బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- Neeraja Prabhala

- 4 days ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #BalalaDinotsavaSubhakankshalu , #బాలలదినోత్సవశుభాకాంక్షలు

Balala Dinotsava Subhakankshalu - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 14/11/2025
బాలల దినోత్సవ శుభాకాంక్షలు - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
పసి బాలలం- భావి భారత పౌరులం.
ఉజ్వల భవిత మాది.
ఉత్తేజ తేజస్సు మాది.
ఉత్సాహంతో కూడిన బాధ్యత మాది.
ఉన్మాదం లేని వివేకం మాది.
ధైర్యంతో కూడిన అడుగులు మావి.
స్వార్ధరహిత గుణాలు మావి.
ఆలోచన -ఆకర్షణ మా సొంతం.
ఆనందం- ఆహ్లాదం మా నైజం.
గత చరిత్ర ఆవేదనతో కూడిన బాధ మాది.
వివేకంతో కూడిన ఉజ్వల దేశభవిష్యత్తు మాది.
దేశ భవిత ప్రగతికి మేమే ఆశాజ్యోతి.
ఆర్ధిక స్వావలంబన మా ధ్యేయం.
పేదరిక నిర్మూలన మా ఆశయం.
కులమతాల వివక్షనరికడదాం.
లింగవివక్షని పారద్రోలుదాం.
కదలిరండి, కదలిరండి అందరూ మన దేశ ప్రగతికి.
ఐకమత్యతో కలసి నడుద్దాం ఉజ్వల భవిష్యత్తుకి.
ప్రపంచ పటం అభివృద్ధిపథంలో అగ్ర పీఠం మన దేశానికే.
దశదిశలా చాటుదాం మన దేశ కీర్తి ప్రతిష్టలను.
కులమతాల వివక్షనరికడదాం.
భరతమాతకు పట్టుబట్టకట్టి గౌరవిద్దాం.
ఆ తల్లి నుదుటన విజయ సింధూరం తీర్చిదిద్దుదాం.
బాధ్యతతో మన దేశాన్ని మనం కాపాడుకుందాం.
దేశమంటే మట్టి కాదోయ్.
దేశమంటే మనమేనోయ్.
హమారా హిందూస్థాన్ -
మేరాభారత్ మహాన్.
…..నీరజ హరి ప్రభల.

-నీరజ హరి ప్రభల




Comments