస్టు ఇవ్వద్దని ఆ దేవుని కోరుకుంటాను.. ''
కొంచెం బాధ పడుతూనే పడుతూనే నిష్క్రమించింది కనిపించడానికి వీలులేని అతని ''నీడ''.
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments