బొమ్మ ప్రాణం
- Yasoda Gottiparthi
- 6 days ago
- 5 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #BommaPranam, #బొమ్మప్రాణం, #TeluguHorrorStories

Bomma Pranam - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 12/08/2025
బొమ్మ ప్రాణం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“ఒరేయ్ భార్గవ్! నువ్వు రేపొద్దున్నే చెన్నై నుండి హైదరాబాద్ కు వస్తున్నావారా? రెండు రోజులు ముందుగా వస్తే కలిసి ఉండే వాళ్ళం కదరా! ఈరోజు నైట్ పదకొండు గంటలకు యూఎస్ ఫ్లైట్ ఉంది. నేను అమ్మ వెళ్తున్నాం. నీకు కూడా తెలుసు కదరా! సరే సరే మెల్లగా జాగ్రత్తగా రండి” అని, “మన ఇంటి తాళం చెవులు క్రింద వాచ్మెన్ కి ఇచ్చి వెళ్తాము నాన్న! నేను వచ్చేవారo వద్దామనుకున్నాను.. కానీ మా కొలీగ్ పెళ్లి ఉంది. సింధుకు కావాల్సిన బొమ్మలు అన్నీ టాయ్స్ రూమ్ లో ఉన్నాయి. సింధుకు ముద్దులు చెప్పు” అంటూ సూట్ కేసులు క్యాబ్ లో ఎక్కించి కదిలారు.
మేము లేనప్పుడు వస్తున్నారు అనే దిగులుతో ఇద్దరు నిశ్శబ్దమయ్యారు.
*******
ఇంట్లోకి ప్రవేశించిన భార్గవ్, షర్మిల, ముందు హాల్లో సోఫాలో కూర్చుని కబుర్లలో మునిగారు. సింధు బొమ్మల రూంలోకి పోయింది.
భార్గవ్ బెడ్ రూమ్ లోకి వెళ్దాం అంటూ డోర్ తీయగానే, పెద్ద కళ్ళు నల్లగా, మూస్తూ తెరుస్తూ, విచిత్ర రంగుల గౌన్లో, చింపిరి జుట్టుతో పెద్ద బొమ్మ ఒకటి తలగడ మీద తలపెట్టి పడుకుని ఉండటం చూడగానే జడుసుకున్నాడు భార్గవ్.
“మీరేమిటండి? సింధు కంటే చిన్న పిల్లాడు అయ్యారు.”
“వామ్మో నేను ఈ గదిలోకి రాను” అని భయపడుతుంటే ఆ బొమ్మని తీసి కింద పడేసింది.
“ఆ బొమ్మ మాట్లాడుతుంది డాడీ. లోపల ఫోన్ ఉంది. మ్యూజిక్ బొమ్మ, బాగుంది. ఆడుకుంట” అంది.
“అంతగా భయం అయితే ఆ బొమ్మని మన వాచ్మెన్ కి ఇచ్చేద్దామండి.”
***
పెళ్లి వైభవంగా జరిగి, గుర్తుగా పిల్లలందరికీ బొమ్మలు
గిఫ్ట్ ఇచ్చారు.
ఇంట్లో అడుగు పెట్టగానే వెనుక నుండి “సార్! మీరు ఇచ్చిన బొమ్మ తీసుకోండి” అంటూ పాప వాచ్మెన్ ఇంట్లో నుండి తన వెనకే వస్తుంది.
తెల్ల రంగు పెద్ద ఫ్రాక్ లో తెల్ల జుట్టు వీరబోసుకొని కళ్ళు పెద్దవి చేసి కాళ్ళు వెనక్కి తిరిగినట్లు ముందు అడుగులు వేస్తూ దగ్గరకు వస్తుంటే, “నువ్వెవరో.. నా దగ్గర రావద్దు. బొమ్మా! వద్దు, వెళ్లిపో..” అంటుంటే
“ఏంటండీ వెనుక ఎవరూ లేరుగా.. ఎవరితో మాట్లాడు తున్నారు” అంది భార్య షర్మిల.
‘నా భ్రమా! భూతమా?’ అనుకొని సరే లోపలికి వెళ్దాం అంటూ గుమ్మం తాళం తీసి లోపలికి వెళ్లారు అందరూ.
మళ్ళీ సోఫాలో గౌన్ వేసి చిప్పిరి జుట్టు ఉన్న బొమ్మను చూసి “ఆ అమ్మాయి ఎప్పుడు తెచ్చి పెట్టింది” అని వణుకుతూ అడుగు తుండగా, “పెళ్లిలో పాపకు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అండి బాగుంది” అనగానే, “వద్దు” అనికింద పడేసాడు భార్గవ్.
****
“ఉరుములు వినిపిస్తున్నాయి, వర్షం వచ్చేట్లు ఉంది. ఆ చెట్లలో ఏం చేస్తు న్నావ్? సింధు రామ్మా..” అని తల్లి పిలుస్తుంది. కానీ సింధుకు ఏమీ వినపడలేదు.
వాచ్మెన్ మనమరాలు చేతిలో బొమ్మను పట్టుకొని “హాయ్! ఎప్పుడు వచ్చారు.. మీ అమ్మ నాన్న కూడా వచ్చారా?” అంటూ పలకరిస్తుంది.
ఆడుకుందామనగానే, “నాకు పని ఉంది. మా తాత పిలుస్తున్నాడు. మా ఇంట్లోకి రా ఎప్పుడైనా” అనగానే
“నాకు మీ నాన్నంటే ఇష్టం లేదు” అంది పాప.
“ఎందుకు.. ఏమన్నాడు?”
“నేను బొమ్మతో ఆడుకుంటున్నాను. కోప్పడుతున్నాడు. నాకు ఈ బొమ్మలంటే చాలా ఇష్టం.”
తల్లి వచ్చి “అక్కడ ఏం చేస్తున్నావే? వర్షం పడేటట్లు ఉంది లోపలికిరా” అంది.
తల్లి వైపు చూసి “నేను ఇక్కడ పాపతో మాట్లాడు తున్నాను.
వస్తున్నానమ్మా” అంటూ వెనక్కి తిరిగి చూడగానే పాప మాయమైంది.
****
భార్గవ్ డ్రైవ్ చేసి అలసిపోయినట్టున్నాడు. నిద్రలోకి జారుకున్నాడు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నిద్రపోవాలి అనుకుని బాత్రూంలోకి వెళ్ళగానే టాప్ ఆన్ చేయకుండానే నీళ్లు ధారలుగా పడుతుంటే, ‘ఇదేమిటి విచిత్రం? ఆటోమేటిక్ సిస్టం.. భార్గవ్ వాళ్ళ నాన్నగారు పెద్ద భవనం కట్టడమే కాకుండా అద్భుతాలు కూడా పెట్టించాడా?’ అనుకుంది.
స్నానం చేసి వచ్చాక చూస్తే డ్రెస్సింగ్ ప్లేస్ లో హ్యాంగర్ లేకుండా బట్టలు వ్రేలాడుతున్నాయి.
పెద్ద జడ ఉన్న ఆకారం నీడలా దగ్గర వచ్చింది. డోర్ లాక్ ఉండడంతో బయటికి వినపడదు. ముందు బయటకు వెళ్లాలనుకుని, వెంటనే గదిలోకి వచ్చి భార్గవ్ అంటూ పడుకుని ఉన్న వాడిని లేపింది. మంచి నిద్రలో ఉన్నాడు. తను బెడ్ పై భార్గవ్ పక్కన పడుకుంది.
జరిగిందంతా చెప్పగానే,
“నాకూ అలానే జరిగింది సింధు. ఎవరూ లేకున్నా పాప తో మాట్లాడానని చెప్తుంది. ఏమిటి ఇదంతా..” అంటూ ఆలోచిస్తూ చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు.
*********
ఉదయం లేచేసరికి ఇల్లంతా శుభ్రం చేసి, బ్రేక్ ఫాస్ట్ కూడా రెడీ చేసి ఉండడం చూసి వంట గదిలో ఉన్న మాయ దగ్గరికి వెళ్లి “రోజూ వస్తావా? మా అత్త వాళ్లకు చేస్తావా?” అని అడిగింది.
“అవునమ్మా! నేను వాచ్మెన్ రంగయ్య మనమరాలను. నిన్న మిమ్మల్ని చూడలేకపోయాను.”
“మా పాపతో ఆడుకుంటావా?”
“బడికి పోవాలమ్మ. అమ్మమ్మ పిలుస్తుంది.”
“ఈ మధ్య కొత్తగా వచ్చారా?”
“తాత, అమ్మమ్మ, నేను అంతే” అనగానే ఆలోచనలో పడింది.
“సరే నీ పని అయిందిగా టిఫిన్ తీసుకుని వెళ్ళమ్మా” అంది.
“గతం లో ఇలా కాలేదు ఎప్పుడూ..” అంటున్నాడు భార్గవ్.
టేబుల్ పైన గిన్నెలు తెరిచేసరికి అందులో ఏమీ లేవు.
వెతుకుతుంటే, అప్పుడే లోపలికి వస్తున్న సీతమ్మ “అమ్మా లేచారా? కాపీ తెస్తా”నంటూ వంట గదిలోకి వెళ్తుంటే “మీ మనవరాలు వచ్చి పని చేసి వెళ్ళింది.” అంది షర్మిల.
“అమ్మా! మాకు మనవరాలు లేదు. మేమిద్దరం లింగు, లిటుకు అంతే..”
“బ్రేక్ఫాస్ట్ చెయ్యి. దోసి పిండి ఫ్రిడ్జ్ లో ఉంది.”
“చేస్తాను, మీరు ఫ్రెష్ అయి రండమ్మ” అనగానే,
భార్గవ్ ను లేపి తనకు ఇలా జరిగిందని చెప్పి, “నేను చెప్తే నిన్న నమ్మలేదు కదా! ఈ ఇంట్లో దయ్యం ఉంది వెళ్ళిపోదాం అండి..” అంది షర్మిల.
వెనుక నుండి “ఎక్కడికి వెళ్ళి పోతావే!” అంటూ ఎదురుగా వచ్చి షర్మిల గొంతు పిసుకుతూ ఉంది దయ్యం.
తన రెండో చేతులతో పెనుగులాడుతూ “వద్దు వద్దు” అని షర్మిల అరుస్తుంటే, "షర్మిల! ఇక్కడ ఎవరూ లేరు” అంటూ భార్గవ్ దగ్గరికి వస్తుంటే,
షర్మిలని వదిలి భార్గవ్ను కింద పడేసి మీద కూర్చొని తెల్లని బట్టల్లో తల విరబోసుకొని కళ్ళు పెద్దగా చేసుకుని గొంతు నులుముతుంటే ‘నన్ను వదులు వదులు’ అని, ‘మేమేమీ ఎక్కడికి వెళ్ళము, మమ్మల్ని ఏమీ చేయకు ప్లీజ్’ అని ప్రాధేయపడగానే వదిలి వెళ్ళిపోయింది.
ఇద్దరూ మాములు స్థితిలోకి వచ్చి ‘మనం వెళ్లినా మన వెంటే వస్తుంది’ అనుకుని నిద్రలోకి జారుకున్నారు.
*******
తండ్రి రంగనాథం బిల్డింగ్ కట్టినప్పుడు కొడుకును కన్స్ట్రక్షన్ సైట్ మీదికి పంపించి పని ఎలా జరుగుతుంది తెలుసుకొని రమ్మని పంపేవాడు. అలా సైట్ మీదికి కన్స్ట్రక్షన్ మేనేజర్ గా పని చేస్తున్న మాలిని నచ్చి మాటలతో దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు ప్రేమలో ఇద్దరు ఒకటి అయ్యారు. తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇంట్లో ఒప్పుకున్నారు.
పెళ్లికి ముందు తనకు నాలుగేళ్ల కూతురు ఉందని తన భర్త చని పోయాడని మాలిని చెప్పడంతో అవాక్కయ్యాడు.
“ముందే చెపాలనుకున్నా, అప్పుడు పాప కూడా నా దగ్గర లేదు. మా అత్తగారింట్లో ఉండేది. నన్ను ఒంటరిదాన్ని చేసి వాళ్లే తమ వంశాoకురమని తీసుకున్నారు. నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి నా దగ్గరికి పంపించారు.”
అది తెలిసి భార్గవ్ తల్లి తండ్రి ఒప్పుకోకపోవడంతో, ఏమి చేయలేక వారికి ఇష్టమైన షర్మిలను చేసుకున్నాడు.
భార్గవ్ పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి మాలిని కనిపించకుండా పోయింది. ఈ కల ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి దీనికి సంబంధం ఏమిటి?
ఆధారాల కోసం వెతుకగా, తండ్రి సూట్ కేసులో ఫోటోలతో సహా ఉత్తరాలు ఉన్నాయి.
తన పెళ్ళికి ముందే తండ్రి వ్రాసిన ఉత్తరం "నా కొడుకు నీ మీద ప్రేమతో పిచ్చివాడయ్యాడు. నీవు ఎక్కడైనా పడి చావు లేదా, వాడి కళ్ళ కు కనిపించకు "
వ్రాసిన దానికి మాలిని జవాబు "నేను చచ్చినా నా ప్రేమ చావదు. నా కూతురు కూడా నన్ను అసహ్యించు కుంటుంది. నేను, అది ఇద్దరం మీ ఇంటి కన్స్ట్రక్షన్ లో పైనుండి దూకి చచ్చిపోతాము."
బెదిరిస్తున్నావా? అని నిలదీశాడు.
అదే యాదృచ్చికంగా జరిగినట్టు అందరికీ చెప్పండి అని వ్రాసిన ఉత్తరాలు చదివి కన్నీరు, మున్నీరు అయ్యాడు భార్గవ్..
తను నా భార్య షర్మిలను కూడా బాధపెడుతుంది.. కాబట్టి మాలిని ఆత్మకు శాంతి చేయాలని, ఒక స్వామిని కలిసి వివరంగా చెప్పాడు.
“మాలిని ఆత్మ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ దెయ్యమై మిమ్మల్ని పీడిస్తుంది.”
“ఇన్నాళ్లకు రావడమేమిటి స్వామి, ఇంకా ఈ కాలం లో భూతాలున్నాయా?”
“వారి కోరికలు తీరకపోతే, ఆత్మ హత్య చేసుకుంటే, వాటికి దహన సంస్కారాలు చేయకపోయినా ఇలా పీడిస్తాయి.
చనిపోయే ముందు ఆ బొమ్మని మీ ఇంట్లోకి విసిరి మరణించింది కాబట్టి అందులోనే ఆమె ప్రాణం ఉంది. ఎక్కడైతే పాతిపెట్టారో అక్కడ ఆ బొమ్మను పెట్టి దహనం చేయండి” అని చెప్పారు.
స్వామి తో ఆయన చెప్పినట్లు చేయించారు.
ఆ రోజు నుండి మళ్ళీ దయ్యం రావడం జరగలేదు. వారిద్దరి మరణానికి తానే కారణం అయ్యానని దుఃఖించాడు భార్గవ్.
సమాప్తం.
******************
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments