ప్రేమలేఖ
- Penumaka Vasantha

- 1 hour ago
- 3 min read
ప్రేమలేఖ, తెలుగు ప్రేమకథ, కాలేజీ ప్రేమ, ప్రేమలేఖ కథ, సుందరి, సుబ్బారావు, ప్రేమలో అపార్థం, Romantic Telugu Story, Love Letter Story, Emotional Telugu Story, Telugu Short Story, College Love Story, Telugu Love letter

Premalekha - Telugu Emotional Love Story | Penumaka Vasantha
ప్రేమలేఖ - తెలుగు భావోద్వేగ ప్రేమ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 16/07/2026
ప్రేమలో మాటలు చెప్పకపోయినా భావాలు నిజాయితీగా ఉంటాయి. కానీ ఒక్క చిన్న అపార్థం జీవితాలను దూరం చేస్తుంది. "ప్రేమలేఖ" కథలో ఒక పాత ఉత్తరం, రెండు మనసుల మధ్య ఏర్పడిన అపార్థాన్ని తొలగించి ప్రేమను విజయవంతం చేస్తుంది. ప్రేమ, గౌరవం, కుటుంబ విలువలను అందంగా మిళితం చేసిన హృద్యమైన కథ ఇది.
అది ఇంకా ఈ సెల్ ఫోన్లు రాని కాలం. అప్పుడు కాలేజీలో అబ్బాయిలు, అమ్మాయిలు కేవలం కాగితాల మీద తమ ప్రేమను వ్యక్తం చేసుకునే వారు.
అలాంటి ప్రేమ కథే మన సుందరి, సుబ్బారావుల ప్రేమ కథ. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు. అనగనగా ఒక అమ్మాయి, ఈ సుందరి. పెద్ద కళ్ళతో, పెద్ద జడతో ఎంతో అందంగా ఉండేది. అసలే బాపు సినిమాలన్నా, బాపు కార్టూన్లన్నా ఇష్టపడే మన సుబ్బారావుకు సుందరి అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది.
అదంతా ఉత్తరాలపై చూపెట్టి ఒకరోజు సుందరి వస్తుంటే తన చేతికి ఇచ్చాడు. అది తీసుకోకుండా అక్కడనే వదిలేసింది సుందరి. సుబ్బారావుకు చాలా కోపం వచ్చింది. ఈ కాలేజీలో అందగాడిని, డబ్బున్నవాడిని అయిన నన్ను అవమానించింది అని, ఎలాగైనా తనని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
అయినా సుందరి సుబ్బారావును పట్టించుకోలేదు. ఇక సుందరి గురించి పట్టించుకోవద్దనుకున్నాడు సుబ్బారావు. కానీ మనసులో సుందరి మీద ప్రేమ అలాగే ఉంది.
కాలేజీ అయిపోయి ఉద్యోగం వెతుక్కున్నాడు సుబ్బారావు. కాలేజీలో జూనియర్ వెంకట్ వచ్చి సుబ్బారావును బుక్స్ అడిగాడు. ఆ బుక్స్ తీసుకుని వెంకట్ చూస్తుంటే, పాత లేఖ ఒకటి అతని చేతిలోకి వచ్చింది. "బ్రో, ఏదో కాగితం!" అంటూ ఇచ్చాడు. ఏంటని చూశాడు సుబ్బారావు. అది సుందరి తనకు రాసిన ప్రేమలేఖ.
ఆశ్చర్యపోతూ కూర్చుని చదివాడు. "డియర్ సుబ్బు, నువ్వంటే నాకు ఇష్టమే. కానీ మన ప్రేమ అందరికీ తెలియాలని లేదు. ఆడపిల్ల జీవితం ప్రేమించిన వ్యక్తితో జరిగితే పర్లేదు. అదే జరగకపోతే ఆమెకు సమాజంలో ఎలాంటి గౌరవం ఉండదు. మీకు ఏమవ్వదు; మగవాడు అనే దానిలో మీరు ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు ఉద్యోగం తెచ్చుకుని మా ఇంటికి వచ్చి మా వాళ్ళని అడిగితే, వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను."
సుందరి తనను పట్టించుకోవటం లేదని తన మీద కోపం పెంచుకున్నాడు. అది ఒక చిన్న అపార్ధమే. "కానీ ఎలా? ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను" అని నిశ్చయించుకుని వెంటనే సుందరి ఇంటికి వెళ్ళాడు సుబ్బారావు.
ఇంట్లో చుట్టాలతో ఇల్లు కళకళలాడుతోంది. అయినా లోపలికి వెళ్ళాడు. సుందరి వాళ్ళ నాన్న అప్పారావు "ఎవరు బాబు నువ్వు?" అన్నాడు.
"నేను మీ అమ్మాయి క్లాస్ మేట్ ని. సుందరి ఉందా?" అని అడిగాడు.
"ఉంది, ఇవాళ మా అమ్మాయికి ఎంగేజ్మెంట్. ఆ హడావుడిలో ఉంది. ఏమన్నా చెప్పాలా తనతో?" అని అప్పారావు అన్నాడు.
"తనతో కాదు, మీతోనే మాట్లాడాలి" అన్నాడు సుబ్బారావు. "మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నాకు కట్నం వద్దు. మీరు ఇష్టపడితే తనని పెళ్లి చేసుకుంటాను."
"సుందరీ..!" అని గట్టిగా కేక పెట్టాడు అప్పారావు. సుందరి బయటకు వచ్చింది. సుబ్బారావును చూసి సుందరి మొహం విప్పారింది.
"ఏంటి, ఇతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు? కాలేజీకి పంపిస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా?" అంటూ సుందరిని తిట్టిపోశాడు.
"ఏమండీ, మీ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, నేనే ప్రేమించాను. సుందరీ, నాకు ఉద్యోగం వచ్చింది. నిన్ను నేను చూసుకోగలను, నాతో వస్తావా?" అని సుబ్బారావు అడిగాడు.
"వస్తాను, కానీ మన పెద్దల అంగీకారంతో ఒకటవుదాం" అంది సుందరి.
సుందరి, సుబ్బారావులు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ పాత ప్రేమలేఖ వల్ల నిజం తెలిసి ఇద్దరూ ఒకటయ్యారు.
సమాప్తం
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.










Comments