top of page
Original.png

రామయ్య కథ

57 minutes ago
2 min read

పేదరికాన్ని అధిగమించి కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న రామయ్య కుటుంబం

Rammaya Katha - Telugu Moral Story | Arundhathi

రామయ్య కథతెలుగు నీతి కథ | అరుంధతి

Published in manatelugukathalu.com on 10/09/2026


“రామయ్య కథ” ఒక కుటుంబం పేదరికం, అప్పులు, పంట నష్టాలు వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ధైర్యం మరియు కష్టంతో తిరిగి జీవితంలో నిలదొక్కుకున్న కథ. కష్టాలను చూసి వెనుకడుగు వేయకుండా నిరంతరం ప్రయత్నిస్తే విజయాన్ని సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని ఈ తెలుగు నీతి కథ అందిస్తుంది.


అనగనగా రామాపురం అనే ఊరు. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి రాజు, లక్ష్మి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా పేదవారు. వారికి ఒక పొలం, ఒక ఆవు మాత్రమే ఉన్నాయి. రామయ్య, సీతమ్మ రోజంతా పొలంలో పని చేసి సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చేవారు. వాళ్ళు వచ్చే సమయానికి పిల్లలు కూడా బడి నుంచి వచ్చేవారు. రాత్రి అందరూ సంతోషంగా భోజనం చేసి ప్రశాంతంగా పడుకునేవారు.


​ఒకరోజు రామయ్యకు ఒక పెద్దమనిషి కనిపించి, "ఏంటి రామయ్య, నువ్వు ఎప్పటికీ ఇలాగే పేదరికంలో ఉండిపోతావా? జీవితంలో పైకి రావాలని లేదా! నీ దగ్గర ఒకే ఆవు ఉంది కదా, దానికి తోడు ఇంకో ఆవును కొనుక్కో. రెండు ఆవుల పాలు అమ్మి, వచ్చిన డబ్బుతో పెద్ద ఇల్లు కట్టు. పిల్లలను బాగా చదివించి, పెళ్లిళ్లు చేయి" అని సలహా ఇచ్చాడు. రామయ్య సరేనని ఆ విషయాన్ని సీతమ్మతో చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ వెనుకాముందు ఆలోచించకుండా, తమ దగ్గరున్న డబ్బులు, నగలు ఇచ్చి ఒక కొత్త ఆవును కొనుక్కొచ్చారు.


​కానీ, రెండు ఆవులకు కావలసిన మేత, దానా సమకూర్చడానికి, ఇంటి ఖర్చుల కోసం మరింత అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులకు వడ్డీలు కడుతూ, పాల అమ్మకం వల్ల వచ్చే డబ్బులు సరిపోక, పిల్లలను బడికి పంపించడం మానేశారు. కొడుకుని తమతో పాటు పొలం పనికి తీసుకెళ్లారు. కాలక్రమేణా సరిగా వర్షాలు పడక పొలంలో నష్టాలు వచ్చాయి. ఒకవైపు ఆవులను పోషించలేక, మరోవైపు కుటుంబ పరిస్థితి చూసి రామయ్య, సీతమ్మలు తీవ్రంగా బాధపడ్డారు.


​అప్పుడు రాజు ధైర్యం చేసి ఊరిలో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. రామయ్య కూడా ధైర్యం తెచ్చుకుని, మున్ముందు పొలంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాడు. రాజు పగటిపూట పనులు చేస్తూ, రాత్రి బడికి వెళ్లి చదువుకునేవాడు. తను నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు, చెల్లికి చెప్పేవాడు.


​రాజు పడిన కష్టానికి ఫలితం దక్కింది. కొన్నాళ్లకు వారి అప్పులన్నీ తీరిపోయాయి. పొలంలో మంచి పంటలు పండించి, తిరిగి ఆవులను కొని, పాలు అమ్ముతూ పిల్లలిద్దరినీ మళ్లీ బడికి పంపించారు. రాజు, లక్ష్మి శ్రద్ధగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించారు. ఆ కుటుంబం పెద్ద ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించింది.


​నీతి: "కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది."


 ********* 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


అరుంధతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



అరుంధతి

రచయిత్రి పరిచయం: అరుంధతి





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page