top of page

భలే రుచి

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #BhaleRuchi -, #భలే రుచి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Bhale Ruchi - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 30/05/2025

భలే రుచితెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"మన హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో చేరిన ఈ అమ్మాయిని చూడు పాపం.. " అంది నర్స్ మాయ ఇంకొక నర్స్ ఛాయతో.


"ఈ అమ్మాయి నాకు తెలుసు.. పేరు 'భలే రుచి'.. " అంది ఛాయ.


"అదేం పేరు.. ?" అని అడిగింది మాయ.

 

"ఈ అమ్మాయి పేరు రుచి. ఫేమస్ ఛానల్ లో వంటల ప్రోగ్రాం యాంకర్. అందరూ అలా పిలుచుకుంటారు"


"అయినా.. నేనేమైనా వంట చెయ్యలా.. ? నా పూర్వజన్మ పుణ్యం కొద్ది, బాగా వంట చేసే భర్త దొరికాడు. ఈ ప్రోగ్రామ్స్ అవి నేను ఎందుకు చూస్తాను చెప్పు.. ? అందుకే నాకు తెలియదు" అంది మాయ.

 

"అవునులే.. మా ఆయనకేమో గ్యాస్ వెలిగించడం కూడా చేత కాదు. నాకేమో వంటల కోసం టీవీ చూడక తప్పదుగా.. అందుకే ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఇంతకీ ఏమైంది?" ఆశ్చర్యంగా అడిగింది ఛాయ.


"ఏమో.. ఏ పదార్థము రుచి తెలియట్లేదంట.. వాసన కూడా తెలియట్లేదు.. "


"అయ్యో పాపం.. !"


ఈ అమ్మాయి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. నీకు తెలిసింది చెప్పవూ.."


"ఈ అమ్మాయి ఫేమస్ ఛానల్ లో వంటల యాంకర్. తన ప్రోగ్రాం నేను రెగ్యులర్ గా చూస్తాను. వచ్చేవారు చేసే వెరైటీ వంటలు అన్నింటిని రుచి చూసి, ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ భలే రుచి అని చెబుతుంది. ఎంతో అదృష్టవంతురాలు.. పేరుకు తగ్గట్టు రోజుకి అన్ని రుచులు చూస్తున్నాది అని అనుకునే దానిని. మన హాస్పిటల్ కే వస్తుందని అసలు అనుకోలేదు". 


"ఇంతకీ ఎలా జరిగిందో ఏమైనా తెలుసా?"


"వాళ్ళ అమ్మగారు కాంతం ఇక్కడే ఉన్నారు.. అడిగితే తెలుస్తుంది.. "


"మేడం.. మీ అమ్మాయికి ఎందుకు ఇలా జరిగింది.. ?"


"ఏం చెప్పను.. వద్దంటే వినలేదు.. యాంకర్ అవుతానని అంది. ఏదో కొత్త ఛానల్ కి అప్లై చేస్తానంది. పోనిలే టీవీలో కనిపిస్తుందిలే అనుకున్నా. అక్కడ వంటల ప్రోగ్రాం లో ముందు యాంకర్ గా ఉండమన్నారు.. తర్వాత, వేరే ప్రోగ్రాం కి యాంకర్ చేస్తామని అన్నారు. వాళ్ళ నాన్న బతికున్నప్పుడు ఆయనే మాకు వంట చేసేవారు. ఇప్పుడు నాకు వంట రాదు.. పోనీ మా అమ్మాయి వంటలు చూసి నేర్చుకుని, నాకూ నేర్పిస్తుందని ఓకే అన్నాను. మగదిక్కు లేని సంసారం, నాలుగు డబ్బులు సంపాదిస్తే ఇల్లు గడుస్తుందని ఆనందపడ్డాను. పైగా, కొత్త రుచులు ఒంటికి పడితే, సన్నంగా ఉన్న అమ్మాయి కొంచం బొద్దుగా అయితే, బాగుంటుందని కూడా ఆశ పడ్డాను" చెప్పింది కాంతం.


(భర్తలు వంటలు చెయ్యడం ఎప్పటినుంచో కొనసాగుతూ ఉందని ఇద్దరు నర్సులు మనసులో నవ్వుకున్నారు.. )


"ఆ తర్వాత ఏమైంది మేడం.. ?" 


"ఆ టీవీ ఛానల్ వారు.. అగ్రిమెంట్ చేయించుకుని.. పర్మనెంట్‌ యాంకర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఏదో పర్మనెంట్‌ ఉద్యోగం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయింది మా అమ్మాయి.. "


"అంతా బాగుంది కదా.. ఆ తర్వాత ఏమైంది?"


"రోజూ ప్రోగ్రాంలో ఎంతో మంది వంటలు చెయ్యడం.. అవి మా అమ్మాయి రుచి చూసి.. బాగుందని అనడం.. అలా కొనసాగింది. తర్వాత, వంటలు వచ్చినవారు, రానివారు.. వచ్చి చెత్తగా వంటలు చేసి మా అమ్మాయి చేత తినిపించేవారు. కొత్తగా చేసిన వంటల ప్రయోగాలన్నీ పాపం మా అమ్మాయే రుచి చూసేది. ఒకరోజు.. 


"సర్.. ! ప్రోగ్రాంలో చేస్తున్న వంటలు బాగోలేవండి. అవి రుచి చూడాలంటే, కష్టంగా ఉంది. నవ్వుతూ బాగుందని చెప్పాలంటే ఇంకా కష్టంగా ఉంది.. " అని బాస్ కి కష్టం చెప్పుకుంది మా అమ్మాయి. 


"ఉప్పు కారాలు తక్కువైన సర్దుకుపోవాలి. వంటలు చెత్తగా ఉన్నా, ముఖం నవ్వుతూ పెట్టాలి. 'భలే రుచి' అని నువ్వు వారిని అభినందించాలి. నిన్ను టీవీలో చూసిన వారంతా నిన్ను 'భలే రుచి' అని పొగడాలి" అన్నాడు బాస్.


అలా చాలా సంవత్సరాలు ఆ చెత్త వంటల ప్రోగ్రాంకి యాంకర్ గా ఉంది రుచి. చేసే వంటలు సరిగ్గా చెయ్యరు.. ఉప్పు కారాలు ఎక్కువైనా సరే, టేస్ట్ చూసి పాపం బాగున్నాయని చెప్పేది. కొంత కాలానికి తనకి వచ్చిన కాస్త వంట కూడా మర్చిపోయింది. వంట రుచులకి జంట జబ్బులు బీపీ, షుగర్ అంటుకున్నాయి మా అమ్మాయికి. అలా, అగ్రిమెంట్ అయ్యేవరకు ఎన్నో వంటలు రుచి చూసి చూసి.. నా రుచికి రుచి తెలియకుండా పోయింది. ఆ తర్వాత మెల్లగా వాసన కూడా పోయింది. చివరికి ఇక్కడ ఇలా హాస్పిటల్ లో చేరి కోమాలోకి వెళ్లిపోయింది. 


"అయ్యో పాపం.. !" అన్నారు ఇద్దరు నర్సులు.


"ఆయనే బతికుంటే మాకెందుకు ఈ కష్టాలు.. ? డబ్బులకి బాధ ఉండేది కాదు.. చక్కగా ఆయనే మాకు వండి పెట్టేవారు.. " అంటూ బోరున ఏడ్చింది కాంతం.



**********



తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page