top of page

బాలచంద్రోదయము

#ChavaliBalakrishnaveni, #చావలిబాలకృష్ణవేణి, #Balachandrodayamu, #బాలచంద్రోదయము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఉత్పలమాల


Balachandrodayamu - New Telugu Poem Written By  - Chavali Balakrishnaveni

Published in manatelugukathalu.com on 19/06/2025 

బాలచంద్రోదయము - తెలుగు కవిత

రచన: చావలి బాలకృష్ణవేణి


ఉత్పలమాలాలంకృతము...

🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸


పన్నగ శాయి! శ్రీ హరి! ప్రభాతము నయ్యె అయోధ్య రామ! నీ

కన్నుల జూఁడు మమ్ముల వికాసము నీయఁగ చిత్తమందు మా

కన్నుల గాంతివీవె ఘన గాత్ర! వికుంఠ విరాజరాజ! యో

చెన్నుడ! రావణారి! తలి చెంతన నిల్చెను నీదు సేవకై

మున్నుగ ముద్దులీయుచు, విబూదిని సౌఖ్యపు మోక్ష మీయరా! 

వెన్నెల సోన నీముఖము వేకువ ఝామున వెల్గుచున్నదే! 

మిన్నున వేచె దేవతలు మేలిమి సీతయె చొప్పడంగ ని

న్నెన్నగ మా తరంబ! ఘనమెవ్వని కీర్తిని దానవారినిన్! 

వెన్నున నాటలాడుమయ ప్రేమకు నీ ప్రతి సాటిలేరయా! 

హొన్నుమనంబు నీది చని, యూయల లూగర తల్లి చేలమున్

వన్నెల తోయజాక్షిఁగను భాగ్యము ముందల నుండెరాఘవా! 

పెన్నిధి నీవె ప్రోచు నరివీరభయంకర! రాజశేఖరా! 

కిన్నెర సాని సోయగము కింకర పోషక! సీత వాల్జడన్! 

నన్నుల మిన్న జానకియె ! యాపద గూల్చెడి ధర్మరక్షకా! 

చెన్ను మొగంబుఁ దీనజన శ్వేతపు  చిత్త మనోభిరాముడా

పన్నుల జీవదాత! వెసఁ బ్రార్ధన లేలర బాలచంద్రుడా! 

దన్నుగ నాంజనేయు నిను త్రాతగ గొల్చుచు నీడనుండగా

పున్నెము నిన్నుజూఁడ రఘుపుంగవ! గౌతమ పత్ని పోష! నే

నన్నము పానముల్ విడచి  యార్తిని యాదవ పూజితా! నినున్

దిన్నగ జేరుకుందు గను! తాటక మర్దన! భక్తి భావమే

నన్ను, నినున్ విభూదియడగంగను నీ వర మీయు మయ్య సం

పన్నుల యందు జూచు పని వద్దు యనన్,సుర సేవితా! ప్రజా 

సన్నుత! జంగమాగమము సద్హృదయాంగము శాశ్వతమ్ముగా

చెన్నుగ నీదు జూడ్కులకు జిత్తము సిధ్ధము నెల్లవేళలన్ 

వన్నెల జానకీ లలన వైభవ మందున వెల్గు చుండ నీ

కిన్ని వసంతరాత్రులివి యిద్దరి మధ్యన ప్రేమపెంచెనే 

ఇన్నియు జెప్పి యుంటి గొను మింకను మంగళ శాసనంబు మీ 

కన్నువ బెంచు, జంట గని హారతి నిత్తురు సర్వదేవతల్!! 


🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏


✍️చావలి బాలకృష్ణవేణి 


చావలి బాలకృష్ణవేణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చావలి(బులుసు) బాలకృష్ణవేణి


జననము.. రాజమహేంద్రవరము

చదువు ::BA, Hindi pandit,

అభిరుచులు..శ్రీ . నన్నయ కవీశ్వరుడు తిరుగాడిన గోదావరీ తీరప్రాంత బాల్యము వలన కలిగిన తెనుఁగు భాషామతల్లికి ఇతోధిక సేవ చేయుట యందు అమితమైన ఆసక్తి

తద్వారా పద్యవిద్య గ్రహించుట..

సాహిత్య ప్రవేశము....


మద్గురువులు శ్రీ అనంతఛందము స్థాపకులు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రమణ్య శర్మ గురువుగారి వద్ద పద్య విద్యలో మెళుకువ లు గ్రహించి..

వారి వద్ద సుమారు 100పైన వివిధ సంకలనములలో వృత్తములు వ్రాయుట.

శ్రీ తోబాసు గురువుగారు వ్రాయించిన శ్రీమద్రామాయణ తేటగీతి ఆంధ్రీకరణలో భాగముగా 3సర్గ ల 2000 వరకూ పద్యములు..

శ్రీ తోబాసు గురువుగారి ప్రోద్బలముతో వివిధ ఛందములలోఅనంత శతసహస్రఛందస్సౌరభము. అనే ఉద్గ్రంధములో 100 వృత్తములు, 100 ప్రముఖుల కవీశ్వరులతో వ్రాయుట వివిధ అనేక ముఖపుస్తక కూటమిలో అనేక కవితా ప్రక్రియలో ఏక్తార.. నానీలు. కవితలు. కధానికలు గజల్స్. అన్నియు వ్రాసి. బహుమతులు పొందుట.. మరికొన్ని అంతర్జాతీయ సంస్థలకు కవితలు కధలు... పద్యములు.. శీర్షికలు వ్రాయుట.. బహుమతులందుకొనుట


స్వయముగా. *శివస్తుతి త్రిశతి*పుస్తకరూపమేర్పడినది.


శ్రీ.. వీరభద్రోదాహరణకావ్యము కూడా.. ప్రచురితమైనది..

బాలకృష్ణబాలలీలలు

శతకము

శ్రీ మార్కండేయోదాహరణము కావ్యము

దేవీ అంతముగా వందల ఛందములలో అనేక వృత్త సంచయములు వ్రాయుట జరిగినది. ఇవన్నియు అముద్రితములు

అనంతఛందమునకు నానీస్ మహతీ ఛానల్

మొదలగు అనేక సంస్థల ద్వారా ప్రముఖులగు అనేక అవధాన వర్యులకు ప్రాశ్నికురాలిగా చేయుట జరిగినది... 🌹🌺☘️ మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments


bottom of page