top of page

దేవుడితో ఆటలు

#JeediguntaSrinivasaRao, #DevuditoAtalu, #దేవుడితోఆటలు, #JeediguntaSrinivasaRao, #TeluguMoralStories, #నీతికథలు


Devudito Atalu - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 30/05/2025

దేవుడితో ఆటలు - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 “ఏమిటి నాన్నా.. హైదరాబాద్ లోను ఎప్పుడు చూసినా డల్ గా వుంటారు, యిక్కడ ముంబై వచ్చినా డల్ గా వుంటారు. సర్వీస్ లో వున్నప్పుడు ఎంతో హుషారుగా వుండే వాళ్ళు, మీకు ఏమైంది” అన్నాడు కార్తిక్ తండ్రితో. 


“యిప్పుడు నేను బాగా వున్నాను రా, రిటైర్ అయ్యి పదేళ్లు అయ్యింది, యింకా హుషారుగా ఎలా వుంటాను, వయసు మీద మీద కి వచ్చేస్తోంది” అన్నాడు మూర్తి.


“అలా అంటే ఎలా, మీకంటే పెద్దవాళ్ళు తెగ తిరిగిస్తున్నారు, పోనీ మీ మనవరాలు ని వెంటపెట్టుకుని అలా వాకింగ్ కి వెళ్ళవచ్చుగా” అంది మూర్తి భార్య సరళ. 


“ఆమ్మో తాతయ్య యింట్లో యిలా వుంటాడు గాని బయట వాకింగ్ చేసే అప్పుడు పీటీ ఉషా లా పరుగులు తీస్తాడు, తాతయ్యా నీరసం కి కారణం మన వంటమనిషి చేసే వంటలు అనుకుంటా” అంది మూర్తి మనవరాలు మీరా.


“నన్ను వదిలేయండి, నేను హ్యాపీగానే వున్నాను, లేనిపోని అనుమానాలు కలిగించకండి” అన్నాడు మూర్తి. 


“లేదు డాడీ! రేపు శనివారం బయలుదేరి షిరిడీ, వైద్యనాథ్ వెళ్లి వద్దాం, దారిలో మీకిష్టమైన గుజరాతీ థాలి తిందురుగాని, రెడీగా వుండండి” అన్నాడు కొడుకు కార్తీక్.


“చూద్దాంలే శనివారం కదా” అన్నాడు. 


“నాన్నా! నేను అమ్మా రాము, నాకు సోమవారం లెక్కల పరీక్ష” అంది కార్తీక్ కూతురు మీరా. 


“సరేలే నేను, తాతయ్య, బామ్మ వెళ్తాము, నువ్వు గుడి అనగానే ఏదో వంక వెతుకుతావు” అన్నాడు కార్తీక్.


“మీ బట్టలు సద్దుకోండి అలా సోపాలో కాళ్ళు జాపుకుని పడుకుంటే ఎలా, మీ మందులు కూడా పెట్టుకోవాలి” అని గొడవ మొదలుపెట్టింది సరళ. తనకి గుళ్లు అన్నా దేవుళ్ళు అన్నా పిచ్చ యిష్టం. భర్త రాకపోతే తమ ప్రయాణం ఆగిపోతుందేమో అని భయంతో భర్త ని ఎలాగైనా ప్రయాణం కి సిద్ధం చేస్తోంది.


“నా వస్తువులు నేను సద్దుకున్నాను, నాకు ఎందుకో ప్రయాణం అంటే కాళ్ళు లాగేస్తాయి అని భయం. వాడేమో నా వీక్నెస్ కనిపెట్టి గుజరాతి ఫుడ్ తినిపిస్తాను అన్నాడు, అదేమిటో మొదట్లో గుజరాతి వాళ్ళ కంపినీలో పని చెయ్యడం తో వాళ్ళ ఫుడ్ అంటే యిష్టం” అన్నాడు సోపాలోనుంచి లేచి మందుల సంచి తెచ్చుకుంటూ.


శనివారం ఉదయమే కారులో బయలుదేరారు ముగ్గురు.


"అబ్బాయి.. నేను వెనుక సీట్ లో పడుకుంటా" అన్నాడు మూర్తి.


"వద్దు. ముందు సీట్ లో కూర్చొని సీనరీస్ చూడండి. ఈ మూడు రోజులు హుషారుగా ఉండాలి" అన్నాడు కొడుకు.


"అక్కడ ఏదో హోటల్ ఉన్నట్టు వుంది. అక్కడ ఆపు" అన్నాడు మూర్తి.


"బయలుదేరి పదినిమషాలు అయ్యింది.అప్పుడే హోటల్ ఏమిటి నాన్న.. ఒక గంట తరువాత సుఖనివాస్ అనే హోటల్ వస్తుంది. దానిలో వడాసాంబార్ చాలా బాగుంటుంది. అదివరకు మీరు ఆ హోటల్ లో తిని బాగుంది అన్నారు .గుర్తుకు వచ్చిందా.." అన్నాడు కార్తీక్. 


హోటల్ లో వేడి వేడి వడాసాంబార్ తినగానే మూర్తికి టేస్ట్ బడ్స్ పనిచెయ్యడంతో పూరీ కూడా తెప్పించుకుని తిని, కారు దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్ళాడు.


"అమ్మా! నాన్నకి హుషారు వచ్చింది" అన్నాడు నవ్వుతు కార్తీక్.


షిర్డీ లో హారతి కి భక్తులతో కిక్కిరిసి వుంది గుడి.


"అబ్బాయి.. నేను హారతి అయ్యే అంతవరకు నుంచోలేను, ఈ లైన్లో కూర్చొని ఉంటా" అంటూ లైన్లో కూర్చున్నాడు.


యింతలో పోలీస్ వచ్చి "యిలా కూర్చుని వుంటే ఎలా, నుంచోలేరా.. అయితే యిటు రండి" అని బాబా కి పక్కన వున్న గదిలో కుర్చీలో కూర్చోపెట్టి "యిక్కడ నుంచి హారతి చూడండి, తరువాత నేను తీసుకుని వెళ్ళి దర్శనం చేయిస్తా" అని వెళ్ళిపోయాడు.


అదృష్టం బాగుంది, ప్రశాంతం గా హారతి కార్యక్రమం చూసి తరువాత బాబా సమాధి ముట్టుకుని బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆతరువాత గంటకి భార్య, కొడుకు బయటకు వచ్చారు.


"నడవగలరా హోటల్ దాకా లేదంటే ఆటో ఎక్కుదామా" అన్నాడు కార్తీక్ తండ్రీతో.


"కాస్త దూరం కి ఆటో ఎందుకు, నడుద్దాం" అంటూ వేగంగా నడవటం మొదలుపెట్టాడు.


రెండవ రోజు బయలుదేరి ఆరు గంటల ప్రయాణం తరువాత వైద్యనాథ్ చేరుకున్నారు. యిసుక వేస్తే రాలనంత జనం. బాబోయ్ ఈ జనం లో ఎలా వెళ్తాము అనుకుంటూ వుండగా ఒకతను వచ్చి "సార్! మనిషికి అయిదు వందలు యిస్తే అయిదు నిమిషాలలో మీకు దర్శనం ఏర్పాటు చేస్తాను" అన్నాడు.


వున్న పరిస్థితి లో యితని ద్వారా వెళ్లడం మంచిది అనుకుని సరే తీసుకుని వెళ్ళు అన్నాడు కార్తీక్.


రండి అంటూ ఒక పువ్వుల షాప్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్పులు అక్కడ పెట్టుకోమని వీల్ చైర్ తీసుకుని వచ్చాడు. "ఇందులో మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు ఎవ్వరో ఒకరు కూర్చోండి. మిగిలిన ఇద్దరు నేను చెప్పినప్పుడు వీల్ చైర్ ని పట్టుకొని ఉండాలి" అన్నాడు.


"మీరు కూర్చోండి, నేను నడుస్తాను" అంది మూర్తి భార్య సరళ.


సరే అని మూర్తి వీల్ చైర్ లో కూర్చున్నాడు. బ్రోకర్ వీల్ చైర్ ని తోసుకుంటూ నడవలేని వారికి ప్రత్యేక దారి ఉండటం తో ఆ దారిలో నుంచి తీసుకుని వెళ్తోవుండగా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆపేసాడు.


కుర్చీలో వున్న మూర్తి ని చూసి, "ఈయనకి ఏమైంది? బాగానే వున్నాడు గా ఈ దారిన వెళ్ళడానికి వీలులేదు" అన్నాడు.


"లేదు సార్! ఆయన నడవలేరు" అన్నాడు.


"లేచి నుంచోండి" అన్న పోలీస్ మాటలకి 'చచ్చాము రా నాయనా యిప్పుడు నుంచుంటే అసలు విషయం బయటపడటమే కాకుండా అవమానంగా కూడా వుంటుంది' అనుకున్నాడు. కార్తీక్ కి ఏమిచెయ్యాలో తెలియటం లేదు. మూర్తి రెండు చేతులు కొద్దిగా లేపి తనని కుర్చీలోనుంచి లేపమని అడిగాడు కార్తీక్ ని, కార్తీక్ ఎంత ఫోర్స్ ఉపయోగించినా మూర్తి కుర్చీలోనుంచి లేవడం లేదు. తండ్రి ఉపాయం కార్తీక్ కి అర్ధం అయ్యింది.


"సార్! మా నాన్నగారిని లేపటం ఒక్కరి వాళ్ళ కాదు, మీరు మీ కానిస్టేబుల్ కూడా సహాయం చేస్తే ఎలాగో అలా నుంచోపెట్టగలం" అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ తో.


"బాగానే ఉంది వరస" అంటూ ఒక చెయ్యి పట్టుకుని లేపటానికి ప్రయత్నం చేసాడు. అయితే మూర్తి తన రెండు పాదాలతో వీల్ చైర్ ఫుట్ రెస్ట్ ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు.


"యింట్లో ఈయనని ఎలా భరిస్తున్నారండి, తీసుకొని వెళ్లి స్వామి దర్శనం చేయించండి" అన్నాడు పోలీస్ ఆఫీసర్.


యిహ అంతే.. ఎక్కడా ఆగకుండా వీల్ చైర్ తోసుకుంటూ గర్భగుడి దగ్గరికి వెళ్లిపోయారు. అక్కడ కుర్చీలోనుంచి లేచి శివాలయం లోపలకి వెళ్ళి శివలింగం కి తల ఆనించి, బయటకు వచ్చారు.


బ్రోకర్ వీల్ చైర్ మడత పెట్టి "డబ్బులు ఇవ్వండి సార్! యింకో కేసు చూసుకోవాలి" అన్నాడు.


"అదేమిటి? నన్ను ఎక్కడ నుంచి తీసుకుని వచ్చావో అక్కడ దాకా దింపు, లేదంటే దారిలో పోలీస్ చూసి గుర్తు పట్టి యిన్నాక నడవలేని వాడు యిప్పుడు ఎలా నడుస్తున్నాడు అని పట్టుకుంటాడు" అని మళ్ళీ వీల్ చైర్ లో కూర్చున్నాడు మూర్తి.


అనుకున్నట్టే దారిలో పోలీస్ ఆఫీసర్ కనిపించి 'దర్శనం అయ్యింది గా.. యింకా వీల్ చైర్ ఎందుకు' అన్నట్టు చూసాడు. బ్రోకర్ కి డబ్బులు యిచ్చేసి కారులో కూర్చొని మూర్తి, మూర్తి భార్య, మూర్తి కొడుకు ముంబై బయలుదేరారు.


"నాన్నా, ఇక్కడకి కొద్ది దూరం లో మంచి హోటల్ వుంది. ఏమైనా తినేసి వెళ్ళాలి, లేదంటే ముంబై కి ఎనిమిది గంటల డ్రైవ్" అన్నాడు కార్తీక్.


కారు సింధూర హోటల్ ముందు ఆగింది. కార్తీక్, సరళ దిగి, వెనుక డోర్ తీసి "దిగండి, యింకా ఎందుకు నాటకం" అన్నాడు నవ్వుతూ కార్తీక్.


మూర్తి కారు దిగటానికి ఎంత ప్రయత్నం చేసినా దిగలేకపోతున్నాడు. "నాకు ఏమైంది రా, కదలలేకుండా వున్నాను, కాళ్ళు మొద్దుబారి పోయాయి, నడుము కలక్కు మంటోంది" అన్నాడు మూర్తి.


"చాలు డాడీ త్వరగా దిగండి" అన్నాడు చెయ్యి పట్టుకొని లాగుతో.


కేదార్నాథ్ లోని భీంశీల లాగా కదలకుండా కూర్చొని వున్న తండ్రిని చూసి "ఏమిటి నిజంగానే లేవలేకపోతున్నారా" అన్నాడు.


"అవును రా ఏమైంది నాకు, శివుడు శపించాడా ఏమిటి" అన్నాడు.


"అందుకే అనేది దేవుడు దగ్గర నాటకాలు పనికిరావు అని, గంట ఆలస్యం అయినా లైన్లో నుంచుని వెళ్ళేవాళ్ళం, రోజూ పదివేల అడుగులు నడిచే మీరు దొంగ దారిలో వెళ్ళటానికి నడవలేను అని అబద్దం చెప్పారు, యిప్పుడు అదే నిజమైంది. నాయనా శంకరా తప్పు అయిపొయింది, మమ్మల్ని క్షమించు తండ్రి, దారిలో ఔరంగాబాద్ దగ్గర వున్న జ్యోతిర్లింగం కి తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తాము, ఆయనకు నడక తెప్పించు తండ్రి" అంటూ సరళ మొక్కేసుకుంది..


"అమ్మా, నాన్నకు సైకాలాజికల్ ఎఫెక్ట్ వల్ల ఆలా వున్నారు, కొద్దిసేపట్లో మాములుగా అయిపోతారు, మనం త్వరగా కాఫీ తాగేసి వద్దాం పదా" అని తల్లిని తీసుకుని హోటల్ వైపుకి నడిచాడు కార్తీక్.


కారులో కూర్చుని వున్న మూర్తి అటు యిటు కదలడానికి ప్రయత్నం చేస్తున్నా యిబ్బంది పడుతున్నాడు. 'శంభో శంకరా! కావాలి అని మోసం చెయ్యలేదు, నీ దర్శనం త్వరగా అవ్వటం కోసం బ్రోకర్ చెప్పింది విన్నాము, నడవలేను అని అన్నందుకు కదలకుండా చేసావా, మా ఆవిడ చేసిన పూజలు, నేను తెలిసి ఎవ్వరికీ అపకారం చెయ్యకుండా వున్నందుకు నాపై కోపం ఎందుకు తండ్రి' అని అనుకుంటున్న మూర్తికి సెల్ ఫోన్ రింగ్ విని ఫోన్ వంక చూసాడు. చెన్నై నుంచి కూతురు ఫోన్.


స్పీకర్ ఆన్ చేసి హలో అన్నాడు.


"నేను డాడీ, ముంబై వచ్చేసారా" అంది. "యిదిగో మీ మనవడు కాన్ఫరన్స్ కాల్ పెట్టాడు, మీ మనవరాలు, మీ అల్లుడు గారు లూడో ఆడటానికి సిద్ధంగా వున్నారు, మీరు ఆడుతారా' అంది.


అంతలో "హాయ్ తాత్" అంటూ మనవడు మనవరాలు కనిపించారు. "వుండండి కారులో సరిగ్గా కనిపించడం లేదు. దిగి మీ పని పడతా, నేను లూడో కింగ్ ని" అంటూ కారు దిగి నుంచుని, అల్లుడుని చూసి "బాగున్నారా" అని ఆడిగాడు మూర్తి.


దూరం నుంచి తండ్రి కారు దిగి నవ్వుతో ఫోన్ మాట్లాడటం చూసి, "అమ్మా, నాన్న చూడు.. కారు దిగి ఎవ్వరితోనో మాట్లాడుతున్నారు, వుండు తీసుకుని వస్తాను" అని తండ్రి దగ్గరికి వెళ్ళాడు.


కారు కి ఆనుకొని సీరియస్ గా లూడో ఆడుతో పిల్లలతో అంటున్నారు "చూసారా తాతయ్య టాలెంట్" అని.


"ఎండలో ఎందుకు హోటల్ కూర్చొని ఆడుకోండి ఏసీ వుంది", అని తండ్రిని పిలిచాడు.


"పదా, ఈ సారి వీళ్ళిద్దరినీ ఓడించాలి. బావగారు గెలిచినా ఓకే, ఈ తన్వి గాడు గెలవకూడదు" అంటూ చకచకా నడుచుకుంటూ హోటల్ లోకి వచ్చారు.


సరళ "అరే యిప్పుడు బాగానే వున్నారుగా" అని అనబోతోవుండగా, గ్రహించి దూరం నుంచి వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డంగా వూపాడు.


అనుకున్నట్టే మనవడి చేతిలో ఓడిపోయాడు. చూసావా తాత్యిది టాలెంట్ అంటే అని యిహ చాలు చదువుకోవాలి అన్నాడు.


తనకి ఎదురుగా పెట్టిన పూరీ ముక్క నోట్లో పెట్టుకుంటూ "మొత్తానికి మళ్ళీ ఓడించాడు" అన్నాడు సరళ తో.


"అది సరే కారు దిగి చక్కగా నడిచి వచ్చారుగా, యిహ ధైర్యంగా వుండండి, మీరు బాగానే వున్నారు" అన్నాడు కార్తీక్.


"అవునురా పిల్లలు కనిపించగానే నాకు తెలియకుండానే కారు దిగిపోయాను, అంతకు ముందే దేవుడు ని తలచుకున్నానులే. బహుశా ఆ శివుడే పిల్లల రూపంలో నాకు సహాయం చేసాడు.

పదా.. అమ్మ మొక్కుకున్నట్టుగా దారిలో వున్న ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం దర్శనం చేసుకుని వెళ్దాం, ఈసారి వీల్ చైర్ వద్దు" అన్నాడు మూర్తి కారు దగ్గరికి నడుస్తో.


ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగింది. జనం ఎక్కువగానే వున్నారు. వాలంటీర్స్ కార్తీక్ తో "సీనియర్ సిటిజన్స్ కి క్యూ లేదు. మీరు మీ పేరెంట్స్ ని యిటు తీసుకుని వెళ్ళండి" అన్నారు.


అదేవిదంగా లోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించి లెంపలు వేసుకుని బయటకు వచ్చాడు మూర్తి.

 

 శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















1 Kommentar



@t.s.sbhargavateja6196

• 5 hours ago

Chala bavundi mastaaru kadha. Nija jeevita satyaalu chaala baaga chepparu. Bale vinasompuga untaayi mee kathalu Srinivas garu. Seetharam Gari Katha pathname chaala bavundi

Gefällt mir
bottom of page