top of page
Original.png

బామ్మ తెలివి



Bamma Thelivi - Telugu Comedy Story Addanki Lakshmi

బామ్మ తెలివి - తెలుగు  హాస్య కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 10/04/2026

 

పెళ్లిళ్లు కేవలం రెండు మనుషుల కలయిక కాదు…రెండు కుటుంబాల మధ్య నిజాలు, అబద్ధాలు బయటపడే సందర్భాలు కూడా.

బామ్మ తెలివి అనే ఈ కథలో, పెళ్లి చూపుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఎలా పెద్ద మలుపు తీసుకుందో, చివరికి ప్రేమ, అంగీకారం గెలిచిన విధానం మనం చూస్తాం.

ఇది సరదాగా సాగిన కథ అయినా…లోపల ఒక మంచి సందేశం దాగి ఉంది.

పెళ్ళికొడుకు పేరు రాజు.

20 సంవత్సరాలు ఉంటాయి. బామ్మ పేరు మంగమ్మ.

కోడలు మనవడిని కని, పురిటిలోనే చనిపోయింది.


కొడుకు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు.

హఠాత్తుగా అనారోగ్యం పాలై కొడుకు పోయాడు.


బామ్మ మంగమ్మ మనవడిని కష్టపడి గారంగా పెంచుకుంది. బామ్మ మహా తెలివైనది.

పొలం మీద వచ్చిన ఆదాయంతో ఇద్దరూ తిండికి, బట్టకి కొదవ లేక గడుపుతున్నారు.


రాజు పదవ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు.


"ఎందుకొచ్చిన చదువులు రా! హాయిగా పొలం పనులు చూసుకో!" అంది బామ్మ.


ఇంక చదువు గొడవ వదిలిందని హాయిగా పొలం పనులు చూసుకుంటున్నాడు రాజు. పొద్దున్నే పొలంలోకి వెళతాడు, పొలం పనులు చేయిస్తాడు. బామ్మ గారంగా చూసుకుంటుంది. చీకూచింతలేక హాయిగా గడిపేస్తాడు.


వయసు వచ్చింది కదా, మనవడికి పెళ్లి చేద్దామని ఆశ బామ్మకు.


మొదలయ్యాయి పెళ్లి చూపుల తతంగం.


ఆరోజు పక్క ఊర్లో పెళ్లి వారి ఇంటికి వచ్చారు పెళ్లి చూపులకు.


పెళ్లికూతురు పేరు రాణి. పదహారేళ్లు ఉంటాయి.


చూడ్డానికి అమాయకంగా, అందంగా ఉంది.

తండ్రి సత్తయ్య, తల్లి సత్తెమ్మ. లేకలేక పెళ్లయిన పది సంవత్సరాలకు పుట్టింది. ఆడపిల్ల అపురూపం.


పెళ్లి చూపులు అంటే పల్లెటూర్లో ఇరుగుపొరుగు పిల్లా, పెద్దా అందరూ వచ్చేసారు. ఎంతో హడావిడి.


బామ్మ మాత్రం ఏం తక్కువ? దూరపు చుట్టాలని ముగ్గురిని వెనకేసుకు వచ్చింది పెళ్లి చూపులకు.


"బామ్మ గారు రండి" అంటూ లోపలకు తీసుకెళ్లారు సత్తయ్య, సత్తెమ్మ.


    పెళ్లి వారిని మర్యాదగా కూర్చోబెట్టారు.

 పెళ్లి కొడుకు చూడ్డానికి అందంగా ఉన్నాడు.


రాగానే సకల మర్యాదలు చేశారు.

స్వీట్లు, లడ్డు, మినప సున్ని, కారం బూంది పెట్టారు.

వేడివేడి చాయ్ ఇచ్చారు.


"పెళ్లికూతుర్ని తీసుకురా అమ్మా!" అంది బామ్మ.


సత్తెమ్మ కూతుర్ని తీసుకువచ్చి చాప మీద కూర్చోబెట్టింది. 

బామ్మ పక్కనే కూర్చుంది. అమ్మాయి ముఖాన్ని ఇటు  అటూ తిప్పి చూసింది. మెల్ల కన్ను లేదు కదా అనుకుంది,


"ఏమ్మా, నీ పేరేమిటి?" అంది.

 రాణి సిగ్గుగా తలవంచుకుంది. 


పక్కనే ఉన్న పిల్ల

"మా అక్క పేరు రాణి!" అంటూ అరిచింది.


"ఏమి చదువుకున్నావే?" అని అడిగింది బామ్మ.


"మా అక్క ఐదో తరగతి ఫెయిల్ అయింది." అక్కడే పక్కన కూర్చున్న ఇంకో పిల్ల.


"ఏమిటి? మీ పిల్లకి మాటలు రావా, మంగమ్మా?" అంటూ అడిగింది బామ్మ.


"ఎందుకు రావూ? సిగ్గు," అంది సత్తెమ్మ.


"మీ మనవడు పెళ్ళికొడుకు ఏం చదువుకున్నాడు ఏం బాబు?" అని అడిగాడు

సత్తయ్య


"ఆ! చదువుకున్నాడు. 10వ తరగతి వరకు." అంటూ సమాధానం చెప్పింది బామ్మ.


"ఏరా, నీకు పిల్ల నచ్చిందా?" అని అడిగింది బామ్మ.


పిల్లాడు పిల్ల వంక చూసి నవ్వుకుంటూ "ఊ..." అన్నాడు.


పెళ్లి కూతురు రాణి కూడా రాజు వంక చూసి మురిపెంగా నవ్వింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. 

హృదయాలు మాట్లాడుకున్నాయి.


"అయితే కట్నకానుకలు తర్వాత మాట్లాడుకుందాం.

50,000కి కట్నం తగ్గేది లేదు!" అని కరాఖండీగా చెప్పింది బామ్మ.


"సరే, మంగమ్మ గారు! మేము పిల్లకి బంగారం అది పెట్టలేము. పెళ్లి బాగా చేస్తాము," అన్నాడు సత్తయ్య.


సరే అంటూ ఒప్పందం చేసుకుని బామ్మతో పాటు వచ్చిన వాళ్ళు శుభమంటూ వెళ్లిపోయారు,


నెల తిరిగేసరికి మంచి ముహూర్తం కుదిరింది.

ఇంక పెళ్లి హడావిడి మొదలైంది.

మగ పెళ్లి వారందరూ బస్సు వేసుకుని ఆడపిల్ల వారింటికి వచ్చేసారు,


ఇల్లంతా మామిడాకుల తోరణాలు, ముంగిట్లో ముత్యాల ముగ్గులు. ఆడపిల్ల వారింట్లో స్నేహితులు, బంధువులు.


పెళ్లి వారు వచ్చేసారు.

సన్నాయి మేళం,

ఇరుగుపొరుగు సందడి.


 అయ్యగారు వచ్చి

ముహూర్తానికి చక్కగా పెళ్లి చేశారు వధూవరులకు.

పెద్దలందరూ అక్షింతలు వేశారు, ఆశీస్సులు పలికారు.


పిల్లాపాపాతో పదికాలాలపాటు సుఖంగా ఉండాలని పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ని దీవించారు.


ఇంక పెళ్లి కూతుర్ని, పెళ్ళికొడుకుని గడప దాటించాలి. వారిద్దరూ ఒకరి చేయి పట్టుకుని ఒకరు ఉంటారు. వెనకాల ఆడపిల్ల వారి, మగ పెళ్లి వారి తరపున అమ్మలక్కలందరూ చేరుతారు.


అక్కడ ఒక ముచ్చట ఉంటుంది ,

పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఒకరి పేర్లు ఒకరు చెప్పాలి.

అప్పుడే గడప దాటిస్తారు,


బంధువులందరూ చేరారు సందడిగా.

ఆడపిల్ల వారి తరఫున, మగ పెళ్లి వారు తరఫున పిల్లలందరూ, పెద్ద వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొంటారు.


ఆడపిల్ల తరపు పెళ్ళివారు పెళ్ళికొడుకుని ముందు చెప్పమంటారు వధూవరుల పేర్లను.


మగ పెళ్లి వారి బంధువులు అల్లరి చేస్తూ పెళ్లికూతురుని ముందు వారి పేర్లు చెప్పమంటారు,


ఆడపిల్ల తరుపు వాళ్ళ బంధువులు ఒప్పుకోరు. ముందు పెళ్ళికొడుకునే చెప్పమంటారు


"ఒరేయ్ రాజు, ఇంక నీ పెళ్ళాం పేరు చెప్పరా!" అంది బామ్మ.


"నే...నే...నే...నే...రాజు. నా...నా...నా...నా భార్య రా...రా...రా...రాణి వచ్చాము!" అన్నాడు రాజు సంతోషంగా.

వచ్చాము అన్నాడు రాజు  సంతోషంగా,


అప్పుడు వాడి అసలు వ్యవహారం తేలిపోయింది. వాడికి నత్తి.

అక్కడున్న ఆడ పిల్లల బంధు జనాలకు అందరికీ ఆశ్చర్యమేసింది,


"ఏమిటి? మీ పిల్లాడికి నత్తి? ఎందుకు ముందు చెప్పలేదు?" అంటూ సత్తెమ్మ విరుచుకుపడింది బామ్మ మీద.


"ఇప్పుడు మీ పిల్లని చెప్పమను, అప్పుడు తేలుస్తా!" అంది బామ్మ.


 పక్కనే ఉన్న దాని బంధువుల  పిల్ల

"మా రాణికి మాటలు రావు గా! మూగి పిల్ల!" అంటూ అరిచింది గట్టిగా.


  పెళ్లికూతురు ముసిముసిగా నవ్వుకొంది,


బామ్మ కి ఒళ్ళు మండిపోయింది. 

 

"ఎంత మోసం! ఎంత మోసం! నన్నే మోసం చేస్తారా? మీ పిల్లకి మాటలు రావు! మూగి పిల్లని మా మనవడికి అంటగడతారా?" కోపంతో ఒళ్ళు మండిపోయింది.


"ఏం? మీరు మాత్రమే తక్కువా?" అంటూ అరిచింది మంగమ్మ. పెళ్లికూతురు తల్లి, చుట్టాలందరూ వింతగా చూస్తున్నారు.


"మీ పిల్ల మాకు అక్కర్లేదు! విడాకులు ఇస్తాము!" అంది బామ్మ మండిపడుతూ.


"మా కట్నం డబ్బులు మాకు కక్కండి!" అన్నాడు వెంటనే సత్తయ్య.


పక్కనున్న పెళ్లి బంధువులందరూ ఇద్దరికీ నచ్చ చెప్పారు,


"పెళ్లి అయిపోయింది కదా! ఎలాగో సర్దుకోండి. ఎందుకు వచ్చిన గొడవలు?

ఇంతకన్నా మంచి మంచి సంబంధాలు మీ పిల్లలకి రావు కదా!

ఇద్దరికీ లోపాలు ఉన్నాయి. పెద్దవాళ్లు మీరు సర్ది చెప్పుకోండి," అంటూ బంధు మిత్రులు పెళ్లి వారికి సర్ది చెప్పారు.


అక్కడితో ఆ సందడి ముగిసింది,

పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మాత్రం ఆనందంగా ఉన్నారు. వారికి ఏ గొడవలు ఏం పట్టడం లేదు.


తమకు లోపం ఉంది కదా, ఎలా పెళ్లవుతుందా అని వాళ్ళకి భయం. పెళ్లి జరిగిందని ఎంతో ఆనందం.


"బా...బా...బా...బామ్మ, నాకు రాణి అంటే ఇష్టమే. నేను దానికి విడాకులు ఇవ్వనే. అదే నాకు భార్య. మూగపిల్ల అయినా నాకు పర్వాలేదు. నాకు కూడా మాటలు సరిగా రావు కదా," అంటున్నాడు రాజు, బామ్మకి నచ్చజెప్పుతూ.

 

పెళ్లికూతురు రాణి పెళ్ళికొడుకుని చూసి ముసిముసిగా నవ్వుతోంది.


"పదండి పదండి! భోజనాలు వడ్డించారు!" అంటూ తొందర పెట్టారు బంధు జనాలు.


  అక్కడితో ఆ పెళ్లి గోల సద్దుమణిగింది,,


పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు హాయిగా ఆనందంగా సంసారాన్ని సాగించారు.



***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page