పంచతంత్రం కథలు
'Batasari - Bangaru Kadiyam' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 10/07/2024
'బాటసారి - బంగారు కడియం' ( పంచతంత్రం కథలు ) తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మర్రి చెట్టు
వుంది. ఆ చెట్టుపై ఎన్నో పక్షులు వుంటున్నాయి. ఒకరోజు
వేటగాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వల పన్నాడు.
పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద
నూకల్ని చూసాయి. వాటిని తినాలని ఆశగా కిందకు దిగాయి.
"ఎక్కడికీ?" అన్నాడు చిత్ర గ్రీవుడు. అతను
ఆ పావురాలకు రాజు.
"ఆగండాగండి, తొందరపడవద్దు. మనుష్యులు
కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడనుండి
వస్తాయి. ఇందులో మోసం వుంది. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఓ బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు. మీకు ఆ కథ చెప్తాను వినండి" అన్నాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు.
ఒక పెద్ద చెరువు వుంది. ఆ చెరువు గట్టున పొద వుంది. ఆ పొదలో వున్న ముసలి పులి అటువైపుగా వెళ్తున్న బాటసారులను పిలుస్తూ వుండేది. ఒకసారి ఆ గట్టుమీద నుండి పోతున్న బాటసారిని
"ఇదిగో.. !" అని కేక వేసింది పులి.
పిలుస్తున్న పులిని చూసి బాటసారి భయపడ్డాడు.
"భయపడకు చూసావా.. ! నా చేతిలోని బంగారు కడియం.
నీలాంటి పుణ్యాత్మునికి ఇవ్వాలని నాకు కోరికగా వుంది.
ఆ చెరువులో స్నానం చేసి శుచిగా వచ్చి ఈ బంగారు కడియం తీసుకో" అంటుంది పులి.
కానీ బాటసారి పులిచేతిలోని కడియం తీసుకోవాలంటే.. భయపడ్డాడు. ఎందుకంటే అది క్రూర జంతువు. తన్ని చంపుతుందేమోనని భయం. ఒకవైపు ధగ ధగ మెరుస్తున్న బంగారు కడియం మీద ఆశ మరొక వైపు ప్రాణం మీద తీపి. అందుకని భయంగా పులితో ఇలా అంటాడు.
"నువ్వేమో క్రూర జంతువు, నేనేమో మనిషిని. నీదగ్గరకు రావాలంటే నాకు భయంగా వుంది. నిన్నెలా నమ్ముతాను. "
అని అంటాడు.
దానికి పులి ఇలా అంటుంది. "నువ్వన్నది నిజమే.. ! నేనుక్రూర జంతువునే. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు చాలా పాపాలు చేసావు. ఎందరో, జంతువుల్ని, మనుష్యుల్ని పొట్టన పెట్టుకున్నాను. అపుడు చేసిన ఆ పాపాల్ని కడిగేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ బంగారు కడయాన్ని ఎవరికైనా ఇచ్చి నా పాపాల్ని కడిగేసుకుందా మనుకుంటున్నాను" అంది పులి.
బాటసారికి కడియం మీద ఆశ, ఇంకోక పక్క
ప్రాణం మీద తీపి.. ఈరెండిటి మద్య ఆలోచిస్తుంటే
పులి ఇంకా అతణ్ణి నమ్మించటానికి ఇలా అంటుంది.
"నేను ముసలిదాన్ని అయ్యాను. పరుగెత్తలేను. కాలి,
చేతి గోళ్ళు మొద్దుబారాయి, పళ్లూడి పోయాయి.
కళ్ళు కనపడవు. మాంసం తినటం ఎపుడో మానివేసాను.
లేనిపోనివి ఆలోచంచకు. వెళ్ళి ఆ చెరువులో స్నానం
చెయ్యి" అంది పులి.
బాటసరికి పులి మాటలకన్నా బంగారు కడియం మీదఆశతో స్నానం చేసేందుకు చెరువులో దిగాడు. చెరువులోని బురదలో
కూరుకు పోయాడు. కాలు బయటకు తీద్దామంటే కూడా రావటం లేదు.
"రక్షించండి బాబోయి.. ! రక్షించండి" అని అరిచాడు.
"అరవకు నేనున్నాగా నిన్ను రక్షిస్తాను.. ! అడుగులో అడుగు వేస్తూ వచ్చి.. ఆ చిక్కిన బాటసారి మీదకు దూకింది పులి. అతన్ని చంపి
తన కడుపు నింపుకుంది.
కథను ముగించి చిత్రగ్రీవుడు "విన్నారుగా.. !, దురాశకు పోతే ఇలా ప్రాణాలను బలి పెట్టాల్సి వస్తుంది " అన్నాడు
"ఇలాంటి కథలు చాలా విన్నాము. నీకన్ని అనుమానాలే! ఎదురుగా వున్న ఆహారాన్ని వదులుకోవటం నా వల్ల కాదు. నేను కిందకు దిగుతున్నాను. నాతోపాటు దిగే వాళ్ళుంటే రండి. లేదంటే మీ ఇష్ట”మని ముసలిపావురం కిందకు దిగింది.
మిగతా పావురాలు ఆకలితో ఉన్నాయేమో "దిగండి.. దిగండి..” అంటూ అన్నీ కిందకు దిగాయి. చిత్ర గ్రీవుడు చేసేదిలేక
కిందకు దిగాడు. తర్వాత పావురాలు అన్నీ
వలలో చిక్కుకున్నాయి.
"అయ్యయ్యో.. ! వలలో ఇరుక్కున్నాము. ఆ ముసలి పావురం వల్లే జరిగినదంతా!" అని పావురాలన్ని ముసలి పావురాన్ని తిట్టిపోసాయి.
"చిత్ర గ్రీవుడు చెపుతున్నా మనం వినలే”దని కన్నీరు పెట్టుకున్నాయి అన్ని పావురాలు.
"బాధపడకండి. తప్పు మీది కాదు ఆ ముసలి పావురానిది కాదు. తప్పంతా మన ఆకలిది. ఏడ్చి లాభం లేదు, ఇక్కడనుండి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచించాలి" అన్నాడు చిత్రగ్రీవుడు.
దగ్గరగా వస్తున్న బోయవాడ్ని చూసి "అదిగో.. ! బోయవాడు వచ్చేస్తున్నా”డని ముసలి పావురం గగ్గోలు పెట్టింది.
"మనం ఇక్కడనుండి తప్పించుకోవాలంటే అందరం ఒక్కసారిగా పైకెగరాలి. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన వలన్ లేదు. నేను ఒకటి, రెండు, మూడనగానే అందరూ పైకి లేవాలి. ఒకటి, రెండు మూడు” అంటూనే.. అన్నీ పావురాలతో పాటు పైకి లేచాడు చిత్రగ్రీవుడు.
బోయవాడు, పావురాలతో పాటు వల కూడా పోవటంతో చూసి బోరుమన్నాడు. "ఉష్ ఉష్.. !" అంటూపావురాల కోసం పరుగుదీసాడు. పరుగు దీసి అలసిపోయాడే తప్ప
పావురాలు చిక్కలేదు, వల దక్కలేదు.
"పిల్లలు.. , ! ఈ కథలో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి
చేటు అ,ని ఐకమత్యంగా వుంటే మనల్ని ఎవరూ ఏమి చేయలేరని. ఈ రెండు విషయాలు మీకు అర్థమయ్యాయి కదా? ఇక హాయిగా వెళ్ళి నిద్రపోండి. "
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comentários