top of page
Original.png

భక్తిగా కొలవాలి దైవాన్ని

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JokyamAnavasaram, #భక్తిగా కొలవాలి దైవాన్ని, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 155

Bhakthigaa Kolavali Daivanni- Somanna Gari Kavithalu Part 155 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 17/12/2025

భక్తిగా కొలవాలి దైవాన్ని - సోమన్న గారి కవితలు పార్ట్ 155 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


భక్తిగా కొలవాలి దైవాన్ని

----------------------------

దైవాన్ని భక్తిగా

ఆత్మలో శ్రద్దగా

సేవించాలి సదా

లేక బ్రతుకు వృథా


భగవంతుని సన్నిధి

భక్తులకది పెన్నిధి

దేవుని కరుణ కొరకు

ఉండాలి కడవరకు


దేవునితో నడవాలి

దీక్షతో గడపాలి

మదిలోని దుర్గుణం

వెంటనే వీడాలి


భక్తి మార్గంలోన

వింత లోకంలోన

జాగ్రత్త అవసరము

అక్షరాల సత్యము

ree






జాగ్రత్త వహిస్తా!

-----------------------------

బ్రతుకులోన సత్యాన్ని

దైవంగా భావిస్తా!

జ్ఞానమనే ముత్యాన్ని

కష్టమైనా సాధిస్తా!


గురుదేవుల రూపంలో

భగవంతుని దర్శిస్తా!

అమ్మ అనే దీపంలో

బ్రతుకు బాట నిర్మిస్తా!


నాన్న గారి బాధ్యతలో

కాసింత స్వీకరిస్తా!

వారు చూపు ప్రేమలో

అమృతాన్ని సేవిస్తా!


పుస్తకాల పఠనంలో

కాలాన్ని వెచ్చిస్తా!

చరవాణి మాయలో

పడకుండా గమనిస్తా!

ree





















గమనార్హం!

----------------------------------------

మేధావుల యోచనలు

ముత్యాల్లా శ్రేష్టము

మూర్ఖుల వాదనలు

తెచ్చిపెట్టు నష్టము


తొలగించును అజ్ఞానం

చేస్తే అక్షరదానము

వికసిస్తే విజ్ఞానము

సాఫల్యము జీవితము


ఉంటేనే సహనమే

అద్భుతాలే సాధ్యము

కొన్నిసార్లు మౌనమే

చెప్పును సమాధానము


మర్యాద పెద్దలతో

ప్రేమతో పిల్లలతో

ఉంటే హుందాతనము

లేకుంటే దారుణము

ree


















ఆస్వాదించు! మట్టి పరిమళం

-----------------------------------------

మట్టితో మానవునికి

అంతులేని అనుబంధము

దైనందిన జీవితాన

గోచరించు ఈ సత్యము


అన్నదాతకు అనుభవము

ఈ ఘన మట్టి పరిమళము

హలముతో పొలాలు దున్ని

పెట్టును కడుపుకు అన్నము


మట్టిలోనే ఆటలు

ఆడుతారు చిన్నారులు

విడదీయ రాని బంధము

దానిలోనే మమేకము


మట్టి మర్మమే గొప్పది

తెలుసుకుంటే మంచిది

మట్టిలో కలిసే వరకు

అదే అమ్మ ఒడి మనకు


మట్టిలో మాణిక్యాలు

అమూల్యమైన ఖనిజాలు

దొరుకు స్థలం అదే అదే

గమనించుము పదే పదే


మట్టికుంది ప్రాముఖ్యత

గుర్తుపెట్టుకో అంచేత

మట్టి పరిమళం గురించి

తెలుసుకొమ్ము దాని మంచి

ree








చేయకూడనివి

-------------------------------------------

పరనింద కడు పాపము

ఉండాలోయ్! దూరంగా

చేయకు నమ్మక ద్రోహము

అవుతుంది బ్రతుకు ఘోరము


త్యాగం లేని ఆరాధన

అర్ధం లేని ఆవేదన

పరికింపగ వ్యర్థమే

కీడు చేయు ఆలోచన


విపరీతపు ప్రవర్తన

కల్గించును ఆందోళన

జీవితాన పరివర్తన

ఉండాలని అభ్యర్తన


మితిమీరిన వాదాలు

విరుద్ధమైన భావాలు

ఎప్పటికైనా నష్టము

చూడ మూఢాచారాలు

ree

గద్వాల సోమన్న







bottom of page